ఉప్పల్ భాగ్యనగరికి జీవీ మాల్ భాగ్యం
షాపింగ్, వినోదానికి సరికొత్త చిరునామాగా జీవీ మాల్ ఉప్పల్ మహానగరానికి జీవీ మాల్ ప్రజలకు షాపింగ్, వినోదాన్ని ఒకే వేదికపై అందించేందుకు జీవీ మాల్ అందుబాటులోకి వచ్చింది. నగరంలోని వివిధ ప్రాంతాల ప్రజలకు సౌకర్యంగా ఉండేలా ఆధునిక హంగులతో మాల్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. గతంలో హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన మాల్ సంస్కృతి ప్రస్తుతం నగరంలోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోందని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రజల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా షాపింగ్‌తో పాటు కుటుంబ సమేతంగా వినోదాన్ని ఆస్వాదించేలా జీవీ మాల్‌ను తీర్చిదిద్దినట్లు తెలిపారు.మాల్‌లో ప్రముఖ బ్రాండ్లకు చెందిన ఫ్యాషన్, ఫుడ్, ఎంటర్‌టైన్‌మెంట్, పిల్లల వినోదం తదితర విభాగాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఒకే ప్రదేశంలో షాపింగ్, భోజనం, వినోదాన్ని ఆస్వాదించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జీవీ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర ప్రజలకు అత్యుత్తమ షాపింగ్, వినోద అనుభూతిని అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. నగర ప్రజల ఆదరణతో జీవీ మాల్ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రారంభోత్సవానికి హాజరైన ప్రముఖులు ఎమ్మెల్యే గడ్డం వంశీ, గడ్డం మురళీగౌడ్ తదితరులు పాల్గొన్నారు. సినీ రంగం నుంచి నటి హేమ తదితరులు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు.









