Monday, 27 April 2026

Blog

E-పేపర్

వెలుగుమట్ల భూ బాధితులకు అండగా కల్వకుంట్ల కవిత నిరాహార దీక్ష*

*వెలుగుమట్ల భూ బాధితులకు అండగా కల్వకుంట్ల కవిత నిరాహార దీక్ష* -దీక్షకు సంఘీభావం తెలిపిన మల్లోజు శ్రీనివాస చారి ఇబ్రహీంపట్నం మార్చ్ 12 ఖమ్మం జిల్లా కేంద్రంలోని వెలుగుమట్లలో భూదాన్ భూ బాధితులకు మద్దతుగా అంబేడ్కర్ భవన్ వద్ద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన నిరాహార దీక్షకు రంగారెడ్డి జిల్లా,యాచారం మండలం,మాల్ గ్రామానికి చెందిన మల్లోజు శ్రీనివాస చారి సంఘీభావం తెలిపారు.డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ తో కలిసి సోమవారం రాత్రి ఆమె దీక్ష ప్రారంభించిన విషయం విదితమే.ప్రభుత్వ చర్యల వల్ల సుమారు 600 ఇళ్లు బుల్డోజర్లతో కూల్చివేయబడగా దాదాపు 2 వేల మంది ఒక్కరాత్రిలోనే నిరాశ్రయులయ్యారని ఈ సందర్బంగా శ్రీనివాస చారి తెలిపారు.బాధితుల్లో అధికంగా సమాజంలోని బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలే ఉన్నాయని పేర్కొన్నారు.ఈ నిరాహార దీక్షలో అమరవీరుల ఆశయ సమితి రాష్ట్ర అధ్యక్షులు కొర్ర సాయి రామ్,తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి అజయ్,రవి కుమార్,పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

ఆర్సీపురంలో ఘనంగా వైకాపా ఆవిర్భావ దినోత్సవం

పున్నమి ప్రతినిధి, రామచంద్రపురం రామచంద్రపురం మండలంలో వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆ పార్టీ నాయకులు చంద్రగిరి వైసీపీ పార్టీ ఇంచార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుని పేదలకు అల్పాహారం అందించారు. ఒక వైసీపీ పార్టీతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని వారు అన్నారు.తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం శ్రీ ప్రసన్న వెంకటేశ్వరపురం లో వైసిపి పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం మండల వైసీపీ కన్వీనర్ ఎద్దులచంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. పార్టీ నాయకులు. ఈ కార్యక్రమం కి ముఖ్యఅతిథిగా చంద్రగిరి నియోజకవర్గ వైకాపా ఇంచార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పాల్గొని వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టాలు వైఎస్ఆర్సిపి కి కొత్తమి కాదని, కష్ట కాలంలో పుట్టిన పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ అన్నారు. అధికారంలో ఉన్న లేకపోయినా కార్యకర్తలకు అండగా పార్టీ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైకాపా కన్వీనర్ ఎద్దుల చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి , వైకాపా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కిడ్నీ ఆరోగ్యంపై అవగాహన అవసరం:డాక్టర్ ఏ కె చక్రవర్తి

నెల్లూరు మార్చ్( పున్నమి ఆరోగ్య ప్రతినిధి) ప్రపంచ కిడ్నీ దినోత్సవం 2026 మార్చి 12న “అందరికీ కిడ్నీ ఆరోగ్యం – ప్రజల సంరక్షణ, భూమి రక్షణ” అనే థీమ్‌తో నిర్వహించనున్నారు. ఈ రోజు కిడ్నీ వ్యాధుల పెరుగుతున్న సమస్యపై అవగాహన పెంచడం మరియు తొందరగా గుర్తించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడమే లక్ష్యంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా గురువారం నాడు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ప్రముఖ కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ AK చక్రవర్తి, డాక్టర్ మస్తాన్ వలీ , డాక్టర్ రాకేష్ మరియు హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ డాక్టర్ బిందు భార్గవి రెడ్డి లు పాల్గోన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఒకరికి క్రానిక్ కిడ్నీ వ్యాధి ఉండే అవకాశం ఉంది మరియు ఇది ప్రారంభ దశల్లో లక్షణాలు లేకుండా ఉండొచ్చు. నియమిత ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్యకరమైన జీవనశైలి, డయాబెటిస్ మరియు రక్తపోటు నియంత్రణ కిడ్నీ వ్యాధి నివారణకు చాలా ముఖ్యమైనవి. ఈ సంవత్సరం థీమ్ అందరికీ సమానంగా కిడ్నీ చికిత్స అందుబాటులో ఉండడం మరియు పర్యావరణానికి అనుకూలమైన వైద్య విధానాల అవసరాన్ని కూడా ప్రస్తావిస్తుంది. ప్రజలు తమ కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవగాహన పెంచుకుని, నిరోధక చర్యలు తీసుకుని, అవసరమైనప్పుడు వైద్య సహాయం పొందాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలులో వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఘన వేడుకలు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండల కేంద్రంలోని వైయస్సార్ కూడలి వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పార్టీ కార్యకర్తలతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన జనరల్ సెక్రటరీ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సంక్షేమమే పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఖమ్మం

ప్రాణాంతక ‘పరాక్వాట్’ విషంపై నిషేధం విధించాలి – రైతుల ప్రాణాలను కాపాడాలని ఖమ్మంలో ప్రజా అవగాహన నిరసన : హాజరైన ప్రముఖ వైద్యులు డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు

. ఖమ్మం, మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) రైతుల ప్రాణాలను కాపాడటానికి ప్రాణాంతకమైన పరాక్వాట్ విషాన్ని వెంటనే నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద గురువారం ప్రజా అవగాహన నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ రక్ష హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పంటల్లో వినియోగించే పరాక్వాట్ విషం వల్ల అనేక మంది రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఇది అత్యంత ప్రమాదకరమైన రసాయనమని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ప్రాణాలను రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరాక్వాట్‌పై పూర్తి నిషేధం విధించాలని వారు డిమాండ్ చేశారు. ఈ అవగాహన బొలికొండ శ్రీనివాసరావు, కంభంపాటి నారాయణరావు, కన్నెవేటి సతీష్ నారాయణ చౌదరి, గజ్జల శ్రీనివాస్, కమలాకర్ శ్రీకాంత్, అరుణ్ కుమార్, నాగేశ్వరరావు, మణికాంత్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. రైతులు మరియు ప్రజల్లో పరాక్వాట్ విషం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు.

ఖమ్మం

ఖమ్మం అర్బన్ బీజేపీ ఉపాధ్యక్షుడిగా పందుల సీతయ్య నియామక పత్రం అందజేసిన మండల అధ్యక్షుడు వంకదాని రామకృష్ణ

ఖమ్మం, మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి): ఖమ్మం అర్బన్ మండల బీజేపీ ఉపాధ్యక్షుడిగా పందుల సీతయ్యను నియమించారు. గురువారం మండల అధ్యక్షుడు వంకదాని రామకృష్ణ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ పందుల సీతయ్య పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసే నాయకుడని, ఖమ్మం అర్బన్ మండలంలో పార్టీ బలోపేతానికి ఆయన సేవలు మరింత ఉపయోగపడతాయని తెలిపారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతమే లక్ష్యం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పందుల సీతయ్య మాట్లాడుతూ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. ఖమ్మం అర్బన్ మండలంలో బీజేపీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని సీతయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ, అర్బన్ మండల ప్రధాన కార్యదర్శి ఆచంటి కోటేశ్వరరావు, జిల్లా నాయకులు వెంకన్న, దొంగల బాబురావు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

రైతులు ఈ పంట నమోదు వివరాల సామాజిక తనిఖీని పరిశీలించిన ఏవో మమత

పున్నమి ప్రతినిధి ,రామచంద్రపురం మండలం రబీ సీజన్ 2026లో రైతులు సాగుచేసిన పంటలను ఈ క్రాఫ్ నమోదు వివరాలను తెలుసుకునేందుకు ఈ పంట సామాజిక తనిఖీ గ్రామ సభ ఎంతగానో ఉపయోగపడుతుందని మండల వ్యవసాయ అధికారిని మమత అన్నారు. రైతు సేవ కేంద్ర ం లో ఈ పంట నమోదు చేసిన వివరాల జాబితాను సామాజిక తనిఖీ గ్రామ సభ లో భాగంగా ఆమె పరిశీలించారు. బుధవారం మండలంలోని గంగిరెడ్డిపల్లి రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన సామాజిక తనిఖీ గ్రామ సభకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాలలో గ్రామసభలను నిర్వహించి, ఈ పంట యాప్ లో నమోదు చేసిన వివరాలను వెల్లడిస్తారని అన్నారు. ఏవైనా పంట నమోదులో మార్పులు ఉంటే సరి చేసుకునేందుకు సంబంధిత రైతు సేవ కేంద్రాల్లోని వి ఏఏల దృష్టికి తీసుకువచ్చి, గ్రీవెన్స్ లో వినతి పత్రాన్ని అందించేందుకు ఈనెల 16వ తేదీ వరకు గడువు ఉందని చెప్పారు. గంగిరెడ్డిపల్లి రైతు సేవా కేంద్రం పరిధిలో 155 మంది రైతులకు గాను 243 ఎకరాల్లో అన్ని పంటలకు సంబంధించిన వివరాలను ఈ క్రాఫ్ నమోదు చేసినట్లు చెప్పారు. అలాగే సంబంధిత రైతు సేవ కేంద్రాలలో పంట నమోదు చేసిన రైతుల వివరాల జాబితాను నోటీసు బోర్డులో అందుబాటులో ఉంచినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ భాగ్యలక్ష్మి రైతులు పాల్గొన్నారు.

తిరుపతి

వైభవంగా శ్రీ నల్ల గంగమ్మ జాతర-అమ్మవారిని దర్శించుకున్న బియ్యపు శ్రీవాణి రెడ్డి

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, మార్చి 11: శ్రీకాళహస్తి పట్టణంలోని బహదూర్ పేటలో వెలసిన శ్రీ నల్ల గంగమ్మ తల్లి జాతర బుధవారం నాడు అత్యంత వైభవంగా జరిగింది. పండుగ వాతావరణం నెలకొనగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ శుభ సందర్భంగా మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి సతీమణి బియ్యపు శ్రీవాణి రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న శ్రీవాణి రెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. శాస్త్రోక్తంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అమ్మవారి దర్శనం అనంతరం భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని శ్రీవాణి రెడ్డి ప్రారంభించారు. జాతరకు విచ్చేసిన భక్తులకు స్వయంగా భోజనాలను వడ్డించారు. ఆధ్యాత్మిక సేవతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని స్థానికులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నేతలు గుణ, కళ్యాణి, వళ్లం గోపి, ప్రకాష్‌తో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జాతర సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

తిరుపతి

శృంగేరి జగద్గురువుల ఆశీస్సులతో కాంతివంతమైన ఎమ్మెల్యే గృహం

శ్రీకాళహస్తి పర్యటనలో భాగంగా పూజ్యశ్రీ శృంగేరి జగద్గురువులు బుధవారం శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్వగ్రామమైన ఊరందూరును సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఎమ్మెల్యే నూతన నివాసానికి జగద్గురువులు విచ్చేసి తమ పాదస్పర్శతో ఆ గృహాన్ని పవిత్రం చేశారు. జగద్గురువుల రాకతో ఎమ్మెల్యే గృహం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు జగద్గురువుల ఆశీస్సులు పొందే భాగ్యం పొందారు. ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి జగద్గురువులకు ఘన స్వాగతం పలికి, భక్తిశ్రద్ధలతో ఆతిథ్యం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ…శాంతి, ధర్మానికి ప్రతిరూపమైన శృంగేరి జగద్గురువులు తమ నివాసానికి విచ్చేసి పాదస్పర్శ చేయడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తమ కుటుంబ సభ్యులు, బంధువులను ఆశీర్వదించడం జీవితంలో మరచిపోలేని అనుభూతిగా భావిస్తున్నానని పేర్కొన్నారు. జగద్గురువుల ఆశీస్సులతో తమ గృహం ఆధ్యాత్మిక కాంతితో వెలిగిపోయిందని, వారి దివ్య కరుణ తమ కుటుంబంతో పాటు శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ పుణ్యసందర్భం తమకు ఎంతో ప్రత్యేకమైందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. జగద్గురువుల సందర్శనతో ఊరందూరు గ్రామంలో భక్తి, ఆధ్యాత్మికత నిండిన వాతావరణం నెలకొంది. గ్రామస్థులు కూడా ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జగద్గురువుల ఆశీస్సులు పొందారు.

తిరుపతి

132 సంవత్సరాల తరువాత తెలుగులోకి ‘శ్రీకాళహస్తి స్థల పురాణం’… జగద్గురువులచే ఆవిష్కరణ

శ్రీకాళహస్తి (పున్నమి న్యూస్), మార్చి 11: దక్షిణ ఆమ్నాయ శృంగేరి శారదా పీఠం ఉత్తరాధికారి పూజ్యశ్రీ విదుశేఖర భారతీ తీర్థ స్వామీజీ బుధవారం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానాన్ని సందర్శించారు. క్షేత్ర పర్యటనలో భాగంగా విచ్చేసిన జగద్గురువులు శ్రీకాళహస్తి ఆలయంలో భక్తిశ్రద్ధల మధ్య “శ్రీకాళహస్తి స్థల పురాణం” గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ గ్రంథం విశిష్టతను వివరించిన ప్రముఖులు మాట్లాడుతూ.. 1893 సంవత్సరంలో వెంకటగిరి సంస్థానాధీశులైన శ్రీశ్రీశ్రీ వెలుగోటి రాజా ముద్దుకృష్ణ యాచేంద్ర భూపాల వారి ఆధ్వర్యంలో ప్రచురితమైన సంస్కృత గ్రంథాన్ని బ్రహ్మశ్రీ చెట్లూరు వెంకటసుబ్రమణ్యం శాస్త్రి పరిష్కరించినట్లు తెలిపారు. దాదాపు 132 సంవత్సరాల తరువాత ఈ మహాగ్రంథాన్ని సంపూర్ణంగా తెలుగులోకి అనువదించి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారని శివపురాణాంతర్గతంగా ఉన్న శివరహస్య సంగ్రహం ఆధారంగా రూపొందిన ఈ శ్రీకాళహస్తి స్థల పురాణంలో మొత్తం 90 అధ్యాయాలు, 9,430 శ్లోకాలు ఉన్నాయి. ఐదు సంపుటాలుగా విస్తరించిన ఈ గ్రంథం సుమారు 1,700 పేజీలతో వెలువడింది. వేదవ్యాస మహర్షి రచించిన ఈ పురాణాన్ని డాక్టర్ పాలకోడేటి జగన్నాథరావు తెలుగులో వ్యాఖ్యాన సమేతంగా ఆంధ్రీకరించారు. ప్రఖ్యాత కవి ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంతో పోలిస్తే ఇది విస్తృతమైన, భిన్నమైన మహాగ్రంథమని పండితులు తెలిపారు. ఈ గ్రంథం సంపాదకత్వాన్ని మాజీ కార్యనిర్వహణాధికారి, డిప్యూటీ కలెక్టర్‌గా సేవలందించిన కె.ఎస్. రామారావు నిర్వహించారు. ఇంద్రకీలాద్రి దుర్గమల్లేశ్వర స్వామి దేవస్థానంతో అనుబంధం కలిగిన ఆయన సంపాదకత్వంలో రెండు సంపుటాలుగా ఈ గ్రంథం వెలువడిందని ఈ గ్రంథాన్ని వెలుగులోకి తీసుకురావడంలో శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన గురజాల నాగారాజ జెట్టి ప్రత్యేక కృషి చేశారు. శృంగేరి జగద్గురువుల చేతుల మీదుగా ఈ గ్రంథం ఆవిష్కరణ జరగడం క్షేత్ర చరిత్రలో ఒక విశిష్ట ఘట్టంగా భక్తులు, పండితులు అభిప్రాయపడ్డారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.