Sunday, 26 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి (పున్నమి ప్రతినిధి) .మనుబోలు మండలం బండేపల్లి గ్రామానికి చెందిన రైతు ఆవుల చిన్న పోతయ్య (45) విద్యుత్ ఘాతంతో మృతి చెందాడు. వరి కోతల సమయం ప్రారంభం కావడంతో పశువులకు గడ్డి తీసుకువస్తుండగా హఠాత్తుగా కరెంట్ స్తంభం వాలింది. దానికి ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో పోతయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బోరున విలపిస్తున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు ఎస్సై శివ రాకేష్ తెలిపారు.

ఖమ్మం

గ్యాస్ కొరతలోనూ హోటల్ ఆగదు – కట్టెల పొయ్యితోనే ప్రజలకు ఆహారం అందిస్తున్న హోటల్ నిర్వాహకుడు

గ్యాస్ కొరతలోనూ హోటల్ ఆగదు – కట్టెల పొయ్యితోనే ప్రజలకు ఆహారం అందిస్తున్న హోటల్ నిర్వాహకుడు ఖమ్మం మార్చి ( పున్నమి జిల్లా ఇంచార్జి ) గ్యాస్ కొరత నేపథ్యంలో ఖమ్మం నగరంలో అనేక హోటళ్లు మూతపడుతున్న సమయంలో, కొత్త బస్టాండ్ సమీపంలోని ఒక హోటల్ నిర్వాహకుడు వినూత్న నిర్ణయం తీసుకుని ప్రజలకు నిరంతరంగా ఆహారం అందిస్తున్నారు. గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో కట్టెల పొయ్యిని ఏర్పాటు చేసి వంటలు చేసి వినియోగదారులకు భోజనం, అల్పాహారం అందిస్తున్నారు. ఈ కట్టెల పొయ్యిని ఏర్పాటు చేయడానికి సుమారు లక్షా యాభై వేల రూపాయలు ఖర్చు అయ్యిందని హోటల్ నిర్వాహకులు తెలిపారు. గ్యాస్ సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు కట్టెల పొయ్యితోనే వంటలు చేసి ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా ఆహారం అందిస్తామని వారు పేర్కొన్నారు. గ్యాస్ కొరత కారణంగా చాలా హోటళ్లు మూతపడిన పరిస్థితిలో, ఈ హోటల్ తీసుకున్న నిర్ణయాన్ని స్థానికులు అభినందిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆహారం అందిస్తాం అని నిర్వాహకులు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలులో వ్యక్తి మృతి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి( పున్నమి ప్రతినిధి).మనుబోలు.మండలంలోని ఆంధ్ర విలాస్ హోటల్ సమీపంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. తోటపల్లి గూడూరు మండలం పాపిరెడ్డి పాలెం గ్రామానికి చెందిన రఘురామయ్య (60) మనుబోలులోని బంధువులను పలకరించి తిరుగు ప్రయాణంలో ఉండగా మద్యం సేవించి రోడ్డుపై పడిపోయాడు. ఎక్కువగా మద్యం సేవించడంతో గొంతు ఆరిపోయి మృతి చెందినట్లు బంధువులు అనుమానిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

కడప

MA గోల్డ్ మెడల్ అందుకున్న ప్రొద్దుటూరు నియోజవర్గం గోపవరం గ్రామపంచాయతీ కాలకట్టకు సంబంధించిన సువర్ణ గారు.

కడప యోగివేమన విశ్వవిద్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారి చేతుల మీదుగా MA గోల్డ్ మెడల్ అందుకున్న ప్రొద్దుటూరు నియోజకవర్గం గోపవరం గ్రామ పంచాయతీ కాలువకట్టకు సంబంధించిన సువర్ణ గారు నేడు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారిని ఆయన క్యాంపు కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి గారు MA గోల్డ్ మెడల్ అందుకున్న సువర్ణను అభినందించారు.

E-పేపర్

మునగనూరు లో నూతన సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

మునగనూరు లో నూతన సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే *శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి పున్నమి న్యూస్ ప్రతినిధి 14 మార్చ్ 2026 ఆదిబాట్ల సర్కిల్ పరదిలోని మునగనూరు లొ నూతన సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని*ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు. నూతన రిజిస్ట్రేషన్ కార్యాలయం తో మునగనూరు,తొర్రూరు, రాగన్నగూడ, తుర్కయంజాల్, మన్నెగూడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రిజిస్ట్రేషన్ కోసం వనస్థలిపురం వెళ్ళల్సిన అవసరం ఇకపై ఉండదాని తెలిపారు. ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలు సులభంగా అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో పనూతన సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రాంత ప్రాంత ప్రజలు ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ పనుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు ఈ కార్యాలయం ప్రారంభంతో సమయం మరియు ఖర్చు రెండూ తగ్గి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు పారదర్శకంగా, వేగంగా సేవలు అందించేందుకు కట్టుబడి ఉందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం ముంగనూరు కు రాకుండ అడ్డుకుండేందుకు కొందరు కుట్రలు చేసిన పట్టుపట్టి మీకోసం మునగనూరు కు తీసుకువచ్చానని ఎమ్మెల్యే తెలిపారు. రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చిన ప్రజలకు అన్ని సౌకర్యాలు కలిపించాలని ఎక్కడ అవినీతి అనేది లేకుండా అధికారులు పని చేయాలనీ ఎమ్మెల్యే సూచించారు…ఈ కార్యక్రమం లో రాష్ట్ర రోడ్డు డవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాం రెడ్డి గ స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

బీసీలకు రూ.50 వేల కోట్ల నిధులు కేటాయించాలి – మెంగని మనోహర్ డిమాండ్

రాజన్న సిరిసిల్ల జిల్లా/ మార్చి/ పున్నమి ప్రతినిధి బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో, బీసీలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని బీసీ సాధికారిక సంఘం స్టేట్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ మెంగని మనోహర్ కోరారు. బీసీ జనాభా దామాషా ప్రకారం బడ్జెట్‌లో కనీసం రూ.50 వేల కోట్ల నిధులు కేటాయించి, చట్టబద్ధంగా బీసీ సబ్‌ప్లాన్ అమలు చేయాలని ఆయన అన్నారు. అలాగే కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించినట్లుగా ప్రతి సంవత్సరం బీసీ సంక్షేమానికి రూ.20,000 కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ.1 లక్ష కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాజీవ్ యువ వికాసం, రైతు భరోసా, విద్యార్థుల ఫీజులు–స్కాలర్షిప్ బకాయిల చెల్లింపులతో పాటు బీసీ కార్పొరేషన్‌కు తగిన నిధులు ఇవ్వాలని కోరారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణనలో భాగంగా బీసీ కులగణన కూడా చేపట్టాలని, కేంద్రంలో పెండింగ్‌లో ఉన్న బీసీ రిజర్వేషన్‌కు సంబంధించిన బిల్లులపై అసెంబ్లీలో చర్చ జరగాలని సూచించారు. బీసీలపై పెరుగుతున్న దాడుల నేపథ్యంలో బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ముందు ఆయన డిమాండ్ చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చిన్నా జనసేన సారథ్యంలో సిమెంట్ బెంచ్ ప్రారంభం – కేక్ కట్ చేసి బాణాసంచాతో సంబరాలు

మర్రిపాడు మండల కేంద్రంలో జనసేన పార్టీ రథసారథి చిన్నా జనసేన సారథ్యంలో 13వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మర్రిపాడు మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిమెంట్ బెంచ్‌ను ప్రారంభించారు. అనంతరం మండల సెంటర్‌లో కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నా జనసేన మాట్లాడుతూ పార్టీ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కులమతాలకు అతీతంగా జనసేన పార్టీ బలోపేతం కోసం తన సాయశక్తులా పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మర్రిపాడు మండల నాయకులు చిన్నా జనసేన, కూరాకు శైలేంద్ర కుమార్, మొద్దు పెంచలయ్య, కృష్ణ కుమార్, వెంకట రమణ, యజ్ఞ శ్రీ, నిత్య శ్రీ, దక్షిత, తిరుపతయ్య, మొద్దు వెంగమ్మ, కూటమి నాయకులు పఠాన్ దండు అశోక్ తదితర జనసైనికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

అనకాపల్లి

జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఘనంగా రక్తదాన శిబిరం..!

అనకాపల్లి జిల్లా మార్చి 14 పున్నమి న్యూస్ : ఎలమంచిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. గౌరవ శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కర్రి ఝాన్సీ, బొద్దపు శ్రీనివాస్ రావు, కొఠారి నరేష్, ఉటకోటి రమేష్, కొఠారి శ్రీను మాస్టర్, గుర్రాల శేఖర్, గొర్లె సత్తిబాబు, కొలగాని భాస్కర్, గంధం శివ తదితర నాయకులు పాల్గొన్నారు. రక్తదానం చేయడం గొప్ప సేవ అని, అవసరమైన వారికి ప్రాణాలు కాపాడే మహోన్నత కార్యక్రమమని నాయకులు తెలిపారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఈ రక్తదాన శిబిరానికి యువత, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్పందించారు. సామాజిక సేవలో భాగంగా ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మర్రిపాడు మండల కేంద్రంలో ఘనంగా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మర్రిపాడు మండల కేంద్రంలో ఘనంగా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మర్రిపాడు మండల కేంద్రంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆత్మకూరు నియోజకవర్గ ఉపాధ్యక్షుడు డబ్బు కొట్టు నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పార్టీ స్థాపకుడు పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలు సంకల్పం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ ఎప్పుడూ ముందుంటుందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డబ్బు కొట్టు నాగరాజు యాదవ్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను గ్రామ గ్రామానికి తీసుకెళ్లి ప్రజలకు సేవ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి డబ్బు కొట్టు సునీల్ యాదవ్ కుమార్, డి. నరసింహులు, కార్యకర్తలు మోహన్ రావు, పెంచలయ్య, కిషోర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ కార్యక్రమం

నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ కార్యక్రమం ముఖ్య వేదికగా మారిందని టిడిపి నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నెల్లూరు రూరల్, మార్చి 14: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో టిడిపి నాయకుడు Kotamreddy Giridhar Reddy పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ప్రజలకు ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎమ్మెల్యే కార్యాలయం అందుబాటులో ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరియు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ఆ దేశాల మేరకు ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తెలియజేసే సమస్యలను అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రజాదర్బార్ ద్వారా వచ్చిన వినతుల ఆధారంగా ఇప్పటికే రూ.27 కోట్ల వ్యయంతో 240 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఈ నెల 22వ తేదీన ఆ 240 అభివృద్ధి పనులను కూటమి నాయకులు మరియు స్థానిక ప్రజల సమక్షంలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ మన్నెం పెంచలనాయుడు, కో-క్లస్టర్ ఇంచార్జ్ విష్ణు ప్రియ, 22వ డివిజన్ కార్పొరేటర్ మూలే విజయభాస్కర్ రెడ్డి, 20వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు దారా మల్లి, 32వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు తోట సునీల్, టిడిపి నాయకులు మాధవి, షేక్ రియాజ్, బషీర్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.