Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: #Manthani #Peddapalli #bjp

పెద్దపల్లి

బీజేపీ ఆధ్వర్యంలో మహనీయుల జయంతి వేడుకలు

మంథని, అక్టోబర్ 02: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో భారతదేశ రెండో ప్రధానమంత్రి, “జై జవాన్ జై కిసాన్” నినాదకర్త, లాల్ బహదూర్ శాస్త్రి, అలాగే జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు లాల్ బహదూర్ శాస్ర్తి చిత్రపటానికి, అలాగే స్థానిక గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ… 1965 ఇండో-పాకిస్తాన్ యుద్ధ సమయంలో దేశాన్ని సమర్థవంతంగా నడిపించి, సైనికుల్లో, రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపిన మహనీయుడు లాల్ బహదూర్ శాస్త్రి అని కొనియాడారు. ప్రతి భారతీయుడు సింహంలా ధైర్యసాహసాలతో ముందడుగు వేయాలని, దేశ దురాక్రమణకు పాల్పడే శత్రువులకు సింహస్వప్నంగా నిలవాలని పిలుపునిచ్చారు. మంథని ప్రజలంతా లాల్ బహదూర్ శాస్త్రి ధైర్యసాహసాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.అనంతరం, అహింసా మార్గంలో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించేలా ప్రజలను నడిపించిన మహనీయుడు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ సేవలను స్మరించుకున్నారు. గాంధీజీ చూపిన శాంతి, సత్యం, అహింసా మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సబ్బాని సంతోష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండపాక సత్య ప్రకాష్, జిల్లా కౌన్సిల్ మెంబర్ బోగోజు శ్రీనివాస్, అసెంబ్లీ కో-కన్వీనర్ నాంపల్లి రమేష్, బీజేపీ సీనియర్ నాయకులు రాపర్తి సంతోష్, పట్టణ ఉపాధ్యక్షులు బొల్లంపల్లి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి పార్వతి విష్ణు, పట్టణ కోశాధికారి వొడ్నాల శ్రీనివాస్, నాయకుడు శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు.

పెద్దపల్లి

ప్రకృతి ప్రేమికుడు గట్టు కృష్ణమూర్తికి బీజేపీ ఘన సన్మానం

‘సేవా సంకల్ప అభియాన్’లో భాగంగా సత్కరించిన బీజేపీ మంథని, సెప్టెంబరు 30: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల రోజులుగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప అభియాన్’ కార్యక్రమంలో భాగంగా, మంథని పట్టణ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ప్రముఖ పర్యావరణ వేత్త, సామాజిక కార్యకర్త గట్టు కృష్ణమూర్తిని బీజేపీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తన సొంత ఖర్చులతో పట్టణంలో విస్తృతంగా మొక్కలు నాటుతూ, ప్రమాదకరంగా మారిన రోడ్డు గుంతలను పూడుస్తూ ప్రజా సంక్షేమానికి కృష్ణమూర్తి కృషి చేస్తున్నారన్నారు. అంతేకాకుండా, పాఠశాల విద్యార్థుల్లో పర్యావరణ ఆవశ్యకతపై చైతన్యం తెస్తూ, ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ తన జీవితాన్ని సమాజ సేవకే అంకితం చేసిన ఆయన సేవలను నాయకులు కొనియాడారు.సన్మానం అనంతరం కృష్ణమూర్తి మాట్లాడుతూ ఈ భూమిపై ప్రతి జీవి మనుగడకు ప్రకృతి సహకారం ఎంతో అత్యవసరం అన్నారు. మానవ విచక్షణారాహిత్యం వల్ల ప్రకృతి నాశనమైతే అది మానవాళి జీవనానికే ముప్పుగా మారుతుందని తెలిపారు. గ్లోబల్ వార్మింగ్, ‘ఎల్ నినో’ వంటి వాతావరణ మార్పులు, భవిష్యత్తు వైపరీత్యాలను తట్టుకోవాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవడం తప్ప వేరే మార్గం లేదన్నారు. మంథని ప్రజలందరూ నడుం బిగించి ప్రకృతి పరిరక్షణను ఒక యజ్ఞంలా నిర్వహించాలని పిలుపునిచ్చారు.పట్టణ అధ్యక్షుడు సబ్బని సంతోష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ బోగోజు శ్రీనివాస్, సీనియర్ నాయకులు రాపర్తి సంతోష్, నారమల్ల కృష్ణ, బూడిద తిరుపతి, పట్టణ ప్రధాన కార్యదర్శి సామల అశోక్, పట్టణ ఉపాధ్యక్షులు బొల్లంపల్లి లక్ష్మణ్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు గుడ్ల గురువేష్, పట్టణ కోశాధికారి వొడ్నాల శ్రీనివాస్, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పెద్దపల్లి

బురద జల్లే దిగజారుడు రాజకీయాలు సహించేది లేదు

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రుపట్ల సునీల్‌రెడ్డి మంథని అభివృద్ధిని కాంక్షించే రాజకీయ పార్టీలలో భారతీయ జనతా పార్టీ ముందుంటుందని, అభివృద్ధి పనులకు పార్టీ ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రుపట్ల సునీల్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం మంథనిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా గ్రామపంచాయతీలతో పాటు మంథని పురపాలక సంఘానికి అందుతున్న కోట్లాది రూపాయల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు బీజేపీ సంపూర్ణంగా మద్దతు ఇస్తోందని తెలిపారు. మంథని అభివృద్ధికి ఆటంకం కలిగించే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. మంథని మున్సిపల్‌ మార్కెట్‌ భవన నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యానికి తమ కుటుంబమే కారణమంటూ కొందరు పనిగట్టుకుని విషప్రచారం చేస్తున్నారని సునీల్‌ రెడ్డి ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం అసత్య ప్రచారాలకు పాల్పడటం సరికాదని, ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు స్వస్తి పలకాలని హెచ్చరించారు. దివంగత నేత, తన తండ్రి చంద్రుపట్ల రామ్‌ రెడ్డి హయాంలోనే మంథని మార్కెట్‌కు పునాదులు పడ్డాయని సునీల్‌ రెడ్డి గుర్తు చేశారు. అప్పటి నుంచి మార్కెట్‌ అభివృద్ధికి సంబంధించి తమవంతుగా సలహాలు, సూచనలు అందిస్తూ వస్తున్నామని తెలిపారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మార్కెట్‌ భవనాన్ని అన్ని సౌకర్యాలతో నిర్మించాల్సిన అవసరం ఉందని, అనాలోచితంగా తొందరపడి నిర్మాణం చేపట్టకూడదని మున్సిపల్‌ అధికారులకు, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తమ పార్టీ తరఫున పలుమార్లు సూచించినట్లు వెల్లడించారు. రాజకీయాల్లో వ్యక్తిత్వమే ప్రధానమని సునీల్‌ రెడ్డి అన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు నాయకులు ఎదుటి వారిపై అసత్య ప్రచారాలు చేస్తూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. బురదజల్లే రాజకీయాలు, తిట్ల దండకాలు మానుకోవాలని సూచించారు. మంథని అభివృద్ధి చెందకూడదనే ఉద్దేశంతో కేవలం అసూయ, ద్వేషంతో రాజకీయాలు చేయాలని చూసే వారికి ప్రజలు తగిన సమాధానం చెబుతారని అన్నారు. ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై నిర్మాణాత్మక రాజకీయాలు చేయాలని సూచించారు. తమ కుటుంబానికి ప్రజాసేవలో ఘనమైన చరిత్ర ఉందని సునీల్‌ రెడ్డి పేర్కొన్నారు. గత 15 సంవత్సరాలుగా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ సేవాభావంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమాలను అసత్య ప్రచారాలతో దెబ్బతీయాలని ప్రయత్నించడం సరికాదన్నారు. ఈ సమావేశంలో బీజేపీ మంథని పట్టణ అధ్యక్షుడు సబ్బాని సంతోష్, మాజీ పట్టణ అధ్యక్షుడు బూడిద తిరుపతి, నియోజకవర్గ సోషల్‌ మీడియా ఇన్‌చార్జి వొజ్జల మురళీకృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శి సామల అశోక్, ఎడ్ల సాగర్, ఉపాధ్యక్షులు బొల్లంపల్లి లక్ష్మణ్, ఆంటి మల్లేష్, కార్యదర్శి పార్వతి విష్ణు, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గుడ్ల గురవేష్, మండల ఉపాధ్యక్షుడు ఎల్లవేణి సమ్మయ్య, నాయకులు చందు, సాయి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.