Sunday, 26 April 2026

Blog

రంగారెడ్డి

* బాలాపూర్ గ్రామంలో అండర్‌గ్రౌండ్ వాటర్ ట్యాంక్‌లకు మూతలు ఎక్కడ –ప్రజల త్రాగు నీరు పై జిహెచ్ఎంసి ఇంత నిర్లక్ష్యమా – రాళ్ళగూడెం రామకృష్ణారెడ్డి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 15 : రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల్ బడంగ్పేట్ సర్కిల్ 62వ బాలాపూర్ డివిజన్ పరిధిలోని బాలాపూర్ గ్రామంలో ఉన్న అండర్‌గ్రౌండ్ వాటర్ ట్యాంక్ సంపులకు సరైన మూతలు లేకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని బడంగ్పేట్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రాళ్ళగూడెం రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.మూతలు లేకపోవడంతో వాటర్ ట్యాంక్‌లలో చెత్త చెదారం పడుతున్నట్లు ఆయన తెలిపారు. అలాగే పలు జీవరాసులు కూడా ట్యాంక్‌లలో పడే ప్రమాదం ఉండటంతో ప్రజలకు సరఫరా చేసే తాగునీరు కలుషితమై ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు ఏర్పడే అవకాశం ఉందన్నారు.ప్రజల ఆరోగ్యానికి సంబంధించి అత్యంత కీలకమైన తాగునీటి విషయంలో కూడా జిహెచ్ఎంసి అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఆయన అన్నారు. కాబట్టి వెంటనే స్పందించి బాలాపూర్ గ్రామంలోని అండర్‌గ్రౌండ్ వాటర్ ట్యాంక్‌లకు బలమైన సురక్షితమైన మూతలు ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసి అధికారులను డిమాండ్ చేశారు.ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టే విధంగా అధికారుల నిర్లక్ష్యం కొనసాగితే భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడానికి వెనుకాడబోమని రాళ్ళగూడెం రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ మురళీధర్ రెడ్డి సైదులు సతీష్ నంద నాగరాజు పవన్ తదితరులు పాల్గొన్నారు

రంగారెడ్డి

* దేవేందర్ రెడ్డి, విజయలక్ష్మి రాజు ముదిరాజ్ లకు శుభాకాంక్షలు తెలిపిన.అందెల శ్రీరాములు *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 15 : మహేశ్వరం నియోజకవర్గంలోని నాదర్గుల్ బీజేపీ పార్టీ ఆఫీసులో రంగారెడ్డి జిల్లా బిజెపి పార్టీ ప్రధాన కార్యదర్శిగా దేవేందర్ రెడ్డి మరియు కార్యదర్శిగా విజయలక్ష్మి రాజు ముదిరాజ్ నియమితులైనందుకు వారికి మహేశ్వరం నియోజకవర్గం కంటెస్టడ్ ఎమ్మెల్యే అందెల శ్రీరాములు యాదవ్ నాదర్గుల్ పార్టీ ఆఫీసులో శాలువా కప్పి స్వీటు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ బిజెపి పార్టీ అధ్యక్షులు రాళ్ల గూడెం రామకృష్ణారెడ్డి మీర్పేట్ ప్రధాన కార్యదర్శి ఇంద్రావత్ రవి నాయక్ రవీందర్ రఘునాథ్ నాగభూషణం హరినాథ్ చుక్కారావు ప్రభాకర్ యువ నాయకుడు చింటూ విజయలక్ష్మి నాగేశ్వరి దేవి జయలక్ష్మి జిల్లా, మండల, కార్పొరేషన్, మహిళా సీనియర్ సిటిజన్స్ నాయకులందరూ పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

ముగ్గురు–ఐదుగురు పిల్లలు?” బాబు ఆలోచనపై చర్చ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్తగా చేసిన “ముగ్గురు లేదా ఐదుగురు పిల్లలు కనాలి” అనే వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. జనాభా తగ్గుదల భవిష్యత్తులో సమస్య అవుతుందని చెబుతూ ఎక్కువ పిల్లలను ప్రోత్సహించాలన్న ఆయన అభిప్రాయం వెలువడింది. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఒక పిల్లవాడిని పెంచడమే కష్టంగా మారిందని విమర్శకులు అంటున్నారు. ఉద్యోగాల అస్థిరత, వ్యవసాయ రంగంలోని సంక్షోభం, పెరుగుతున్న ఖర్చులు వంటి కారణాలతో సాధారణ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎక్కువ పిల్లలు కనాలని ప్రోత్సహించడం ఎంతవరకు సాధ్యమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భవిష్యత్తు ఆలోచనలతో పాటు ప్రస్తుత వాస్తవాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

ఎలూరు

వృద్ధ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. ఏలూరు జిల్లా పోలవరం మండలం బంగరమ్మపేట ముస్లిమ్ జమాత్ సభ్యులు రంజాన్ మాసం పురస్కరించుకుని పొలవరం లోని గోదావరి వృద్ధ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఈరోజు సాయంత్రం 7 గంటలకు నిర్వహించడం జరిగింది ఈ కార్య క్రమo లొ ముస్లిం యువత మస్జిద్ ఇమామ్, ముతవల్లీ,గ్రామ సభ్యులు పాల్గొన్నారు, END

ఎలూరు

వృద్ధ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. ఏలూరు జిల్లా పోలవరం మండలం బంగరమ్మపేట ముస్లిమ్ జమాత్ సభ్యులు రంజాన్ మాసం పురస్కరించుకుని పొలవరం లోని గోదావరి వృద్ధ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఈరోజు సాయంత్రం 7 గంటలకు నిర్వహించడం జరిగింది ఈ కార్య క్రమo లొ ముస్లిం యువత మస్జిద్ ఇమామ్, ముతవల్లీ,గ్రామ సభ్యులు పాల్గొన్నారు, END

రాజన్న సిరిసిల్ల

మొర్రాయిపల్లెలో లక్కడి నరేష్ వివాహ వేడుకకు ప్రముఖుల హాజరు

ముస్తాబాద్ మార్చి పున్నమి ప్రతినిధి మొర్రాయిపల్లె గ్రామానికి చెందిన లక్కడి నరేష్ వివాహ వేడుకకు సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు కృష్ణారెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తుల సమక్షంలో వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అంజిరెడ్డి, కృష్ణారెడ్డి నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి దాంపత్య జీవితం ఆనందంగా, సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. సమాజంలో మంచి ఆదర్శ దంపతులుగా నిలవాలని వారు ఆశీర్వదించారు. వివాహ వేడుకలో పలువురు గ్రామ పెద్దలు, బంధుమిత్రులు, యువకులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య సాదరంగా నిర్వహించబడింది.

రాజన్న సిరిసిల్ల

ముస్తాబాద్‌లో బద్దిపడగే ప్రతాప్ రెడ్డి గృహప్రవేశం – హాజరైన కేకే మహేందర్ రెడ్డి

ముస్తాబాద్ మార్చి పున్నమి ప్రతినిధి ముస్తాబాద్ పట్టణంలో బద్దిపడగే ప్రతాప్ రెడ్డి గారి నూతన గృహప్రవేశం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పోతుగల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా ఉన్న ప్రతాప్ రెడ్డి గారి ఇంటి గృహప్రవేశ వేడుకలో పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేకే మహేందర్ రెడ్డి, సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌గా పాల్గొని గృహప్రవేశం సందర్భంగా ప్రతాప్ రెడ్డి గారిని అభినందించారు. అలాగే రాష్ట్ర నాయకులు చక్రధర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి తదితరులు గౌరవ అతిథులుగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు ప్రతాప్ రెడ్డి గారికి పూలమాలలు వేసి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

అంతరించిపోతున్న చేతివృత్తుల కులాల వారికి బడ్జెట్‌లో పెద్దపీట వేయాలి – మెంగని మనోహర్

రాజన్న సిరిసిల్ల జిల్లా మార్చి పున్నమి ప్రతినిధి అంతరించిపోతున్న కుల చేతివృత్తులతో ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో బీసీ వర్గాల జీవన పరిస్థితులు దెబ్బతింటున్నాయని, వారి బ్రతుకుల బాగుకోసం రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో ప్రభుత్వం పెద్దపీట వేయాలని మెంగని మనోహర్ డిమాండ్ చేశారు. బీసీ సాధికారిక సంఘం స్టేట్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన మెంగని మనోహర్ మాట్లాడుతూ, బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ముఖ్యంగా సంప్రదాయ కుల చేతివృత్తులు క్రమంగా అంతరించిపోతున్న పరిస్థితుల్లో ఆ వృత్తులను కాపాడేందుకు మరియు బీసీలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక పథకాలు తీసుకురావాలని సూచించారు. అలాగే కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆయన అన్నారు. ఆ హామీలను అమలు చేయడానికి రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో సరిపడా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీలు ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, వారి అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని మెంగని మనోహర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

రంగారెడ్డి

*అల్కాపురి కాలనీలో ఘనంగా ‘ఈస్బీ టెక్స్‌టైల్స్’ ను ప్రారంభించిన దేప భాస్కర్ రెడ్డి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చి 15 : మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణాపురం డివిజన్ అల్కాపురి కాలనీ లోని శ్రీనివాస నూతనంగా ఏర్పాటు చేసుకున్న ఈస్బీ టెక్స్‌టైల్స్ (EESBEE TEXTILES) నూతన షోరూమ్ ను జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు & టిపిసిసి మెంబర్ దేప భాస్కర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన వస్త్రాలను, సరసమైన ధరలకే అందించాలని నిర్వాహకులకు సూచించారు. స్థానిక యువత వ్యాపార రంగంలో రాణించడం అభినందనీయమని, శ్రీనివాస గారి వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.కొత్త వ్యాపార సంస్థల ఏర్పాటు ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ బండి మధుసూదన్ రావు ఖిల్లా మైసమ్మ దేవాలయం చైర్మన్ సురేష్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ తలాటి రమేష్ నేత, ముప్పిడి లింగస్వామి గౌడ్,యాదవ రెడ్డి, జగని రమేష్, పగడాల శ్రీశైలం,పెద్దవూర సైదులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నిరుద్యోగ యువతకు శుభవార్త.. మనుబోలులో మెగా జాబ్ మేళా

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి నెల (పున్నమి ప్రతినిధి) మనుబోలు సి.ఆర్.ఆర్ కళ్యాణమండపంలో ఈ నెల 17న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు టిడిపి మండలాధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య తెలిపారు. ఏపీ ఫీల్డ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచనల మేరకు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు పొందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి తెలుగు యువత అధ్యక్షుడు శివుడు రాజా గౌడ్, చే రెడ్డి పద్మనాభ రెడ్డి, సాని వెంకట రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.