Friday, 6 March 2026

Blog

ప్రకాశం

వెలిగొండ ప్రాజెక్టు ను సందర్శించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్

వేలుగోండ ప్రాజెక్టు హేడ్ రేగ్యూలేటర్ పనులు కోళ్లం వాగు దగ్గర పరిశీలించిన ఇరిగేషన్ మినిష్టర్ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ. అనిల్ కుమార్ యాదవ్ మరియు శ్రీ. డా.ఆదిమూలపు సురేష్ మరియు అధికారులు.

ప్రకాశం

పంచాయతీ కార్మికులకు కు భోజనం పంపిణీ చేసిన జబర్దస్త్ ఫేమ్ నెమలి రాజు

పొదిలి పట్టణంలో పెన్ పవర్ ఆధ్వర్యంలో సోమవారం పంచాయతీ కార్మికులకు నిర్వహించే భోజనాలకు జబర్దస్త్ ఫేమ్ నెమలి రాజు ఆర్ధిక సహాయం అందజేశారు. అందులో భాగంగా 61 వ రోజు ఆయిన సోమవారం స్వయంగా వచ్చి వడ్డించారు. సాధారణ భోజనంతో పాటు స్పెషల్ లడ్డు, బూందీ, అరటిపండు, అప్పడం స్వయంగా వచ్చి వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఆయన సోదరులు , స్నేహితులు పాల్గొన్నారు.

ప్రకాశం

మేముఉన్నాము సేవాసంస్థ ఆధ్వర్యంలో ఒక మహిళకు రక్తదానం చేసిన యువకుడు

గిద్దలూరు పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో గిద్దలూరు మండలం పొడలకొండపల్లె గ్రామానికి చెందిన ఆగోలు శివనాగార్జున యాదవ్ అనే యువకుడు మేము ఉన్నాము సేవసంస్థ ఆధ్వర్యంలో సోమవారం రక్తదానం చేశారు. వివరాల్లోకి వెళితే ఓ మహిళకు అత్యవసర పరిస్థితుల్లో O+ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో మేమున్నాం సేవాసమితి ద్వార విషయం తెలుసుకున్న ఆగోలు శివనాగార్జున యాదవ్ రక్త దానం చేశారు. ఆపత్కాలంలో, స్పందించినందుకు మహిళ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేమున్నాం సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.

ప్రకాశం

పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే

  పొదిలిలోని పొగాకు వేలం కేంద్రంను సోమవారం ఉదయం సందర్శించి రైతుల సమస్యను వేలం సూపరింటెండెంట్ దృష్టికి తీసుకొని వెళ్లిన మార్కాపురం మాజీ శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి.

ప్రకాశం

చిన్నారుల మృతదేహాలను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే

పొదిలి ప్రభుత్వ వైద్యశాల లో సోమవారం ఉదయం కొనకనమిట్ల మండలం అంబాపురం గ్రామంలో నీటి కుంటలో పడి మృతి చెందిన ఇద్దరు చిన్నారుల మృత దేహాలను సందర్శించి వారి కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి.

ప్రకాశం

మంచి నీటి చెరువులను సాగర్ నీటితో నింపండి – మంత్రి బాలినేని

ఒంగోలు పట్టణంలో ప్రస్తుతం 1 వ సమ్మర్ స్టోరేజి చెరువు నందు 668ml, 2వ సమ్మర్ స్టోరేజి చెరువు నందు 1556ml అందుబాటులో ఉన్నాయి. రామతీర్థం రిజర్వాయర్ ద్వారా ప్రస్తుతం చెరువులకు మంచి నీరు వచ్చి చేరుతుంది. ఇంకా 20 రోజులు రామతీర్థం రిజర్వాయర్ నుండి మంచి నీరు వస్తే చెరువులు పూర్తి స్తాయిలో నిండుతాయి. 3 నెలలు 20 రోజుల పాటు వస్తాయి. ప్రస్తుతానికి ఉన్న నీళ్లు 2 నెలల పాటు వస్తాయని ఒంగోలు మున్సిపల్ ఇంజనీర్ దేవరపల్లి సుందర రామిరెడ్డి వివరణ ఇచ్చారు. మంత్రి గారి ఆదేశాలు మేరకు చెరువులను పూర్తి స్తాయిలో నింపుతాం. నగరంలో ప్రజలకు మంచి నీరు కష్టాలు రాకుండా చూస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్

వసప క్వారంటైన్ సెంటర్ లో భోజనంలో ఇసుక

కొత్తూరు :మండలంలోని వసప కస్తూరిబా గాంధీ బాలికల వసతి గృహంలో యర్పాటు చేసిన వలస కార్మికుల క్వారంటైన్ సెంటర్లో నాసిరకం భోజనం అందిస్తూ ఎంతో ప్రయసపడి వచ్చిన వారిని అదరించకపోగా దుర్బాష లు ఆడుతున్నారు, సోమవారం ఉదయం భోజనం లో భాగం గా పులిహోర పెట్టగా చాలీ చాలని దానితో పొట్ట నింపుకొంటామని అనుకున్న వారికి భోజనంలో ఇసుక వచ్చింది దీనిపై పలువురు అడగగా ఉంటే ఉండండి లేదు అంటే వెళ్లిపోంది అని సిబ్బంది అంటున్నారు రని  ,తలుపులు  వేసి తాళాలు వేశారని తెలుపుతున్నారు

ప్రకాశం

ఏడాదిలో లక్ష ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్ కే సొంతం

ప్రకాశం జిల్లా దర్శి మండలం కొత్తపాలెంలో నూతనంగా నిర్మించిన దర్శి-2 సచివాలయాన్ని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరితగతిన అన్ని సచివాలయాలు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. జగనన్న సారథ్యంలో ఏడాది పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏడాదిలోనే లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఒక్క జగన్​కే దక్కుతుందని కొనియాడారు. సచివాలయాలు అవినీతి రహితంగా ప్రజలకు విశ్వాసం కలిగించేలా ఉండాలని ఉద్యోగులకు సూచించారు.

ఆంధ్రప్రదేశ్

ప్రతి ఇంటా ” కోవిడ్ 19 ఆంధ్ర ప్రదేశ్” మొబైల్ యాప్

శ్రీకాకుళం : ప్రతి ఇంటా ” కోవిడ్ 19 ఆంధ్ర ప్రదేశ్” మొబైల్ యాప్ ఉండాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆది వారం ఒక ప్రకటనలో తెలిపారు. 5 వ విడత ఇంటింటి ఫీవర్ సర్వేలో  భాగంగా ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ కొన్ని సూచనలు జారీ చేసిందన్నారు. ఇందులో భాగంగా కోవిడ్ 19 ఆంధ్ర ప్రదేశ్ యాప్ ను ఆశా కార్యకర్త, ఏ.ఎన్.ఎం ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేస్తూ  స్వయంగా డౌన్ లోడ్ చేయాలని పేర్కొన్నారు. సర్వే సమయానికి ముందు రోజు ఫీవర్  సర్వే గురించి ప్రజలందరికీ తెలియజేయాలని ఆయన ఆదేశించారు. ప్రజలు అందరూ అందుబాటులో ఉండే సమయాలలో సర్వే నిర్వహించాలని తద్వారా మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.  సర్వే కార్యక్రమాన్ని ఆయా ప్రాంత ఆశా కార్యకర్త,ఏ.ఎన్.ఎం స్వయంగా నిర్వహించాలని తెలిపారు. వాలంటీర్ సర్వేలో పాల్గొని తమ మొబైల్ ఆప్ ద్వారా ఆశా, ఏ.ఎన్.ఎం చెప్పిన వివరాలు నమోదు చేయాలని అన్నారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారు, ఇతర ప్రాంతాలనుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని గమనించాలని ఆదేశించారు. సర్వేలో భాగంగా మలేరియా,డెంగీ వంటి వ్యాధులను గూర్చి అవగాహన కలిగించి, నివారణ చర్యలు తీసుకొనే విధంగా చైతన్య పరచాలని పేర్కొన్నారు. సర్వేలో పాల్గొనే సిబ్బంది విధిగా మాస్కు ధరించి, తగిన ఇతర రక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి సర్వే వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. సర్వే వివరాలు నేరకుగా మోబైల్ యాప్ ద్వారా ప్రతి ఇంటి సర్వేలో భాగంగా ఆ ఇంటి వద్దనే అప్ లోడ్ చేయాలని ఆదేశించారు. తాళాలు వేసిన ఇళ్ళు ఉంటే వదిలి పెట్టరాదని, ఇంటి మనుషులు వచ్చిన వెంటనే అప్ లోడ్ చేయాలని సూచించారు. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా సహనం, ఓర్పుతో సర్వే చేపట్టి ఆదర్శంగా నిలవాలని ఆయన కోరారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.