Sunday, 26 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పవన్ కళ్యాణ్ పై బెదిరింపులు చేస్తే ఊరుకోము:

పవన్ కళ్యాణ్ పై బెదిరింపులు చేస్తే ఊరుకోము: జనసేన నేత కాకు మురళి రెడ్డి నెల్లూరు: అన్నీ మతాలను గౌరవించే వ్యక్తి పవన్క ళ్యాణ్అ ని, అలాంటి నాయకుడిపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలు సహించరని జనసేన నాయకుడు కాకు మురళి రెడ్డి హెచ్చరించారు. ఒక క్రైస్తవ పాస్టర్ పవన్ కళ్యాణ్‌ను నరుకుతామని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకు మురళి రెడ్డి, గునుకుల కిషోర్, నూనె మల్లిఖార్జున్ మాట్లాడుతూ సనాతన ధర్మం పై దాడులు జరుగుతున్నాయని, తిరుమల లడ్డూ అంశంపై పవన్ కళ్యాణ్ బలంగా స్పందించినందుకు ఆయనకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి కొందరు రాజకీయంగా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అంబటి రాంబాబు ద్వారా కాపులను, బీసీ పార్టీ నేత రామచంద్ర యాదవ్ ద్వారా బీసీలను రెచ్చగొట్టే ప్రయత్నం జరిగిందని, అవి ఫలించకపోవడంతో ఇప్పుడు మత రాజకీయాలను ప్రోత్సహించేలా క్రైస్తవ పాస్టర్‌ను ముందుకు తెచ్చారని విమర్శించారు. డానీయల్ కెనడి అనే పాస్టర్ పవన్ కళ్యాణ్‌ను నరుకుతామని చేసిన వ్యాఖ్యల వెనుక వైస్సార్కాం గ్రెస్ పార్టీ కుట్ర ఉందని వారు ఆరోపించారు. కులాలను కలిపే ఆలోచన, మత ప్రస్తావనలేని రాజకీయ సిద్ధాంతాలను పాటించే పార్టీ జనసేన అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పని చేస్తున్న పవన్ కళ్యాణ్ జోలికి, సర్వమతాలను గౌరవించే సనాతన ధర్మం జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఏటూరి రవికుమార్, ఆఫీస్ ఇంచార్జి జమీర్, మహేష్ శర్మ, హరికృష్ణ, విజయ్, వీరమహిళలు వాణి తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా

జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా జనసేన పార్టీ పటిష్టత కోసం చేపట్టిన క్రియాశీల “ఉద్యమ సభ్యత్వ నమోదు” కార్యక్రమంలో భాగంగా ప్రత్తిపాడు మండలం లాంపకలోవా గ్రామంలో ప్రజా చైతన్య ఉద్యమ సభ్యత్వ శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను కలుసుకుని ఉద్యమ సభ్యత్వ కార్యక్రమాన్ని చేపట్టారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలు ప్రజలకు వివరించి సభ్యత్వం పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు మంచి స్పందన తెలుపుతూ పెద్ద ఎత్తున సభ్యత్వం నమోదు చేసుకున్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని నాయకులు ఈ సందర్భంగా కోరారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

డ్రోన్ నిఘాతో నేరాలపై కఠిన చర్యలు – నెల్లూరు పోలీసుల వినూత్న చర్యలు

నెల్లూరు జిల్లాలో నేరాలను నియంత్రించేందుకు డ్రోన్ సాంకేతికతను వినియోగిస్తూ ప్రత్యేక నిఘా చర్యలు చేపట్టామని జిల్లా ఎస్‌పి డా. అజిత వేజెండ్ల, ఐపీఎస్ తెలిపారు. ఎస్‌పి ఆదేశాల మేరకు సంబంధిత డీఎస్పీల ఆధ్వర్యంలో సీఐలు, ఎస్సైలు కలిసి నెల్లూరు పట్టణం, శివారు ప్రాంతాలు మరియు నిర్మానుష్య ప్రదేశాల్లో డ్రోన్ల ద్వారా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నేర నియంత్రణ లక్ష్యంగా క్రైమ్ ప్రోన్ ప్రాంతాలపై డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు. బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి వినియోగం, పేకాట నిర్వహణ, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, రహదారి ప్రమాదాలు, దొంగతనాలు వంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నేరాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి పాడుబడిన బంగ్లాలు, తోటలు, బహిరంగ ప్రదేశాలు, పార్కులు, నదీ తీర ప్రాంతాలపై డ్రోన్లను పంపించి నిఘా ఏర్పాటు చేశారు. ఎవరైనా చట్ట వ్యతిరేక లేదా క్రిమినల్ చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రత్యేకంగా గంజాయి సేవించడం, అమ్మడం లేదా రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు మరియు నేరాలను నియంత్రించేందుకు సాంకేతికతను వినియోగిస్తూ వినూత్న చర్యలు చేపడుతున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వెంటనే డయల్ 112 లేదా ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బయ్యపురెడ్డి వారి నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్

బయ్యపురెడ్డి వారి నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వింజమూరు మండలం ఎర్రబల్లిపాలెం గ్రామంలో శ్రీ బయ్యపురెడ్డి రవిశంకర్ రెడ్డి – శ్రీమతి మౌనిక దంపతుల నూతన గృహప్రవేశ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ శుభ కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా హాజరై దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కొత్తగా నిర్మించిన ఇంటిని సందర్శించి, గృహప్రవేశం జరుపుకుంటున్న రవిశంకర్ రెడ్డి – మౌనిక దంపతులను ఆప్యాయంగా అభినందించారు. నూతన గృహంలో సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆనందాలు నిండాలని ఆకాంక్షిస్తూ వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. వారి కుటుంబం ఎల్లప్పుడూ ఆరోగ్యంతో, ఆనందంతో ఉండాలని, జీవితంలో మరిన్ని విజయాలు సాధిస్తూ దినదినాభివృద్ధి చెందాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ ప్రజలు మరియు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ కలిసి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి వారి కొత్త జీవిత ప్రయాణం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరు నియోజకవర్గంలో జనసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆత్మకూరు నియోజకవర్గంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమం జనసేన పార్టీ ఇంచార్జి నలిశెట్టి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో అనంతసాగరం మండలానికి చెందిన జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమానికి అనంతసాగరం మండల జనసేన పార్టీ పెద్దలు రవి, ఉదయగిరి బీవీ రమణ, పార్టీ నేతలు నరసింహ రాయల్, ఎం. కృష్ణ తదితరులు హాజరై రక్తదానం చేసి సేవా భావాన్ని చాటుకున్నారు. సమాజానికి అవసరమైన సమయంలో రక్తదానం ప్రాణాలను కాపాడే మహత్తర సేవ అని నాయకులు పేర్కొన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మర్రిపాడు కొనసముద్రంలో రాములవారి దేవాలయ నిర్మాణానికి టీడీపీ నాయకులతో భూమి పూజ

నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో, ఆనం రామనారాయణ రెడ్డి చొరవతో ఆత్మకూరు నియోజకవర్గంలో మంజూరైన దేవాలయాల నిర్మాణ కార్యక్రమం కొనసాగుతోంది. మర్రిపాడు మండలం కొనసముద్రం ఎస్సీ కాలనీలో రాములవారి దేవాలయ నిర్మాణానికి శనివారం గ్రామస్తులతో కలిసి టీడీపీ నాయకులు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ కేశవులు చౌదరి, ఆత్మకూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఆరికట్ల జనార్దన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనార్దన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చొరవతో ఆత్మకూరు నియోజకవర్గంలో మొత్తం 23 దేవాలయాలు మంజూరయ్యాయని తెలిపారు. అందులో భాగంగా మర్రిపాడు మండలంలో ఇప్పటివరకు మూడు దేవాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా కొనసముద్రం గ్రామం ఎస్సీ కాలనీలో దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో కాలనీ వాసులంతా మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు దేవరాల గంగాధర్ యాదవ్, టీడీపీ నాయకులు కొన్నమనేని నాగేశ్వరు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మర్రిపాడు మండలంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మర్రిపాడు మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. చిన్నా జనసేన సారథ్యంలో ఈ కార్యక్రమం మధ్యాహ్నం జరగనుంది. ఈ సందర్భంగా “పల్లె పల్లెకు జనసేన పార్టీ సిమెంట్ బెంచ్” కార్యక్రమం భాగంగా సిమెంట్ బెంచ్ ప్రారంభోత్సవం నిర్వహించబడుతుంది. అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమంతో పాటు బాణాసంచా కాల్చి వేడుకలను జరుపుకోనున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు మరియు వీరమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మర్రిపాడు మండల జనసేన నాయకులు కోరారు.

ఖమ్మం

ఖమ్మం 21వ డివిజన్‌లో మార్పు కోసం బీజేపీ డివిజన్ యాత్ర.. ప్రజల నుండీ మంచి స్పందన వస్తుంది బీజేపీ నాయకుడలు పిల్లల మర్రి వెంకట్ రజిత .

ఖమ్మం, మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి): ఖమ్మం కార్పొరేషన్ 21వ డివిజన్‌లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ నాయకులు చేపట్టిన డివిజన్ యాత్ర మరింత వేగంగా కొనసాగుతోంది. డివిజన్ నాయకులు పిల్లల మర్రి వెంకట్, శ్రీమతి రజిత దంపతులు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రతి ఇంటి తలుపు తట్టి, ప్రతి కుటుంబాన్ని కలుస్తూ ముందుకు సాగుతున్నారు. ఇంటింటికీ వెళ్లి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి, వాటి ప్రయోజనాలను తెలియజేస్తున్నారు. శనివారం నిర్వహించిన డివిజన్ యాత్రలో పున్నమి జిల్లా ఇంచార్జి పువ్వాడ నాగేంద్ర కుమార్‌తో పిల్లల మర్రి వెంకట్ దంపతులు మాట్లాడుతూ, అభివృద్ధి కోసం పోరాటమే తమ లక్ష్యమని, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. 21వ డివిజన్‌లో కమల వికాసమే తమ ప్రధాన లక్ష్యమని వారు పేర్కొన్నారు. తమ ఆధ్వర్యంలో కొనసాగుతున్న డివిజన్ యాత్ర ఏడవ రోజు విజయవంతంగా సాగుతుండటంతో ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నదని వారు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరిలో ఘనంగా జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Date 14-3-2026 ఉదయగిరి: జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉదయగిరిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి నియోజగవర్గం ఇంచార్జి కొట్టె వెంకటేశ్వర్లు గారు హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉదయగిరి మండల అధ్యక్షులు సురేంద్రారెడ్డి, రవీంద్ర మరియు దుత్తలూరు మండల అధ్యక్షులు రవి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేడుకలలో భాగంగా జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించి, భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పార్టీ స్థాపకుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలను గ్రామ స్థాయిలో మరింత బలపరచాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొని పార్టీపై తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.

ఖమ్మం

గ్యాస్ కొరతతో ఖమ్మం నగరంలో మూతపడుతున్న హోటళ్లు… వ్యాపారులు ఆందోళన

ఖమ్మం, మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం నగరంలో కమర్షియల్ గ్యాస్ కొరత తీవ్రంగా ప్రభావం చూపుతోంది. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో నగరంలోని పలు హోటళ్లు శుక్రవారం నుండి ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. గ్యాస్ సరఫరా లేకపోవడం వల్ల వంటలు చేయలేని పరిస్థితి ఏర్పడడంతో హోటల్ నిర్వాహకులు తాత్కాలికంగా తమ వ్యాపారాలను నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చింది. హోటల్ యజమానుల మాటల్లో చెప్పాలంటే, గత కొద్ది రోజులుగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా తీవ్రంగా తగ్గిపోయింది. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరా వ్యవస్థలో ఏర్పడిన అంతరాయాల కారణంగా ఈ కొరత ఏర్పడిందని వారు చెబుతున్నారు. సాధారణంగా ప్రతి రోజు అవసరమైన సిలిండర్లు సమయానికి అందేవి. కానీ ఇప్పుడు రెండు మూడు రోజులుగా సిలిండర్లు దొరకకపోవడంతో వంటగదులు ఖాళీగా మారాయి. ఖమ్మం నగరంలో చిన్న పెద్దగా వందలాది హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు కమర్షియల్ గ్యాస్ మీదే ఆధారపడి నడుస్తున్నాయి. గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో అనేక హోటళ్లు తమ సేవలను నిలిపివేశాయి. కొన్ని హోటళ్లు పరిమితంగా మాత్రమే వంటలు చేసి వినియోగదారులకు అందిస్తున్నాయి. అయితే పరిస్థితి ఇలా కొనసాగితే మరిన్ని హోటళ్లు కూడా మూతపడే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. హోటల్ రంగంపై ఆధారపడి పనిచేసే వందలాది కార్మికుల భవిష్యత్తుపై కూడా ఈ పరిస్థితి ప్రభావం చూపుతోంది. హోటళ్లు మూతపడితే వంటమాస్టర్లు, సర్వర్లు, శుభ్రత కార్మికులు, సరఫరా సిబ్బంది వంటి అనేక మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే కొన్ని చోట్ల కార్మికులు పనిలేక ఇళ్లకే పరిమితమయ్యారని హోటల్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “గ్యాస్ లేకపోతే హోటల్ ఎలా నడపగలం? మాకు రోజువారీ వ్యాపారం మీదే జీవనం ఆధారపడి ఉంటుంది. ఇలా రోజులు గడిస్తే మాకు మాత్రమే కాదు, మమ్మల్ని నమ్ముకుని పనిచేస్తున్న కార్మికులందరికీ కష్టాలు వస్తాయి,” అని ఒక హోటల్ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరియు గ్యాస్ సరఫరా సంస్థలు వెంటనే జోక్యం చేసుకుని కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని హోటల్ వ్యాపారులు కోరుతున్నారు. సమస్య త్వరగా పరిష్కారం కాకపోతే ఖమ్మం నగరంలో మరిన్ని హోటళ్లు మూతపడే పరిస్థితి ఏర్పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. స్థానిక వ్యాపార సంఘాలు కూడా ఈ సమస్యపై స్పందిస్తూ అధికారులతో చర్చలు జరిపి త్వరితగతిన పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నాయి. గ్యాస్ కొరత సమస్య త్వరగా తీరాలని వ్యాపారులు, కార్మికులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.