Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలి

కూటమి సమన్వయంతో 100 శాతం విజయమే లక్ష్యం: ఎమ్మెల్యే నల్లమిల్లి

కాకినాడ, అక్టోబరు 13 (పున్నమి ప్రతినిధి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి కేటాయించిన స్థానాలన్నింటిలో విజయం సాధించేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు అధ్యక్షతన జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన పదాధికారులు, జిల్లా కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. బలమైన అభ్యర్థుల ఎంపిక, మూడు పార్టీల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్నలక్ష్మి, జిల్లా నాయకులు, పదాధికారులు పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలి

స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలి

స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలి

స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *