Monday, 27 April 2026

Blog

రాజన్న సిరిసిల్ల

ప్రజా పాలన -ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు రోడ్ల శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్న నామాపూర్ సర్పంచ్

ముస్తాబాద్ మార్చి 10 (పున్నమి ప్రతినిధి) రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం రామాపురం గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు గ్రామ సర్పంచ్ మాదాసు అనిల్. ఉప సర్పంచ్ తాడేపమురయ్య. మరియు పాలకవర్గం గ్రామపంచాయతీ సిబ్బంది తో కలిసి రోడ్లను శుభ్రం చేశారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్లే కాకుండా సనిటేషన్ కానీ శుభ్రంగా ఉంచాలని గ్రామాన్ని పరిశుభ్ర గ్రామపంచాయతీగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా సర్పంచ్ అనిల్ గారు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS

SPS నెల్లూరు జిల్లా నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS ఆధ్వర్యంలో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా పోలీసు అధికారులతో కలిసి వివిధ నేరాలపై సమగ్రంగా సమీక్షించారు. స్మార్ట్ పోలీసింగ్ ద్వారా ఆధునిక సాంకేతికత, డేటా విశ్లేషణ, సీసీటీవీ నిఘా, డ్రోన్లు మరియు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను వినియోగించి నేరాలను ముందుగానే గుర్తించి ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించాలని ఎస్పీ సూచించారు. గ్రేవ్ కేసుల విచారణను నిర్ణీత గడువులో పూర్తి చేసి ఛార్జ్ షీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. PGRS పిటిషన్లను తక్షణమే పరిష్కరించడంతో పాటు డయల్-112 కాల్స్‌కు వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకోవాలని చెప్పారు. ప్రతి కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించి దర్యాప్తు చేయడం ద్వారా కన్విక్షన్ రేటు పెంచాలని సూచించారు. ఓపెన్ డ్రింకింగ్‌పై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి నేరాలను నియంత్రించాలని, రౌడీ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి నిబంధనలు ఉల్లంఘించిన వారి బెయిల్ రద్దు చేయించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ఇతర శాఖలతో కలిసి బ్లాక్ స్పాట్స్‌ను పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రోన్ సర్వైలెన్స్ పెంచడం, ముఖ్య ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంపై అవగాహన కల్పించడం, అనుమానిత ప్రాంతాల్లో కార్డన్ ఆపరేషన్స్ నిర్వహించడం వంటి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మిస్సింగ్ కేసులను ప్రత్యేక బృందాలతో వెంటనే చేధించాలని, ప్రతి అధికారి తప్పనిసరిగా విలేజ్ విజిట్ చేయాలని పేర్కొన్నారు. రాత్రి గస్తీలను ముమ్మరం చేసి అనుమానితుల వేలిముద్రలు సేకరించాలని సూచించారు. అనంతరం జిల్లాలో పెండింగ్‌లో ఉన్న గ్రేవ్, నాన్-గ్రేవ్ కేసులు, హత్య, POCSO, రేప్, డెకాయిటి, రాబరీ, ప్రాపర్టీ, వాహనాల దొంగతనం, మిస్సింగ్, చీటింగ్ కేసులు, రోడ్డు ప్రమాదాలు, 174 Cr.P.C కేసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ పనులు, పెండింగ్ NBWs, NDPS కేసులపై సర్కిల్ వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీమతి CH. సౌజన్య, ఎస్‌బీ, కావలి, ఆత్మకూరు డీఎస్పీలు మరియు ఇతర జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రజా ఫిర్యాదులపై చట్ట ప్రకారం విచారణ చేసి న్యాయం చేస్తాం: జిల్లా ఎస్‌పి డా. అజిత వేజెండ్ల

SpSR నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (Public Grievance Redressal System) కార్యక్రమంలో మొత్తం 161 ఫిర్యాదులు స్వీకరించినట్లు జిల్లా ఎస్.పి. డా. అజిత వేజెండ్ల, IPS తెలిపారు. ప్రజా సమస్యల పట్ల పోలీసు అధికారులు అలసత్వం ప్రదర్శించకుండా బాధ్యతతో వ్యవహరించి, అందిన పిటీషన్లను త్వరితగతిన పరిశీలించి చట్టపరంగా పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదుల్లో కుటుంబ వివాదాలు, మోసపూరిత వ్యవహారాలు, అదనపు కట్న వేధింపులు, ఆర్థిక మోసాలు వంటి అంశాలు ఉన్నాయి. ముత్తుకూరు, కోట, చిల్లకూరు, తోటపల్లి గూడూరు, దర్గామిట్ట పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కొన్ని ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్.పి సూచించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా ఎస్.పి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్.పి (అడ్మిన్) CH. సౌజన్య, ఎస్‌బి డీఎస్పీ శ్రీనివాసరావు, మహిళా స్టేషన్ డీఎస్పీ సత్యనారాయణ, డీసీఆర్‌బీ సీఐ రామారావు, కంట్రోల్ రూమ్ సీఐ భక్తవత్సల్ రెడ్డి, ఎస్‌బి-2 సీఐ శ్రీనివాస రెడ్డి మరియు కంప్లైంట్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తూర్పుకనుపూరు శ్రీ ముత్యాలమ్మ జాతరపై ఎస్పీ పర్యవేక్షణ

నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ చిల్లకూరు మండలం తూర్పుకనుపూరులో 10 నుంచి 13 మార్చి వరకు జరగనున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఐపీఎస్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలో కంట్రోల్ రూమ్, బారికేడింగ్, క్యూ లైన్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. సుమారు ఐదు లక్షల మంది భక్తులు రానున్న నేపథ్యంలో QRT టీమ్స్, మొబైల్ పెట్రోలింగ్, డ్రోన్ సర్వైలెన్స్, సీసీటీవీ పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జూదం, డైమండ్ డబ్బా వంటి అక్రమాలను అరికట్టాలని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.

ఖమ్మం

అనుమతి లేకుండా జెడ్పీ సెంటర్ వద్ద ధర్నా… కల్వకుంట్ల కవిత సహా 43 మందిపై కేసులు

ఖమ్మం, మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) అంబేద్కర్ భవన్ ఆవరణంలో ఆశ్రయం పొందుతున్న వెలుగుమట్ల భూ నిర్వాసితులను ధర్నా పేరిట రెచ్చగొట్టి, ఎటువంటి అనుమతులు లేకుండా జిల్లా పరిషత్ సెంటర్ వద్ద మూడు గంటలపాటు రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించిన ఘటనలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజుతో పాటు మొత్తం 43 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి తెలిపారు. వెలుగుమట్ల భూ నిర్వాసితులను తప్పుదోవ పట్టించి ధర్నాకు దిగేలా ప్రేరేపించి, రోడ్డుపై బైఠాయించడం వల్ల ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు వారించినప్పటికీ ఆందోళనకారులు వినకుండా దౌర్జన్యంగా ప్రవర్తించి పోలీసు విధులకు ఆటంకం కలిగించారని వెల్లడించారు. ఈ కేసులో ఉన్న 43 మందిలో ఖమ్మం జిల్లాకు సంబంధం లేని 33 మంది నిజామాబాద్, వనపర్తి, నల్గొండ, కామారెడ్డి, హన్మకొండ, హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన బయట వ్యక్తులని తెలిపారు. వారు అంబేద్కర్ భవన్‌లో ఉన్న బాధితులను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీపీ స్పష్టం చేశారు. అదేవిధంగా కొంతమంది భూ నిర్వాసితులు విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీస్ సిబ్బందిపై దాడులు చేసినట్లు ప్రాథమిక సమాచారం ఉందని తెలిపారు. సంఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను పరిశీలించిన అనంతరం సంబంధిత వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేయనున్నట్లు చెప్పారు. భూ నిర్వాసితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొంతమంది రెచ్చగొట్టే మాటలను నమ్మి మోసపోవద్దని ఏసీపీ విజ్ఞప్తి చేశారు..

ఖమ్మం

ఇకపై రైతులు గడ్డి మందు కొనాలంటే అధికారుల అనుమతి తప్పనిసరి

ఖమ్మం, మార్చి 10, 2026 (పున్నమి ప్రతినిధి): వ్యవసాయంలో కలుపు మొక్కలను నివారించేందుకు రైతులు విస్తృతంగా ఉపయోగిస్తున్న ప్యారా క్యూట్ డైక్లోరైడ్ మందు రైతుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మందు విక్రయాలపై నియంత్రణ విధిస్తూ, ఇకపై వ్యవసాయ అధికారుల అనుమతి ఉన్నప్పుడే రైతులకు గడ్డి మందును విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది. గత కొంతకాలంగా ఈ రసాయన మందును పంటలలో కలుపు నివారణ కోసం విస్తృతంగా వినియోగిస్తున్నప్పటికీ, అనుకోని ప్రమాదాలు, ఆత్మహత్యలకు ఈ మందు కారణమవుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం గడ్డి మందుల విక్రయాలపై కట్టుదిట్టమైన నియంత్రణలు అమలు చేయాలని నిర్ణయించింది. ఇకపై రైతులు గడ్డి మందు కొనుగోలు చేయాలంటే ముందుగా సంబంధిత వ్యవసాయ అధికారులను సంప్రదించాలి. అధికారులు రైతుల పొలాలను ప్రత్యక్షంగా పరిశీలించి నిజంగా గడ్డి మందు అవసరం ఉందని భావించినప్పుడు మాత్రమే ప్రత్యేక డిస్క్రిప్షన్ (ప్రమాణ పత్రం) ఇవ్వనున్నారు. ఆ డిస్క్రిప్షన్ ఆధారంగా మాత్రమే రైతులు పురుగు మందుల దుకాణాల నుంచి గడ్డి మందును కొనుగోలు చేయగలరు. అలాగే ఎరువులు, పురుగు మందుల దుకాణాలు ఈ మందు విక్రయాలకు సంబంధించి ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. ప్రతి రైతు వివరాలు, ఇచ్చిన డిస్క్రిప్షన్ వివరాలు, విక్రయించిన మందు పరిమాణం వంటి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలని అధికారాలు ఆదేశించాయి. ఈ విధానం ద్వారా గడ్డి మందుల అనవసర వినియోగాన్ని తగ్గించడమే కాకుండా రైతుల ప్రాణ భద్రతను కాపాడడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. రైతులు కూడా ఈ నియమాలను పాటిస్తూ అవసరమైతే మాత్రమే మందులను వినియోగించాలని సూచించారు. Ok

తిరుపతి

శ్రీ శక్తి పీఠాన్ని సందర్శించిన శ్రీమతి సత్యవాణి, శ్రీమతి శాంత కుమారి

పున్నమి ప్రతినిధి రామచంద్రపురం శ్రీ శక్తి పీఠాన్ని సందర్శించిన ప్రముఖ సామాజిక, ఆధ్యాత్మిక వ్యాఖ్యాత శ్రీమతి సత్యవాణి , ప్రముఖ కాఫీ పొడి కాంటినెంటల్ కాఫీ యజమాని శ్రీమతి చల్లా శాంత కుమారి తిరుపతి జిల్లా, రాయల చెరువు లో వెలసిన శ్రీ శక్తి పీఠాన్ని ప్రముఖ సామాజిక, ఆధ్యాత్మిక వ్యాఖ్యాత శ్రీమతి సత్యవాణి మరియు ప్రముఖ వ్యాపారవేత్త కాంటినెంటల్ కాఫీ యజమాని చల్లా రాజేంద్ర ప్రసాద్ శ్రీమతి చల్లా శాంత కుమారి సందర్శించారు. పరమ పూజ్య శ్రీ స్వామివారిని పూజ్య శ్రీ మాతాజీ వారిని కలిసి వారి ఆశీస్సులు పొందారు. పూజ్య శ్రీ మాతాజీ వారు శేష వస్త్రాలు, పుస్తక ప్రసాదాన్ని అందజేశారు. పీఠం అర్చకులు వేద ఆశీర్వాదం చేశారు.

ఖమ్మం

వెలుగుమట్ల నిర్వాసితులకు అండగా ప్రభుత్వం – మంత్రి పొంగులేటి హామీ

ఖమ్మం, మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి) వెలుగుమట్ల నిర్వాసితులకు ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి పట్టాతో పాటు ఇందిరమ్మ ఇల్లు త్వరలోనే మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదవాడి పక్షాన నిలుస్తుందని మంత్రి స్పష్టం చేశారు. బాధితులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వెలుగుమట్లలో ఇళ్ల కోల్పోయిన కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ద్వారా సహాయం అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తి ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి ఎమ్మెల్యే

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 09: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో పట్టణంలోని సీఎం ఫంక్షన్ హాల్‌ నందు ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జనసేన పార్టీ ఎమ్మెల్యే, తిరుపతి పార్లమెంట్ ఉద్యమ ఆర్డినేటర్ ఆరణి శ్రీనివాసులు విచ్చేసి శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో ఉద్యమి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొట్టేసాయి ప్రసాద్ మార్చి 8వ తేదీన జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఎమ్మెల్యే చేతుల మీదగా మహిళలకు చీరలు పంపిణీ చేయించడం జరిగినది. ఈ కార్యక్రమంలో తిరుపతి జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రాజా రెడ్డి, సత్యవేడు జనసేన పార్టీ ఇంచార్జ్ లావణ్య కుమార్, జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి జయప్రకాశ్, జనసేన శ్రీకాళహస్తి పట్టణ నాయకులు గరికపాటి చంద్ర, ఇతర జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి

తొట్టంబేడులో రైతులకు పంట భీమాపై అవగాహన కార్యక్రమం

తొట్టంబేడు పున్నమి న్యూస్, మార్చి 09: శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం తంగేళ్లపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు బ్యాంకు ఎఫ్ఎల్సి మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో బ్యాంకు చైర్మన్ బీమాల భాస్కర్ ముదిరాజ్ మాట్లాడుతూ రైతులకు కావలసిన పంట రుణాలు ఇన్సూరెన్స్ డిపాజిట్లు గురించి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు భీమాల భాస్కర్ ముదిరాజ్ డిసిసి బ్యాంక్ సూపర్వైజర్లు మురళిమోహన్, కృష్ణ,టి శరత్ కుమార్ సంఘ ముఖ్య కార్యనిర్వహణ అధికారి పి చిరంజీవిరెడ్డి తదితర సిబ్బంది,రైతులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.