Wednesday, 11 March 2026

Blog

E-పేపర్

కలెక్టర్ ఆదేశాలు బెఖాతార్ …!

రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలో గల వీరభద్ర కాలనీ లో నిత్యం చెత్త కాలుస్తూనే ఉన్నారు గత సంవత్సరము కలెక్టర్ పోస్టర్ రిలీజ్ చేసినా స్థానిక అధికారులు ప్రజలకు కిందిస్థాయి ఉద్యోగులకు అవగాహన కల్పించడంలో విఫలమయ్యారని అర్థమవుతుంది. చెత్త కాల్చడం వల్ల గాలి కాలుష్యం అవుతుందని ప్రజలకు శ్వాస సంబంధిత సమస్యలు ఎదురవుతాయని, క్యాన్సర్ కి కారణం కూడా అవుతుందని ప్రభుత్వం హెచ్చరించినా గానీ కింది స్థాయి ఉద్యోగులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలకే నోచుకోకపోతే సామాన్య ప్రజలు స్వేచ్ఛగా జీవించేది ఎప్పుడు అని ప్రజలు వాపొతున్నారు. ట్లు వదిలేస్తున్నారని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలకే నోచుకోకపోతే సామాన్య ప్రజలు స్వేచ్ఛగా జీవించేది ఎప్పుడు అని ప్రజలు వాపొతున్నారు. చిత్త పోయ్యోద్దు అంటూ మైక్ పెట్టి ఉన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నారా లోకేష్ జన్మదిన వేడుకలు

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటి,విద్యా శాఖ మాత్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకలు మర్రిపాడు లో కేంద్రం లో రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మాత్యులు శ్రీ ఆనం రామానారాయణ రెడ్డీ ఆదేశాలతో 23 న మర్రిపాడు బస్సు స్టాండ్ నందు ఉదయం 10 లకు నిర్వహించడం జరుగుతుంది ముందుగా అభయంజానేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి కేక్ కటీంగ్ చేయబడును మర్రిపాడు మండలంలోని టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు లోకేష్ జన్మదిన వేడుకలో పాల్గొనాలని, కార్యక్రమం విజయవంతం చేయవలసిందుగా, మర్రిపాడు గ్రామం ప్రజలు కోరుతున్నారు.

కాకినాడ

పెద్దాపురం RDO కార్యాలయం లో బిజెపి జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో జనతా వారధి.

పున్నమి న్యూస్, పెద్దాపురం సోమవారం ఉదయం 10.30 కి భారతీయ జనత పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన జనతా వారధి కార్యక్రమం లో భాగంగా ప్రజా సమస్యలు ను RDO కార్యాలయం నందు నిర్వహించిన గ్రీవెన్సెల్ అధికారులు దృష్టికి తీసుకువెళ్లి సమస్యలును పరిష్కరించడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలలు తమ సమస్యలును భాజపా చేపట్టిన జనతా వారధి ద్వారా త్వరిత గతిన పరిష్కరించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం కు బిజెపి పెద్దాపురం నియోజకవర్గం ఇంచార్జ్ దాట్ల సాహితి వర్మ, పట్టణ అధ్యక్షులు బొలిశెట్టి రాంకుమార్, జనరల్ సెక్రెటరీ మిడతాని శ్రీధర్, ఓడిమని శివ, చెల్లిపోయిన రత్నం, కె ధనలక్ష్మి, అద్దేపల్లి వెంకట్రావు, నెల్లిపూడి బ్రహ్మాజీ పాల్గొన్నారు

E-పేపర్

మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర* : బంగారం ధర బుధవారం భారీగా పెరిగింది

*మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర* : బంగారం ధర బుధవారం భారీగా పెరిగింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం నిన్న తొలిసారి రూ.1.50 లక్షలను అధిగమించగా, ఈరోజు మరింతగా పెరిగింది. హైదరాబాద్‌ బులియన్‌ విపణిలో మంగళవారం రాత్రి 11.55 గంటలకు రూ.1,52,800 ఉన్న ధర, బుధవారం ఒక్కరోజే రూ.6,000కు పైగా పెరిగి రూ.1,59,000కు చేరింది. ఇక వెండి ధర కిలో రూ.3,19,000 దాటింది

ఖమ్మం

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ రాష్ట్ర నాయకుడు గల్లా సత్యనారాయణ

ఖమ్మం, జనవరి (పున్నమి ఖమ్మం జిల్లా ప్రతినిధి) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీపై చేసిన వ్యాఖ్యలను బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహానీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఆయన పేర్కొన్నారు. అలాంటి పార్టీపై ముఖ్యమంత్రి అవగాహనలేని వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరమని అన్నారు. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అలాగే బీజేపీ మూలమైన జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను బీజేపీ కొనసాగిస్తోందని తెలిపారు. విదేశీ మహిళ అయిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలో సాగుతున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి బీజేపీపై అర్థంలేని వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని విమర్శించారు. ఖమ్మంలో జరిగిన సీపీఐ సభలో దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు అవుతుందని, సీపీఐ నేతలు వందేళ్లుగా పేదల పక్షాన పోరాడుతున్నామని, మరో వందేళ్లు కూడా పోరాటం చేస్తామని చెప్పడంలోనే కమ్యూనిస్టు నాయకులకు పేదరిక నిర్మూలనపై ఆసక్తి లేదని స్పష్టమవుతోందని అన్నారు. కమ్యూనిస్టు పార్టీలకు అభివృద్ధి నిరోధక పార్టీ అనే పేరు ఉందని వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న పార్టీ బీజేపీ అని, ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ దేశాభివృద్ధి కోసం ఏ నిర్ణయం తీసుకున్నా మొదటగా వ్యతిరేకించేది కమ్యూనిస్టు పార్టీలేనని గల్లా సత్యనారాయణ పేర్కొన్నారు. అందుకే కమ్యూనిస్టులను ఖమ్మం జిల్లా ప్రజలు, దేశ ప్రజలు మరిచిపోయారని అన్నారు. బీజేపీని మతతత్వ పార్టీగా విమర్శించే కాంగ్రెస్ పార్టీనే గతంలో “కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్” అన్న వ్యక్తులు ఉన్నారని గుర్తు చేశారు. అలాంటి పార్టీకి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీపై విమర్శలు చేయడం తగదని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని గద్దె దించటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

E-పేపర్

ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. పరీక్షకు 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి

ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. పరీక్షకు 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి* తెలంగాణ ఇంటర్ బోర్డు విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఫిబ్రవరి 25 నుంచి మొదలయ్యే ఇంటర్ పబ్లిక్ పరీక్షల వేళ అమలు చేసే ‘ఒక్క నిమిషం ఆలస్యం’ నిబంధనను సవరించింది. ఇకపై పరీక్షలకు ఐదు నిమిషాల ఆలస్యమైనా అనుమతిస్తారని తెలిపింది. ఈ పరీక్షలకు మొత్తం 10 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరుకానున్నారు. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుంచి మొదలవుతాయి. హాల్ టికెట్లపై QR కోడ్ తో పరీక్ష కేంద్రాలకు సులభంగా చేరుకోవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది.

E-పేపర్

యాచారం మండలంలో గత 4 రోజులుగా యూరియా కోసం రైతులు ఎదురుచూపులు

యాచారం మండలంలో గత 4 రోజులుగా యూరియా కోసం రైతులు ఎదురుచూస్తున్నారు కానీ యూరియా మాత్రం దొరకడం లేదు రైతులు ఇబ్బంది పడుతున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పై రైతులు దుమ్ము పోస్తున్నారు.కొద్దిగా ఈ సమస్య పరిష్కారం అయ్యేటాటు చూడండి ఒక్క రైతు ఆవేదన అర్థం చేసుకోగలరు

కామారెడ్డి

ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటే…..

కామారెడ్డి, 21 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ప్రజలు ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, ఊరు, మండ లం, జిల్లా, రాష్ట్రం వంటి తప్పులను సరిచేసుకోవా లంటే స్థానిక ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్‌కు వెళ్లాలి. ఈ సమాచారం అప్‌డేట్ చేసుకోవడం ప్రభుత్వ ప్రయోజనాలు, బ్యాంకింగ్, పబ్లిక్ సర్వీసులకు అత్యంత ముఖ్యం. అవసరమైన పత్రాలుపేరు సరిదిద్దడానికి • పాన్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవర్ లైసెన్స్, వోటర్ ఐడి లేదా గవర్నమెంట్ గొప్పల డాక్యుమెంట్. • పుట్టిన తేదీకి: బర్త్ సర్టిఫికెట్, పాన్, పాస్‌పోర్ట్, పదవ తరగతి పాస్- ఫేల్ సర్టిఫికెట్, బ్యాంక్ పాస్‌బుక్. • అడ్రస్ (ఊరు, మండలం, జిల్లా, రాష్ట్రం): రేషన్ కార్డు, బ్యాంక్ స్టేట్‌మెంట్, ఎలక్షన్ కార్డ్, గ్యాస్ బుక్ లేదా భూమి పత్రాలు. • అప్‌డేట్ ప్రక్రియదగ్గరలోని ఆధార్ సెంటర్‌కు వెళ్లి దిద్దుబాటు ఫారం (Update/Correction Form) తీసుకోండి. • సరైన పత్రాల కాపీలు, ఒరిజినల్స్ చూపించి సమర్పించండి; బయోమెట్రిక్స్ (ఫింగర్‌ప్రింట్, ఐరిస్) తనిఖీ చేస్తారు.( ఫీజు ₹50 చెల్లించండి ) • 10-15 రోజుల్లో అప్‌డేట్ అవుతుంది, స్టేటస్ SRN ద్వారా చెక్ చేయవచ్చు. రామారెడ్డి మండలంలో సెంటర్లు రామారెడ్డి మండలంలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద, కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యాలయంలో ఆధార్ సెంటర్లు ఉన్నాయి. • దగ్గర సెంటర్ వివరాలు uidai.gov.inలో లేదా 1947కు కాల్ చేసి తెలుసుకోండి. • ముఖ్య సలహాఆన్‌లైన్‌లో పేరు, అడ్రస్ అప్‌డేట్ చేయొచ్చు (myaadhaar.uidai.gov.in) కానీ పుట్టిన తేదీ, ఊరు వంటివి సెంటర్‌లోనే సాధ్యం; తప్పులు ఉంటే త్వరగా సరిచేయండి. ఉచిత అప్‌డేట్ కాలం గడిచినా సెంటర్‌లో ₹50తో సులభం.

ఆంధ్రప్రదేశ్

హందుజా బొగ్గు లారీలను నిలుపుదల చేయాలి..

సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గని శెట్టి డిమాండ్ పరవాడ, (పున్నమి ప్రతినిధి) పరవాడ మండల పరిషత్ కార్యాలయం జంక్షన్ లో హిందూజా బొగ్గు లారీలను ఈ మార్గం మీదగా నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా గని శెట్టి మాట్లాడుతూ హిందూజా బొగ్గు లారీలు ఈ మార్గం మీదగా ప్రయాణించడం వలన తీవ్రమైన బొగ్గు ఈ రోడ్లపై పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, లారీలు నిండు ధూళి రోడ్లపై వేసుకుంటూ లారీలు వెళుతున్నాయని దీనివలన పరవాడ ఎమ్మార్వో ఆఫీస్ జంక్షన్, సినిమా హాల్ జంక్షన్, సబ్ స్టేషన్, లంకెలపాలెం గ్రామం పూర్తిగా ధూళితో కపివేయపడుతుందని ఈ గ్రామాల్లో ప్రజలు ఉండలేని పరిస్థితి ఏర్పడుతుందని గని శెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. అధిక లోడుతో ప్రయాణిస్తున్న లారీలపై ఆర్టీవో అధికారులు దాడులు చేసికేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మార్గంలో అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని రోడ్లు పూర్తిగా పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి అన్నారు. హిందూజా కి రైల్వే ద్వారా బొగ్గు తరలించుకోవాలని డిమాండ్ చేశారు. మహారత్న పరిశ్రమగా ఉన్న ఎన్టిపిసి ప్రజల్ని రకంగా కాలుష్యానికి నెట్టు వేయడం అన్యాయం అన్నారు. వెంటనే , ధూళి లారీలపై చర్యలు చేపట్టాలని గని శెట్టి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, సత్యనారాయణ, అప్పల నరసమ్మ, చిన్న, ఫాతిమా బేగం, తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 78 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 78 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ఇబ్రహీంపట్నం, జనవరి 20 : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 22 అభివృద్ధి పనులను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం చెరువు కట్టపై గల కట్ట మైసమ్మ ఆలయం వద్ద నిర్మిస్తున్న ప్రత్యేక పూజలు చేసి అక్కడ నిర్మిస్తున్న ఆలయ షెడ్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఇబ్రహీంపట్నం చెరువు కట్ట సుందరీకరణ 18 కోట్ల రూపాయలతో పనులను, ఇబ్రహీంపట్నం నుండి నాగన్ పల్లి రోడ్డు వరకు నాలుగు లైన్ ల రోడ్డు పనులకు 60 కోట్ల రూపాయలతో నిర్మించే రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గతంలో బిఆరఎస్ ప్రభుత్వ పాలనలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు సంవత్సరాల కాలంలోనే 200 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని రాష్ట్రంలో ఆదర్శ మున్సిపాలిటీగా మార్చడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో గల సబ్ రిజిస్టర్ కార్యాలయం ఇక్కడే ఉంటుందని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ రిజిస్టర్ కార్యాలయాలు ప్రారంభిస్తున్న తరుణంలో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు రిజిస్టర్ కార్యాలయానికి అనుసందంగా పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మల్ రెడ్డి అభిషేక్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి మైపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్ రెడ్డి, వైస్ చైర్మన్ మంకాల కర్ణాకర్, పిఎసిఎస్ చైర్మన్ పాండురంగారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈసి శేఖర్ గౌడ్, జడల రవీందర్ రెడ్డి, ముత్యాల రాజశేఖర్ రావు, కప్పరి చందు, జలమోని రవీందర్ ముదిరాజ్, చెనమోని యాదగిరి, పప్పె శ్రీను, ఇందూరి శ్రీనివాస్, శశిధరప్ప, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.