Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: NIRMAL

నిర్మల్

శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకున్న సయ్యద్ అర్జుమంద్ అలీ

నిర్మల్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం నిర్మల్ పట్టణంలోని పలు కాలనీల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సయ్యద్ అర్జుమంద్ అలీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడమే కాకుండా, ఐక్యత, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఆకుల హరీష్, కౌన్సిలర్లు నాందేడేపు చిన్ను, కత్తి నరేందర్, జింక సూరి, ధర్మాజీ శీను, షేక్ ఫిరోజ్, జిల్లా మైనార్టీ చైర్మన్ జునైద్ మెమన్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సమరసింహారెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కొంతం గణేష్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు సాయి ప్రతాప్, నరేందర్, ప్రశాంత్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

నిర్మల్‌లో ఘనంగా ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఇద్గాం చౌరస్తాలో మిస్సైల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి: అబ్దుల

నిర్మల్, పున్నమి ప్రతినిధి: భారత మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలను నిర్మల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఏపీజే అబ్దుల్ కలాం సంఘం, తెలంగాణ ముస్లిం ఏక్తా సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, యువత డాక్టర్ అబ్దుల్ కలాం జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని విద్యారంగంలో రాణించడంతోపాటు దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ, ఆయన చూపిన మార్గంలో నడవాలని సూచించారు. మిస్సైల్ విగ్రహ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలి నిర్మల్‌లోని ఇద్గాం చౌరస్తాలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్మారకంగా మిస్సైల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఏపీజే అబ్దుల్ కలాం సంఘం ప్రధాన కార్యదర్శి అబ్దుల్ జావిద్ కోరారు. గతంలో మున్సిపల్ పాలకవర్గం ఈ అంశాన్ని ఎజెండాలో చేర్చినప్పటికీ, ఇప్పటివరకు నిర్మాణ పనులు ప్రారంభం కాలేదని తెలిపారు. ప్రస్తుత మున్సిపల్ పాలకవర్గం చొరవ తీసుకొని విగ్రహ ఏర్పాటుకు అవసరమైన అనుమతులు మంజూరు చేసి, పనులను త్వరితగతిన ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీజే అబ్దుల్ కలాం సంఘం అధ్యక్షుడు అజర్ ఉద్దీన్, తెలంగాణ ముస్లిం ఏక్తా సంఘం అధ్యక్షుడు షేక్ ముజాహిద్, బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ఐటీ సెల్ జిల్లా నాయకుడు రిజ్వాన్ ఖాన్, కలాం గుణం వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి ఇంతియాజ్ అహ్మద్, అబ్దుల్ జావిద్ తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

చెరువుల్లో నీటి నిల్వలు తక్కువ.. రైతులు అప్రమత్తంగా ఉండాలిమాజీ జెడ్పీటీసీ ఓసా రాజేశ్వర్ సూచన నిర్మల్ జిల్లా: మ

మాజీ జెడ్పీటీసీ ఓసా రాజేశ్వర్ సూచన నిర్మల్ జిల్లా: మండలంలోని స్థానిక చెరువులను మాజీ జెడ్పీటీసీ ఓసా రాజేశ్వర్ పరిశీలించారు. యాసంగి సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని చెరువుల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున రైతులు నీటి లభ్యతను బట్టి పంటలు సాగు చేయాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని అవగాహన కల్పించారు. రైతులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం అందించే సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కాంగ్రెస్ నాయకులు కూచాడి శ్రీహరి రావు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కృషితో సరస్వతి కెనాల్ ద్వారా లక్ష్మణచందా, సోన్, మామడ మండలాలకు నీటి విడుదల జరిగిందని తెలిపారు. ఆయా గ్రామాల వీఏడీసీ సభ్యులు, గ్రామస్తులు సమన్వయంతో స్థానిక చెరువులను నింపుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో పశుపక్షాదులకు నీటి కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. పదవిలో లేకున్నా నిరంతరం రైతులు, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న మాజీ జెడ్పీటీసీ ఓసా రాజేశ్వర్‌ను ఈ సందర్భంగా రైతులు అభినందించారు. నిర్మల్ జిల్లా: మండలంలోని స్థానిక చెరువులను మాజీ జెడ్పీటీసీ ఓసా రాజేశ్వర్ పరిశీలించారు. యాసంగి సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని చెరువుల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున రైతులు నీటి లభ్యతను బట్టి పంటలు సాగు చేయాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని అవగాహన కల్పించారు. రైతులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం అందించే సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కాంగ్రెస్ నాయకులు కూచాడి శ్రీహరి రావు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కృషితో సరస్వతి కెనాల్ ద్వారా లక్ష్మణచందా, సోన్, మామడ మండలాలకు నీటి విడుదల జరిగిందని తెలిపారు. ఆయా గ్రామాల వీఏడీసీ సభ్యులు, గ్రామస్తులు సమన్వయంతో స్థానిక చెరువులను నింపుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో పశుపక్షాదులకు నీటి కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. పదవిలో లేకున్నా నిరంతరం రైతులు, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న మాజీ జెడ్పీటీసీ ఓసా రాజేశ్వర్‌ను ఈ సందర్భంగా రైతులు అభినందించారు.

నిర్మల్

డా. అబ్దుల్ కలాం జీవితం ఆదర్శనీయం

ఈద్గామ్ చౌరస్తాలో ఘనంగా జయంతి వేడుకలు నిర్మల్, పున్నమి ప్రతినిధి: భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డా. ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని నిర్మల్ పట్టణంలోని ఈద్గామ్ చౌరస్తాలో డా. ఏపీజే అబ్దుల్ కలాం ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు మహమ్మద్ అజహరుద్దీన్ మాట్లాడుతూ, దేశానికి నిస్వార్థ సేవలందించిన కలాం జీవితం యువతకు ఆదర్శమన్నారు. క్షిపణి, అణు సాంకేతిక రంగాల్లో దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటారని కొనియాడారు. కలాం జయంతి, వర్ధంతి వేడుకలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని, నిర్మల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈద్గామ్ చౌరస్తాలో ఆయన కాంస్య విగ్రహంతో పాటు క్షిపణి నమూనాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ, రాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చిన మహనీయుడు కలాం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ అబ్దుల్ జావీద్, షేక్ ఖలీల్, అబ్దుల్ వాజీద్, మిర్జా షోయెబ్, కరీమ్, మహమ్మద్ మిన్హాజ్, శేఖర్, మహేందర్, మహమ్మద్ షాదాబ్, ఇమ్రాన్ ఖాన్, మహమ్మద్ ఇంతియాజ్, రిజ్వాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

సత్య దుర్గామాతను కుటుంబ సమేతంగా దర్శించుకున్న GDR ట్రస్ట్ చేర్మెన్. డా. అనిల్ కుమార్,దంపతులు.

కుబీర్ మండలం,సిరిపెల్లి హెచ్:పున్నమి ప్రతినిధి : గ్రామంలో కొలువుదీరిన శ్రీ సత్య దుర్గామాత (మహా ప్రసన్న జగత్ జనని జగదీశ్వరి దేవి) అమ్మవారిని ప్రముఖ వైద్యులు, జీడీఆర్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ డా. అనిల్ కుమార్ జాదవ్, డా. దీప అనిల్ కుమార్ జాదవ్ దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలో కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు, గ్రామ ప్రముఖులు వారికి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు.ఈ కార్యక్రమంలో బాలాజీ పాటిల్ (టీచర్), ఆనంద్ రావు పాటిల్ PRO సాయినాథ్ గ్రామ సర్పంచ్ సతీష్.గారు ,గ్రామ పెద్దలు.మాతా భక్తులు తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. సత్య దుర్గామాత అమ్మవారి కృపతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో సాగిన ఈ దర్శన కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది.

నిర్మల్

అమరవేణి నర్సా గౌడ్ కుటుంబానికి చంద్రన్న పరామర్శ

పున్నమి ప్రతినిధి నిర్మల్13/10/2026: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అమరవేణి సిద్ధార్థ బహుజన్ గౌడ్ నెలమాసిక కార్యక్రమం మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్ కాలనీలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ మావోయిస్టు మాజీ కేంద్ర కమిటీ నాయకుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్నతో పాటు పలువురు ప్రజాసంఘాల నాయకులు మృతుడి తల్లిదండ్రులు, అమరవేణి నర్సా గౌడ్, నిర్మల, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ ఐక్యవేదిక రాష్ట్ర నాయకుడు గంట సత్యం, టీఏకేఎస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బంటు శ్రీనివాస్, ప్రజాసంఘాల నాయకులు పెద్ది రాజన్న, ఇంజనీర్ పోచన్న, తోట రాజు, లింగు, ఎం. నర్సయ్య, ఏ. రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

ఘనంగా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారం

రెడ్‌క్రాస్ సభ్యులను సన్మానించిన తెలంగాణ ముస్లిం ఏక్తా సంఘం నిర్మల్, అక్టోబర్ 13 (పున్నమి ప్రతినిధి): నిర్మల్ జిల్లాలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నూతన జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలిసారిగా నిర్మల్ జిల్లాలో రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరగడం విశేషం. అక్టోబర్ 13న ఉదయం 11 గంటలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో నూతన జిల్లా చైర్మన్‌గా ఎన్నికైన జి. జనార్దన్‌తో పాటు 14 మంది కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల అధికారి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొని నూతన కార్యవర్గానికి ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు, పలు సంఘాల ప్రతినిధులు రెడ్‌క్రాస్ సభ్యులను సన్మానించారు. తెలంగాణ ముస్లిం ఏక్తా సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు షేక్ ముజాహిద్, ఉపాధ్యక్షుడు సాజిద్, ప్రధాన కార్యదర్శి అల్మాస్ చేతుల మీదుగా నూతన కార్యవర్గ సభ్యులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.

నిర్మల్

వానల్పాడ్ భవానీ మాత సన్నిధిలో జై జవాన్ సేవా సమితి ప్రత్యేక పూజలు

బైంసా:వానల్పాడ్:మహిషా నగర పరిధిలోని వానల్పాడ్ గ్రామంలో వేప చెట్టుపై స్వయంభువుగా వెలసిన శ్రీ భవానీ మాత సన్నిధి భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఈ పవిత్ర సన్నిధిని మహిషా జై జవాన్ సేవా సమితి సభ్యులు గాలి రాజన్న, కాసరోల్ల ప్రవీణ్ కుమార్, చొప్పరి వెంకటేష్, బండారి దిలీప్ దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా జై జవాన్ సేవా సమితి కుటుంబ సభ్యుల క్షేమం, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాల కోసం ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక అర్చనలు చేయించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ముత్యం రెడ్డి, చందర్ పటేల్ అమ్మవారి చిత్రపటాలను సమితి సభ్యులకు అందజేశారు. జగన్మాత శ్రీ భవానీ దేవి కృపాకటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలి,అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా భక్తులు ఆకాంక్షించారు. భక్తి భావంతో సాగిన ఈ దర్శన కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపింది.

నిర్మల్

శరన్నవరాత్రి వేడుకల్లో సయ్యద్ అర్జుమంద్ అలీ

నిర్మల్: పట్టణంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సయ్యద్ అర్జుమంద్ అలీ నిర్మల్ పట్టణంలోని పలు కాలనీల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తి భావంతో మొక్కులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఆకుల హరీష్, కౌన్సిలర్లు నాందేడుపు చిన్ను, ఆకుల రామకృష్ణ, జిల్లా మైనార్టీ చైర్మన్ జునైద్ మెమెన్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కొంతం గణేష్, సాయి ప్రతాప్, నరేందర్, ప్రశాంత్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

ఐచర్ షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

పున్నమి ప్రతినిధి నిర్మల్: నిర్మల్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సమరసింహారెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన ఐచర్ షోరూం ప్రారంభోత్సవంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి, జిల్లా మైనార్టీ చైర్మన్ జునైద్ మెమెన్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సారంగాపూర్ మాజీ ఎంపీపీ మహిపాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ పతాని భూమేష్, నిర్మల్ పట్టణ అధ్యక్షుడు ఆకుల హరీష్, మైనార్టీ పట్టణ అధ్యక్షుడు మతిన్, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు, అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్షద్, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయి ప్రతాప్ నాయుడు, మొగిలి శివ, నవీద్, ఫరాన్ తదితరులు పాల్గొని షోరూం నిర్వాహకుడికి శుభాకాంక్షలు తెలిపారు.