Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Government activity

ఖమ్మం

ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి లో అత్యధిక వర్షపాతం నమోదు

జిల్లాలో మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకు పలు మండలాల్లో వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 97.4 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, జిల్లా సగటు వర్షపాతం 4.6 మి.మీ.గా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మండలాల వారీగా పరిశీలిస్తే సత్తుపల్లి మండలంలో అత్యధికంగా 20.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. అనంతరం వేంసూరు 15.2, ఎర్రుపాలెం 10.4, కల్లూరు 7.6, పెనుబల్లి 5.2, కొణిజర్ల 4.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. తిరుమలాయపాలెం, వైరా, తల్లాడ మండలాల్లో 4.2 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. ఇక జిల్లాలో అత్యల్పంగా కూసుమంచి మండలంలో 0.6 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసినట్లు తెలిపారు.

ఖమ్మం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఓటర్ల జాబితా ప్రక్రియ షురూ

ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఓటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నెల 28న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సమాచారం. నవంబర్ 6లోగా అర్హులైన పట్టభద్రులు ఫారం–18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలి. నవంబర్ 20న ముసాయిదా ఓటర్ల జాబితాను, డిసెంబర్ 30న తుది జాబితాను విడుదల చేయనున్నారు. గతంలో ఓటరుగా నమోదైన పట్టభద్రులు సైతం కొత్తగా ఫారం–18 సమర్పించాల్సి ఉంటుంది. 2024లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 3,36,013 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అర్హులైన పట్టభద్రులు గడువులోగా నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఖమ్మం

దంసలాపురం చెరువులో గణపతి నిమజ్జనాలకు ఏర్పాట్లు ముమ్మరం

ఖమ్మం నగరంలోని కాలవడ్డు, ప్రకాష్‌నగర్‌ వద్ద మున్నేరు వాగులో ప్రతి ఏటా నిర్వహించే గణపతి నిమజ్జనాలకు ఈసారి వర్షాభావ పరిస్థితులు ఆటంకంగా మారాయి. మున్నేరులో నీరు లేకపోవడంతో ప్రభుత్వం దంసలాపురం చెరువులో గణపతి విగ్రహాల నిమజ్జనాలకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అధికారులు పనులను ముమ్మరం చేశారు. చెరువు వరకు ప్రత్యేక రహదారి నిర్మాణంతో పాటు భారీ విగ్రహాలను క్రేన్ల సహాయంతో సులభంగా నీటిలోకి దింపేందుకు ప్రత్యేక ఘాట్లను ఏర్పాటు చేస్తున్నారు. నిమజ్జనానికి వచ్చే వాహనాలు, భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లను వేగవంతం చేశారు.

ఖమ్మం

రేపు జాతీయ లోక్ అదాలత్

ప్రజలు తమ వివాదాలను సత్వరంగా, రాజీ మార్గంలో పరిష్కరించుకునేందుకు రేపు (సెప్టెంబర్ 12) జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ లోక్ అదాలత్‌లో కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న రాజీ చేయదగిన కేసులతో పాటు ప్రీ-లిటిగేషన్ కేసులను కూడా పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. ఇరుపక్షాల అంగీకారంతో కేసులను పరిష్కరించుకోవడం ద్వారా సమయం, ఖర్చు ఆదా అవుతుందని న్యాయ సేవా సంస్థలు సూచిస్తున్నాయి. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

ఖమ్మం

బ్యాంకులకు వరుసగా నాలుగు రోజుల మూత

బ్యాంకు ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నారు. దీంతో నేడు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. అనంతరం రేపు రెండో శనివారం, ఆదివారం సాధారణ సెలవులు కాగా, సోమవారం వినాయక చవితి సందర్భంగా బ్యాంకులకు సెలవు ప్రకటించారు. దీంతో నేటి నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఖాతాదారులు నగదు లావాదేవీలు, చెక్కులు, ఇతర బ్యాంకింగ్ పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర లావాదేవీలకు డిజిటల్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవచ్చు.

ఖమ్మం

పాలేరు జలాశయంలో వినాయక నిమజ్జనానికి అనుమతి లేదు

పాలేరు /ఖమ్మం పాలేరు జలాశయాన్ని తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నందున నీరు కలుషితం కాకుండా వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదని ఇరిగేషన్ డీఈఈ చిట్టిబాబు తెలిపారు. జలాశయంలో విగ్రహాల నిమజ్జనం వల్ల తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉందన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రజలు అధికారుల సూచనలను పాటించి జలాశయ నీటి స్వచ్ఛతను కాపాడేందుకు సహకరించాలని చిట్టిబాబు కోరారు.

ఖమ్మం

28 పీఎం శ్రీ పాఠశాలలకు 167 రకాల ఆటవస్తువులు రూ.14 లక్షలతో సరఫరాకు టెండర్లు.. స్థానిక అభ్యర్థులకే అవకాశం

ఖమ్మం జిల్లాలోని 28 పీఎం శ్రీ పాఠశాలలకు 167 రకాల ఆటవస్తువులు సరఫరా చేసేందుకు టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.14 లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు. జిల్లా అభ్యర్థులు మాత్రమే టెండర్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. టెండర్ రుసుము రూ.4,000, డిపాజిట్ రూ.50,000గా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు సాయంత్రం 5 గంటలలోపు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. టెండర్లను ఈ నెల 19న ఉదయం 11 గంటలకు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో తెరవనున్నట్లు అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు

ఖమ్మం

హైదరాబాద్ నుంచి భద్రాద్రి వరకు.. టూరిజం ప్యాకేజీకి కసరత్తు!

హైదరాబాద్ నుంచి ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను కలుపుతూ ప్రత్యేక టూరిజం ప్యాకేజీ రూపకల్పనకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఫారెస్ట్, ఐటీడీఏ, టూరిజం శాఖల ఆధ్వర్యంలో రూపొందిస్తున్న ఈ ప్యాకేజీలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రూ.39 కోట్ల ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. వెలుగుమట్ల, ఖిల్లా పులిగుండాల, కిన్నెరసాని, భద్రాచలం, బోగత జలపాతం, లక్నవరం, రామప్ప తదితర పర్యాటక ప్రాంతాలను అనుసంధానం చేయనున్నారు. పర్యాటకుల సౌకర్యార్థం ఒక రోజు నుంచి ఐదు రోజుల వరకు విభిన్న ప్యాకేజీలను రూపొందించినట్లు సమాచారం. అటవీ అందాలు, జలపాతాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, చారిత్రక ప్రదేశాలను ఒకే టూర్‌లో చూసే అవకాశం కల్పించడమే లక్ష్యంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఖమ్మం

Share Your Problems, Stay Away from Suicide. DMHO Ramarao

On the occasion of World Suicide Prevention Day, Khammam District DMHO Dr. Ramarao urged people not to resort to suicide and to share their problems with family members. He expressed concern over people taking extreme steps even for minor reasons. He advised parents to reduce academic pressure on children and communicate with them every day in a friendly manner. Those experiencing mental stress should seek help without hesitation, he said. Counselling services are available at Khammam GGH for those facing mental health issues. He urged everyone to support each other and work together to prevent suicides

ఖమ్మం

సమస్యలను పంచుకోండి.. ఆత్మహత్యలకు దూరంగా ఉండండి. DMHO రామారావ్.

ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం అయినా సెప్టెంబర్ 9 ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడకుండా సమస్యలను కుటుంబ సభ్యులతో పంచుకోవాలని ఖమ్మం జిల్లా DMHO రామారావు సూచించారు. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడటం ఆందోళనకరమన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై మార్కుల ఒత్తిడిని తగ్గించి, ప్రతిరోజూ వారితో స్నేహపూర్వకంగా మాట్లాడాలని కోరారు. మానసిక ఒత్తిడికి గురైన వారు సమస్యలను దాచుకోకుండా సహాయం తీసుకోవాలని సూచించారు. ఖమ్మం GGHలో మానసిక ఆరోగ్య కౌన్సెలింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కుటుంబ సభ్యులు పరస్పరం అండగా నిలిచి, ఆత్మహత్యల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.