Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: జనగామ

జనగాం

ఘన్‌పూర్ (స్టేషన్) మున్సిపాలిటీలో నూతన బార్ కేటాయింపునకు లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక

ఘన్‌పూర్ (స్టేషన్) మున్సిపాలిటీలో నూతన బార్ కేటాయింపునకు లాటరీ నిర్వహణ ————————————————————— జనగామ, అక్టోబర్ 16,పున్నమి జిల్లా ప్రతినిధి : 349 దరఖాస్తుల నుంచి లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక,– శుక్రవారం, జిల్లాలోని ఘన్‌పూర్ (స్టేషన్) మున్సిపాలిటీ పరిధిలో నూతన బార్ కేటాయింపునకు *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* అధ్యక్షతన సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో లాటరీ విధానంలో పారదర్శకంగా నిర్వహించారు. తెలంగాణ ఎక్సైజ్ (బార్ ద్వారా మద్యం విక్రయించుటకు లైసెన్సుల మంజూరు, లైసెన్సు షరతులు) నియమాలు, 2005 ప్రకారం, ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు ఘన్‌పూర్ (స్టేషన్) మున్సిపాలిటీ పరిధిలో ఒక నూతన బార్ ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానించగా, మొత్తం (349) దరఖాస్తులు వచ్చాయి. లాటరీలో DPSG0291 టోకెన్ నంబర్ కలిగిన గడ్డం సందీప్, తండ్రి రమేష్, వీణవంక గ్రామం, మండలం, కరీంనగర్ జిల్లాకు చెందిన దరఖాస్తుదారుడు విజేతగా ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో డీపీఈఓ ఎన్. అంజిరెడ్డి, జనగామ, ఘన్‌పూర్ (స్టేషన్), పాలకుర్తి ఎస్‌హెచ్‌ఓలు జి. శ్రీనివాసరావు, ఎన్. రఘునాథ్ రెడ్డి, ఆర్. బాలాజీ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

జనగాం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ సెంటర్ ప్రారంభించిన రాష్ట్ర బిజెపి నాయకులు ఉడుగుల రమేష్

జనగాం జిల్లా బిజెపి పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ సెంటర్ కార్యక్రమాన్ని రాష్ట్ర నాయకులు ఉడుగుల రమేష్ గారు ప్రారంభించడం జరిగింది.వారు మాట్లాడుతూ ఈరోజు నుండే బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఎన్రోల్మెంట్ చేయడానికి సెంటర్ అందుబాటులో ఉంటుంది ఈ అవకాశాన్ని పట్టభద్రులు యువకులు విద్యార్థులు,రిటైర్డ్ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ 2023 నవంబర్ వరకు డిగ్రీ పూర్తి అయిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది.గతంలో ఎన్రోల్మెంట్ చేసుకున్న వారు కూడా తప్పనిసరిగా ఈసారి ప్రతి ఒక్కరూ ఎన్రోల్మెంట్ చేసుకోగలరు,ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా విలువైనది దానిని మనం అందరం సద్వినియోగం చేసుకొని మంచి ప్రజలకు ఉపయోగపడే నాయకున్ని ఎన్నుకోవాలని ఓటర్లకు తెలపడం జరిగింది.ఎన్రోల్మెంట్ చేయువారు ,, గొడిశాల శివరామకృష్ణ సెల్ 998974 37 38 సంప్రదించండి.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పెద్దోజు జగదీష్, డాక్టర్ శశిధర్,దూసరి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు

జనగాం

జనగామ చౌరస్తా లో నిర్వహించిన రైతు నిరసన దీక్ష విజయవంతం :సౌడ రమేష్ బిజెపి జిల్లా అధ్యక్షులు

ఈరోజు భారతీయ జనతా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సోమిడి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో రైతు సమస్యలపై రైతు నిరసన దీక్ష జనగామ చౌరస్తాలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సౌడ రమేష్ మాట్లాడుతూ జనగామ జిల్లాలో రైతులు పండించిన వరి పంట పొలాలు కరెంటు కోతల వల్ల పంటలు ఎండిపోయి నోటికాడి ముద్ద నేలపాలై రైతులు తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ఎద్దేడిచిన యువసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డట్టు చరిత్రలో లేదని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 24 గంటల కరెంటు వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని రైతులు అతివృష్టి వలన అనావృష్టి వలన పంటలకు నష్టం వాటిల్లి నప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించి ఈ పథకాన్ని తెలంగాణ రైతులకు అందేటట్లు చేయాలని,అదేవిధంగా పూర్తిగా పంట నష్టపోయిన రైతులను యుద్ధ ప్రాతిపదికన గుర్తించి ఎకరానికి 25 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని సౌడ రమేష్ డిమాండ్ చేయడం జరిగింది.అదేవిధంగా రైతులకు న్యాయం జరిగేంత వరకు భాజాపా మరియు కిసాన్ మోర్చా రైతుల పక్షాన భాజపా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరుట్ల దశమంత రెడ్డి బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్ రెడ్డి రాష్ట్ర నాయకులు ఒడుగుల రమేష్ శివరాజ్ యాదవ్ సీనియర్ నాయకులు కొంతం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఐలోని అంజిరెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు దేవర ఎల్లయ్య, పట్టణ అధ్యక్షులు బొమ్మ కంటి అనిల్ యువ మోర్చా అధ్యక్షులు హరీష్, ఎస్టి మచ్చ అధ్యక్షులు నానావత్ రవి,కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి రెడ్డి మెడికల్ సెల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, పెద్దోజు జగదీష్ డాక్టర్ శశిధర్ గుప్తా రఘునాథపల్లి మండల అధ్యక్షులు వేణు,హరీష్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు

జనగాం

ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ప్రత్యామ్నాయపంటల సాగుకు రైతులు ప్రాధాన్యత నివ్వాలి -జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు ప్రాధాన్యత ఇవ్వాలి-జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ———————————————————— *రబీ సీజన్‌లో వరి, మొక్కజొన్న వంటి అధిక నీరు అవసరమయ్యే పంటలకు దూరంగా ఉండాలి* *తక్కువ నీటితో పండే పంటలు, ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షపాతం తగ్గి, ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* సూచించారు. బుధవారం, జిల్లాలోని పాలకుర్తి మండలంలోని ముత్తారం గ్రామంలో గల రైతు వేదికలో నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ (NMNF) కింద ప్రకృతి వ్యవసాయంపై అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్* మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాదని, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. రానున్న జూన్ నెల వరకు ఈ ప్రభావం కొనసాగనున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రబీ సీజన్‌లో వరి, మొక్కజొన్న వంటి అధిక నీరు అవసరమయ్యే పంటలను సాగు చేయకుండా, తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. *వర్షపాతం తగ్గే అవకాశం.. నీటి వినియోగంలో అప్రమత్తత అవసరం* జిల్లాలో సాధారణంగా సంవత్సరానికి సుమారు 900 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని, ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటివరకు సుమారు 529 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైందని తెలిపారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉందన్న వాతావరణ అంచనాలను దృష్టిలో ఉంచుకొని రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నీటి లభ్యతను బట్టి పంటలను ఎంచుకోవాలని, కేవలం సంప్రదాయ పద్ధతుల్లోనే పంటలు సాగు చేయకుండా, పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని సూచించారు. *తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలి* వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. కంది, పెసర, వేరుశనగ వంటి పంటలతో పాటు తక్కువ నీటితో సాగు చేయగల ఇతర ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించిన పంటల సాగు విధానాలను రైతులు పాటించాలని, శిక్షణ కార్యక్రమాల్లో అందించిన సూచనలను ఆచరణలో పెట్టాలని కోరారు. రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు అందించేందుకు వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. *ఉద్యానవన పంటలు, ఆయిల్‌ పామ్ సాగుకు ప్రాధాన్యత* నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు రైతులకు దీర్ఘకాలికంగా ఆదాయం అందించే ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. ఆయిల్‌ పామ్ సాగుపై రైతులు ఆసక్తి చూపాలని, అయితే ఆయిల్‌ పామ్ తోటల్లో తప్పనిసరిగా డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని అమలు చేయాలని తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని పొదుపుగా వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. ఉద్యానవన పంటల సాగుకు సంబంధించి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సదుపాయాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసక్తి ఉన్న రైతులు తమ పేర్లను ఉద్యానవన శాఖ అధికారులకు నమోదు చేసుకోవాలని, సంబంధిత అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తారని తెలిపారు. *రైతులకు గ్రామాల్లోనే ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండాలి* రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు గ్రామాల్లోనే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగా నాణ్యమైన వ్యవసాయ ఉత్పాదకాలు లభించేలా చూడాలన్నారు. ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల విక్రయానికి సంబంధించిన లైసెన్సులు కలిగిన దుకాణదారులు తమ వద్ద అందుబాటులో ఉన్న ఉత్పాదకాలను నిబంధనల ప్రకారం విక్రయించాలని సూచించారు. *భూగర్భ జలాల పరిరక్షణ అందరి బాధ్యత* ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో భూగర్భ జలాలు వేగంగా తగ్గిపోయే ప్రమాదం ఉన్నందున ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. గ్రామ సర్పంచులు ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, నీటి సంరక్షణ చర్యలను ప్రోత్సహించాలని తెలిపారు. *రైతులు నష్టపోకుండా ముందస్తు ప్రణాళికతో సాగు చేయాలి* వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవడం ద్వారా రైతులు నష్టాల నుంచి బయటపడవచ్చని తెలిపారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు అందించే సలహాలను రైతులు పాటించాలని సూచించారు. రైతులకు ఏవైనా సమస్యలు ఎదురైతే సంబంధిత శాఖల అధికారులను సంప్రదించాలని, అవసరమైన సహకారం అందించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. రైతులు ఆందోళన చెందకుండా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని, నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. *వీబీ–జీ రామ్ జీ పథకం కింద పనులు చేపట్టాలి* గ్రామాల్లో భూగర్భ జలమట్టాల పెంపు, నీటి సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ వీబీ–జీ రామ్ జీ పథకం కింద అవసరమైన పనులను గుర్తించి, చేపట్టాలని సూచించారు. చెక్‌ డ్యామ్‌ల నిర్మాణం, మరమ్మతులు, ఇతర నీటి సంరక్షణ పనులకు సంబంధించి నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అంతకుముందు పీఎండీడీకేవై కింద *మామ్నూర్ కేవీకే శాస్త్రవేత్త సౌమ్య* ఎల్నీనో నేపథ్యంలో విత్తన శుద్ధి, పంట మార్పిడి, నీరు తక్కువగా పండే పంటలు, తదితరాలపై రైతులకు శిక్షణ ఇచ్చి, అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీఏఓ అంబికా సోనీ, ఉద్యానవన శాఖ అధికారి నర్సయ్య, ఎంపీడీవో వేదవతి, ఏడీఏ అపర్ణ, ఎంపీఓ మల్లిఖార్జున, ఆత్మా ఛైర్మన్ రాఘవ రెడ్డి, సర్పంచి అనిత, ఎంఏఓ విద్యాసాగర్, ఏఈఓ మహేష్, ఇతర సంబంధిత అధికారులు, అధిక సంఖ్యలో రైతులు, తదితరులు పాల్గొన్నారు.

జనగాం

నిబంధనల ప్రకారం ఫామ్ పాండ్ల నిర్మాణం చేపట్టాలి -జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

నిబంధనల ప్రకారం ఫామ్ పాండ్ల నిర్మాణాలు చేపట్టాలి -జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా —————————————————————- *పాలకుర్తి మండలంలోని అయ్యంగారిపల్లి గ్రామంలో ఫామ్ పాండ్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. పంటల సాగుకు నీటి కొరత లేకుండా, వర్షపు నీటిని ఒడిసిపట్టి అవసరమైన సమయంలో పంటలకు వినియోగించుకునేందుకు చేపడుతున్న ఫామ్ పాండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* సూచించారు. మంగళవారం, జిల్లాలోని పాలకుర్తి మండలంలోని అయ్యంగారిపల్లి గ్రామంలో చేపట్టిన ఫామ్ పాండ్ నిర్మాణ పనులను *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* పరిశీలించారు. ఈ సందర్భంగా ఫామ్ పాండ్ల నిర్మాణ పనులకు ఎక్కువ మంది కూలీలు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత లోతు, ఎత్తు, పొడవులతో ఫామ్ పాండ్ల నిర్మాణాలను చేపట్టాలని ఆదేశించారు. ప్రతి మండలంలో ఐదు ఫామ్ పాండ్ల చొప్పున ఎంపిక చేసి, వాటి నిర్మాణ పనులను క్రమం తప్పకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. నిర్మాణ పనులకు ప్రతిరోజూ ఎంత మంది కూలీలు హాజరవుతున్నారు, వారికి ఎంత మేర కూలి చెల్లిస్తున్నారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. కూలీల హాజరును తప్పనిసరిగా నమోదు చేయడంతో పాటు, సంబంధిత వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం రైతులకు వ్యవసాయ యాంత్రిక పరికరాలపై అందిస్తున్న సబ్సిడీల గురించి అవగాహన కల్పించాలని, నీటి లభ్యతను బట్టి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా రైతులకు చైతన్యం కల్పించాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో డీఆర్డీఓ భాస్కర్, ఎంపిడిఓ వేదవతి, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

జనగాం

వర్షపు నీటిని సంరక్షించి పొదుపు చేయాలి :మొహమ్మద్ జహీర్ ఉద్దీన్ అజీమ్, జనగామ సీనియర్ జర్నలిస్ట్ (ఉర్దూ )

*రాష్ట్రంలో వర్షపాతం తగ్గడం వల్ల నీటి కొరత ముప్పు — ముందస్తు జాగ్రత్తలు అవసరం నీటి వృథాను నివారిస్తూ భూగర్భ జలాల పరిరక్షణపై దృష్టి పెట్టాల్సిన అవసరం* –మొహమ్మద్ జహీర్ ఉద్దీన్ అజీమ్ ——————————————————————— రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. వర్షం సహజ నీటి వనరులకు ప్రధాన ఆధారం. వర్షపాతం తగ్గితే వ్యవసాయం, చెరువులు, సాగునీరు, భూగర్భ జలాలపై ప్రత్యక్ష ప్రభావం పడే అవకాశం ఉంది. పరిస్థితిపై సకాలంలో దృష్టి సారించకపోతే రైతులతో పాటు సాధారణ ప్రజలు కూడా నీటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. వర్షపాతం తగ్గడం వల్ల జిల్లాలోని పలు చెరువులు, ఇతర నీటి నిల్వల్లో నీటి మట్టం తగ్గే అవకాశం ఉంది. అదే విధంగా భూగర్భ జలాల మట్టం కూడా పడిపోయే ప్రమాదం ఉంది. దీని ప్రభావం వ్యవసాయ కార్యకలాపాలతో పాటు తాగునీటి లభ్యతపై కూడా పడవచ్చు. ప్రస్తుత నీటి వనరులను అత్యంత జాగ్రత్తగా, ప్రణాళికాబద్ధంగా వినియోగించాల్సిన అవసరం ఉంది. గృహ అవసరాలు, వ్యవసాయం, ఇతర రంగాల్లో నీటి అనవసర వినియోగం మరియు వృథాను అరికట్టాలి. రైతులు తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణానికి సాగునీరు అందించే పద్ధతులను అవలంబించాలి. జిల్లా స్థాయి ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో తక్కువ నీటితో సాగు చేయగల పంటలు, కూరగాయల సాగును ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తున్నారు. రైతులను గుమ్మడికాయ, పప్పుధాన్యాలు, ఇతర తక్కువ నీరు అవసరమయ్యే కూరగాయల సాగు వైపు ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా మునగ, పుట్టగొడుగుల సాగుపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. తక్కువ నీటి వనరులతో మెరుగైన దిగుబడులు సాధించేందుకు రైతులను ప్రత్యామ్నాయ మరియు తక్కువ నీరు అవసరమయ్యే పంటల వైపు మళ్లించడం అవసరమని అధికారులు పేర్కొంటున్నారు. అదేవిధంగా చెరువులు, బావులు, ఇతర నీటి వనరులను పర్యవేక్షించడంతో పాటు భూగర్భ జలాల మట్టంపై నిరంతరం నిఘా ఉంచాలి. అందుబాటులో ఉన్న వర్షపు నీటిని సంరక్షించేందుకు చెరువుల శుభ్రత, వర్షపు నీటి నిల్వ, వాటర్ హార్వెస్టింగ్, భూగర్భ జలాల రీచార్జ్‌కు సంబంధించిన చర్యలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రజలు కూడా నీటిని దేవుడిచ్చిన అమూల్యమైన వరంగా భావించి అనవసరంగా వినియోగించకుండా జాగ్రత్త వహించాలి. ఇళ్లలో, పొలాల్లో, ఇతర ప్రాంతాల్లో నీటి వృథాను అరికట్టడం ప్రతి పౌరుడి బాధ్యత. నేడు నీటిని పొదుపు చేస్తే భవిష్యత్తులో తీవ్రమైన నీటి కొరత సమస్యలను ఎదుర్కోకుండా ఉండేందుకు సహాయపడుతుంది. ప్రభుత్వం, సంబంధిత శాఖలు, రైతులు, ప్రజలు పరస్పర సహకారంతో జిల్లాలోని నీటి వనరుల పరిరక్షణకు సమగ్ర ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉంది. తక్కువ వర్షపాతం ఉన్న పరిస్థితుల్లో కూడా వ్యవసాయం, తాగునీరు, ఇతర అవసరాలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలి. వర్షపు నీటిని సంరక్షించాల్సిన అవసరం — Rainwater Harvesting వర్షపు నీటిని సేకరించి నిల్వ చేసే విధానాన్ని “Rainwater Harvesting” అంటారు. అదే విధంగా వర్షం సమయంలో ప్రవహించే నీటిని అడ్డుకుని వృథా కాకుండా సంరక్షించి సహజ వనరుగా వినియోగించడాన్ని “Rainwater Conservation” అని కూడా అంటారు. ప్రస్తుతం భూగర్భ జలాల మట్టం తగ్గడం, నీటి అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో వర్షపు నీటిని సంరక్షించడం అత్యంత అవసరంగా మారింది. వర్షం సమయంలో పెద్ద మొత్తంలో నీరు వాగులు, రోడ్లు, లోతట్టు ప్రాంతాల నుంచి ప్రవహించి వృథా అవుతోంది. ఈ నీటిని సరైన ప్రణాళికతో అడ్డుకుని భూమిలోకి ఇంకేలా చేస్తే భూగర్భ జలాల మట్టాన్ని పెంచేందుకు గణనీయంగా సహాయపడుతుంది. వర్షపు నీటిని సంరక్షించేందుకు చెక్ డ్యామ్‌లు, పెర్కొలేషన్ ట్యాంకులు, ఫార్మ్ పాండ్లు, రైన్‌వాటర్ హార్వెస్టింగ్ ట్యాంకులు, రీచార్జ్ బోర్‌వెల్‌లు వంటి విధానాలను అమలు చేయవచ్చు. ఇళ్ల, పాఠశాలలు, ప్రభుత్వ భవనాలు, ఇతర సంస్థల పైకప్పులపై సేకరించే వర్షపు నీటిని పైపుల ద్వారా ట్యాంకుల్లో నిల్వ చేయవచ్చు. లేదా తగిన ఫిల్టరేషన్ అనంతరం భూగర్భ జలాల రీచార్జ్‌కు వినియోగించవచ్చు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో పొలాల చుట్టూ చిన్న కట్టలు, నీటిని నిల్వ చేసే కందకాలు, ఫార్మ్ పాండ్లు ఏర్పాటు చేస్తే వర్షపు నీరు ఎక్కువ కాలం ఆ ప్రాంతంలో నిల్వ ఉంటుంది. దీని వల్ల భూమిలో తేమ నిలిచి ఉండటంతో పాటు వ్యవసాయం, పశువులకు నీటి లభ్యత మెరుగుపడేందుకు సహాయపడుతుంది. నీరు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరం. అది ప్రవహించి వృథా కాకుండా సంరక్షించడం మనందరి బాధ్యత. వర్షపు నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించి ప్రతి గ్రామం, పట్టణం, నగరంలో Rainwater Harvesting విధానాన్ని ప్రోత్సహించాలి. ఈ రోజు సంరక్షించిన వర్షపు నీరు భవిష్యత్తులో నీటి కొరత సమస్యను తగ్గించడంలో కీలక పాత్ర పోషించగలదు.

జనగాం

మణిపూర్ ఎంపిడాక్టర్ అంగొంచ భీమోల్ అకోజామ్ ఫోటో ఫ్రేమ్ దగ్ధం చేసిన జనగామ జిల్లా బిజెపి మహిళా మోర్చా

ఈ రోజు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు సాంబ జీవనజ్యోతి ఆధ్వర్యంలో మణిపూర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డాక్టర్ అంగొంచ బీమోల్ అకోజామ్ ఫోటో ప్రేమ్ దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సౌడ రమేష్ మాట్లాడుతూ మణిపూర్ కాంగ్రెస్ ఎంపీ మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ అసభ్యమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ మహిళలను కించపరిచి మాట్లాడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్న కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుని సభ్యత్వం రద్దు చేయాలి రాహుల్ గాంధీకి వెంటనే అతన్ని ఆయనను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని లేనిపక్షంలో మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తారని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేస్తున్న దురాగతాలను పక్కన పెట్టి మహిళలపై కించపరిచే వారిని వెనుకేసుకు రావడం దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో తెలంగాణలోమహిళలు తగిన బుద్ధి చెప్తారని వారు తెలిపారు బుడుగుల రమేష్ తోకల ఉమారాణి, బొమ్మ కంటే అనిల్ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శుల ఎనగందుల కళ్యాణి ముస్లి స్వప్న గాదపాక శ్వేత,గణపురం ఉమారాణి సీతారామ శ్యామల కొండ పద్మ వెలిశాల లక్ష్మి శీలం ప్రభావతి రాష్ట్ర నాయకులు డాక్టర్ వెంకటేశ్వర్లు పెద్ద జగదీష్ వెంకటరమణ భాష పాక పాక సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

జనగాం

వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ బిజెపి అభ్యర్థి ని మొదటి ప్రాధాన్యత ఓటు తోనే గెలిపించాలి :ఎమ్మెల్సీఅంజిరెడ్డి

ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి ఎమ్మెల్సీ చిన్న మైల్ అంజి రెడ్డి రావడం జరిగింది, ఎమ్మెల్సీ అంజి రెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని నిరుద్యోగ సమస్యలపై ఉద్యోగుల సమస్యలతో ప్రైవేటు టీచర్ల సమస్యలపై రిటైర్డ్ ఎంప్లాయిస్ సమస్యలపై పట్టభద్రుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచి నిరుద్యోగ భృతికై భాజాపా పోరాటం చేస్తుందని మేధావులు బిజెపికి మద్దతుగా నిలవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరుట్ల దశమంత రెడ్డి బిజెపి ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ అభినవ్ భాస్కర్ రాష్ట్ర నాయకులు సిరికొండ విద్యాసాగర్ రెడ్డి ఒడుగుల రమేష్ శివరాజ్ యాదవ్ ప్రధాన కార్యదర్శి తోకల ఉమారాణి ఐలోని అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు బాష్పాక సుధాకర్ పల్లె కుమార్ అమరేందర్ రెడ్డి వడ్లకొండ రవి బూరుగు సురేష్ తదితరులు పాల్గొన్నారు

జనగాం

సోమవారం జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమం రద్దు :జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

*సోమవారం జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమం రద్దు* *ప్రజలు తమ వినతులతో కలెక్టరేట్‌కు రావద్దు* —జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ సోమవారం (అక్టోబర్ 12)న రద్దు చేసినట్లు *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రబీ పంటల ప్రణాళిక, పంటల సాగు విధానాలు, పంటల వైవిధ్యీకరణ, వ్యవసాయ నిర్వహణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు *తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి* రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్న నేపథ్యంలో, అక్టోబర్ 12వ తేదీ (సోమవారం)న నిర్వహించనున్న రైతు నేస్తం కార్యక్రమం సందర్భంగా కలెక్టరేట్‌లో నిర్వహించే జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు స్పష్టం చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి తమ వినతులు, ఫిర్యాదులతో సోమవారం కలెక్టరేట్‌కు రావద్దని *కలెక్టర్* కోరారు. అయితే డివిజన్ స్థాయి, మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని *కలెక్టర్* వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలు, వినతులను సంబంధిత డివిజన్, మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాల్లో సమర్పించుకోవచ్చని సూచించారు.

జనగాం

రైతువేదికల్లో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహణమహిళా రైతుల భాగస్వామ్యం నకు ప్రత్యేక చర్యలు :జిల్లా కలెక్టర్

*రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహణ* *మహిళా రైతుల భాగస్వామ్యానికి ప్రత్యేక చర్యలు* –జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రబీ పంటల ప్రణాళిక, పంటల సాగు విధానాలు, పంటల వైవిధ్యీకరణ, వ్యవసాయ నిర్వహణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు *తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి* రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్న నేపథ్యంలో, అక్టోబర్ 12వ తేదీన (సోమవారం) నిర్వహించనున్న రైతు నేస్తం కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని రైతు వేదికల్లో పకడ్బందీగా నిర్వహించనున్నట్లు *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జిల్లా వ్యవసాయ అధికారి, సంబంధిత శాఖల అధికారులు, మండల స్థాయి అధికారులకు *కలెక్టర్* పలు కీలక సూచనలు జారీ చేశారు. జిల్లాలోని ప్రతి రైతు వేదికకు కనీసం 200 మంది రైతులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, సోమవారం ఉదయం 11 గంటల లోపు రైతులందరూ తమకు కేటాయించిన రైతు వేదికలకు చేరుకునేలా చూడాలని ఆదేశించారు. ప్రతి రైతు వేదికలో మహిళా రైతులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని స్పష్టం చేశారు. స్వయం సహాయక సంఘాలు, గ్రామ సంఘాలు, సెర్ప్ సిబ్బంది, మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా మహిళా రైతులను కార్యక్రమానికి సమీకరించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిని ఆదేశించారు. ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ, మార్కెటింగ్ శాఖ, పశుసంవర్ధక శాఖ అధికారులు తమ పరిధిలోని రైతులు, ఉద్యానవన రైతులు, పాడి పరిశ్రమ, పశుపోషణ రంగాలకు చెందిన రైతులు కార్యక్రమంలో పాల్గొనేలా క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా చర్యలు తీసుకోవాలని సూచించారు. వానాకాలం 2026లో ఎల్‌నినో పరిస్థితులపై అవగాహన కల్పించిన అనంతరం పంటల వైవిధ్యీకరణ, శాఖ సూచించిన వ్యవసాయ పద్ధతులను అనుసరించి ప్రయోజనం పొందిన ఇద్దరు ప్రగతిశీల రైతులను గుర్తించాలని సూచించారు. సహజ వ్యవసాయం, వ్యవసాయ యాంత్రీకరణ, పప్పుధాన్యాల్లో ఆత్మనిర్భరత మిషన్ (MANP) వంటి పథకాల ద్వారా లబ్ధి పొందిన రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జనగామ, ఘన్‌పూర్ (స్టేషన్) రెవెన్యూ డివిజన్లలో సంబంధిత ఆర్డీవోలు, మండలాల్లో మండల ప్రత్యేక అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతి రైతు వేదికకు ఒక మండల స్థాయి అధికారిని కేటాయించాలని సూచించారు. ఈ రైతు నేస్తం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని, రైతులకు ఎల్‌నినో పరిస్థితులు, రబీ పంటల ప్రణాళిక, అనువైన పంటల ఎంపిక, శాస్త్రీయ సాగు పద్ధతులపై అవగాహన కల్పించేలా అవసరమైన ఏర్పాట్లన్నీ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని వెల్లడించారు.