వార్త ముఖ్యాంశాలు
- ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ రూరల్ మండలం కచ్ కంటి గ్రామంలో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 సొసైటీ ఆధ్వర్యంలో ఆర్టిఐ అమలు దినోత్సవం సందర్భంగా సమాచార హక్కు చట్టం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
- ఈ సందర్భంగా ఆర్టీఐ ఆక్టివిస్టు, సమాచార హక్కు రక్షణ చట్టం 2005 సొసైటీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కొండగుర్ల కమలాకర్ మాట్లాడుతూ దేశంలో ఆర్టిఐ చట్టం అమలులోకి వచ్చి 21 సంవత్సరాలు అవుతుందన్నారు.
- సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలన్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ రూరల్ మండలం కచ్ కంటి గ్రామంలో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 సొసైటీ ఆధ్వర్యంలో ఆర్టిఐ అమలు దినోత్సవం సందర్భంగా సమాచార హక్కు చట్టం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీఐ ఆక్టివిస్టు, సమాచార హక్కు రక్షణ చట్టం 2005 సొసైటీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కొండగుర్ల కమలాకర్ మాట్లాడుతూ దేశంలో ఆర్టిఐ చట్టం అమలులోకి వచ్చి 21 సంవత్సరాలు అవుతుందన్నారు. సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలన్నారు. సమాచారం పొందడం ప్రతి ఒక్కరి రాజ్యాంగబద్ధమైన హక్కు అని అన్నారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వ చట్టాల పైన, పథకాల పైన, రాజ్యాంగం పైన కనీస అవగాహన పెంపొందించుకోవాలన్నారు. సమాచార హక్కు చట్టం ప్రాముఖ్యత, దరఖాస్తు విధానం గురించి తెలియజేశారు. సమాచార హక్కు చట్టం సెక్షన్ (3) ప్రకారం దేశ పౌరులందరూ సమాచారం పొందే హక్కు కలదని, సెక్షన్ 6 (1) ప్రకారం సమాచారం కొరకు దరఖాస్తు చేసుకోవచ్చని, సెక్షన్ 4(4) ప్రకారం సమాచారాన్ని తెలుగులో పొందవచ్చు అని, సెక్షన్ 4(1) బి ప్రకారం స్వచ్ఛందంగా సమాచారం పొందవచ్చని, సెక్షన్ 19(1) ప్రకారం మొదటి అప్పీల్, 19(3) ప్రకారం రెండవ అప్పీల్ చేసి, చట్ట ప్రకారం నిర్ణీత సమయంలో సమాచారం పొందవచ్చని అన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారానే ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, జవాబుదారితనం సాధ్యమవుతుందన్నారు. సమాచార హక్కు చట్టం ముఖ్యమైన సెక్షన్స్, రోడ్ సేఫ్టీ, మాదక ద్రవ్యాల నివారణ, సైబర్ మోసాల నివారణ, అడవుల సంరక్షణ, ప్లాస్టిక్ నివారణ కు సంబంధించిన అవగాహన కర పత్రాలను గ్రామస్తులతో కలిసి విడుదల చేశారు. సమాచార హక్కు రక్షణ చట్టం సొసైటీ ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రభుత్వ అధికారులతో కలిసి ఆర్టిఐ చట్టం అమలుకు నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 ఆదిలాబాద్ రూరల్ మండల అధ్యక్షులు బండి భూమన్న, ఫీల్డ్ అసిస్టెంట్ సోమన్న, శ్రీనివాస్, దత్తు, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.