Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

రాంబిల్లిలో స్థానిక ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ కీలక భేటీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రాంబిల్లిలో స్థానిక ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ కీలక భేటీ

వార్త ముఖ్యాంశాలు

  • సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికపై పంచాయతీ పెద్దలతో చర్చ పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో) రాంబిల్లి: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎలమంచిలి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో రాంబిల్లి మండలం మామిడివాడలో కీలక సమావేశం నిర్వహించారు.
  • మండలంలోని వివిధ పంచాయతీలకు చెందిన పంచాయతీ పెద్దలు, స్థానిక నాయకులతో విడివిడిగా సమావేశమై ఆయా ప్రాంతాల్లో పార్టీ పరిస్థితులు, స్థానిక అంశాలు, ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు.
  • సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికపై క్షేత్రస్థాయి నాయకులు, పంచాయతీ పెద్దల అభిప్రాయాలను కరణం ధర్మశ్రీ తెలుసుకున్నారు.

సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికపై పంచాయతీ పెద్దలతో చర్చ

పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో)

రాంబిల్లి: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎలమంచిలి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో రాంబిల్లి మండలం మామిడివాడలో కీలక సమావేశం నిర్వహించారు. మండలంలోని వివిధ పంచాయతీలకు చెందిన పంచాయతీ పెద్దలు, స్థానిక నాయకులతో విడివిడిగా సమావేశమై ఆయా ప్రాంతాల్లో పార్టీ పరిస్థితులు, స్థానిక అంశాలు, ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు.
సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికపై క్షేత్రస్థాయి నాయకులు, పంచాయతీ పెద్దల అభిప్రాయాలను కరణం ధర్మశ్రీ తెలుసుకున్నారు. ప్రతి పంచాయతీలో పార్టీ కార్యకలాపాలు, అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల కార్యాచరణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. క్షేత్రస్థాయి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడంతో పాటు పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసే అంశాలపై సమావేశంలో చర్చించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *