Friday, 6 March 2026

Blog

Featured

నెల్లూరు ట్రైనీ కలెక్టర్ గా భావన వశిష్ఠ

నెల్లూరు ట్రైనీ కలెక్టర్ గా భావన వశిష్ఠ – ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం* నెల్లూరు జిల్లా ట్రైనీ కలెక్టర్ గా భావన వశిష్ఠ నియమితులైనారు. అసిస్టెంట్ కలెక్టర్ హోదాలో ఆమెను జిల్లాకు కేటాయిస్తూ బుధవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2018 లో జరిగిన ఆలిండియా సివిల్స్ పరీక్షల్లో 68వ ర్యాంకు సాధించిన భావన వశిష్ఠ ఐఏఎస్ కు ఎంపికైనారు. గత ఏడాది శిక్షణ కాలాన్ని పూర్తి చేసుకున్న ఆమెను ఏపికి కేటాయించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం భావన వశిష్ఠను నెల్లూరుజిల్లాకు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ట్రైనీ కలెక్టర్ గా నెల్లూరులో తొలి పోస్టింగ్ పొందిన భావన ఇక్కడ అసిస్టెంట్ కలెక్టర్ హోదాలో పనిచేయనున్నారు. ఆమె ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తి.

Featured

డైకస్ రోడ్డు సెంటర్ నందు మూగజీవాలకు ఆహారాన్ని అందిస్తున్న పోలీస్ సిబ్బంది

కరోన మహమ్మారి వలన మనుషులే కాదు రోడ్డున తిరిగే మూగజీవాలకు కూడా ఆహారం దొరక్క విలవిలలాడుతున్నాయి. ఆకలితో కవర్లు తింటున్న గోవులను గమనించిన వన్ టౌన్ సీఐ మధు బాబు రోటరీ క్లబ్ నెల్లూరు కార్యదర్శి మరియు కూరగాయల మార్కెట్ సెక్రటరీ అయిన అజీజ్ కు చెప్పగా వెంటనే స్పందించి వారి మిత్రుడు హాజీ తో కలసి కలిసి డైక్రస్ రోడ్డు సెంటర్ నందు ఆవులకు అరటి పండ్లను, ఆకుకూరలను సొరకాయలను ఆహారంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కూడా పాల్గొని వాటికి ఆహారాన్ని అందించడం జరిగిందని రోటరీ క్లబ్ అధ్యక్షుడు సతీష్ కుమార్ తెలియజేశారు. ఈ విధంగా మూగ జీవాలు కూడా ఆహారాన్ని అందజేసి తమ మానవత్వాన్ని చూపుతున్నారు పోలీసు వారు మరియు రోటరీ వారు.

Featured

పారిశుద్ధ్య కార్మికులను సత్కరించిన VHPS అధ్యక్షుడు

నెల్లూరు VHPS జిల్లా అధ్యక్షులు రమేష్ నాయుడు బుధవారం నెల్లూరు నగరంలోని పదరూపల్లిలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ద్య్ కార్మికుల కళ్ళు కడిగి సత్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రజల ప్రాణాలను కాపాడటంలో ప్రధాన పాత్ర వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు మారువలేనివి అని కొనియాడారు.వారిని సత్కరించడం సంతోషంగా ఉందన్నారు.

Featured

పెళ్లయిన మూడు నెలలకే విషాదం…ఈతకు వెళ్లి వ్యక్తి మృతి

పొదలకూరు మండలం పర్వతాపురంలో బుధవారం విషాదం నెలకొంది. కండలేరు డ్యామ్ స్పిల్ వేలో ఈతకెళ్లి యువకుడు చిరంహీవి మృత్యువాత(27) పడ్డాడు.కండలేరు థ్యంలో ఈత కొడుతూ గుంటలో మ్యూనిగిపోవడంతో చనిపోయినట్లు ప్రాధమిక సమాచారం. మూడు నెలల క్రితం అతనికి వివహమైంది.కాగా పోస్టుమార్టం రిపోర్ట్ కోసం మృతదేహాన్నీ నెల్లూరుకు తరలించారు.

జాతీయ అంతర్జాతీయ

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి

బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ (54) మృతి చెందాడు.గతకొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆయన.ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచాడు.హైదర్,కిస్సా, పాన్ సింగ్ తోమర్,లైఫ్ ఆఫ్ పైతో పాటు పలు హాలీవుడ్ సినిమాల్లోనూ నటించాడు.కాగా ఇర్ఫాన్ ఖాన్ కు భార్య ,ఇద్దరు కొడుకులు ఉన్నారు.

Featured

100 పిపి ఈకిట్లను అందచేసిన కోటంరెడ్డి

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోట్టంరెడ్డి 100 పిపి ఈకిట్లను జిల్లా కలెక్టర్ శేషగిరిబాబుకు పంపారు.కరోనా వైరస్ రోగులకు చికిత్స అందించే వైద్యులు కొసం వీటిని ఉపయోగించాలన్నారు.కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రూరల్ వైసిపీ కార్యాలయ ఇంచార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి వీటిని కలెక్టర్కు అమెదచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..కరోనా కష్టకాలంలో సహకరిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Featured

జర్నలిస్టులను ఆదుకోవాలని కలెక్టర్ కు జాప్ వినతి

జర్నలిస్టులను ఆదుకోవాలని కలెక్టర్ కు జాప్ వినతి నెల్లూరు : కరోనా లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నెల్లూరు జిల్లాలోని జర్నలిస్టులకు సాయం చేయాలని కోరుతూ జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) నెల్లూరు జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నెల్లూరు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు అందజేయాలని రూరల్ డెవలప్ మెంట్ ట్రస్టు (RDT) అనంతపురం వారిని జాప్ కోరగా, వారు నెల్లూరు నగరంలో ఉన్న ఆ శాఖ ద్వారాఅందించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అయితే జిల్లా కలెక్టర్ ద్వారా అనుమతులు ఇప్పించి, సిఫార్సు చేయించాలని కోరగా,  ఆ మేరకు నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు ను బుధవారం కలెక్టర్ క్యాపు ఆఫీసులో కలవడం జరిగింది. కలెక్టర్ అందుకు సానుకూలంగా స్పందించి, ఈ తంతు పూర్తి చేయాలని డి ఆర్ ఓ ను ఆదేశించారు. డి ఆర్ ఓ ను కూడా కలిసి కలెక్టర్ సిఫారసు లేఖను అందజేయగా ఆయన వెంటనే స్పందించి ఆర్ డి టి సంస్థ తో సంప్రదింపులు జరపడంతో పాటు, సమాచారశాఖ ద్వారా జాబితా కోరారు. జిల్లా జాప్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, జాప్ నాయకులు విజయకుమార్ రెడ్డి,రావూరి రమేష్ పాల్గొన్నారు. అనంతపురం నుండి నెల్లూరు జర్నలిస్టులకు ఈ సహకారం అందించుటకు ప్రధాన పాత్ర పోషించిన jaap రాష్ట్ర నాయకులు అనిల్ కుమార్ రెడ్డి గారికి నెల్లూరు జర్నలిస్టులు అభినందనలు తెలుపుతున్నారు

Featured Others

షేడ్స్! – చిత్తలూరి…………..(ఛాలెంజిలు విసురుకుంటూ వినోదం పంచుతున్న సినీ సెలెబ్రిటీల కొన్ని వీడియాలను చూశాక..)

షేడ్స్! – చిత్తలూరి బాగుంది బాబయ్యా చాలా బాగుంది బ్లాక్ బస్టరైన భారీ బడ్జెట్ సినిమాలా వుంది ఇల్లు ఊడ్చటం అంట్లు తోమటం వంట చేయటం పక్క బట్టలు సర్దటం పైపుతో నీళ్లు కొడుతూ నేలంతా శుభ్రం‌చేయటం మీ బోటి పెద్దోళ్లు మాబోటి వాళ్ల పనులు చేస్తూ కనిపించటం ముచ్చటగా వుంది ఊహించని విధంగా ఒక చిన్న సినిమా సూపర్ హిట్టయినంత సంతోషంగా వుంది చిన్న చిన్న ఛాలెంజిలు విసురుకుంటూ మాకింత పెద్ద వినోదాన్ని పంచటం బాగుంది బాబయ్యా చాలా చాలా బాగుంది అయితే కాలు బయట పెట్టని ఈ క్వారంటైన్ల కాలంలో వినోదాన్ని పంచుతున్న మీ ఈ ఛాలెంజిల సంగతేమోగానీ ఎంత చాకిరీ చేసినా మాబోటి పేదలకు నిత్యం బతుకే ఒక ఛాలెంజ్ ఇంట్లోనే బందీయైన ఇట్లాంటి సంక్షోభ సమయంలో బతకటమే ఒక పెద్ద ఛాలెంజ్ అందుకే మీ ఛాలెంజిల్లో చిన్న మార్పు కోరుకుంటున్నాం బాబయ్యా మా పేదల బతుకులు మార్చే ఊహ చేస్తున్నాం బాబయ్యా వేషాల్లేక వేసారిపోతున్న మీ తోటి కార్మికుల పొట్ట నింపే ఛాలెంజిలిసురుకోండి ఈ కరోనా కష్టకాలంలో గడప దాటితేగానీ పూట గడవని ఎంతో మంది నిరుపేదల కడుపు నింపే దాతృత్వాలకై ఛాలెంజ్ విసురుకోండి ఈ లాక్ డౌన్ల లాకులెత్తాక వరద నీటిలా పోటెత్తే సామాన్య జనం రేపటి బతుకు సమస్యలకు కొత్త మార్గాలనన్వేషించే ఛాలెంజిలు విసురుకోండి అప్పుడింకా బాగుంటుంది బాబయ్యా చాలా చాలా బాగుంటుంది చిన్న బడ్జెట్ తో తీసిన సినిమా భారీ కలెక్షన్లు వసూలు చేసినంత అద్భుతంగానూ ఆనందంగానూ వుంటుంది మనిషిలోని రక రకాల షేడ్స్ ని ఈస్ట్ మన్ కలర్ లో కళ్లకు కడుతున్న ఈ కరోనా సంక్షోభ కాలం, మీలాంటి సెలబ్రిటీల ఛాలెంజులకి స్ఫూర్తివంతమైన ఒక కొత్త అర్థాన్నీ ఇచ్చినట్టుంటుంది! (ఛాలెంజిలు విసురుకుంటూ వినోదం పంచుతున్న సినీ సెలెబ్రిటీల కొన్ని వీడియాలను చూశాక..) – చిత్తలూరి 8247432521

Featured Others

ఎక్కడ?? ……….సడ్లపల్లె

ఎక్కడ?? సడ్లపల్లె ********* అప్పుడే మొలిచిన తొలి ఆలోచనల్ని పేర్చి మహా మంత్రాల వాహకాలుగా మార్చి అందిన ఇంధనాల్ని అలవోకగా కాల్చి అనేకానేక యాగాల్ని చేసి అంది పుచ్చుకొన్న అలనాటి శక్తులేమాయె?? మన ముఖాల్లాంటి మానవ రూపాల్ని తీర్చి కడగండ్ల భూ మండలం మీదికి జార్చి పై లోకాల్లో అందాల భామల్తో హాయిని భోంచేస్తూ కులికే దేవాను దేవుళ్లను మెగా తపో మహిమల్తో గడగడ లాడించి భూతలం మీదికి ఈడ్చి కష్టాలూ నష్టాల్ని తీర్చే వరాల మూటలు అందుకొన్న వీర స్వాముల వారెక్కడ?? మానవాధములను ఆక్రమించి మరణమృదంగం మోగించే రోగాల్ని పరిశుద్ధ తీర్థ జలం తోనో పవిత్ర వాక్కుల శక్తుల తోనో స్వయంభూ దేహ ఆలింగనం తోనో చిటికెలో పటాపంచలు చేసిన పలుశ్రీసంబోధనల సమాజ ఉద్ధారకు లెక్కడ?/ ఒంటి మీది కుంటి వెంట్రుక పీకి నోటితో ఒక్క వాక్యం పలికి చేతి చిట్టి బెత్తం విసరి దేవతల్నీ రాక్షసుల్నీ జంతువుల్నీ క్రిముల్నీ పక్షుల్నీ పాముల్నీ శపించి రాయీ రప్పలుగానో మరో కు రూపంగానో మార్చే మాయల మరాఠీ మూకలెక్కడ?? ఇక్కడ మహా మహులంతా భయాలు మేసి పిరికి రసం తాగి పిడుచకట్టి అయోమయాంగులై అంగలారుస్తూ…!! వాస్తవాలు మాట్లాడే వారిపై వ్యంగంగా విరుచుక పడుతూ……. పనికిమాలిన పాండిత్యం ప్రదర్శిస్తూ……….. సేకరణ వెంకటేశ్వర్లు    

Featured Others

పోరాటల పురిటిగడ్డ………………. గంజాం భ్రమరాంబ తిరుపతి 994993291

  స్వాతంత్ర్య సమరంలో పాల్గొని దేశానికి స్వేచ్ఛా వాయువులనిచ్చిన వీరనాయకుల గాధలు విరివిగా విన్నాము కోరుకున్న లక్ష్యాన్ని పోరాడి సాధించి విజయాన్ని చేరుకున్న ధీరుల గాధలు చిన్ననాటి నుండి కనులారా చదివాము రక్తాన్ని ఉడికెత్తించే పౌరుష సంవాదనలు దేశభక్తిని మేల్కొలిపే జవానుల వీరోచితాలు విజయసింహాసనాన్ని అధిరోహించిన సాహసాలుఎన్నెన్నో చూసాము. ఎందరో ప్రజలను పొట్టనబెట్టుకున్న జలియన్ వాలాబాగ్ వంటి ఉందంతాలెన్నింటినో విని కన్నీళ్ళు కార్చిన మనమే ఏకతాటిపైకి వచ్చి వీడని సంకల్పంతో శత్రువుల దురాగతాలను తరిమితరిమి కొట్టాము. అవన్నీ …. ఎవరో తాతలు చెప్పగా విన్న గాథలు ఎక్కడో పుస్తకాలలో చదవగా తెలిసిన సంఘటనలు ఎప్పుడో నాటకాలలో చూడగా కలిగిన అనుభూతులు ఇప్పుడు నిజంగా … ఒక అలుపెరుగని యుద్ధం మన ముందుకొచ్చింది. ప్రతి ఒక్కరూ పోరాడే ఆవశ్యకత ముంచుకొచ్చింది. పోరాటాల పురిటి గడ్డ మనది. వెనుదిరగని స్వభావం మనది. రెప్పపాటు కాలంలో తెలియని శత్రువొకటి ప్రపంచం మీదకి దండయాత్రకొచ్చింది గొప్పవాళ్ళమంటూ తరచుగా జబ్బలుచరచుకునే దేశాలన్నీ జబ్బులతో బెంబేలెత్తి శ్మశానవాటికలయ్యాయి. మన చక్కని సాంప్రదాయాలు సంస్కృతి ఏళ్ళతరబడి అనుసరిస్తున్న ఆరోగ్యసూత్రాలు యోగాసనాలు ప్రకృతి వైద్యాలు ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.. విదేశాలనుండి సులువుగా ప్రవేశించిన భూతం మన కట్టుదిట్టాలను చూసి బిత్తరపోయింది. తిండిలేక నిదురలేక త్రాగుటకు నీరులేక ఎన్నెన్ని అవస్థలు పడుతున్నా సరే కరోనా భూతాన్ని పారద్రోలందే విశ్రమించమన్న మన దృఢ సంకల్పాన్ని చూసి స్వీయ నిర్భంధానికి స్వచ్చందంగా వెళుతూ స్వీయ సంరక్షణ పాటిస్తున్న ప్రజల సంకల్ప బలాన్ని చూసి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నా వెనుకడుగు వేయని ప్రజల మానసిక స్థైర్యం చూసి కరోనా బూచి సాగిలపడి బూడిద అవుతోంది క్రమ క్రమంగా బలహీన పడుతోంది ఓరిమితో ఐక్యతతో మనం చేస్తున్న స్వచ్ఛంద గృహనిర్బంధ పోరాటాన్ని చూసి కరోనా దహించుకు పోతుంది క్రమేణా క్రుంగి కృశించి పోతుంది అంతవరకూ…. మన తరగని ఆత్మవిశ్వాసమే మన ఆయుధం ఆరోగ్య సూచనలు పాటించడమే తక్షణ కర్తవ్యం. మనల్ని మనం కాపాడుకుందాం మనవారినందరినీ కాపాడుకుందాం రండి .. గెలిచేందుకు పోరాడుదాం గెలిచేవరకూ పోరాడుదాం గంజాం భ్రమరాంబ తిరుపతి 9949932918 bhramarambaganjam22@gmail.com

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.