వార్త ముఖ్యాంశాలు
- జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కారం క్వారీ వద్ద ఘోర ప్రమాదం జరిగింది.
- ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి ఆకర్షితులై, ఫోటోలు, వీడియోల కోసం క్వారీకి వెళ్లిన గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన 12 మంది విద్యార్థుల్లో ఒకరు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు.
- సంఘటన వివరాలు: మృతుడిని పవన్ సాయి (18)గా గుర్తించారు.
జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కారం క్వారీ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి ఆకర్షితులై, ఫోటోలు, వీడియోల కోసం క్వారీకి వెళ్లిన గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన 12 మంది విద్యార్థుల్లో ఒకరు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు.
సంఘటన వివరాలు:
మృతుడిని పవన్ సాయి (18)గా గుర్తించారు. స్నేహితులతో కలిసి క్వారీ వద్ద ఫోటోలు దిగుతుండగా, పవన్ సాయి ప్రమాదవశాత్తు కాలుజారి గంటల తరబడి పేరుకుపోయిన నీటిలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడని అతని స్నేహితులు తెలిపారు.
శరవేగంగా రెస్క్యూ ఆపరేషన్:
సమాచారం అందుకున్న వెంటనే జవహర్ నగర్ పోలీసులు, హైడ్రా (HYDRAA) DRF బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. రెస్క్యూ ఇన్ఛార్జ్ పి. స్వామి ఆధ్వర్యంలో సుమారు 300 మీటర్ల లోతు నుంచి బోటు సహాయంతో రంగంలోకి దిగిన బృందం, కేవలం 10 నిమిషాల్లోనే పవన్ సాయి మృతదేహాన్ని వెలికితీసింది.
ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు. సోషల్ మీడియా పిచ్చి, ప్రమాదకరమైన ప్రాంతాల్లో సెల్ఫీల వ్యామోహం నవయువకుల జీవితాలను ఎలా బలితీసుకుంటోందో అనడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం.
సందీప్, పౌర్ణమి రిపోర్టర్, మేడ్చల్ జిల్లా