Thursday, 12 March 2026

Blog

ఆంధ్రప్రదేశ్

నెల్లూరు అపోలో హాస్పిటల్‌లో అరుదైన వైద్య చికిత్స – రోగి ప్రాణాలు రక్షణ

(పున్నమి ప్రతినిధి) నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్‌లో అరుదైన వైద్య చికిత్స విజయవంతంగా నిర్వహించారు. కావలి పట్టణానికి చెందిన 37 ఏళ్ల నాగరాజు నోటిలో నుంచి తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రికి రావడంతో వైద్యులు ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళంలో రంధ్రం ఏర్పడినట్లు గుర్తించారు. మెట్రో నగరాలకు మాత్రమే పరిమితమైన బ్రాంకిల్ ఆట్రీ ఎంబోలైజేషన్ విధానంతో చికిత్స చేసి రక్తస్రావాన్ని పూర్తిగా నియంత్రించారు. ఈ చికిత్స నెల్లూరులో తొలిసారిగా నిర్వహించామని డాక్టర్ భక్తవత్సల రెడ్డి, డాక్టర్ శ్రావణి రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు వెల్లడించారు.

కామారెడ్డి

గొల్లపల్లి పాఠశాలలో సర్పంచ్‌లు పిల్లలతో కలిసి మధ్యాహ్నాహారం..

రైతులకు యూరియా బుకింగ్ ఆన్‌లైన్ సహాయం! కామారెడ్డి, 06 జనవరి,( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, గొల్లపల్లి పిల్లల భవిష్యత్తు మా చేతుల్లో అంటున్నా సర్పంచ్ కిషన్ యాదవ్ సంకల్పంతో మంగళవారం గొల్లపల్లి ప్రథమిక పాఠశాలలో అద్భుతమైన కార్యక్రమం జరిగింది. స్థానిక పాలకులు, ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు కలిసి పిల్లల మధ్యాహ్నాహారాన్ని పరిశీలించి,వారితో పాటు తిన్నారు. అంతేకాకుం డా, రైతులకు యూరియా ఆన్‌లైన్ బుకింగ్‌లో సహాయం చేసి, వ్యవసాయ ఎరువుల వివరాలు తెలియజేశారు. గ్రామ పెద్దలు, రైతుల పాల్గొన్న ఈ కార్యక్రమం విజయవంతమైంది.మధ్యాహ్నం పాఠ శాలలో జరిగిన ఈ పరిశీలన సర్పంచ్ కిషన్ యాద వ్ నేతృత్వంలో జరిగింది. ఉపసర్పంచ్ మధుసూ దన్, 5వ వార్డు సభ్యుడు ప్రభాకర్ రెడ్డి, 6వ వార్డు మల్లేష్, రాజేశ్వర్, గొల్ల నవీన్‌లతో పాటు హెచ్ఎం రాజు కుమార్ కలిసి పిల్లల మధ్యాహ్నాహారం త యారీ నుంచి పంపిణీ వరకు పరిశీలించారు.ఫుడ్ ఎలా పెడుతున్నారు? పిల్లలకు రుచి, పోషకాలు సరిపోతున్నాయా?అని వారు అడిగి తెలుసుకు న్నారు. తర్వాత, పిల్లలతో కలిసి మధ్యాహ్నాహారం తిని, వారి సంతోషాన్ని పంచుకున్నారు.పిల్లల మధ్యాహ్నాహారం పరిశీలనకు ప్రత్యేకంగా గ్రామ పాలకులు రాణించారు.పిల్లల ఆరోగ్యం, చదువు మా మొదటి ప్రాధాన్యత.ఈ పద్ధతి గ్రామంలో అమలు చేస్తూ పాఠశాలలను మరింత బలోపేతం చేస్తామని సర్పంచ్ కిషన్ యాదవ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలు సంతోషంగా పాల కులను కొనియాడారు.

ఆంధ్రప్రదేశ్

జగదేవి పేట పీహెచ్‌సీలో ఆశా డే సమావేశం – క్యాన్సర్ అవగాహన కార్యక్రమం

(పున్నమి ప్రతినిధి) ఇందుకూరుపేట మండలం జగదేవి పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 06.01.2026న ఆశా డే సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ బ్రహ్మేశ్వర్ నాయుడు, డాక్టర్ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టారు. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నెల్లూరు నుంచి వచ్చిన డాక్టర్ హరిప్రియ (ఎండి – రేడియేషన్ ఆంకాలజీ) రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు, కారణాలు, నివారణపై అవగాహన కల్పించారు. ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని తెలిపారు. ప్రతి నెల స్వీయ పరీక్షలు, 40 ఏళ్లు దాటిన మహిళలు మామోగ్రఫీ చేయించుకోవాలని సూచించారు. క్యాన్సర్ లక్షణాలు కనిపించిన వారిని వెంటనే ఆసుపత్రికి పంపించాలని ఆశా వాలంటీర్లకు సూచించారు. ఈ సమావేశంలో వైద్య సిబ్బంది, ఆశా వాలంటీర్లు పాల్గొన్నారు.

కామారెడ్డి తెలంగాణ

రెడ్డిపేట తండా జిల్లా పరిషత్ పాఠశాలలో ఘన సన్మాన సమ్మేళనం 

 కామారెడ్డి,6 జనవరి, ( పున్నమి ప్రతినిధి )    :  కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం స్కూల్ తాండ గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల ఆధ్వర్యంలో నూతన సర్పంచ్ పాలకవర్గానికి ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, స్కూల్ అభివృద్ధికి అంగీకారం తెలిపారు.స్కూల్ తండా సర్పంచ్ సలావత్ బుచ్చిరెడ్డి, ఉపసర్పంచ్ గంగావత్ రమేష్, జగదాంబ తండ సర్పంచ్ భూక్యా లతా, బాయనంద ఉపసర్పంచ్ గంగావత్ పూర్ణరాజు, నాయక్‌ బట్టు తండా సర్పంచ్ బట్టు బికినీ, ఉపసర్పంచ్ రాతుల కిషోర్‌లకు ప్రత్యేక సన్మానం.వార్డు సభ్యులు రాతుల సవిత, రంజిత్, గంగావత్ సేవ్య, గంగావత్ సంతోష్, సలావత్ లలిత, నరేష్, సలవత్ తిరుపతి లకు ఘన సత్కా రం పొందారు. పాఠశాలకు ఎల్లవేళలా అభివృద్ధి కొరకు సహకారం ఉండాలని కోరారు.ఉపాధ్యా యులు, భవిష్యత్ సహకారం కోరారు. గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రైతులకు భూ చట్ట భద్రత కల్పించడమే తన లక్ష్యం అని ఎమ్మెల్యే తెలిపారు

రైతులకు భూ చట్ట భద్రత కల్పించడమే తన లక్ష్యం అని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు ఆర్ల పడియ గ్రామoలో నిర్వహించిన పట్టాదారు పాస్ బుక్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గోని వివరించారు గత ప్రభుత్వం జారీ చేసిన పట్టా దారు పాస్ బుక్ పుస్తకాలు చెల్లని నోట్లతో సమానము అని తమ ప్రభుత్వం జారీ చేస్తున్న పట్టాదారు పాస్ బుక్ పుస్తకాలు రిజర్వు బ్యాంకు జారీ చేసే కరెన్స్ నోట్ల వలె చట్ట భద్ద విలువ, భద్రత కలిగినవి అని అన్నారు

తిరుపతి

రైతు హక్కులకు భరోసా: ‘మీ భూమి–మీ హక్కు’లో అరవ శ్రీధర్

ఓబులవారిపల్లి మండలం వెంకటేశాపురంలో నిర్వహించిన ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ ముక్కా సాయి వికాస్ రెడ్డి పాల్గొన్నారు. అర్హులైన రైతులకు రాజ్యముద్రతో కూడిన పట్టాదార్ పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. గత పాలనలో రైతు హక్కులను నిర్లక్ష్యం చేశారని విమర్శించిన అరవ శ్రీధర్, ప్రస్తుత ప్రభుత్వం భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటోందన్నారు. ఫిర్యాదు చేసిన నెలలోపే పరిష్కారం అందిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు.

తిరుపతి

ప్రాణాలకు ప్రథమ ప్రాధాన్యం – అంబులెన్స్ సేవల పటిష్టతపై అరవ శ్రీధర్

ప్రజల ప్రాణాలే ప్రథమమని ప్రభుత్వ విప్‌, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తెలిపారు. రైల్వే కోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ, గత పాలనలో నిర్వీర్యమైన అంబులెన్స్ వ్యవస్థను ఎన్డీఏ ప్రభుత్వం పునఃపటిష్టం చేస్తోందన్నారు. 108, 104 అంబులెన్స్‌లను వేగవంతంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని, జీపీఎస్ పర్యవేక్షణ, అత్యవసర పరికరాల సమకూర్పు చేపట్టామన్నారు. డ్రైవర్లు, సిబ్బందికి క్రమం తప్పకుండా జీతాలు చెల్లిస్తున్నామని తెలిపారు. మంగంపేట ప్రమాదంలో అంబులెన్స్ సకాలంలో చేరిన ఘటన ప్రస్తుత వ్యవస్థ సామర్థ్యానికి నిదర్శనమన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

కామారెడ్డి

అన్నారం గ్రామ ప్రాథమిక పాఠశాలలో నూతన సర్పంచ్‌కు ఘన స్వాగతం

కామారెడ్డి,06 జనవరి, ( పున్నమి ప్రతినిధి) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, అన్నారం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల బృందం అంతా కలిసి గ్రామ నూతన సర్పంచ్ లతా శ్రీనివా స్‌ను, ఉపసర్పంచ్ దయానంద్‌ను, పాలక వర్గాన్ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం గ్రామ విద్యా, పరిపాలనా వర్గాల మధ్య ఐక్యతను మరిం త బలోపేతం చేసేలా నిర్వహించబడింది. నూతన సర్పంచ్ లతా శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామ వి ద్యార్థులు విద్యా అభివృద్ధి కోసం పాఠశాల అధికా రులతో కలిసి పనిచేస్తామన్నారు. అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉ పసర్పంచ్ దయానంద్ గ్రామ పరిపాలనలో విద్యా సంస్థల సహకారం కీలకమని పేర్కొన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వడ్లమూడి పల్లిలో కరెంటోల్లో జనం బాట కార్యక్రమం

ఉదయగురి మండలం అప్పసముద్రం పంచాయతీ పరిధిలోని వడ్లమూడి పల్లిలో మoగళవారం కరెంటోళ్ల జనం బాట కార్యక్రమం నిర్వహించారు ఉదయగిరి విద్యు త్ శాఖ ఏ ఈ చెంగయ్య గ్రామంల్లో తిరిగుతు విద్యుత్ సమస్యలు ఏమైనా ఉన్నాయా అనిప్రజలను అడిగి తెలుసుకున్నారు అప్పటికప్పుడే పరిష్కరించే సమస్యలను తమ సిబ్బందితో పని చేయించారు విద్యుత్ సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తిడుకురావాలన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఓ ఎన్ జి సి గ్యాస్ లీకేజ్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చింతలపల్లి జనవరి 05 60 కుటుంబాలను మరియు మూగజీవాలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన గ్రామ సర్పంచ్ మట్టా ప్రసన్న కుమారి సురేష్, రాజోలు ఎమ్మార్వో సీహెచ్ భాస్కర్, ఎంపీడీవో కే.వెంకటేశ్వరరావు,ఆర్.ఐ. సీహెచ్ కుమారిదేవి మరియు రాజోలు మండల అధికారులు మరియు పంచాయితీ సిబ్బంది రాజోలు డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం ఇరుసమండ గ్రామంలో గ్యాస్ లీకేజ్ కారణం గా మంటలు ఎగసి పడుతున్న ఇదే ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న చింతలపల్లి గ్రామ పరిధిలోని పోతుమట్ల ఏరియా కు అతి సమీపంలో ఉండటం తో ఏరియా ప్రజలను మరియు మూగ జీవాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కార్యక్రమం లో వీఆర్వో సత్తిబాబు,వీఆర్వో సాయిబాబు, మాజీ సర్పంచ్ గెడ్డం సత్యన్నారాయణ, ఎంపీటీ ప్రసాద్ బాబు ఎంపీటీసి ఆనందరాజు, తాతాజీ, పాటి శ్రీను మామిడిశెట్టి శ్రీను, ఆర్ఎంపీ గిరిబాబు, సచివాలయ సిబ్బంది గ్రేడ్2 కార్యదర్శి రాజేష్, మౌనిక, సంధ్య, స్వప్న మరియు పంచాయితీ సిబ్బంది గ్రామ పెద్దలు పాల్గొన్నారు, ఓఎన్జిసి కంపెనీ ప్రతినిధులు ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు .ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.