Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మేడ్చల్ – మల్కాజిగిరి

మేడ్చల్ జిల్లా: కీసర పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు, విద్యార్థి దుర్మరణం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మేడ్చల్ జిల్లా: కీసర పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు, విద్యార్థి దుర్మరణం

వార్త ముఖ్యాంశాలు

  • మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
  • వ్యాయామం కోసం జిమ్‌కు వెళ్తున్న ఓ యువ విద్యార్థిని వేగంగా వచ్చిన లారీ రూపంలో మృత్యువు కబలించింది.
  • లారీ చక్రాలు తల పైనుంచి వెళ్లడంతో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వ్యాయామం కోసం జిమ్‌కు వెళ్తున్న ఓ యువ విద్యార్థిని వేగంగా వచ్చిన లారీ రూపంలో మృత్యువు కబలించింది. లారీ చక్రాలు తల పైనుంచి వెళ్లడంతో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
​స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వాయుశక్తి నగర్ ప్రాంతంలో నివసించే చంద్రశేఖర్ కుమారుడు బెన్నురు అఖిల్ (20) విద్యార్థిగా చదువుకుంటున్నాడు. రోజూ మాదిరిగానే ఉదయం తన హోండా యాక్టివా వాహనంపై అఖిల్ వర్కౌట్ల కోసం ఆర్జన్ ఫిట్‌నెస్ జిమ్‌కు బయలుదేరాడు.
​మార్గమధ్యంలో కీసర రూట్‌లో ఉన్న రాంపల్లి ఎక్స్ రోడ్ వద్ద, అనిల్ ఫుట్‌వీర్ సమీపంలో అరటిపండ్లు కొనుగోలు చేయడానికి అఖిల్ తన వాహనాన్ని రోడ్డు పక్కన ఆపాడు. అదే సమయంలో ఇండియన్ గ్యాస్ ఆయిల్‌ను తరలిస్తున్న ఒక లారీ డ్రైవర్ అత్యంత నిర్లక్ష్యంగా, వేగంగా నడుపుకుంటూ వచ్చి అఖిల్ ఆపిన యాక్టివాను వెనుక నుంచి ఢీకొట్టాడు.
​ఈ ప్రమాదంలో అఖిల్ రోడ్డుపై పడిపోగా, లారీ అతని తల పైనుంచి దూసుకెళ్లింది. దీనితో అతనికి తీవ్రమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే ఒక అజ్ఞాత వ్యక్తి మృతుడి ఫోన్ నుంచి అతని స్నేహితుడు విశాల్‌కు సమాచారం అందించాడు. విశాల్ ద్వారా ఈ వార్త కుటుంబ సభ్యులకు చేరడంతో, వారు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.
​లారీ డ్రైవర్ బొడ్డు నర్సింహ నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే తన కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కగానొక కుమారుడు రోడ్డు ప్రమాదంలో విగతజీవిగా మారడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
​- మేడ్చల్ జిల్లా పున్నమి రిపోర్టర్, సందీప్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *