Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: NIRMAL

నిర్మల్

ఐచర్ షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

పున్నమి ప్రతినిధి నిర్మల్: నిర్మల్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సమరసింహారెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన ఐచర్ షోరూం ప్రారంభోత్సవంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి, జిల్లా మైనార్టీ చైర్మన్ జునైద్ మెమెన్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సారంగాపూర్ మాజీ ఎంపీపీ మహిపాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ పతాని భూమేష్, నిర్మల్ పట్టణ అధ్యక్షుడు ఆకుల హరీష్, మైనార్టీ పట్టణ అధ్యక్షుడు మతిన్, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు, అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్షద్, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయి ప్రతాప్ నాయుడు, మొగిలి శివ, నవీద్, ఫరాన్ తదితరులు పాల్గొని షోరూం నిర్వాహకుడికి శుభాకాంక్షలు తెలిపారు.

నిర్మల్

నిర్మల్‌లో సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

నిర్మల్: ఆర్టీఐ అమలు దినోత్సవం సందర్భంగా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు సీహెచ్. వినోద్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు, వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం అమలు, పనితీరు, నిబంధనలపై చర్చించారు. అనంతరం కమిటీ సభ్యులకు ఆర్టీఐ చట్ట పుస్తకాలను జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ సాదిక్, జిల్లా జనరల్ సెక్రటరీ మొహమ్మద్ ముసెబ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొహమ్మద్ ముసెబ్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సమాచార హక్కు చట్టంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంతో పాటు ప్రజలకు ప్రభుత్వ సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావడంలో ఆర్టీఐ చట్టం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రజలు తమ హక్కులను తెలుసుకుని చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

నిర్మల్

ఆర్టీఐ చట్టంపై ప్రజల్లో అవగాహన పెంచాలి: సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షులు సీ.హెచ్. వినోద్

*ఆర్టీఐ చట్టంపై ప్రజల్లో అవగాహన పెంచాలి: సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షులు సీ.హెచ్. వినోద్* నిర్మల్: అక్టోబర్ 12 ఆర్టీఐ అమలు దినోత్సవం సందర్భంగా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ సభ్యులు *నిర్మల్ సబ్‌రిజిస్ట్రార్ మట్టా రవి కిరణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆర్టీఐ చట్టం పుస్తకాన్ని అందజేశారు.* ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సీహెచ్ వినోద్ చట్టం అమలుతీరు, ప్రజలకు సమాచారం అందుతున్న విధానంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యాలయ వేళల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత సమాచారాన్ని పొందవచ్చని సబ్‌రిజిస్ట్రార్ తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ సాధిక్‌తో పాటు కార్యాలయ సిబ్బంది స్వామి, మల్లికార్జున్ , నవీన్. కిషన్ పాల్గొన్నారు.

నిర్మల్

ఢిల్లీ నిరసన ర్యాలీకి బయలుదేరిన కూచాడి శ్రీహరి రావు

రేపు నిర్వహించనున్న నిరసన ర్యాలీతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు ఢిల్లీకి బయలుదేరారు. ఆయనతో పాటు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి సునీల్ రెడ్డి కూడా ఢిల్లీకి పయనమయ్యారు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమాల్లో వారు పాల్గొననున్నారు.

నిర్మల్

చిత్ర అవధానంలో ప్రతిభ.. పీసర శ్రీనివాస్ గౌడ్‌కు “పుష్కర మిత్ర” పురస్కారం

పున్నమి ప్రతినిధి: బైంసా.గోదావరి నదికి 2027 జూన్ 27న రానున్న పుష్కరాలను పురస్కరించుకొని శ్రీ హంసవాహిని సాహిత్య కళాపీఠం ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో వాట్సప్ వేదికగా నిర్వహించిన అష్టావధాన కార్యక్రమంలో చిత్ర అవధానం ప్రక్రియలో ప్రతిభ కనబరిచిన పీసర శ్రీనివాస్ గౌడ్‌కు “పుష్కర మిత్ర” పురస్కారం లభించింది. చిత్ర అవధానం ప్రక్రియలో పాల్గొని చక్కని పద్యాన్ని రచించినందుకు ఆయనను అభినందిస్తూ శ్రీ హంసవాహిని సాహిత్య కళాపీఠం జాతీయ అధ్యక్షులు జాధవ్ పుండలిక్ రావు పాటిల్, అధ్యక్షులు జాగిరి యాదగిరి, సంచాలకులు బొందిడి పురుషోత్తమరావు పురస్కారాన్ని బహుకరించారు.ఈ సందర్భంగా ప్రముఖ కవులు, కవయిత్రులు తనూజ వెంకట్, కుంభోజు వేంకట రమణాచార్య, కత్తూరి శివప్రసాద్, అంజనీ గాయత్రీ దేశరాజు, యర్రంశెట్టి శిరీష పద్మ, సమ్మెట వెంకటేశ్వర్లు, డా. తూము నర్సయ్య, భీమ గంగయ్య, డా. మంగళంపల్లి లక్ష్మీనరసింహం, దొమ్మాట శ్రీకాంత్ గౌడ్, పోటు హైమావతి, తాళ్లూరు విజయ్ లక్ష్మణ్, కోలకాని శివలక్ష్మి, అడబాల ఫణీంద్ర సత్య చక్రపాణి, కనికరపు స్వామి, పల్లె తేజలక్ష్మి, పడిగెల దేవిదాస్ తదితరులు పీసర శ్రీనివాస్ గౌడ్‌ను అభినందించారు.అలాగే డా. బొక్కా శ్రీనివాసరావు గౌడ్, డా. గుగులోత్ అంజనిబాయి, ఎం. పెంటయ్య, మైలవరపు చారులత, సుబ్బూరి కొండల్, మేకల లింగమూర్తి, అనితారాణి కాంచనపల్లి, కందకుర్తి దేవిప్రియ, పుట్రేవు శ్రీనివాసరావు, షేక్ ధాదా ఫీరా, చెంచటి హరిప్రసాద్ సాగర్, వెలిదె ప్రసాదశర్మ, పి. ఉమాపతి, కనుమ ఎల్లారెడ్డి, డా. నూతక్కి పూర్ణ ప్రజ్ఞాచారి తదితరులు అభినందనలు తెలిపారు.

నిర్మల్

బోరుబావుల ఓవర్‌ఫ్లోకు చెక్‌.. విద్యుత్, నీటి వృథాకు అడ్డుకట్ట ఆటోమేటిక్ పంప్ కంట్రోలర్ల ఏర్పాటుకు గ్రామ పంచాయ

పున్నమి ప్రతినిధి, బైంసా: హంపొలి. ఎల్‌నినో ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో బోరుబావుల నుంచి నీరు ఓవర్‌ఫ్లో అవుతూ నీటితో పాటు విద్యుత్‌ వృథా అవుతున్న సమస్యకు చెక్‌ పెట్టేందుకు గ్రామ పంచాయతీ పాలకవర్గం సాంకేతిక పరిష్కారానికి శ్రీకారం చుట్టింది. బోరుబావుల మోటార్ల స్టార్టర్లకు ఆటోమేటిక్ పంప్ కంట్రోలర్లు, కట్‌ఆఫ్ స్విచ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ పరికరాల ద్వారా నీటి మట్టం లేదా అవసరమైన స్థాయి చేరుకున్న వెంటనే మోటార్లు ఆటోమేటిక్‌గా ఆగిపోతాయి. దీంతో అనవసరంగా మోటార్లు నడవకుండా విద్యుత్‌ ఆదా కావడంతో పాటు భూగర్భ జలాలు వృథా కాకుండా సంరక్షించవచ్చు. అలాగే మోటార్లు ఎక్కువసేపు పనిచేయడం, ఓవర్‌హీటింగ్‌, వోల్టేజ్‌ సమస్యల కారణంగా పాడయ్యే ప్రమాదం తగ్గి వాటి జీవితకాలం పెరుగుతుంది. సర్పంచ్ బండారి పోసాని బాయి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం తీసుకున్న ఈ సాంకేతిక ముందడుగు నీటి సంరక్షణ, విద్యుత్‌ పొదుపులో కీలకంగా నిలవడమే కాకుండా ఇతర గ్రామ పంచాయతీలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు.

నిర్మల్

జిల్లా సాధన ఉద్యమకారులు, కవులకు ఘన సన్మానం

నిర్మల్, పున్నమి ప్రతినిధి: నిర్మల్ జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా సాధన కోసం కృషి చేసిన ఉద్యమకారులు, కవులకు కృతజ్ఞతలు తెలుపుతూ నిర్మల్‌లో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సాధనలో వారి సేవలను కొనియాడుతూ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు విలాస్ గాదేవార్, నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి కె. రామ్ కిషన్ రెడ్డి, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు మార్గొండ రాము, కె. సుశీల్ కుమార్ రావు, అక్రమాలి, శ్రీకాంత్ యాదవ్, సాయికుమార్ రావు, జుబేర్, cm మహబూబ్, మసూద్, నయీమ్, సుధన్, అజిజ్.శంకర్ యాదవ్, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

నిర్మల్ జిల్లా సాధనకర్త అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి శుభాకాంక్షలు

నిర్మల్ జిల్లా ఏర్పాటుకు కృషి చేసి పదేళ్లు పూర్తయిన సందర్భంగా అభినందనలు తెలిపిన నాయకులు నిర్మల్, అక్టోబర్ 10 (పున్నమి ప్రతినిధి): నిర్మల్ జిల్లాను సాధించడంలో కీలక పాత్ర పోషించి, జిల్లా ఏర్పాటుకు విశేష కృషి చేసిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి జిల్లా ఏర్పాటు జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. నిర్మల్ జిల్లా అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా నాయకులు గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి ముడుసు సత్యనారాయణ, పీఏసీఎస్ చైర్మన్లు నారాయణ రెడ్డి, రమణ రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు మేడారం ప్రదీప్, మండల అధ్యక్షులు మాధవ్ రావు, మల్లిష్, మాజీ ఆలయ చైర్మన్ ఆమెడా శ్రీధర్, పీఏ నలం శ్రీనివాస్, మాజీ ఎంపీపీ మహిపాల్ రెడ్డి, బీసీ జిల్లా అధ్యక్షుడు అనుముల భాస్కర్, మాజీ సర్పంచులు పోశెట్టి, రమేష్ రెడ్డి, గంగాధర్, నిర్మల్ పట్టణానికి చెందిన రమేష్, శ్రీనివాస్ టేలర్, మాజీ కౌన్సిలర్ సలీమ్, జఫర్, జుఫీర్ తదితరులు పాల్గొని అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

నిర్మల్

ఎస్ఐఆర్ ప్రక్రియకు వ్యతిరేకంగా ఇండియా కూటమి నిరసన ర్యాలీ

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ర్యాలీ నిర్మల్, అక్టోబర్ 10 (పున్నమి ప్రతినిధి – అబ్దుల్ సాదిక్): ఎస్ఐఆర్‌ (SIR) ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్మల్‌ జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడి పిలుపు మేరకు డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ నాయకత్వంలో, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరి రావు సమక్షంలో ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ చౌక్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Uploaded Video:

నిర్మల్

నిర్మల్ జిల్లా దశాబ్ది వేడుకలు.. ఉద్యమకారులకు అభినందనలు

పున్నమి ప్రతినిధి నిర్మల్, అక్టోబర్ 10: నిర్మల్ జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా ఏర్పాటుకు కృషి చేసిన ఉద్యమకారులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నిర్వహించిన అభినందన సభలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, ఉద్యమకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, ఉద్యమకారులు విలాస్ గాదేవార్, నిర్మల్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు మార్గొండ రాము, బీఆర్‌ఎస్ మాజీ రాష్ట్ర యువజన కార్యదర్శి కె. సుశీల్ కుమార్ రావు, మాజీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి అక్రమాలి, బీఆర్‌ఎస్ కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్, బీఆర్‌ఎస్వీ రాష్ట్ర విద్యార్థి విభాగం నాయకుడు సాయికుమార్ రావు పాల్గొన్నారు. అలాగే బీఆర్‌ఎస్ మైనార్టీ జిల్లా యువజన నాయకుడు జుబేర్, మైనార్టీ నాయకుడు ఎండీ మహబూబ్, బీఆర్‌ఎస్ టౌన్ సెక్రటరీ మసూద్, నయీమ్, నర్సాపూర్ మండల అధ్యక్షుడు సుధన్, టౌన్ బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు శంకర్ యాదవ్, రామకృష్ణ, టౌన్ మైనార్టీ నాయకుడు అజీజ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఏర్పాటు కోసం కృషి చేసిన ఉద్యమకారుల సేవలను గుర్తుచేసుకుంటూ, నిర్మల్ జిల్లా అభివృద్ధికి వారు చేసిన కృషిని నాయకులు అభినందించారు.