Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: గాజుల బాలాజీ. ఎల్లారెడ్డి పేట

రాజన్న సిరిసిల్ల

సారంపల్లి నేరెళ్ల గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 11 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సారంపల్లి నేరెళ్ల గ్రామాల మధ్య ఉన్న పాల కేంద్రం వద్ద కారు ప్రమాదానికి గురైంది రోడ్డుపై వెళ్తున్న కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది ఈ ఘటనను గమనించిన స్థానికులు అక్కడికి చేరుకున్నారు కారులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు వెల్లడించారు ప్రమాదానికి గల కారణాలు తెలియవలసి ఉంది

రాజన్న సిరిసిల్ల

భవాని యూత్ ఆధ్వర్యంలో దుర్గ మాత శోభాయాత్ర

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 11 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో భవాని యూత్ ఆధ్వర్యంలో దుర్గామాత అమ్మవారి అగమన శోభయాత్ర భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగింది భవాని యూత్ పదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో అమ్మవారి ఆరాధ్యులైన దుబ్బుల వారి ఆటపాటలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి సాంప్రదాయ వాయిద్యాలు ఆట పాటల నడుము అమ్మవారి శోభాయాత్ర కొనసాగుతుండగా భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు అమ్మవారి అగమనతో గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తూ వేడుకలో భాగస్వాములు అవుతున్నారు దుర్గ మాత అమ్మవారి శరన్నవరాత్రి కార్యక్రమం రోజువారీ అమ్మవారిని ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామంలోని ప్రజలందరూ పాల్గొని అమ్మవారి దీవెనలు అందేలా చూడాలని దుర్గామాత అమ్మవారిని వేడుకుంటున్నారు

రాజన్న సిరిసిల్ల

VBG -RAM G పథకంలో ఉపాధి హామీ పనుల ప్రణాళిక

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 11 రాజన్న సిరిసిల్ల జిల్లా VBG -RAM G కింద ఉపాధి హామీ పనుల కల్పనలో జిల్లా రాష్ట్రంలో ముందు స్థానంలో నిలిచింది జిల్లా యంత్రంగానే రాష్ట్ర అధికార యంత్రాంగం అభినందించింది శాశ్వత ఆస్తుల కల్పన వనరుల సంరక్షణ పనులు చేయిస్తూ జిల్లా అధికార యంత్రాంగం ముందుకు సాగుతుంది విస్తృతంగా ఉపాధి హామీ పనులు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజవీక మిషన్ రాంజీ కార్యక్రమం కింద పనులు విస్తృతంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ ఆదేశాల మేరకు ఉపాధి పనులపై జిల్లాలోని ఆయా గ్రామాల సర్పంచులు పంచాయతీ కార్యదర్శులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు

రాజన్న సిరిసిల్ల

మేరా యువ భారత్ మై భారత్ అవగాహన కార్యక్రమం

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 11 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం దేశాయిపల్లి గ్రామంలో మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టడంలో యువతలో అవగాహన పెంపొందించడం లక్ష్యంగా నష ముక్త భారత్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మేరా యువభారత్ మై భారత్ రాజన్న సిరిసిల్ల విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 15 మంది యువత పాల్గొన్నారు ఈ సందర్భంగా యువతకు మై భారత్ పోర్టల్ లక్ష్యాలు అందులోని ఫీచర్లు యువతకు అందుబాటులో ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించారు మాదకద్రవ్యాల దుర్వినియోగానికి గల కారణాలు వ్యసనాల రకాల వాటి వల్ల కలిగే శారీరక మానసిక ఆరోగ్య సమస్యలతో పాటు కుటుంబం సమాజంపై పడే ప్రభావాలను వివరించారు దేశ జనాభా ప్రయోజనాలు వికసిత కల్పన గురించి తెలియజేశారు

రాజన్న సిరిసిల్ల

ఐటీ రంగానికి కేటీఆర్ చేసిన కృషిని గుర్తించాలన్నారు

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 11 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో BRSV రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ కేటీఆర్ వ్యాఖ్యలను బిఆర్ఎస్వి ఖండించింది కేటీఆర్ పై బల్మూర్ వెంకట్ వ్యాఖ్యలను ఖండించింది కేటీఆర్ నాయకత్వాన్ని చూసి కాంగ్రెస్ నేతలు భయపడి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అభివృద్ధి ఐటి రంగానికి కేటీఆర్ చేసిన కృషిని గుర్తించాలన్నారు రాజకీయ విమర్శలకు విధానాలు ప్రజా సమస్యలకే పరిమితం కావాలని వ్యక్తిగత వాక్యాలు మానుకోవాలని సూచించారు తెలంగాణ లో ఐటి రంగంలో వివిధ దేశాల నిపుణుల సలహా సూచనలతో పలు రకాల ఫ్యాక్టరీలు నూతన ఆవిష్కరణలు పలు ఐటి కంపెనీలు తీసుకువచ్చిన ఘనత కేటీఆర్ ది

రాజన్న సిరిసిల్ల

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 11 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో బతుకమ్మ పండుగ తో జీవించిపోయింది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పకృతి ఆరాధ్య దేవతగా కొలిచే బతుకమ్మ పండుగతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి సాంప్రదాయ బద్ధంగా బతుకమ్మ వేడుకల్లో ఆటపాటలతో గ్రామంలోని వివిధ వీధులలో సందడి నెలకొంది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలతో సందడి నెలకొంది

రాజన్న సిరిసిల్ల

9వ పోషణ మాసం ముగింపు వేడుకలు

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 11 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రి ఆవరణలో 9వ పోషణ మాసం ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ ఈ కార్యక్రమానికి హాజరై పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు చిన్నారులు పోషకార లోపం పుట్టుకతో వచ్చే ఆరోగ్య సమస్యలు తొలిదశలోనే గుర్తించి తగిన చికిత్స అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేములవాడ ఆసుపత్రిలో మోకాళ్ళ ఆపరేషన్లు పిల్లల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకోవచ్చు నిరుపేదలకు పిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు

రాజన్న సిరిసిల్ల

చంద్రగిరి అనిల్ తన తండ్రి జ్ఞాపకార్థం షీల్డ్లు పంపిణీ

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 10 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల లో చంద్రగిరి అనిల్ తన తండ్రి జ్ఞాపకార్థం నేరెళ్ల గ్రామ సర్పంచ్ పొన్నం లచ్చయ్య ఆధ్వర్యంలో నేరెళ్ల ప్రాథమిక పాఠశాలలో సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన 15 మంది విద్యార్థులకు షీల్డ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుబ్బాక ప్రభాకర్ ఉపాధ్యాయులు వార్డ్ సభ్యులు మెహర సాయి రంజిత్ సత్యం సత్తయ్య పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల

రాచర్ల గొల్లపల్లి పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 10 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం జెడ్ పి హెచ్ ఎస్ రాచర్ల గొల్లపల్లి పాఠశాలలో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు రకరకాల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సంతోషంగా సంబరాలు చేసుకున్నారు పాఠశాల ఆవరణంలో పూల పండగ శోభతో కలకలలాడింది అనంతరం బతుకమ్మ పండుగ ప్రస్తావాన్ని వివరిస్తూ ఉపాధ్యాయులు మాట్లాడారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండగ అని పకృతిని ఆరాధించే గొప్ప పండుగ తొమ్మిది రోజులపాటు అమ్మవారిని తొమ్మిది రూపాలలో కొలుస్తారని మహిళల ఐక్యతకు ఆత్మ గౌరవానికి నిదర్శనమని విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి మురళీధర్ సార్ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల

వయోవృద్ధుల తల్లిదండ్రుల సంరక్షణ కు చట్టం

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 10 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించగా ముఖ్యఅతిథిగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బిగితే హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు తల్లిదండ్రుల సంరక్షణకు చట్టం పకడ బందీగా అమలు చేస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ స్పష్టం చేశారు వయోవృద్ధుల తల్లిదండ్రుల సంక్షేమానికి అమలు చేస్తున్న చట్టాలు పథకాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మణ చారి వృద్ధుల సంరక్షణ చట్టాలు ఉపయోగాలు తెలియజేశారు