Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రంగారెడ్డి

టీకేఆర్ కమాన్ రోడ్‌లో కేకేఆర్ గ్రీన్ మోటార్స్ నూతన ప్రారంభం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
టీకేఆర్ కమాన్ రోడ్‌లో కేకేఆర్ గ్రీన్ మోటార్స్ నూతన ప్రారంభం

పున్నమి: రంగారెడ్డి జిల్లా:
టీకేఆర్ కమాన్ రోడ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన కేకేఆర్ గ్రీన్ మోటార్స్ షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం రోజున ఘనంగా జరిగింది. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ నూతన షోరూమ్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జె.ఎస్.ఆర్. డైనమో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫౌండర్ పాశం జనార్దన్ రెడ్డి, కేకేఆర్ గ్రీన్ మోటార్స్ సీఓ కిరణ్ కుమార్ రెడ్డి, శ్రీ లక్ష్మీ మోటార్స్ ఎండీ కిరణ్ మహేశ్వరి రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఎంతో అవసరమని, ప్రజలకు నాణ్యమైన ఎలక్ట్రిక్ వాహనాలను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. “సొల్యూషన్ టు పొల్యూషన్” అనే నినాదంతో పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించేందుకు కేకేఆర్ గ్రీన్ మోటార్స్ కృషి చేస్తుందని తెలిపారు.

ప్రారంభోత్సవం సందర్భంగా షోరూమ్ నిర్వాహకులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

టీకేఆర్ కమాన్ రోడ్‌లో కేకేఆర్ గ్రీన్ మోటార్స్ నూతన ప్రారంభం

టీకేఆర్ కమాన్ రోడ్‌లో కేకేఆర్ గ్రీన్ మోటార్స్ నూతన ప్రారంభం

టీకేఆర్ కమాన్ రోడ్‌లో కేకేఆర్ గ్రీన్ మోటార్స్ నూతన ప్రారంభం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *