Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Ramesh Naidu

తూర్పు గోదావరి

గొల్లల మామిడాడ ఎంపీటీసీ కూటమి అభ్యర్థిగా రాపర్తి శ్రీనివాసు నామినేషన్

పెదపూడి, అక్టోబరు 22 (పున్నమి ప్రతినిధి): పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామ ఎంపీటీసీ స్థానం నంబర్‌ 5 నుంచి కూటమి అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్న రాపర్తి శ్రీనివాసు గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థిగా ఆయన ఎన్నికల బరిలో నిలిచారు. నామినేషన్‌ కార్యక్రమంలో గొల్లల మామిడాడ గ్రామానికి చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో ఎన్నికల సందడి నెలకొంది.

తూర్పు గోదావరి

జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల కేటాయింపుపై టీడీపీ–బీజేపీ నేతల చర్చలు

కాకినాడ, అక్టోబరు 21 (పున్నమి ప్రతినిధి): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాకినాడ జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల కేటాయింపుపై టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య చర్చలు జరిగాయి. కాకినాడ రూరల్ శాసనసభ్యుడు పంతం నానాజీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఇరు పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల కాకినాడ జిల్లా టీడీపీ పరిశీలకులు, మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొన్నారు. బీజేపీ తరఫున స్థానిక సంస్థల ఎన్నికల కాకినాడ జిల్లా పరిశీలకులు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ ప్రసన్న, కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు సమావేశానికి హాజరయ్యారు. కాకినాడ జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను బీజేపీకి కేటాయించే అంశంపై ఇరు పార్టీల నాయకులు చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు ధర్మానికి అనుగుణంగా స్థానాల సర్దుబాటుపై ఈ సమావేశం నిర్వహించారు.

తూర్పు గోదావరి

స్థానిక ఎన్నికలు.. బీజేపీ ఫార్మ్‌-బి జారీ అధికారం నల్లమిల్లికి

కాకినాడ, అక్టోబర్ 18: కాకినాడ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఫార్మ్-బి జారీ చేసే అధికారాన్ని పార్టీ అధిష్ఠానం అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి అప్పగించింది. ఈ మేరకు కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ హరేంధీర ప్రసాద్‌కు ఎమ్మెల్యే ఫార్మ్-ఎ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తోందన్నారు. ఎన్నికల్లో పార్టీ శ్రేణులు ఐకమత్యంతో పనిచేయాలని, ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు స్పందించకుండా సంయమనం పాటించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి మద్దతు ఇచ్చి అత్యధిక విజయాన్ని అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

తూర్పు గోదావరి

స్థానిక ఎన్నికలపై కూటమి నేతల చర్చలు

కాకినాడ, అక్టోబరు17: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాకినాడలో కూటమి నేతలు సమావేశమై ఎన్నికలపై చర్చించారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, జనసేన నాయకులతో స్థానిక సంస్థల ఎన్నికల కాకినాడ జిల్లా బీజేపీ పరిశీలకుడు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు సమావేశమై ఎన్నికల వ్యూహాలపై చర్చించారు.

తూర్పు గోదావరి

ప్రధాని 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానంపై పుస్తకం అందజేత

పున్నమి, రాజమహేంద్రవరం, అక్టోబరు 13 (పున్నమి ప్రతినిధి): ‘సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పురస్కరించుకుని రూపొందించిన ‘ఓడరేవులు, విమానాశ్రయాలు – అద్భుతమైన నిర్మాణాలు’ పుస్తకాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి అందజేశారు. రాజమహేంద్రవరం బూరుగుపూడి విమానాశ్రయంలో విమానాశ్రయ డైరెక్టర్ టి.ఎస్.ఎన్. మూర్తి తరఫున ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ మేనేజర్ ఈ పుస్తకాన్ని ఎమ్మెల్యేకు అందించారు. దేశంలో ఓడరేవులు, విమానాశ్రయాల నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధిని వివరించే ఈ పుస్తకాన్ని సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా అందించడం జరిగింది.

తూర్పు గోదావరి

శ్రీ దుర్గాదేవిని దర్శించుకున్న ఎమ్మెల్యే నల్లమిల్లి

గాడాల, అక్టోబరు 13 (పున్నమి ప్రతినిధి): రాజానగరం నియోజకవర్గం గాడాల గ్రామంలోని శ్రీ దుర్గాదేవి ఆలయంలో భవానీల పీఠం వద్ద అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆయన వెంట టీడీపీ నాయకుడు మంగి లక్ష్మీనారాయణ, గాడాల గ్రామ కూటమి నాయకులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

పెదపూడి మండల అభివృద్ధి పనులపై కలెక్టర్‌తో ఎమ్మెల్యే సమావేశం

కాకినాడ, అక్టోబరు 13 (పున్నమి ప్రతినిధి): కాకినాడ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ హరేంధీర ప్రసాద్, ఐఏఎస్‌తో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. పెదపూడి మండలంలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్‌తో చర్చించారు. మండలంలో ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు, వాటి అమలుకు సంబంధించిన అంశాలను సమావేశంలో ప్రస్తావించారు.

తూర్పు గోదావరి

స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలి

కూటమి సమన్వయంతో 100 శాతం విజయమే లక్ష్యం: ఎమ్మెల్యే నల్లమిల్లి కాకినాడ, అక్టోబరు 13 (పున్నమి ప్రతినిధి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి కేటాయించిన స్థానాలన్నింటిలో విజయం సాధించేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు అధ్యక్షతన జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన పదాధికారులు, జిల్లా కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. బలమైన అభ్యర్థుల ఎంపిక, మూడు పార్టీల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్నలక్ష్మి, జిల్లా నాయకులు, పదాధికారులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

స్థానిక ఎన్నికలపై బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం

కాకినాడ, అక్టోబరు 13 (పున్నమి ప్రతినిధి): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాకినాడ జిల్లా బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు అధ్యక్షతన జిల్లా బీజేపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై కోర్‌ కమిటీ సభ్యులతో చర్చించారు. ఈ సమావేశంలో కాకినాడ జిల్లా బీజేపీ కోర్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

స్థానిక ఎన్నికల్లో 100 శాతం విజయమే లక్ష్యం

కూటమి సమన్వయంతో అభివృద్ధికి బాటలు వేయాలి: ఎమ్మెల్యే నల్లమిల్లి అనపర్తి, అక్టోబరు 13 (పున్నమి ప్రతినిధి): స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు నూటికి నూరు శాతం విజయం సాధించేలా సమన్వయంతో పనిచేయాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో అనపర్తిలోని ఎస్‌ఎన్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన నియోజకవర్గ కూటమి సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు పార్టీల ప్రతినిధుల అభిప్రాయాలను సేకరించి, ఎన్నికల కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. 2019–2024 మధ్య వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధిని, 2014–2019తో పాటు 2024 నుంచి కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు బేరీజు వేసుకోవాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా గ్రామాలు, నియోజకవర్గ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా అందరూ ముందుకు రావాలని వైసీపీ నాయకులకు విజ్ఞప్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి ప్రజలు 93 శాతం స్ట్రైక్‌ రేటుతో విజయాన్ని అందించారని, అదే నమ్మకంతో స్థానిక ఎన్నికల్లోనూ మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్థానిక సంస్థల్లోనూ కూటమి పాలన ఏర్పడితే అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని పేర్కొన్నారు. సమావేశంలో అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.