Sunday, 26 April 2026

Blog

తిరుపతి

పెన్షనర్స్ దినోత్సవంలో విశ్రాంతి ఉద్యోగులకు ఎమ్మెల్యే సత్కారం

శ్రీకాళహస్తి, మార్చి 15 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పెన్షనర్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక పెన్షనర్స్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి విశ్రాంత ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పదవీ విరమణ చేసి 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంఘ సభ్యులను ప్రత్యేకంగా సత్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి విశ్రాంత ఉద్యోగులను శాలువాలు కప్పి మెమెంటోలు అందజేసి ఘనంగా అభినందించారు. విశ్రాంత ఉద్యోగులు మాట్లాడుతూ .. ప్రభుత్వాలు తమ సమస్యలను పరిష్కరించేందుకు అండగా నిలవాలని కోరారు. గతంలో కోల్పోయిన పీఆర్‌సీ, ఐఆర్‌సీ వంటి ప్రయోజనాలను పునరుద్ధరించాలని ఎమ్మెల్యేకి వినతి చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి విశ్రాంత ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమం అనంతరం సంఘ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బి. వెంకయ్య, ఉపాధ్యక్షులు పురుషోత్తం గౌడ్, ప్రధాన కార్యదర్శి పి.వి. ప్రసాద్, వెంకట రమణయ్య తదితరులు విశేషంగా పాల్గొన్నారు.

తిరుపతి

అమ్మపాలెం వాసి వెంకట సుబ్బారెడ్డి మృతిపై మాజీ ఎమ్మెల్యే సంతాపం

శ్రీకాళహస్తి, మార్చి 15 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి మండలంలోని అమ్మపాలెం గ్రామానికి చెందిన వెంకట సుబ్బారెడ్డి ఇటీవల ఆకస్మికంగా మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వారి ఇంటికి చేరుకుని సుబ్బారెడ్డి కర్మక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకట సుబ్బారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ విషాద సమయంలో తాము వారి కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యుగంధర్ రెడ్డి, రాజేష్ రెడ్డి, శివ రెడ్డి, శంకరయ్య, చంద్ర రెడ్డి, సుమన్, మాధవ, మధు రెడ్డి, శ్రవణ్ రెడ్డి, హరి రెడ్డి తదితరులు పాల్గొని వెంకట సుబ్బారెడ్డికి నివాళులు అర్పించారు.

తిరుపతి

విద్యార్థులు పరీక్షలను ఆత్మవిశ్వాసంతో రాయాలి–ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి, మార్చి 15 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజవర్గ శాసనసభ సబ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి నేటి నుండి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమవుతున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోయే విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా, శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని విద్యార్థులు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తులో కీలకమైన దశ అని, ఇప్పటి వరకు చేసిన కృషిని పరీక్షల ద్వారా ప్రతిబింబించుకునే అవకాశమని పేర్కొన్నారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. హాల్ టికెట్ చూపిన విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించడం, పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, నీడ వంటి అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి, సమయపాలన పాటిస్తూ ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కోరుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పదో తరగతి విద్యార్థులందరూ మంచి ఫలితాలు సాధించాలని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.

తిరుపతి

ఎమ్మెల్యే గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న మైనారిటీ నాయకులు షఫీ

శ్రీకాళహస్తి, మార్చి 15 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తన స్వగ్రామంలో నూతనంగా నిర్మించిన గృహంలో గృహప్రవేశ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పార్టీ నాయకులు, అభిమానుల సమక్షంలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి గృహప్రవేశ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ వేడుకకు శ్రీకాళహస్తి పట్టణ టీడీపీ మైనారిటీ ప్రధాన కార్యదర్శి షేక్ షఫీ, 32వ వార్డు కార్యదర్శి రూకేష్ హాజరై ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, బొజ్జల రిషిత రెడ్డి దంపతులకు బహుమతులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు.

తిరుపతి

మాజీ ఎమ్మెల్యే ఆదేశాలతో విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ

శ్రీకాళహస్తి, మార్చి 15 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరు ఎస్సీ కాలనీలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలకు అవసరమైన విద్యా సామగ్రిని ఆదివారం నాడు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా వైసీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి పైపూరి రంగయ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ….ప్రతి సంవత్సరం పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు విజయవంతంగా రాయడానికి అవసరమైన సామగ్రిని అందజేస్తున్నామని. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా విద్యార్థులు పరీక్షలను ధైర్యంగా, మంచి ఫలితాలతో రాయాలని ఆకాంక్షిస్తూ పరీక్షా సామగ్రిని పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీ. నరేంద్ర, పి. అరుణాచలం, వినోద్, సంజీవ ప్రసాద్, చెంచు కృష్ణ, ఢిల్లీ బాబు, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

హిందూ ఐక్యతకు శ్రీకాళహస్తిలో కుల పెద్దల సమావేశం

శ్రీకాళహస్తి, మార్చి 15 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని మహేష్ కళ్యాణ సదన్‌లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘం (ఆర్‌ఎస్‌ఎస్) శతవసంతాల సందర్భంగా హిందూ సమాజంలోని కుల పెద్దల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశం శ్రీకాళహస్తి ఖండ కార్యవాహ వెంకట సుబ్రహ్మణ్యం రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ప్రాంత కార్యకారిణి సభ్యుడు దువ్వూరు యుగంధర్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు ప్రపంచానికి విశ్వగురువుగా మార్గనిర్దేశం చేసిన హిందూ సమాజం ఆధ్యాత్మిక, విద్యా, సాంస్కృతిక, సేవా, సామాజిక మరియు ధార్మిక రంగాల్లో విశిష్ట స్థానాన్ని సంపాదించిందన్నారు. బలమైన కుటుంబ వ్యవస్థ, పెద్దల పట్ల గౌరవం, గురువుల పట్ల భక్తి వంటి విలువలతో సమాజంలో ఆత్మీయత నిండిన జీవన విధానం కొనసాగిందని అయితే కాలక్రమంలో విదేశీ దురాక్రమణలు, బలవంతపు మత మార్పిడులు వంటి పరిణామాల వల్ల హిందూ సమాజంలో కొన్ని అవలక్షణాలు ఏర్పడి సమాజం బలహీనపడిందన్నారు. విదేశీ మతాల ప్రభావం కూడా మన జీవన విధానంలోకి చొరబడిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో గతంలో ఉన్న హిందూ సమాజ మహత్తును తిరిగి స్థాపించుకోవడం ప్రతి హిందువు బాధ్యతని ముఖ్యంగా హిందూ సమాజంలోని కుల పెద్దలు, ఆధ్యాత్మిక వేత్తలు, ధార్మిక నాయకులు తమ తమ సామాజిక వర్గాల్లో హిందూ ధర్మ గొప్పతనాన్ని తెలియజేస్తూ సమాజంలో చైతన్యం కలిగించాల్సిన అవసరం ఉందని మత మార్పిడులు వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించి హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో వివిధ సంఘాలకు చెందిన కుల పెద్దలు, సామాజికవేత్తలు, వివిధ రంగాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

యాదాద్రి భువనగిరి

*శ్రీ నాగదేవత విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్నసర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 15 : యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో మార్కండేయ దేవస్థానం లో చిలుకూరి అంజయ్య వారి కుమారులు చిలుకూరి శ్రీనివాస్, చిలుకూరి రాజు కుటుంబ సభ్యులు ఆదివారం శ్రీ నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన మరియు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనీ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ఈ యొక్క కార్యక్రమంలో వార్డ్ నెంబర్లు సింగం బిక్షపతి, కట్లవలజ భాస్కరాచారి, సభావత రఘునాయక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలివేరు పాలా అంజయ్య, మరగోని శంకర్ గౌడ్,కర్నాటి నవీన్, సూరపల్లి భాను, యువజన కాంగ్రెస్ నాయకులు ఉప్పల నాగరాజు, బొడుగు శ్రావణ్, కొండా నవీన్ గౌడ్, పల్లె ఆనంద్ గౌడ్, ఉప్పల చిన్న లింగస్వామీ,బానోతు కిరణ్ నాయక్,బిజెపి నాయకులు సంగిశెట్టి నరేష్, సామాజిక నాయకులు వినుకొండ నర్సింహ మార్కండేయ దేవస్థానం కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

రంగారెడ్డి

* కేంద్రమంత్రి గంగాపురం కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన.. కోలన్ శంకర్ రెడ్డి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 15 : బిజెపి రాష్ట్ర నేత ఆలుపెరగని ప్రజా పోరాట నాయకుడు కోలన్ శంకర్ రెడ్డిని నూతనంగా బిజెపి రాష్ట్ర కోపరేటివ్ సెల్ కన్వీనర్ గా నియమించిన సందర్భంగా మర్యాద పూర్వకంగా ఆదివారం బిజెపి నాయకులతో కలిసి కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖల మంత్రి గంగాపురం కిషన్ రెడ్డిని హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి స్వీట్స్ తినిపించి, పుష్ప గుచ్ఛం అందజేశారు ఈ సందర్భం గా కోలన్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి రాష్ట్ర కోపరేటివ్ సెల్ అధ్యక్షుడిగా పదవి రావడానికి సహకరించి నందుకు కేంద్రమంత్రి గంగాపురం కిషన్ రెడ్డి కి, కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది అలాగే రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రాంచందర్ రావుకి కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి మంత్రి బండి సంజయ్ కుమార్ కి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి , డా కే లక్ష్మణ్ ఎంపీకి జిల్లా అధ్యక్షులు రాజ్ బూపాల్ గౌడ్, ఇతర రాష్ట్ర జిల్లా నాయకులకు ధన్యవాదములు తెలియజేశారు

రంగారెడ్డి

*ఘనంగా మాన్యశ్రీ కాన్షిరాం 92వ జయంతి వేడుకలు *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 15 : బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్షిరాం 92వ జయంతి సందర్భంగా దళిత రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో లక్కీ హోటల్ దగ్గర కాన్షిరాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించినారు అనంతరం హెల్త్ క్యాంపు నిర్వహించారు నాయకులతో పాటు కమిటీ సభ్యులు కూడా రక్త దానం చేసారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మాన్యవర్ కాన్షిరాం తన ఉన్నత సైంటిస్ట్ ఉద్యోగానికి రాజీనామా చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకుని 1984 ఏప్రిల్ 14న బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పీ).ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు మరియు అగ్రవర్ణ పేదలకు రాజ్యాధికారం సాధించాలనే లక్ష్యంతో బహుజన సమాజ్ పార్టీని స్థాపించారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో సంఘము అధ్యక్షులు బి సురేష్, ఉపాధ్యక్షులు ఆడపు లక్ష్మణ్, మహిళ అధ్యక్షురాలు అరుణ,నాయకులు, ఎ మధు, వినోద్రా జేష్,నరేష్,నక్క కృష్ణ, ఇస్లావత్ నరేశ్, పాల్గొన్నారు.

రంగారెడ్డి

*నూతన వధూవరులను ఆశీర్వదించిన దేప భాస్కర్ రెడ్డి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 15 : మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్ కుమారుడు కాకి శివరామకృష్ణ వివాహ వేడుకలలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టిపిసిసి మెంబర్ దేప భాస్కర్ రెడ్డి ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు సామిడీ గోపాల్ రెడ్డి ఏఎంసీ డైరెక్టర్ బండి మధుసూదన్ రావు ఖిల్లా మైసమ్మ దేవాలయం చైర్మన్ సురేష్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ తలాటి రమేష్ నేత ముప్పిడి లింగస్వామి గౌడ్,యాదవ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి,పోతర్ల తిరుపతయ్య, మహేందర్,సామిడీ చరణ్ రెడ్డి,పెద్దవూర సైదులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.