Monday, 27 April 2026

Blog

తిరుపతి

అవిలాల చెరువును తిరుపతి ప్రజల కోసం అద్భుతంగా తీర్చిదిద్దుతాం: తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి

పున్నమి ప్రతినిధి ,తిరుపతి జిల్లా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తుడా ఆధ్వర్యంలో అవిలాల చెరువు అభివృద్ధి పనులను అత్యంత వేగంగా చేపడుతున్నట్లు తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన అవిలాల చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గతంలో మూడు నెలల సమయం పట్టే జంగిల్ క్లియరెన్స్ (చెత్తాచెదారం, పిచ్చి మొక్కల తొలగింపు) పనులను కేవలం ఒక్క నెలలోనే పూర్తి చేశామని తెలిపారు. పేరూరు తుమ్మలగుంట చెరువు నుంచి వచ్చే ఓవర్‌ఫ్లో నీరు మరియు డైరీ పక్కన పశ్చిమ దిశ నుండి వచ్చే ఇన్‌ఫ్లో ద్వారా అవిలాల చెరువు నిండుతుందని తెలిపారు. సుమారు 157 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువుకు సంబంధించి 14 మీటర్ల వెడల్పు గల బండ్ (గట్టు) నిర్మాణం చేపట్టనున్నారు. దీని కనీస వెడల్పు 3 మీటర్లు ఉండగా, ఎత్తు 5 మీటర్లుగా నిర్ణయించమన్నారు. తిరుపతి నగర మరియు చుట్టుపక్కల ప్రజల కోసం ఇక్కడ ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్, స్పోర్ట్స్ ఏరియా మరియు అందమైన గార్డెనింగ్‌ను అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. చెరువులోని నీటిని కలుషితం కాకుండా కాపాడటమే కాకుండా, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయనున్నట్లు తెలిపారు. తుడా మరియు నీటిపారుదల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన బడ్జెట్ అంచనాల ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలోనే పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులు ముగించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఛైర్మన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తుడా సెక్రటరీ డా యన్ వి శ్రీకాంత్ బాబు, ఎస్ ఈ రవీంద్రయ్య, ఏఈ భవ్య, ఇరిగేషన్ ఈ ఈ ప్రసాద్, ఏ ఈ, రెవెన్యూ,తుడా అధికారులకు, తదితరులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

పోతుగల్ పీహెచ్‌సీలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికకు మంచి స్పందన

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు ప్రభుత్వ ఆరోగ్య సేవలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోతుగల్ గ్రామ సర్పంచ్ పెద్దిగారి యాదమ్మ , ఉప సర్పంచ్ కోల కృష్ణ, డాక్టర్ ఆఫీజ వార్డు సభ్యులు పాల్గొన్నారు. అలాగే మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, ఆశా వర్కర్లు, హాస్పిటల్ సిబ్బంది మరియు వివిధ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు ప్రజలకు ప్రభుత్వ పథకాల గురించి వివరించి, ఆరోగ్య సేవలను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. గ్రామ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

లిఫ్ట్ అడిగి కాలయముడి కారు ఎక్కాడు: రోడ్డు ప్రమాదంలో బట్టల వ్యాపారి మృతి

​దత్తలూరు/పామూరు: 11-3-2026 అపరిచితులను నమ్మి లిఫ్ట్ అడగడం ఆ వ్యాపారి ప్రాణాల మీదకు తెచ్చింది. రాత్రి వేళ గమ్యస్థానానికి త్వరగా చేరుకోవాలన్న ఆత్రుత అనంత లోకాలకు పంపింది. కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఉదయగిరిలో బట్టల షాపు నడుపుకునే షాంషీర్ (వ్యాపారి) అక్కడికక్కడే మృతి చెందారు. ​అసలేం జరిగిందంటే? ​ఉదయగిరిలో బట్టల వ్యాపారం చేసుకునే షంషార్ వ్యక్తిగత పనిపై దత్తలూరు వెళ్లారు. పని ముగించుకుని తిరిగి పామూరు వెళ్లేందుకు రాత్రి 11 గంటల సమయంలో దత్తలూరు వద్ద వేచి చూస్తుండగా, అదే దారిలో వెళ్తున్న ఒక కారును లిఫ్ట్ అడిగారు. కారు యజమాని అతడిని ఎక్కించుకుని పామూరు వైపు బయలుదేరారు., ​కారు దత్తలూరు సమీపంలోని తెడ్డుపాడు వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపుతప్పింది. అతివేగం కారణంగానో లేదా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లో కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన షంషార్ ఘటనా స్థలంలోనే మరణించారు. స్థానిక పోలీస్ సంఘటన స్థలనికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఖమ్మం

దీక్ష కొనసాగిస్తున్న కల్వకుంట్ల కవిత *

* T.Ravinder ఖమ్మం మార్చి (పున్నమి ప్రతినిధి) ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా మూడో రోజు కొనసాగుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిరవధిక నిరాహార దీక్ష* *హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో దీక్ష కొనసాగిస్తున్న కల్వకుంట్ల కవిత * *బుధవారం ఉదయం దీక్షా శిబిరంలో వివిధ దిన పత్రికలు చదివిన జాగృతి అధ్యక్షురాలు* వెలుగుమట్ల బాధితులతో కలిసి సోమవారం ఖమ్మం జెడ్పీ సెంటర్ లో భారీ ఆందోళన చేసిన కవిత , డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ తదితరులు అదే రోజు కవిత సహా పలువురి అరెస్టు.. 41 సీ ఆర్ పీసీ నోటీసులు ఇచ్చి విడుదల చేసిన పోలీసులు.. అనంతరం ఖమ్మం అంబేద్కర్ భవన్ లో వెలుగుమట్ల బాధితులతో కలిసి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించిన జాగృతి అధ్యక్షురాలు మంగళవారం ఉదయం కవిత గారు సహా దీక్ష చేస్తున్న నాయకుల అరెస్ట్.. హైదరాబాద్ కు తరలింపు.. హైదరాబాద్ లోని జాగృతి కార్యాలయంలో నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్న కల్వకుంట్ల కవిత

హైదరాబాద్

2O03 డి ఎస్ సి అభ్యర్థులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలి

*2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ మంజూరు చేయాలని గౌరవ శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసిన – TGTJAC గౌరవాధ్యక్షులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు మరియు TG TJAC సెక్రటరీ జనరల్ శానమోనినర్సిములు గారు* *పున్నమి ప్రతినిధి* *హైదరాబాద్ తేది::* *11.03.2026* *నాడు TPCC అధికార ప్రతినిధి, TG TJAC గౌరవాధ్యక్షులు శ్రీ గాల్ రెడ్డి గారి నేతృత్వంలో.. *. TGTJAC సెక్రెటరీ జనరల్ శానమోని నర్సిములు* *గారు ముఖ్యమంత్రి సలహాదారులు శ్రీ వేంనరేందర్ రెడ్డి గారిని కలిసి రాజ్యసభ సభ్యులుగా ఎంపికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి ఉపాధ్యాయులకు సంబంధించిన ఈ క్రింది సమస్యలపై విజ్ఞప్తి చేయడం జరిగింది. అనుకూలంగా స్పందించిన వారు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సమావేశ పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రాతినిధ్యం చేసిన అంశాలు : 1. డీఎస్సీ 2003 అభ్యర్థులకు పాత పెన్షన్ అమలు చేయాలి 2. ఆధార్ మిస్ మ్యాచ్ అయిన కారణంగా ఆగిపోయిన 216 మంది ఉపాధ్యాయుల జీతాలను వెంటనే మంజూరు అయ్యేలా సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు ఇవ్వాలి. 3. జీవో 317 బాధితులైన ఉపాధ్యాయులకు తాత్కాలికంగా ఇచ్చే డిప్యూటేషన్లను (డిస్ లొకేటెడ్ నాన్ డిస్ లోకేటెడ్ ఇరువురికి) త్వరగా ఇవ్వాలి. 4. జీవో 190 ను సవరించి అప్గ్రేడ్ అయిన భాషాపండితులకు కూడా కనీసం తాత్కాలికంగా ఇచ్చే డిప్యూటేషన్స్ ఇచ్చి సొంతజిల్లాలకు కేటాయించాలి. 5. మిగిలిపోయిన భాషా పండితులను అప్గ్రేడ్ చేయాలి. 6. మిగిలిపోయిన స్పౌస్ లు, అంతర్ జిల్లా స్పౌస్ లు, సెంట్రల్ స్పౌస్ లకు కూడా అవకాశం ఇస్తే స్పౌస్ లు అందరికీ అవకాశం ఇవ్వాలని కోరారు

అనకాపల్లి

ఏటికొప్పాకకు చెందిన బాలుడు కౌశిక్ మృతి కేసులో అసలు నిజం బయట నాటు తుపాకీ మిస్‌ఫైర్ ఘటనపై కేసు ఛేదించిన పోలీసులు-ఇద్దరు నిందితుల అరెస్ట్

అనకాపల్లి జిల్లా, మార్చి 10 (పున్నమి న్యూస్ ప్రతినిధి – ఆనంద్): అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో నాటు తుపాకీ మిస్‌ఫైర్ కారణంగా 13 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. గ్రామానికి చెందిన ఆడారి వెంకట కౌశిక్ తన స్నేహితులతో కలిసి గ్రామ శివారులో ఉన్న ఒక ఇంటి వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న నాటు తుపాకులను చూపిస్తూ అవి ఎలా పనిచేస్తాయో వివరించే క్రమంలో ప్రమాదవశాత్తు తుపాకీ మిస్‌ఫైర్ అయింది. ఈ ఘటనలో గుండు కౌశిక్‌కు తగలడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనతో భయపడిన ఇంటి యజమాని బాలుడి మృతదేహాన్ని సమీపంలోని తుప్పల్లో పడేసి పరారైనట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రెండు నాటు తుపాకులు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రజా సమస్యలపై చురుకైన పోరాటం.. MLC పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని జగన్ అభినందన

ప్రజా సమస్యలపై చురుకైన పోరాటం.. MLC పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని జగన్ అభినందన కౌన్సిల్ సమావేశాలు ముగిసిన అనంతరం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు MLC పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి మరియు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. కౌన్సిల్‌లో టీటీడీ కల్తీ నెయ్యి ఘటనతో పాటు పలు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ప్రజావ్యతిరేక అంశాలపై చురుకుగా స్పందిస్తున్నందుకు జగన్ మోహన్ రెడ్డి ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిణామాలపై కూడా ఇరువురు చర్చించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పరికోటలో రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

పరికోటలో రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కలిగిరి మండలం పరికోట గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో రైతులకు రాజముద్రతో ముద్రించబడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో రీ-సర్వే పేరుతో జరిగిన అవకతవకల వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం భూ వివరాలను పారదర్శకంగా నమోదు చేస్తోందని చెప్పారు. రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్‌తో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం ద్వారా రైతుల భూమి వివరాలు స్పష్టంగా నమోదవుతాయని పేర్కొన్నారు. అన్నదాతల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతుల అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.