గొల్లల మామిడాడ ఎంపీటీసీ కూటమి అభ్యర్థిగా రాపర్తి శ్రీనివాసు నామినేషన్
పెదపూడి, అక్టోబరు 22 (పున్నమి ప్రతినిధి): పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామ ఎంపీటీసీ స్థానం నంబర్ 5 నుంచి కూటమి అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్న రాపర్తి శ్రీనివాసు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థిగా ఆయన ఎన్నికల బరిలో నిలిచారు. నామినేషన్ కార్యక్రమంలో గొల్లల మామిడాడ గ్రామానికి చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో ఎన్నికల సందడి నెలకొంది.









