చెరువుల్లో నీటి నిల్వలు తక్కువ.. రైతులు అప్రమత్తంగా ఉండాలిమాజీ జెడ్పీటీసీ ఓసా రాజేశ్వర్ సూచన నిర్మల్ జిల్లా: మ
మాజీ జెడ్పీటీసీ ఓసా రాజేశ్వర్ సూచన నిర్మల్ జిల్లా: మండలంలోని స్థానిక చెరువులను మాజీ జెడ్పీటీసీ ఓసా రాజేశ్వర్ పరిశీలించారు. యాసంగి సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని చెరువుల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున రైతులు నీటి లభ్యతను బట్టి పంటలు సాగు చేయాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని అవగాహన కల్పించారు. రైతులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం అందించే సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కాంగ్రెస్ నాయకులు కూచాడి శ్రీహరి రావు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కృషితో సరస్వతి కెనాల్ ద్వారా లక్ష్మణచందా, సోన్, మామడ మండలాలకు నీటి విడుదల జరిగిందని తెలిపారు. ఆయా గ్రామాల వీఏడీసీ సభ్యులు, గ్రామస్తులు సమన్వయంతో స్థానిక చెరువులను నింపుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో పశుపక్షాదులకు నీటి కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. పదవిలో లేకున్నా నిరంతరం రైతులు, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న మాజీ జెడ్పీటీసీ ఓసా రాజేశ్వర్‌ను ఈ సందర్భంగా రైతులు అభినందించారు. నిర్మల్ జిల్లా: మండలంలోని స్థానిక చెరువులను మాజీ జెడ్పీటీసీ ఓసా రాజేశ్వర్ పరిశీలించారు. యాసంగి సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని చెరువుల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున రైతులు నీటి లభ్యతను బట్టి పంటలు సాగు చేయాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని అవగాహన కల్పించారు. రైతులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం అందించే సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కాంగ్రెస్ నాయకులు కూచాడి శ్రీహరి రావు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కృషితో సరస్వతి కెనాల్ ద్వారా లక్ష్మణచందా, సోన్, మామడ మండలాలకు నీటి విడుదల జరిగిందని తెలిపారు. ఆయా గ్రామాల వీఏడీసీ సభ్యులు, గ్రామస్తులు సమన్వయంతో స్థానిక చెరువులను నింపుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో పశుపక్షాదులకు నీటి కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. పదవిలో లేకున్నా నిరంతరం రైతులు, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న మాజీ జెడ్పీటీసీ ఓసా రాజేశ్వర్‌ను ఈ సందర్భంగా రైతులు అభినందించారు.









