Friday, 27 March 2026

Blog

ఆంధ్రప్రదేశ్

మహర్షి భగీరధుడికి ఘన నివాళులు

పున్నమి ప్రతినిథి షేక్ . ఉస్మాన్ అలీ…✍️ భగీరథ జయంతి పునస్కరించుకొని స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు గురువారం ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మహర్షి భగీరథ కృషి,పట్టుదల నేటి యువతరం ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పలువురు అధికారులు పాల్గొన్నారు.

Featured

కరోనా నియంత్రణ చర్యలకు డీఈఏఎఫ్ వితరణ

పున్నమి ప్రతినిథి షేక్ .ఉస్మాన్ అలీ✍️✍️ నెల్లూరు జిల్లాలో కరోనా నియంత్రణ చర్యలకు తమ వంతు సహాయంగా గురువారం డీఈఏఎఫ్ రూ.86,116 లను అందచేసింది.స్థానికి జిల్లా పరిషత్ కార్యాలయంలోని జిల్లా ఎమర్జెన్సీ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ మేరకు డీఈఏఎఫ్ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు ఈ మేరకు పత్రాన్ని అందజేశారు. కొలెక్టర్ శేషగిరిబాబు మాట్లాడుతూ… కరోన నియంత్రణ చర్యలకు అండగా నిలుస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Featured పిల్లలకు

దేవతా గుర్రాలు-నేటి యువత*….. (పున్నమి ప్రతినిధి:::: చింతా ప్రసాద్ బాబు)

  *దేవతా గుర్రాలు-నేటి యువత అనగనగా రెండు గుర్రాలు ఉండేవి. దేవతా గుర్రాలంటే మాటలా! పాలరాతి తెలుపుతో, నురగలాంటి జూలుతో మహా అందంగా ఉండేవి. వాయువేగంతో ముల్లోకాలూ చుట్టిపారేసేవి. జనం ఆ గుర్రాలను చూసినప్పుడల్లా అంత అందమైన గుర్రాలను చూడటంతో తమ జన్మ ధన్యమైపోయిందని మురిసిపోయేవారు. కానీ ఆ గుర్రాల మనసులో ఏదో చింత. రెండు గుర్రాలనీ అంతా సమానంగా చూస్తున్నారు. రెండూ అందమైనవే అనీ, రెండూ వేగమైనవే అనీ పొగుడుతున్నారు. అలా జరగడానికి వీల్లేదు! ఈ ప్రపంచంలో అన్ని గుర్రాలకంటే నేనే అందంగా ఉండాలి అన్న ఆలోచన రెండు గుర్రాలలోనూ కలిగింది. అంతే వాటిలో ఒక గుర్రం నిదానంగా దేవుడి దగ్గరకి పోయి, భగవంతుడా! నన్ను ఇంత అందంగా అద్భుతంగా సృష్టించినందుకు కృతజ్ఞతలు. దేవతా గుర్రంగా నా జన్మ ధన్యమై పోయింది. కానీ నాదో చిన్న కోరిక అంది ఆ గుర్రం. దాని మనసులో మాట గ్రహించిన భగవంతుడు చిరునవ్వు నవ్వి నువ్వు దేవతా గుర్రానివి నీ కోరిక తీర్చుతాను ఏం కావాలో కోరుకో!’ అన్నాడు. నేను అందంగా ఉన్న మాట నిజమే కానీ ఇంకాస్త అందంగా ఉంటే బాగుండు అన్న దుగ్థ నన్ను తెగ వేధిస్తోంది. నాలో చాలా అవకరాలే కనిపిస్తున్నాయి. అవన్నీ సరైపోయి నేను ఇంకా అందంగా ఉండేట్లు ఆశీర్వదించండి స్వామీ!’ అని వేడుకుంది. సరే! నీలో నీకు ఏ లక్షణాలు లోపాలుగా కనిపిస్తున్నాయో చెప్పు అవన్నీ సరిదిద్దుతాను అని అభయమిచ్చాడు భగవంతుడు. దాంతో ఆ గుర్రం తనలో తనకి లోపాలుగా తోచిన లక్షణాలన్నింటినీ ఏకరవు పెట్టడం మొదలుపెట్టింది. ఈ తల మెడకి అంటుకు పోయినట్లుగా ఉంది. అది ఇంకాస్త పొడవు ఉంటే బాగుంటుంది. ముక్కు కూడా సన్నగా ఉందని నా అనుమానం. ఇక కాళ్లు ఇంకాస్త పొడవుంటే భలే ఉంటుంది. దయచేసి ఇవన్నీ సరిదిద్దుదురూ! అంది గుర్రం. తథాస్తు! రేపు ఉదయం నిద్ర లేచి చూసుకునే సరికి నీవు కోరుకున్న సరికొత్త రూపం నీకు వస్తుంది అన్నాడు భగవంతుడు. సంతోషంగా భగవంతుని దగ్గర సెలవు తీసుకుంది మొదటి గుర్రం. అది అలా వెళ్లిందో లేదో రెండో గుర్రం భగవంతుడి దగ్గరకు చేరుకుంది. హే భగవాన్‌! ఆ గుర్రం తన అందాన్ని పెంచుకోవాలనే కోరికతోనే నీ దగ్గరకి వచ్చిందని నాకు తెలుసు. ఎలాగైనా ప్రపంచంలోనే గొప్ప గుర్రం అనిపించు కోవాలని దాని తపన. దాని అత్యాశని మీరు అణిచి అది తనలోని అందం మెరుగుపడేందుకు ఏ ఏ లక్షణాలనైతే కోరుకొందో… అవి నాలో మరింత ఎక్కువగా ఉండేలా వరం ఇవ్వండి అని వేడుకుంది. అయ్యో అదెంత భాగ్యం, అసలే నువ్వు దేవతా గుర్రానివి కనుక నీ కోరికను తీర్చాల్సిందే, రేపు ఉదయం నువ్వు లేచి చూసుకునేసరికి లక్షణాలన్నీ నీలో కనిపిస్తాయి. తథాస్తు అంటూ నవ్వాడు భగవంతుడు. ఆ రాత్రి రెండు గుర్రాలకు సరిగా నిద్రపట్టనే లేదు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా… తమ అందాన్ని ఎప్పుడెప్పుడు చూసుకుంటామా అన్న ఉద్విగ్నతతో ఆ రాత్రిని గడిపాయి. తెల్లవారాక చూసుకుంటే ఆ రెండు గుర్రాలకీ తమ కోరిక నెరవేరిన విషయం తెలిసిపోయింది. కాకపోతే… మొదటిగుర్రం కోరుకున్న లక్షణాల కారణంగా అది అచ్చు ఒంటెలా మారిపోయింది. మొదటి గుర్రం కోరుకున్న లక్షణాల మోతాదు తనలో మరింతగా ఉండాలని కోరుకోవడంతో రెండో గుర్రం జిరాఫీలా మారిపోయింది. తమ శరీరాల వంక చూసుకున్న గుర్రాలు రెండూ లబోదిబోమంటూ భగవంతుడి దగ్గరకు పరుగులెత్తాయి.. ఆయనను చూస్తూనే ఏమిటీ మాకీ అన్యాయం! అంటూ ఆక్రోశించాయి. మీరు కోరుకున్న వరాన్ని యథాతథంగా తీర్చాను. ఇది అన్యాయం ఎలా అవుతుంది. ఆగమేఘాల మీద పరుగులు తీసే దేవతాశ్వాలు ఎలా ఉండాలో, మిమ్మల్ని అలా పుట్టించాను. కానీ మీకు మీ శరీరం పట్ల కానీ, దానిని అందించిన నా పట్ల కానీ నమ్మకం లేదు. అదే అసలైన అన్యాయం. మీరు నిజంగా నన్ను ఏదన్నా కోరుకోవాలని అనుకుంటే… మరింత బలిష్టంగా ఉండాలనో, కోరుకున్న గమ్యాన్ని సమర్థంగా చేరుకోవాలనో అడగాల్సింది. కానీ మీరు పై పై మెరుగులకే ప్రాధాన్యతని ఇచ్చారు. కనుక ఫలితం అనుభవించండి. ఇక నుంచీ మీరు దేవతా అశ్వాలు కాదు. ఒకరేమో ఒంటెలాగా ఎడారుల్లో తిరుగుతూ నానా బరువులూ మోయాల్సి ఉంటుంది. మరొకరేమో చిటారు కొమ్మ మీద దొరికే ఆహారంతో తృప్తిపడుతూ అడవులలో కాలం గడపాల్సి ఉంటుందని అనేశాడు భగవంతుడు. అదీ విషయం!. ఇది కథ మాత్రమే. కానీ దీనిని ఇప్పటి యువకుల జీవితాలకు, విద్యార్థుల చదువులకు అన్వయించి చూస్తే… ఇప్పటికి నేటి యువత వారిలో ఉన్న శక్తి సామర్థ్యాలకు తృప్తిపడి వాటిని మరింత మెరుగు పెట్టుకోవడం మాని అవసరం లేని దాని కోసం వెంపర్లాడుతూ విలువైన సమయాన్ని, సహజ సిద్ధమైన శక్తియుక్తులను మర్చి పొతున్నారు. విద్యార్థులు జ్ఞాన సముపార్జన కన్నా ర్యాంకులు, మార్కులు తప్ప విషయ పరిజ్ఞానాన్ని పొందలేక జీవితాల్లో చాలా సందర్భాల్లో ఆశించిన దానిని పొందకుండా ఆత్మహత్యల వైపు, అసాంఘిక కార్యకలాపాల వైపు, లేదంటే అనారోగ్యకర అలవాట్ల వైపు వెళ్లి విలువైన జీవితాన్ని చేజేతులా పాడు చేసుకుంటున్నారు. నేటి యువతకు, విద్యార్థులకు పై సందేశాన్ని అందించినవారు మురళీ కృష్ణ హోటల్స్ వీరిశెట్టి హజరత్ బాబు.

Featured గూడూరు

గూడూరు పట్టణానికి కరోన సాయం

స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ట్రస్ట్ ద్వారా గూడూరు నియోజకవర్గంలోని గూడూరు పట్టణానికి 1-లక్ష.,గూడూరు రూరల్ మండలానికి 1-లక్ష.,చిల్లకూరు మండలానికి 1-లక్ష రూపాయలచొప్పున కరోన నివారణ సాయం క్రింద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయాలని ఆయా స్థానిక YSRCP నాయకులకు అందజేసిన కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు. గూడూరు పట్టణానికి కరోన సాయం క్రింద తన 5-నెలల జీతం 1-లక్ష రూపాయలను పట్టణ నాయకులకు అందజేసిన నెల్లూరు DCMS ఛైర్మన్ వీరి చలపతిరావు గారు అందజేశారు.                                      ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు నెల్లూరు పార్లమెంట్ కన్స్టెన్సీ ఇన్చార్జ్ విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి గారు మరియు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ గారు వైయస్సార్ సిపి నాయకులు అధికారులు పాల్గొన్నారు.

Featured

ఆపదలో ఉన్న వారికి ఆపద్బాంధవుడు ఈ అయోద్యుడు ..

_నెల్లూరు జిల్లా , 30.04.2020 ( పున్నమి ప్రతినిధి షేక్. ఉస్మాన్ అలీ ✍️_ శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణం లోని టూ టౌన్ కానిస్టేబుల్ అయోధ్య కుమార్ పేద కుటుంబంలో జన్మించి కష్టపడి చదువుకుని కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించి అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా సహాయం చేస్తూ కష్టకాలంలో కొండంత అండగా  ఆకలితో అలమటిస్తున్న గిరిజనులుకడుపు నింపేందుకు నేనున్నానంటూ ముందుకొచ్చిన కావలి టూ టౌన్ కానిస్టేబుల్ అయోధ్య కుమార్ కరోనా వైరస్ అరికట్టేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్ డౌన్ తో ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు యాచకులకు నిరాశ్రయులకు కావలి టూ టౌన్ కానిస్టేబుల్ అయోధ్య కుమార్ నేనున్నాను అంటూ  ముందుకు వచ్చి ప్రతి రోజూ కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.

Featured

వికలాంగుల కాలనీ లో నిత్యావసర సరుకులు పంపిణీ …

 పున్నమి ప్రతినిధి ఉస్మాన్ అలీ✍️ కావలి 16 వార్డు నందు దాతలు జలదంకి పొదుపు లక్ష్మి మహిళా బ్యాంక్ ప్రెసిడెంట్ కండె రమణమ్మ మేనేజర్ వేలమూరి శోభారాణి మరియు జలదంకి రైతు ఉత్పత్తి దారుల సంఘం సీఈవో కృష్ణారెడ్డి సహకారంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరుణ మహమ్మారి వలన లాక్ డౌన్ విధించినప్పుడు నుండి పనులు లేక విలవిలలాడుతున్న నిరుపేద గిరిజనులకు మరియు వికలాంగులకు అఖిల భారత్ వికలాంగుల హక్కుల వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి మండవ వెంకట్రావు ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు కూరగాయలు పంపిణీ చేసి దాతృత్వం చాటుకున్నారు

Featured ఆంధ్రప్రదేశ్

కరోనా’ కట్టడికి.. నవ సూత్రాల అమలు తప్పదు మరి!

కరోనా’ కట్టడికి.. నవ సూత్రాల అమలు తప్పదు మరి! కరోనా ను కట్టడి చేయాలంటే లాక్ డౌన్ అనేది అద్భుతమైన ప్రయోగం. అయితే లాక్ డౌన్ విజయవంతం కావాలంటే దానికి కొన్ని ప్రత్యేక ఉద్దీపన చర్యలు చేపట్టాలి. అప్పుడే మన దేశంలో కరోనాకు శాశ్వతంగా కళ్లెం వేయొచ్చు. ప్రభుత్వ ఉద్దీపన చర్యలు ప్రజలకు నేరుగా చేరిన రోజు నే ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలు కచ్చితంగా అమలవుతాయి. కరోనాకు పేద, మధ్యతరగతి, ధనిక బేధాలు ఉండవు. అది అందరినీ కబళించి వేస్తుంది. ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ఉద్దీపన చర్యలు కాస్త ఉపశమనం కలిగించినా, అది బ్రెయిన్ ట్యూమర్ రోగికి అమృతాంజనం రాసిన చందంగా ఉంది. పేదోడికి పని లేకపోతే పూట గడవదు. మధ్య తరగతికి ఉద్యోగ, ఉపాధి లేకపోతే ఇల్లు జరగదు. ధనికుడికి వ్యాపారం, పరిశ్రమలు నడవకపోతే మనుగడ ఉండదు. అయితే మన ప్రభుత్వాలు చేపట్టే ఉద్దీపన చర్యలు అందరినీ ఆదుకునే పరిస్థితి కనబడటం లేదు. ఈ మూడు వర్గాల్లో ఏ వర్గం దెబ్బతిన్నా, దాని ప్రభావం అన్ని వర్గాలపైనా పడుతుంది. అందరినీ నాశనం చేస్తుంది. అంటే పరిశ్రమకు ప్రోత్సాహం లేకపోతే మూత పడుతుంది. తద్వారా కార్మికులు, ఉద్యోగులను నిరుద్యోగం వెంటాడుతుంది. వ్యాపారాలు దెబ్బతింటే అది పూడ్చు కోవడానికి ధరలు పెంచుతారు. అవన్నీ మళ్లీ సామాన్యుడి నడ్డి విరుస్తాయి. అందుకే ప్రభుత్వ ఉద్దీపన చర్యలు అన్ని వర్గాలను కాపాడే విధంగా ఉండాలి. ప్రస్తుతం చేపట్టిన ఉద్దేపన చర్యలో భాగంగా కేంద్ర ప్రభ్యుత్వం జన్ ధన్ ఖాతాల్లో వేసిన 500 రూపాయల డబ్బులు కోసం జనం మళ్లీ రోడ్లపైకి వచ్చి, బ్యాంకుల వద్ద బారులు తీరి కరోనాకు ఎర్ర తివాచీ పరిచారు. కొందరికి ఏ ఖాతాలో పడ్డాయో కూడా తెలియని పరిస్థితి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఈ కింది సూచించిన విధంగా ఉద్దీపనకు ఉపక్రమిస్తే లాక్ డౌన్ నిబంధనలు ప్రజలు ఖచ్చితంగా పాటిస్తారు. మండలం రోజులు కాదు.. నూరు రోజుల గృహ నిర్బంధంలో నైనా ఉండి కరోనా (కోవిడ్ 19) పై విజయం సాధిస్తారు. 1. ఆకలి చావు లేకుండా అందరికీ నిత్యావసర సరకులు కిట్లు రూపంలో ప్రభుత్వమే నేరుగా ఇంటికి చేర్చాలి. పాలు, గ్యాస్ కూడా ఉచితంగా ఇవ్వాలి. ఎన్ని రోజులు లాక్ డౌన్ ఉంటే దానికి నెల రోజులు అదనంగా పంపిణీ చేయాలి. అప్పుడు ఎవరూ బయటకురారు. 2. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వమే విద్యుత్, కేబుల్, నెట్ చార్జీలు చెల్లించాలి. లేదా మాఫీ చేయాలి. జియో కంపెనీ ఆరు నెలలు ఫ్రీగా ఇస్తే వారికి వచ్చిన నష్టం ఏమీలేదు పైగా కొన్ని కోట్ల వినియోగదారులను కూడగట్టుకోగలిగింది. ఇది ప్రభుత్వ రంగ బిఎస్ ఎన్ ఎల్ ఎందుకు చేయకూడదు. 3. రుణాలపై మారటోరియం కాకుండా, లాక్ డౌన్ సమయం ఉన్నంత కాలం ఆ సమయంలో చెల్లించాల్సిన నెలసరి వాయిదాలు ప్రభుత్వం తరపున చెల్లించడం గానీ, రుణ మాఫీ చేయడం గానీ జరగాలి. ఇది పేద, మధ్య, పారిశ్రామిక, వ్యాపార వర్గాలు అనే తేడా ఉండకూడదు. 4. దీర్ఘకాలిక రోగ గ్రస్థులు, అనారోగ్య పీడితులకు టెలీ మెడిసిన్ సలహాలు అందించి, నేరుగా ఇంటికే ఉచితంగా మందులను పంపాలి. 5. ప్రవేటు ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులకు లాక్ డౌన్ కాలాన్ని హోమ్ సిక్ గా పరిగణించి, ఈ ఎస్ ఐ ద్వారా వేతన భృతిని విడుదల చేయాలి. ఇలా చేయడం వల్ల ఈ రంగంలో ఉన్న సంస్థలపై భారం పడదు, పైగా కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుంది. 6. సమాచార, ప్రసార మాధ్యమాల్లో పని చేసే వారికి కూడా, వైద్య, రక్షణ రంగాల్లో వారికి ఇచ్చే కోవిడ్-19 పాలసీని అమలు చేసి బీమా సదుపాయం కల్పించాలి. 7. కోవిడ్ కాలంలో ప్రవేటు ఆస్పత్రులు, వైద్యులను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని ఉచిత వైద్య సేవలు అందించాలి. 8. ఎక్కడికక్కడ అష్ట దిగ్బంధనం చేసి, ఎవరినీ ఇంటి నుంచి కదలకుండా చూడాలి. అందుకు దేశ రక్షణ రంగ, ర్యాపిడ్ ఫోర్సులను దించి, కఠిన నిబంధనలు అమలు చేయాలి. కర్ఫ్యూ విధించాలి. సడలింపులకు తావివ్వకూడదు. 9. సామాజిక దూరం అనే పదాన్ని తొలగించి భౌతిక దూరం పాటించేలా, భవిష్యత్తులోనూ అది అన్ని చోట్లా అమలయ్యేలా చూడాలి. పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు అన్నట్టు, కరోనా కట్టడికి నవ సూత్రాలు పాటిస్తే భారత్ ప్రజలు భరోసాగా బతుకుతూ, బంగారు భవితకు బాటలు వేసుకోగలరు. ఇన్ని చేయాలంటే ప్రభుత్వానికి ప్రస్తుతం కాస్త కష్టతరమనిపించినా, సుభిక్ష భారత్ కావాలంటే తప్పదు మరి. కార్పొరేట్లు బ్యాంకులకు ఎగ్గొట్టిన ఋణాలకంటే 100 రోజుల ఈ దీక్షకు ప్రజలకు ఖర్చు పెట్టే ఈ మొత్తం పెద్ద భారమేమీ కాదు. డబ్భు దేముంది రేపు లాక్ డౌన్ ఎత్తి వేశాక, దేశ ఆర్థిక పరిపుష్టికి కాస్త ధరలు పెంచినా, దాన్ని ప్రజలు సంతోషంగా స్వీకరిస్తారు. ఎందుకంటే విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడిన ప్రభుత్వాన్ని పెద్దగా తప్పు పట్టరు. ఇందులో రాజకీయ కోణాలు మానుకొని అందరూ ఏకతాటిపైకి వస్తే దీనిని దిగ్విజయంగా అమలు చేయవచ్చు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ సామెతను నిజం చేయవచ్చు. @ వేగోరే (వేణుగోపాల్ రెడ్డి ద్వారం), సీనియర్ జర్నలిస్టు, విశ్లేషకులు. 9705388544

Featured

అచ రి త్వ ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయం: పాస్టర్ అనిల్ కుమార్*

*అచ రి త్వ ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయం: పాస్టర్ అనిల్ కుమార్* ఈ రోజు ఉదయం బి వి నగర్ లో Anagunta ప్రాంతంలో బాప్టిస్ట్ చర్చి దగ్గర అచ్చరిత్వ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేయడం జరిగింది. అక్కడ చర్చ్ దగ్గర వుంటున్న పేదలైన వృద్దులకు కొంతమందికి నిత్యావసరాలు వారి మదర్ ఇన్ లా కందికట్టి మరియమ్మ పేరు మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పాస్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ గత కొంత కాలంగా అచ రి త్వ ఫౌండేషన్ చైర్మన్ కృపా ల్ చేస్తున్న సేవలు అభినందనీయం అని వారిని ఆదర్శంగా తీసుకొని అనేక మంది ఇలాంటి పేదలకు సేవ చేయాలని ఫౌండేషన్ ద్వారా ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలి అని కోరుకుంటున్నాను అన్నారు.

Featured Others

నీవెప్పుడు జన్మిస్తావు? ————————————— గంజాం భ్రమరాంబ తిరుపతి

నీవెప్పుడు జన్మిస్తావు? ————————————— గంజాం భ్రమరాంబ తిరుపతి నిజం చెప్పు నీవెప్పుడు జన్మించావు? నీ తల్లిదండ్రులు నీకు ఊపిరి పోసిన నిమిషంలోనా…. లేదా నీ మానవజన్మకు అర్థం,పరమార్థం వుందని తెలుసుకున్న మరుక్షణంలోనా …. రత్నాకరుడు వాల్మీకిగా, సిద్ధార్థుడు బుద్ధుడుగా, నరేంద్రుడు వివేకానందుడుగా, గాంధీజీ మహాత్ముడుగా, ఠాగూర్ కవీంద్రుడుగా, అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా, సావిత్రి భాయి తొలి ఉపాధ్యాయినిగా, థెరెసా విశ్వమాతగా, ఇలా ఎందరెందరో… పునః జన్మించడానికి సంవత్సరాల కాలం యుగాంతాల త్యాగం జన్మాంతరాల మేథో మధనం వెరసి వారి జన్మ సాఫల్యం మరి నిజం చెప్పు నీవెప్పుడు జన్మిస్తావు? అసలు నీవెవరో నీవెప్పుడు గుర్తిస్తావు? గంజాం భ్రమరాంబ తిరుపతి 9949932918

Featured

నెల్లూరు ట్రైనీ కలెక్టర్ గా భావన వశిష్ఠ

నెల్లూరు ట్రైనీ కలెక్టర్ గా భావన వశిష్ఠ – ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం* నెల్లూరు జిల్లా ట్రైనీ కలెక్టర్ గా భావన వశిష్ఠ నియమితులైనారు. అసిస్టెంట్ కలెక్టర్ హోదాలో ఆమెను జిల్లాకు కేటాయిస్తూ బుధవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2018 లో జరిగిన ఆలిండియా సివిల్స్ పరీక్షల్లో 68వ ర్యాంకు సాధించిన భావన వశిష్ఠ ఐఏఎస్ కు ఎంపికైనారు. గత ఏడాది శిక్షణ కాలాన్ని పూర్తి చేసుకున్న ఆమెను ఏపికి కేటాయించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం భావన వశిష్ఠను నెల్లూరుజిల్లాకు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ట్రైనీ కలెక్టర్ గా నెల్లూరులో తొలి పోస్టింగ్ పొందిన భావన ఇక్కడ అసిస్టెంట్ కలెక్టర్ హోదాలో పనిచేయనున్నారు. ఆమె ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.