Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి లో అత్యధిక వర్షపాతం నమోదు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి లో అత్యధిక వర్షపాతం నమోదు
Oplus_16908288

జిల్లాలో మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకు పలు మండలాల్లో వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 97.4 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, జిల్లా సగటు వర్షపాతం 4.6 మి.మీ.గా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

మండలాల వారీగా పరిశీలిస్తే సత్తుపల్లి మండలంలో అత్యధికంగా 20.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. అనంతరం వేంసూరు 15.2, ఎర్రుపాలెం 10.4, కల్లూరు 7.6, పెనుబల్లి 5.2, కొణిజర్ల 4.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. తిరుమలాయపాలెం, వైరా, తల్లాడ మండలాల్లో 4.2 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.

ఇక జిల్లాలో అత్యల్పంగా కూసుమంచి మండలంలో 0.6 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసినట్లు తెలిపారు.

ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి లో అత్యధిక వర్షపాతం నమోదు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *