Sunday, 26 April 2026

Blog

రాజన్న సిరిసిల్ల

కార్మికులను భయపెడుతున్న “సీఎస్‌సీ ఆరోగ్య రక్ష” పరీక్షలు రద్దు చేయాలి

ముస్తాబాద్/ మార్చి/ పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లాలో భవన నిర్మాణ మరియు ఇతర రంగాల కార్మికులను “సీఎస్‌సీ ఆరోగ్య రక్ష” పేరుతో రక్త పరీక్షలు చేయించుకోవాలని బలవంతం చేస్తున్నారని బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఫెడరేషన్ నాయకులు ఆరోపించారు. లేబర్ కార్డు ఆన్‌లైన్ కావాలంటే తప్పనిసరిగా రక్త పరీక్ష చేయించుకోవాలని చెప్పి అమాయక కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. దీనివల్ల గ్రామీణ కార్మికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై ఇప్పటికే ఏఎల్ఓ, జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఈ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎగమాటి ఎల్లారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గురజాల శ్రీధర్, కుల శ్రీనివాస్, శ్రావణపల్లి ప్రభాకర్, ఇసంపల్లి రాజయ్యతో పాటు వివిధ మండలాల సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు. సమస్య పరిష్కారం కాకపోతే త్వరలో చలో హైదరాబాద్ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.

రాజన్న సిరిసిల్ల

ముస్తాబాద్‌లో స్వశక్తి మహిళా భవనానికి భూమి పూజ

ముస్తాబాద్/ మార్చి /పున్నమి ప్రతినిధి ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నూతన స్వశక్తి మహిళా భవనం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ళ బాల్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జెల రాజు పాల్గొని భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం స్వశక్తి మహిళా భవనం నిర్మాణం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. మహిళలు సంఘటితంగా అభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్, మట్ట రమణారెడ్డి, కుక్కల దేవేందర్, ఉచిడీ బాల్ రెడ్డి, మహిళా సీఈఓతో పాటు పలువురు మహిళలు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనవడు దేవాంశ్‌కు ధోతీల వేడుక ఘనంగా

మనవడు దేవాంశ్‌కు ధోతీల వేడుక ఘనంగా మంత్రి నారా లోకేష్ – నారా బ్రాహ్మణి దంపతుల కుమారుడు దేవాంశ్‌కు ధోతీల వేడుకను కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ దంపతులు స్వయంగా దగ్గరుండి మనవడికి ధోతీలు పెట్టి ఆశీర్వదించారు. ఈ వేడుకకు నందమూరి, నారా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై దేవాంశ్‌కు ఆశీస్సులు అందించారు. కుటుంబసభ్యుల ఆనందోత్సాహాల మధ్య ఈ వేడుక ఎంతో సాంప్రదాయబద్ధంగా జరిగింది. మనవడికి ధోతీలు పెట్టే ఈ ప్రత్యేక కార్యక్రమం కుటుంబ సభ్యుల సమక్షంలో సంతోషకర వాతావరణంలో నిర్వహించబడింది. 🎉

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మహిళల భద్రత కోసం “శక్తి యాప్”పై విస్తృత అవగాహన – జిల్లా ఎస్‌పి డా. అజిత వేజెండ్ల

మహిళల భద్రత కోసం “శక్తి యాప్”పై విస్తృత అవగాహన – జిల్లా ఎస్‌పి డా. అజిత వేజెండ్ల నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మహిళల భద్రతను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో “శక్తి యాప్” వినియోగంపై పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్‌పి డా. అజిత వేజెండ్ల, ఐపీఎస్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ప్రవేశపెట్టిన ఈ శక్తి యాప్ ప్రతి మహిళ తప్పనిసరిగా తమ మొబైల్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ యాప్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని ఉపయోగించడం ద్వారా మహిళలు ఏదైనా విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం చేరుతుంది. ఆ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తక్షణ సహాయం అందిస్తారని ఎస్‌పి పేర్కొన్నారు. జిల్లా ఎస్‌పి ఆదేశాలు మరియు అడిషనల్ ఎస్‌పి (అడ్మిన్) సూచనల మేరకు శక్తి బృందాలు జిల్లా వ్యాప్తంగా బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లు, షాపింగ్ ప్రాంతాలు, విద్యాసంస్థలు తదితర ప్రదేశాల్లో ప్రజలకు, ముఖ్యంగా మహిళలు మరియు విద్యార్థినిలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమాల్లో మహిళలకు శక్తి యాప్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఎలా ఉపయోగించాలి అనే విషయాలను వివరంగా తెలియజేస్తున్నారు. అలాగే బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, వెట్టిచాకిరీ, మానవ అక్రమ రవాణా, పోక్సో చట్టం, మాదకద్రవ్యాల నిషేధం వంటి అంశాలపై కూడా అవగాహన కల్పిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే డయల్ 100, 112, 1098, 1930 వంటి హెల్ప్‌లైన్ నంబర్ల గురించి కూడా ప్రజలకు తెలియజేస్తూ భద్రతపై జాగ్రత్తలు సూచిస్తున్నారు. మహిళలందరూ తమ భద్రత కోసం శక్తి యాప్‌ను తప్పనిసరిగా మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకుని అవసర సమయంలో పోలీసుల సహాయం పొందాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

తిరుపతి

ఏఐ -3డి ప్రింటింగ్ పై రెండు రోజుల జాతీయ సదస్సు విజయవంతం

పున్నమి ప్రతినిధి, రామచంద్రపురం రామచంద్రపురం మండలం వెంకట్రామాపురం సమీపంలోని సెవెన్ హిల్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ లో ఫార్మాస్యూటికల్ అనాలిసిస్ మరియు ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగాల ఆధ్వర్యంలో “AI, 3D ప్రింటింగ్ మరియు నియంత్రణ సంసిద్ధతకు నాణ్యత “హామి” అనే అంశం పై నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సు శనివారం నాడు విజయవంతంగా ముగిసింది. రెండో రోజున డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీన్కు చెందిన సతీష్ బాబు వక్తగా హాజరై భవిష్యత్ ఫార& సిస్టులకు అవసరమైన క్వాలిటీ మైండ్ సెట్ గురించి వివరించారు. అనంతరం శ్రీ ఆర్. చంద్రరేఖర్ జర్నల్ పేపర్ రచిన మరియు పరిశోధన విధానాల పై ముఖ్యమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగాం నిర్వహించిన మాఖక మరియు ఈ-పోస్టర్ ఉత్తమ ప్రజంటేషన్లకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సదస్సు ద్వారా ఫార్మసీ రంగంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 3 డి, ప్రింటింగ్ మరియు క్వాలిటీ అష్యూరెన్స్ వంటిఆధునిక సాంకేతికతల పై అవగాహన పెంపొందించడంలో ముఖ్యమైన వేదికగా నిలిచిందని సదస్సు కన్వీనర్లు శివగామి, సతీష్ కుమార్ తెలిపారు.

తిరుపతి

బొజ్జల కుటుంబ గృహప్రవేశ వేడుకకు పెద్దఎత్తున హాజరైన నాయకులు

శ్రీకాళహస్తి, మార్చి 14, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తమ స్వగ్రామమైన ఊరందూరులో నిర్మించిన నూతన గృహానికి శనివారం సంప్రదాయబద్ధంగా గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య సుధీర్ రెడ్డి దంపతులు గృహప్రవేశం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ శుభసందర్భంగా నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, పట్టణ ప్రముఖులు, ఎమ్మెల్యే అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరై సుధీర్ రెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను ఎమ్మెల్యే ఆత్మీయంగా ఆహ్వానించి ఆతిథ్యం అందించారు. ఎమ్మెల్యేకు ఆప్తమిత్రుడైన తుడా ఛైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్, తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రత్యేకంగా హాజరై బొజ్జల కుటుంబ సభ్యులకు శుభాభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు, బొజ్జల కుటుంబ శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో జాతీయ లోక్ అదాలత్ విజయవంతం… 1,937 కేసుల పరిష్కారం

శ్రీకాళహస్తి, మార్చి 14, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణం న్యాయస్థాన సముదాయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఆదేశాల మేరకు శనివారం నాడు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజీమార్గంలో కేసులను పరిష్కరించుకునే అవకాశంపై కక్షిదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా లోక్ అదాలత్ ద్వారా అప్పిలు లేని తుది తీర్పు పొందవచ్చని, రాజీ ద్వారా కేసులు పరిష్కరించుకోవడం వల్ల సమయం, ధనం ఆదా అవుతాయని న్యాయమూర్తి తెలిపారు. కార్యక్రమంలో ముందుగా కోర్ట్ ఆవరణలో తిరుపతి, సంకల్ప హాస్పిటల్ వాళ్ళు మెడికల్ క్యాంప్ నిర్వహించగా న్యాయమూర్తులు ఈ వైద్య శిభిరాన్ని ప్రారంభించి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం జరిగిన లోక్ అదాలత్‌లో మొత్తం 1,937 కేసులు పరిష్కరించబడగా, రూ.1,01,73,495 నగదు వసూలైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి బేబీ రాణి, జూనియర్ సివిల్ జడ్జి కృష్ణప్రియ, మెజిస్ట్రేట్ సాంబశివ, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, కక్షిదారులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో ఘనంగా జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

శ్రీకాళహస్తి, మార్చి 14, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పేట బ్రదర్స్ మిత్రబృందం ఆద్వర్యంలో పార్టీ కార్యాలయంలో వీర మహిళలు, జన సైనికులు, ఉద్యమి సభ్యత్వదారులు, జనసేన నాయకులు జనసేన పార్టీ జెండాను ఎగరవేసి, కేక్ కటింగ్ చేసి తదనంతరం రామచంద్రాపురం గ్రామం, శివనాదిపాలెం పంచాయతీ, పొయ్య పంచాయితీ, చిట్టత్తూరు పంచాయతీ నందు పార్టీ జెండాను ఎగరవేసి, పొయ్య గిరిజన కాలనీలో అన్న వితరణ చేసి గిరిజనుల సమక్షంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండుగలాగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు, ఉద్యమ సభ్యత్వదారులు పాల్గొనడం జరిగింది.

తిరుపతి

బడికి దూరమవుతున్న పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రగతి స్వచ్ఛంద సంస్థ

శ్రీకాళహస్తి, మార్చి 14, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి రూరల్ మండలంలోని వాంపల్లి, పల్లం ఈశ్వరయ్య గిరిజన కాలనీలలో కొద్దిరోజులుగా కొంతమంది విద్యార్థులు బడికి సక్రమంగా పోకుండా ఎలాంటి కారణాలు సమస్యలు లేకున్నా కొంతమంది విద్యార్థులు ఇంటి వద్దనే వృధాగా కాలం గడిపేస్తున్నారని గుర్తించిన ప్రగతి స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పోతురాజు ఉపాధ్యాయిణీలు ముని లక్ష్మి, రాజారాణి, శిరీష, మల్లేశ్వరి లతో చర్చించి విద్యార్థుల నీవాసలకు వెళ్లి ఇంటింటా బడికి రాని విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి మాట్లాడి తమ పిల్లలను ప్రతిరోజు పాఠశాలకు పంపాలని పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత మధ్యాహ్న భోజనం పథకం, యూనిఫామ్ పాఠ్యపుస్తకాలు గురించి వివరించారు. విద్యార్థులకు పాఠశాలల్లో హాజరు సక్రమంగా ఉండాలని తక్కువగా ఉంటే తల్లికి వందనం పథకం రాకుండా పోయే అవకాశం ఉందని ఎక్కువ రోజులు ఇంటి వద్దనే ఉంది కాలక్షేపం చేస్తున్న విద్యార్థులు భవిష్యత్తులో బాల కార్మికులుగా మారే అవకాశం ఉందని బాల్య వివాహాలు కూడా జరిగే ప్రమాదం ఉందని వారికి తెలిపి బడికి సక్రమంగా పంపించాలని చిన్నారుల తల్లి,దండ్రులకు విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి వారిని ఒప్పించడం జరిగిందని ప్రగతి స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు.

తిరుపతి

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గృహప్రవేశానికి ఎంజీఎం కుటుంబం శుభాకాంక్షలు

శ్రీకాళహస్తి, మార్చి 14, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి,బొజ్జల రిషిత రెడ్డి దంపతులకు ఊరందరు గ్రామంలో నూతనంగా నిర్మించిన గృహప్రవేశ సందర్భంగా శ్రీకాళహస్తి ఎంజీఎం గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ గుడ్లూరు మయూర్, గుడ్లూరు ఐశ్వర్య లక్ష్మి దంపతులు, తండ్రి ఎంజీఎం గ్రూప్ చైర్మన్ గుడ్లూరు మల్లికార్జున్ నాయుడు, గుడ్లూరు భాగ్యలత దంపతులు కుటుంబ సమేతంగా వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు ఎంజిఎం కుటుంబ సభ్యులకు బొజ్జల బృందమ్మ కలంకారి వస్త్రములు బహుకరించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా ఎంజీమ్ గ్రూప్ చైర్మన్ గుడ్లూరు మల్లికార్జున్ నాయుడు మాట్లాడుతూ….దైవ నిలయమైన శ్రీకాళహస్తి అభివృద్ధికి కారుకులైన మూడు తరాల బొజ్జల కుటుంబం తాత బొజ్జల గంగ సుబ్బరామిరెడ్డి, తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఇప్పుడు మనవడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి వరుసుగా ఒకే కుటుంబం నుంచి మూడు తరాలు శ్రీకాళహస్తికి ప్రాతినిధ్యం వహించడమే కాకుండా 1966 నుంచి 2026 వరకు 60 సంవత్సరాలు ఏడు సార్లు శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా ఒకే కుటుంబం నుంచి ఎన్నికై శ్రీకాళహస్తి అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారని నేడు సరికొత్త సదుపాయాలతో ఊరందరు గ్రామంలో బొజ్జల కుటుంబం నూతన గృహాన్ని నిర్మించి గృహప్రవేశం చేయడం శ్రీకాళహస్తి ప్రజలకు ఎంతో బలంచేకూరిందని సంతోషాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి బొజ్జల కుటుంబ అభిమానులు, రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు తరలివచ్చి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంజీఎం గ్రూప్ చైర్మన్ గుడ్లూరు మల్లికార్జున్ నాయుడు దంపతులు, ఎంజీఎం గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ గుడ్లూరు మయూర్ దంపతులు, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ దంపతులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.