Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: గాజుల బాలాజీ. ఎల్లారెడ్డి పేట

రాజన్న సిరిసిల్ల

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 17 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కు ఏర్పాట్లు పూర్తయ్యాయి అక్టోబర్ 17 నుంచి 27వ తేదీ వరకు శ్రీ వైష్ణవ పాంచరత అగమ శాస్త్రము ప్రకారం ఉత్సవాల నిర్వహించుచున్నారు ఈ నెల 26న స్వామివారి రథోత్సవం వైభవంగా జరగనుంది భక్తులు కు ఇబ్బందులు కలగకుండా చలువ పందిళ్లు తాగునీరు లైటింగ్ వైద్య శిబిరం పోలీస్ బందోబస్తు పారిశుద్ధ్య ఏర్పాట్లు చేపట్టినట్లు ఆలయ ఈవో డివి మారుతి రావు తెలిపారు

రాజన్న సిరిసిల్ల

బతుకమ్మ పండుగ మహిళను ఆత్మ గౌరవానికి ప్రతీక

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 17 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బతుకమ్మ పండుగ మహిళల ఆత్మ గౌరవానికి ప్రతీక అని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బతుకమ్మ వేడుకలను అధికారికంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు వేములవాడలో సద్దుల బతుకమ్మ వేడుకలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు ఈ సందర్భంగా మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు BRS వేములవాడ లక్ష్మీనరసింహారావు ఆహ్వానం మేరకు వేములవాడలో బతుకమ్మ వేడుకలు పాల్గొనడం జరిగింది

రాజన్న సిరిసిల్ల

లోక్ అదాలత్ ల ద్వారా సమస్యల పరిష్కారం

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 17 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల న్యాయం నుంచి ఎవరు బహిష్కరించబడకూడదు వేణు ఆర్థిక పరిస్థితులు లేదా ఇతర కారణాలతో ఏ ఒక్కరు న్యాయానికి దూరం కాకూడదని లక్ష్యంతో న్యాయ సేవాధికార సంస్థలు పనిచేస్తున్నాయని లోక్ అదాలత్ సభ్యుడు న్యాయవాది ఆడేపు వేణు తెలిపారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కొనరావుపేట్ రైతు వేదిక తో పాటు వీర్నపల్లి మండలం లోని గర్జనపల్లి సీతారాం నాయక్ తండాలో న్యాయవిజ్ఞాన సదస్సులు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలకు న్యాయ హక్కులు ఉచిత న్యాయ సాయం మధ్యవర్తిత్వం లోక్ అదాలతల ద్వారా సమస్యల పరిష్కారం పై అవగాహన కల్పించారు నాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని పేద ప్రజలకు మంచి మంచి అవకాశం ఉపయోగించుకోవాలని కోరారు

రాజన్న సిరిసిల్ల

డిజిటల్ మోసాల నివారణ పై అవగాహన పోస్టర

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 17 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల లో అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు ఆర్థిక అక్షరాస్యత డిజిటల్ మోసాల నివారణ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ తెలిపారు లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజు కుమార్ తో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు ప్రభుత్వ బీమా పెన్షన్ పథకాలు బ్యాంకు ఖాతాల ప్రారంభం రి కేవైసీ నామిని నమోదు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు

రాజన్న సిరిసిల్ల

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యల పట్ల నిర్లక్ష్యం

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 17 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా తెలంగాణ భవన్ లో BRS రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు వివిధ పరిశ్రమల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారిని ఇబ్బందులకు గురిచేస్తుందని రైతుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు రాష్ట్రంలో వివిధ పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కూడా ప్రభుత్వం దృష్టి సారించడం లేదని విమర్శించారు రైతులు పరిశ్రమల ప్రయోజనాలు కాపాడటంలో ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని తోట ఆగయ్య పేర్కొన్నారు

రాజన్న సిరిసిల్ల

జగదంబ సేవా సమితి ఆధ్వర్యంలో గోపూజ నిర్వహణ

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 17 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం కేంద్రంలో జగదాంబ సేవా సమితి ఆధ్వర్యంలో అమ్మవారి మండపంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గోపూజ నిర్వహించారు గోవులను పూలమాల లు నూతన వస్త్రాలతో అలంకరించి పసుపు కుంకుమ గంధంతో పూజలు చేశారు గోపూజతో సకల శుభాలు కలుగుతాయని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మచ్చ శ్రీనివాస్ మేర రాజు సామల రమేష్ అంకారపు మహేష్ సమితి సభ్యులు భక్తులు మహిళలు పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల

బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఘన సన్మానం

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 16 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మేడిపల్లి దేవానందం ఘనంగా సన్మానం చేసిన బండ లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ సాదిక్ బొప్పాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎండి ఇమామ్ మాజీ డైరెక్టర్ జంగా శ్రీకాంత్ రెడ్డి బండ లింగంపల్లి గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు దడిగెల రామ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మార్పు సంజీవరెడ్డి దడిగల లక్ష్మారెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొండే రాజు రెడ్డి ఆకారం రాజు జంగ బుచ్చిరెడ్డి దడిగెల బిక్షపతి రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల

బండ లింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సన్మానం

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 16 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ సాదిక్ బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎండి ఇమామ్ ను కాంగ్రెస్ పార్టీ మాజీ డైరెక్టర్ జంగ శ్రీకాంత్ రెడ్డి కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు కొండే రాజు రెడ్డి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు దడిగల రాంరెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మార్పు సంజీవరెడ్డి దడిగల లక్ష్మారెడ్డి జంగ బుచ్చిరెడ్డి బిక్షపతి రెడ్డి కొత్తపల్లి బాలరాజ్ ఆకారం రాజు దడిగెల శ్రీనివాసరెడ్డి ఎండి యూసుఫ్ బొడ్డు దేవయ్య ఎండి సలీం ఈ కార్యక్రమంలో పాల్గొని సన్మానం చేయడం జరిగింది

రాజన్న సిరిసిల్ల

పర్యావరణ ప్రేమికుడు పకృతి ప్రకాష్ ఆదర్శ వ్యక్తి

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 16 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ఆడబిడ్డల కోసం ఉచితంగా గునుగు పువ్వులు సుద్దాలకు చెందిన పర్యావరణ ప్రేమికుడు పకృతి ప్రకాష్ ఆదర్శంగా నిలిచారు గుట్టలు చెట్లు అంతరించి బతుకమ్మ పూలు కరువైన వేల ఆడబిడ్డల కోసం తన రెండు ఎకరాల చేన్లో గునుగు పూలు తాగు చేశారు 100 బతుకమ్మలకు సరిపడా పూలను ఎవరైనా ఉచితంగా తీసుకెళ్లవచ్చు అని ప్రకటించారు వివిధ గ్రామాల ప్రజలు ఇక్కడికి వచ్చి పూలు సేకరిస్తూ ఆయన చొరవను కొనియాడుతున్నారు పక్షుల కోసం మొక్కజొన్నను కూడా వదిలి పకృతి ప్రేమను చాటుకున్నారు

రాజన్న సిరిసిల్ల

గౌరీ మాత అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు విప్

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 16 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ మేరకు గౌరీ మాత అమ్మవారి విగ్రహానికి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీను ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ అమ్మవారి విగ్రహాన్ని మూలవాగు సమీపంలోని తెప్ప వద్దకు చేర్చారు ఈ వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు బిజెపి నాయకుడు ప్రతాపరామకృష్ణ కౌన్సిలర్లు వివిధ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాపతినిధులు గౌరీ మాత అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు