Sunday, 26 April 2026

Blog

తిరుపతి

ఎంజీఎం గ్రూప్ ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే గృహప్రవేశంలో ఎమ్మెల్సీ గ్రీష్మ

శ్రీకాళహస్తి, మార్చి 14, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్వగ్రామమైన ఊరందూరులో నూతనంగా నిర్మించిన గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ తన భర్త శ్రీనివాస్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు శ్రీకాళహస్తి పట్టణంలోని ఎంజీఎం గ్రాండ్ హోటల్‌లో బస చేశారు. అనంతరం ఎంజీఎం గ్రూప్ చైర్మన్ గుడ్లూరు మయూర్, ఆయన సతీమణి గుడ్లూరు ఐశ్వర్య లక్ష్మి, ఎంజీఎం గ్రూప్ చైర్మన్ గుడ్లూరు మల్లికార్జున నాయుడు, గుడ్లూరు భాగ్యలతలను మర్యాదపూర్వకంగా కలిసి పలకరించారు. తదుపరి వారు అందరూ కలిసి ఊరందూరు గ్రామానికి చేరుకొని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగగా, పలువురు నాయకులు, అభిమానులు పాల్గొని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.

తిరుపతి

రైతులకు రూ.6 వేల సాయం… శ్రీకాళహస్తిలో తేదీపా పాలాభిషేకం

శ్రీకాళహస్తి, మార్చి 14, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణ పొలిమేరలో ‘అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్’ పథకంలో భాగంగా రైతులకు మూడో విడతగా రూ.6,000 నిధులు విడుదలైన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు పచ్చని పంట పొలాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రైతుల సంక్షేమానికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు ‘అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్’ పథకం ద్వారా మూడో విడతగా రూ.6,000 జమ చేయడంతో రైతు కుటుంబాల్లో ఉగాది ఆనందం నెలకొన్నదన్నారు. ఈ పథకం ద్వారా ఏడాదికి రైతులకు మొత్తం రూ.20,000 ఆర్థిక సహాయం అందుతుందని 2025–26 సంవత్సరానికి ఈ పథకం కింద రైతులకు మొత్తం రూ.8,985.41 కోట్లు అందుతుండగా, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.6,560.18 కోట్లు, కేంద్ర ప్రభుత్వం రూ.2,425.23 కోట్లు అందిస్తున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం రైతులకు ఎక్కువ సాయం అందిస్తున్నదని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేస్తూ వెలిగొండ ప్రాజెక్టుని 2026 జూలై నాటికి, పోలవరం ప్రాజెక్టులను 2027 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యదర్శులు డా.జి. దశరథాచారి, గాలి చలపతి నాయుడు, మిన్నల్ రవి, యం. సుబ్బయ్య, డా.యం. ఉమేష్ రావు, వజ్రం కిషోర్, తీర్థం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

ఎఫ్‌టీసీసీఐ వేదికగా దామా విజయకుమార్‌కు విశిష్ట సత్కారం

శ్రీకాళహస్తి, మార్చి 14, పున్నమి న్యూస్: ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలోని (ఎఫ్‌టీసీసీఐ) భవనంలో నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ స్టేట్స్ సెక్రటరీగా సేవలందిస్తున్న దామా విజయకుమార్‌కు విశిష్ట సత్కారం లభించింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖుల సమక్షంలో ఆయనకు ప్రశంసా పత్రాన్ని అందజేసి ఘనంగా సన్మానించారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో దామా విజయకుమార్ చేస్తున్న సేవలను కార్యక్రమానికి హాజరైన అతిథులు ప్రశంసించారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణలో అంకితభావంతో పనిచేస్తున్న దామా విజయకుమార్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని మిత్రులు, శ్రేయోభిలాషులు ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియజేశారు.

తిరుపతి

ప్రజల కోసమే వైఎస్ షర్మిళా రెడ్డి యాత్ర – తలపా దామోదరం రెడ్డి

శ్రీకాళహస్తి, మార్చి 14, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళా రెడ్డి చేపట్టినటువంటి ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర రాష్ట్ర పర్యటనలో భాగంగా శనివారం నాడు అమలాపురం జిల్లా పాయకారావుపేట నియోజకవర్గంలోని వెధర్లపాలెం గ్రామంలో కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. ఈ సందర్భంగా దామోదరం రెడ్డి మాట్లాడుతూ….ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో వైఎస్ షర్మిలా రెడ్డి చేపట్టిన యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తున్నదని ప్రజల తరఫున జరుగుతున్న ఈ పోరాట ఫలితంగానే ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలను మరో రెండు నెలలపాటు వాయిదా వేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారని, వైఎస్ షర్మిలా రెడ్డి నిర్వహిస్తున్న సభలకు అశేష జనవాహిని తండోపతండాలుగా తరలివస్తున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రజల ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

తిరుపతి

డాక్టర్ చిర్రి లిఖిత్ పార్థివదేహానికి…నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

శ్రీకాళహస్తి, మార్చి 14, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలోని పీ.వి. రోడ్ సమీపంలో నివసించే శ్రీ రాఘవేంద్ర ట్రేడర్స్ అధినేత చిర్రి మస్తాన్ యాదవ్ కుమారుడు డాక్టర్ చిర్రి లిఖిత్ సాయి ప్రమాదవశాత్తు ఆకస్మికంగా మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని కలిగించింది. ఈ విషయం తెలుసుకున్న శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి లిఖిత్ సాయి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని తల్లి జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయు లింగేశ్వర స్వామివారిని ప్రార్థించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సంతాపం తెలిపిన వారిలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఎం.ఆర్ మురళి యాదవ్,చిర్రి నాగేశ్వరావు యాదవ్, బాలు యాదవ్,శ్రీవారి సురేష్, కంట ఉదయ్ కుమార్, పటాన్ ఫరీద్, బుల్లెట్ జయశ్యామ, షేక్ అస్లాం, పెరుమాళ్ చౌదరి, సాగర్ బి,షర్మిల ఠాగూర్ తదితరులు వున్నారు.

తిరుపతి

శివనాథపురంలో పోలీసుల కార్డన్ సర్చ్– రికార్డుల్లేని 56 వాహనాలు స్వాధీనం

తొట్టంబేడు, మార్చి 14, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తొట్టంబేడు పోలీస్ స్టేషన్ పరిధిలోవున్న శివనాథపురం గ్రామంలో శనివారం పోలీసులు విస్తృతంగా కార్డన్ సర్చ్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వజ్రపహర్ కార్యక్రమంలో భాగంగా డీఎస్పీ నర్సింహమూర్తి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. నియోజకవర్గంలోని వివిధ పోలీస్ స్టేషన్ల సిబ్బంది పాల్గొని గ్రామంలో ఇంటింటికి వెళ్లి వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులు, పత్రాలు తదితరాలను పరిశీలించారు. ఈ తనిఖీల్లో రికార్డులు లేని 52 స్కూటర్లు, 4 ఆటో రిక్షాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వాహనాల యజమానులు సరైన పత్రాలు సమర్పించాలని అధికారులు సూచించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించి వాటికి దూరంగా ఉండాలని ప్రజలను అప్రమత్తం చేశారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలు, మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పించారు. గ్రామంలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు, మత్తు పదార్థాల క్రయవిక్రయాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే 1972 లేదా 112 హెల్ప్‌లైన్ నంబర్లకు సమాచారం అందించాలని పోలీసు అధికారులు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సీఐలు తిమ్మయ్య, ఇబ్రహీం, నాగరాజు, ప్రకాష్‌తో పాటు ఎస్సైలు వెంకటేష్, రవి, సుబ్బారెడ్డి, జ్యోతి, బాలకృష్ణ, ఇమ్మానుయేల్, హరి ప్రసాద్, స్వాతి, రామాంజనేయులు, గోవిందు తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

తిరుపతి

బొజ్జల కుటుంబ గృహప్రవేశ వేడుకకు పెద్దఎత్తున హాజరైన నాయకులు

శ్రీకాళహస్తి, మార్చి 14, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తమ స్వగ్రామమైన ఊరందూరులో నిర్మించిన నూతన గృహానికి శనివారం సంప్రదాయబద్ధంగా గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య సుధీర్ రెడ్డి దంపతులు గృహప్రవేశం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ శుభసందర్భంగా నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, పట్టణ ప్రముఖులు, ఎమ్మెల్యే అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరై సుధీర్ రెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను ఎమ్మెల్యే ఆత్మీయంగా ఆహ్వానించి ఆతిథ్యం అందించారు. ఎమ్మెల్యేకు ఆప్తమిత్రుడైన తుడా ఛైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్, తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రత్యేకంగా హాజరై బొజ్జల కుటుంబ సభ్యులకు శుభాభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు, బొజ్జల కుటుంబ శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పదవ తరగతి పరీక్షలకు కట్టుదిట్టమైన బందోబస్త్ – జిల్లా ఎస్‌పి డా. అజిత వేజెండ్ల నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న

పదవ తరగతి పరీక్షలకు కట్టుదిట్టమైన బందోబస్త్ – జిల్లా ఎస్‌పి డా. అజిత వేజెండ్ల నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల కోసం పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్‌పి డా. అజిత వేజెండ్ల, ఐపీఎస్ తెలిపారు. ఈ నెల మార్చి 16 నుండి ఏప్రిల్ 1 వరకు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 176 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయని వెల్లడించారు. పరీక్షల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ తరఫున కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని ఎస్పీ తెలిపారు. పరీక్షా పత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయడంతో పాటు, ప్రశ్నాపత్రాలను పరీక్షా కేంద్రాలకు తరలించే సమయంలో మరియు సమాధాన పత్రాలను తిరిగి తరలించే సమయంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 అమలులో ఉంటుందని, ఇన్విజిలేటర్లు మరియు పరీక్షలకు కేటాయించిన సిబ్బంది తప్ప ఇతరులు కేంద్రాల వద్ద ఉండరాదని స్పష్టం చేశారు. అలాగే పరీక్షల సమయంలో పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరగేందుకు ఇతర శాఖల సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మొబైల్ పెట్రోలింగ్ బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు నిరంతరం పర్యవేక్షణ చేస్తాయని పేర్కొన్నారు. అలాగే ట్రాఫిక్ అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు జిల్లా ఎస్పీ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులు పరీక్షా నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సమయానికి హాజరు కావాలని, తల్లిదండ్రులు కూడా ముందుగానే కేంద్రాలకు చేరుకునేలా చూడాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఏ పరీక్షా కేంద్రం వద్ద అయినా ఎటువంటి ఘటన జరిగిన వెంటనే DIAL 100 / 112 కు లేదా జిల్లా పోలీస్ వాట్సాప్ నెంబర్ 9392903143 కు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా దేవరపల్లి రఘురాం రెడ్డి నియామకం

పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా దేవరపల్లి రఘురాం రెడ్డి నియామకం ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలం బ్రాహ్మణకాక అగ్రహారానికి చెందిన దేవరపల్లి రఘురాం రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగంలో రాష్ట్ర సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా రఘురాం రెడ్డి గారు మాట్లాడుతూ తనకు ఈ పదవి రావడానికి కారణమైన మాజీ మంత్రి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి, వారి తనయుడు యువ నాయకుడు మేకపాటి అభినవ్ రెడ్డి గారికి, జలదంకి మండల పార్టీ అధ్యక్షుడు మదన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఉదయగిరి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి విజయానికి, అలాగే పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆయన తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వధూవరులకు పెళ్లి కానుకగా రూ.10 వేల ఆర్థిక సహాయం

ఉదయగిరి మండలం దాసరపల్లి పంచాయతీ పరిధిలోని ఎర్రబల్లికుంట గ్రామానికి చెందిన గెట్టిబోయిన సురేష్ – శ్రీమతి హజరత్తమ్మ దంపతుల కుమార్తె వెంకట స్వప్న వివాహ శుభ సందర్భంగా కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున పెళ్లి కానుకగా రూ.10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ట్రస్ట్ సభ్యులు, స్థానిక నాయకుల ద్వారా కుటుంబ సభ్యులకు అందజేయించారు. ఈ సందర్భంగా వధూవరులకు హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తూ వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఐశ్వర్య సంపదలతో నిండిపోవాలని ఆకాంక్షించారు. ప్రజల శుభకార్యాల్లో సహాయం చేయడం తన బాధ్యతగా భావిస్తూ, కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.