Monday, 27 April 2026

Blog

ఖమ్మం

ఫుడ్ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణ లోపం..? పాత ఆహారంతో కస్టమర్ల ప్రాణాలతో చెలగాటం.

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అలాగే ఖమ్మం నగరంలో టిఫిన్ సెంటర్లు నుంచి పెద్ద పెద్ద హోటళ్ల వరకు వినియోగదారుల ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పలు హోటళ్లు, బిర్యానీ పాయింట్లు రోజులు తరబడి నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను కస్టమర్లకు అందిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి ఫుడ్ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణ లోపమే కారణమని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం అనేక బిర్యానీ పాయింట్లలో రోజు ల తరబడి నిల్వ ఉంచిన గ్రేవీ, పెరుగు చట్నీ వంటి పదార్థాలను మళ్లీ వేడి చేసి వినియోగదారులకు అందిస్తున్నట్లు సమాచారం. అలాగే కొన్ని టిఫిన్ సెంటర్లలో సాంబార్, చట్నీలు మాత్రమే కాకుండా పిండితో తయారయ్యే కొన్ని ఆహార పదార్థాలను కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంచి వాడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల వల్ల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి పాత ఆహారాన్ని తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, జీర్ణ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది హోటల్ యజమానులు తనిఖీలను తప్పించుకోవడానికి మామూలు ఇచ్చి ఫుడ్ ఇన్స్పెక్టర్లను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ కారణంగా తనిఖీలు సక్రమంగా జరగడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పటికైనా అప్రమత్తం కావాలని ప్రజలు కోరుతున్నారు. నగరంలోని టిఫిన్ సెంటర్లు, బిర్యానీ పాయింట్లు, హోటళ్లపై అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించి నాణ్యతలేని ఆహారాన్ని విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకుంటారా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారినది.

తిరుపతి

విజయవంతంగా ముగిసిన బాల్య వివాహ విముక్తి రథ ప్రచార యాత్ర

భారత ప్రభుత్వం మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో చేపట్టిన 100 రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం భాగంగా ప్రగతి సంస్థ నిర్వహించిన ‘బాల్య వివాహ విముక్తి రథం’ ప్రచార యాత్ర విజయవంతంగా ముగిసింది. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ చేత ప్రారంభమైన ఈ రథయాత్ర జిల్లా వ్యాప్తంగా మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాలు, పట్టణాల్లో పర్యటిస్తూ బాల్య వివాహాల దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించింది. 100 రోజుల అవగాహన కార్యక్రమం ముగింపు సందర్భంగా తొట్టంబేడు మండలం పెద్ద కన్నలి గ్రామంలో గ్రామస్తులు కొవ్వొత్తులు వెలిగించి బాల్య వివాహాల నిర్మూలనకు తమ మద్దతు ప్రకటించారు. శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్ కాలనీలో ఉన్న ఏపిడబ్ల్యూఆర్‌ఎస్ గర్ల్స్ హాస్టల్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతి సంస్థ డైరెక్టర్ కె.వి. రమణ మాట్లాడుతూ….ప్రగతి సంస్థ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ నెట్‌వర్క్‌లో భాగస్వామి సంస్థగా బాల్య వివాహాల నిర్మూలన కోసం నిరంతరం కృషి చేస్తోందన్నారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి ఈ 100 రోజుల అవగాహన కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ పార్లమెంట్‌లో బాల్య వివాహాల నిర్మూలన చట్టం పూర్తి స్థాయిలో అమలుకు కృషి చేస్తామని చెప్పడం ఆనందదాయకమని బాల్య వివాహం ఒక సామాజిక రుగ్మత మాత్రమే కాదు, పెళ్లి పేరుతో చిన్నారిపై జరిగే అత్యాచారమే. ఇది చట్టం ప్రకారం నేరం, బాల్య వివాహం ఒక అమ్మాయి భవిష్యత్తును నాశనం చేసి, ఆమెను పోషకాహార లోపం, అక్షరాస్యత లేకపోవడం, పేదరికం అనే చీకటి లోకంలోకి నెడుతుందని ప్రభుత్వం, ప్రజలు, ప్రజాసంఘాలు, ఎన్‌జీఓలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఈ ప్రచారం ప్రజా ఉద్యమంగా మారిందని అందరి సహకారంతో బాల్య వివాహాలు లేని తిరుపతి జిల్లా లక్ష్యాన్ని త్వరలోనే సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ బాల్య వివాహ విముక్తి రథం కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, దేవాలయ పూజారులు, చర్చ్ పాస్టర్లు, మసీదు మౌళీలు, హజరత్‌లు మరియు వివిధ మత పెద్దలు పాల్గొని బాల్య వివాహాలు చేయకూడదని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేసిన పత్రికా మిత్రులకు, ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అయన తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు, వార్డెన్ విజయలక్ష్మి, ప్రగతి సంస్థ జిల్లా కోఆర్డినేటర్ రాజారెడ్డి, సిబ్బంది కోటయ్య, లత, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

ద స్కూల్ లో రోబోటిక్స్ టెక్నాలజీతో నూతన ఆవిష్కరణలు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 08: శ్రీకాళహస్తి పట్టణంలోని ద స్కూల్ నందు కోడియోటిక్ ఎడుటెక్ సొల్యూషన్ సంస్థ ఆధ్వర్యంలో ఏఐ రోబోటిక్ ఎక్స్ పో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ – రోబోటిక్స్ ప్రదర్శన కార్యక్రమాన్ని పాఠశాల కరస్పాండెంట్ జనార్దన్ రావు జె.పవార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.విశాల ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ద స్కూల్ విద్యార్థులు అత్యాధునిక ఏ ఐ – రోబోటిక్స్ టెక్నాలజీతో నూతన ఆవిష్కరణలు చేశారు. విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలతో ఏఐ టెక్నాలజీని వినియోగించి రోబోలతో ఏ విధంగా పనిచేయించుకోవచ్చోచూపించి అబ్బురపరిచారు. సీసీ కెమెరాలు బదులు ఏ ఐ టెక్నాలజీతో ఫోను ద్వారానే పరిసరాలను నిఘాలో ఉంచడం వంటి నూతన ఆవిష్కరణలను చేశారు. రాబోయే ఆధునిక కాలంలో టెక్నాలజీతో రోబోటిక్ సమాజాన్ని సృష్టించే విధంగా విద్యార్థులు వినూత ఆలోచనలతో ఆకట్టుకున్నారు. ఏ ఐ రోబోటిక్ ఎక్స్ పోను తిలకించిన తల్లిదండ్రులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలను అభినందించి ప్రశంసించారు. ద స్కూల్లో ప్రతివారం రెండు రోజులు పాటు ఏఐ -రోబోటిక్ పై ప్రత్యేక తరగతులు నిర్వహించి, శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పాఠశాల నిరవహుకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లి, తండ్రులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తి తెదేపా కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 08: శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ కాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనల మేరకు ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ ఈ వేడుకలలో పాల్గొని మహిళా నాయకులతో కలిసి కేక్ కట్ చేసి మహిళా దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా బృందమ్మ మాట్లాడుతూ…..తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మహిళల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ వంటి పథకాల ద్వారా మహిళల ఆర్థిక భారం తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. సమాజంలో మహిళలు మరింత ముందుకు రావడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని తెలుగుదేశం పార్టీలో మహిళలకు ఉన్న గౌరవం ఎంతో గొప్పదని బొజ్జల బృందమ్మ మహిళలకు రాజకీయంగా కూడా అవకాశాలు కల్పిస్తూ నాయకత్వ స్థానాలకు తీసుకువెళ్లే పార్టీగా తెలుగుదేశం పార్టీ నిలుస్తోందని, మహిళా శక్తి అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులతో పాటు కూటమి ప్రభుత్వం నాయకులు కూడా పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీ సీతారామ మందిర మహాకుంభాభిషేకంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 08: శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం పొయ్య గ్రామంలో శ్రీ సీతారామ మందిర మహాకుంభాభిషేక మహోత్సవంలో ఆదివారం నాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి దంపతులు పాల్గొని శ్రీ స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకోవడం జరిగినది. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు, ఆయన సతీమణి ఎంపీపీ నిర్మలమ్మ స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయించారు. అనంతరం వేద పండితులచే ఆశీర్వచనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పొయ్య గ్రామస్తులు, మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి

శివయ్యను దర్శించిన సినినటి మీనాక్షి చౌదరి

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, మార్చి 08: శ్రీకాళహస్తీస్వరస్వామి వారి దర్సనార్డం సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో విక్టరి వెంకటేష్ తో కలసి నటించిన సిని హిరోయిన్ మీనాక్షి చౌదరి విచ్చెసారు. ఈ మేకు భాజాపా నాయకులు కోలా ఆనంద్ సూచనల మేరకు బిజెపి యువ నాయకులు చందు రాయల్, ఆలయ సిబ్బందితో కలసి సాదర స్వాగతం పలికి శ్రీ స్వామి, అమ్మవార్ల ప్రత్యేక దర్శనం చేయించి తీర్ధ,ప్రససాలు అందజేశారు.

తిరుపతి

కార్యకర్త కుమారునికి నివాళులర్పించిన తెదేపా నాయకులు

ఏర్పేడు, పున్నమి న్యూస్, మార్చి 08: ఏర్పేడు మండలం మేర్లపాక బిసి కాలనీలో టీడీపీ కార్యకర్త దొడ్డవరం తిరుపాల్ వార్డ్ మెంబెర్ కుమారుడు దొడ్డవరం ముని ఆకస్మికంగా మరణించడంతో సమాచారం తెలుసుకున్న ఏర్పేడు మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు పేరం నాగరాజ ముని భౌదీక దేహానికి పూలమాల వేసి శ్రద్ధంజలి ఘటించి తిరుపాల్ కుటుంబ సబ్యులను పరామర్శించి తన ప్రఘాడ సానుభూతిని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు రమణ, రాచేటి సుబ్రహ్మణ్యం, నరసింహులు నాయుడు, గుణాయాదవ్, సుధీర్, గోపాలరెడ్డి, గోపి రెడ్డి, వై. మనోహర్ నాయుడు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

బొజ్జల బృందమ్మకు మహిళా దినోత్సవశుభాకాంక్షలు తెలిపిన టైలర్స్ సంఘం

శ్రీకాళహస్తి, న్యూస్, మార్చి 08: శ్రీకాళహస్తి టైలర్ వెల్ఫేర్ అసోసియేషన్ టైలర్స్ కార్యవర్గ సభ్యులు తరుపున అంతర్జాతీయ జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మని కలసి ఆమెను దుశ్యాలతో సత్కరించి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ మహిళ కార్యవర్గ సభ్యులు ముని లక్ష్మి, మమత, ఆయుష ,లక్ష్మి, సుమలత, శ్రీలక్ష్మి, మాధవి, పవిత్ర, పల్లవి, మంజుల, టైలర్ అసోసియేషన్ అధ్యక్షులు తొట్టంబేడు బాలయ్య, చెంగయ్య, రమేష్, శ్రీనివాసులు, వాసు, సుబ్రహ్మణ్యం, మనీ, మౌలా, జాకీర్ తదితర టైలర్స్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

తిరుపతి

యువ నేస్తం ట్రస్ట్ ద్వారా ఆదర్శ వృధా ఆశ్రమంలో అల్పాహారం వితరణ

ఏర్పేడు, పున్నమి న్యూస్, మార్చి 08: ఏర్పేడు మండలం సరస్వతి కండ్రిగ గ్రామం లో లోకేష్, భానుల కుమారుడు కుమార్తె వేదాన్షిత, తనీష్ రాయల్ ల పేరు మీద యువ నేస్తం చారిటబుల్ ట్రస్ట్ ద్వార వృధా ఆశ్రమంలో ఉన్న వృద్ధులులకు ఉదయం హల్ప హారం వితరణ చేయండి జరిగింది. ఈ సందర్భంగా యువ నేస్తం అసోసియేషన్ వ్యవస్థాపకులు మునిశేఖర్ యువ నేస్తం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు వినోద్ మాట్లాడతూ.. ఎవ్వరు ఆకలితో ఇబ్బంది పడకూడన్నా దృడసంకల్పంతో యువ నేస్తం అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామనీ అందులో భాగంగా ఆదివారం నాడు ఆదర్శ వృధా ఆశ్రమంలోని వృద్ధులకు మానసిక రోగులకు హల్పాహారం ఏర్పాటు చేయండిజరిగిందన్నరు. ఈ కార్యక్రమంలో యువ నేస్తం చారిటబుల్ ట్రస్ట్ వాలంటీర్స్ యుగంధర్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం దక్కడం గర్వకారణం-అంజూరు చక్రధర్

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 08: తెలుగు చిత్ర పరిశ్రమ మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని’ ప్రకటించడం పట్ల జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్ తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాన్య కుటుంబంలో జన్మించి, స్వయంకృషితో తెలుగు సినీ సామ్రాజ్యంలో అగ్రస్థానానికి చేరుకున్న చిరంజీవి గారి ప్రస్థానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కేవలం నటుడిగానే కాకుండా, సామాజిక సేవలోనూ ఆయన అందిస్తున్న సేవలు అసమానమైనవని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారి పేరు మీద ఇచ్చే ఈ గౌరవప్రదమైన పురస్కారం చిరంజీవి గారికి దక్కడం పట్ల జనసేన కార్యకర్తలు, అభిమానులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారని చక్రధర్ ఈ సందర్భంగా తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.