Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం తొలిసారి వికసించిన కమలం జమీందారు ఎస్వీఎస్ సుధాకర్ రావు గారిని కలిసిన నాయకులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మైలవరం తొలిసారి వికసించిన కమలం జమీందారు ఎస్వీఎస్ సుధాకర్ రావు గారిని కలిసిన నాయకులు

🪷*మైలవరంలో తొలిసారి వికసించిన కమలం!*🪷

*అనుమానాలను పటాపంచలు చేస్తూ 188 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి ఘన విజయం*

మైలవరం,నవంబర్: పున్నమి న్యూస్ ప్రతినిధి

_మైలవరం మండల రాజకీయాల్లో కమలం తొలిసారిగా వికసించింది. ఈ నెల 7న ప్రకటించిన ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో నాలుగో సెగ్మెంటులో బీజేపీ అభ్యర్థి తోట నాగేశ్వరరావు కమలం గుర్తుపై పోటీ చేసి 188 ఓట్ల మెజారిటీతో అద్భుత విజయం సాధించారు. దీంతో మైలవరం మండలంలో బీజేపీ తన విజయ ప్రస్థానాన్ని ప్రారంభించింది._
_కూటమి పొత్తులో భాగంగా నాలుగో ఎంపీటీసీ సెగ్మెంటును బీజేపీకి కేటాయించారు._ _అయితే ఆ ప్రాంతంలో బీజేపీకి సొంత ఓటు బ్యాంకు అంతంతమాత్రంగానే ఉండటంతో పాటు టీడీపీ, జనసేన నాయకుల సహకారం, కూటమి ఓట్ల బదలాయింపుపై రాజకీయ వర్గాల్లో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ సెగ్మెంటులో వైసీపీ అభ్యర్థి విజయం ఖాయమనే ప్రచారం సైతం సాగింది._
_అయితే కూటమి నాయకులు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్టీల మధ్య సమన్వయాన్ని పెంపొందిస్తూ, టీడీపీ, జనసేన శ్రేణులను కలుపుకొని బీజేపీ అభ్యర్థి విజయానికి సమష్టిగా కృషి చేశారు._ _నాయకులు, కార్యకర్తలు చేసిన నిరంతర శ్రమకు తోడు ఓటర్లు అందించిన మద్దతుతో తోట నాగేశ్వరరావు 188 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు._
_ఈ ఫలితంతో మైలవరం నాలుగో సెగ్మెంటులో తొలిసారిగా కమలం వికసించగా, కూటమి పార్టీల ఐక్యత, సమన్వయానికి ఈ విజయం నిదర్శనంగా నిలిచింది. రాజకీయంగా ఆసక్తి రేపిన ఈ సెగ్మెంటులో బీజేపీ సాధించిన విజయం మండల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది._

మైలవరం తొలిసారి వికసించిన కమలం జమీందారు ఎస్వీఎస్ సుధాకర్ రావు గారిని కలిసిన నాయకులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *