Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హెల్త్ టిప్స్

మధుమేహం ఉన్నవాళ్లు పండ్లు తినవచ్చా?

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మధుమేహం ఉన్నవాళ్లు పండ్లు తినవచ్చా?

పండ్లు మధుమేహానికి శత్రువులు కాదు
తినవచ్చా కాదు కచ్చితంగా తినాలి. అయితే ఎప్పుడు తినాలి? ఏమి తినాలి?ఎంత తినాలి? ఎలా తినాలి? అనే విషయాల మీద స్పష్టత కలిగి ఉండాలి.
​ పండ్లలో కేవలం చక్కెర మాత్రమే ఉండదు. వాటిలో పీచు పదార్థం,విటమిన్లు, ఖనిజ లవణాలు మరియు పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి రక్తనాళాల లోపలి పొరను (Endothelium) కాపాడి, దీర్ఘకాలిక గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తాయి.
​ ఎటువంటి పండ్లు తినాలి?……తక్కువ గ్లేసిమీక్
ఇండెక్స్ ( glycemic index ) పండ్లైన ​దోస, జామకాయ, నేరేడు పండ్లు, ఆపిల్, బేరి (Pear), బత్తాయి, నారింజ లాంటి పండ్లు తినడం మంచిది.

1.​ ఎటువంటి పండ్లు తినడం తగ్గించాలి
ఎక్కువ GI వుండే ​మామిడి, సపోటా, సీతాఫలం, బాగా పండిన అరటిపండు, ద్రాక్ష లను తగ్గించాలి.వీటిలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ మోతాదు ఎక్కువగా ఉంటుంది..
2.​ఎప్పుడు తినాలి? (సరైన సమయం)
పండును ఎప్పుడూ ప్రధాన భోజనంతో కలిపి తినకూడదు.భోజనం చేసిన వెంటనే లేదా భోజనంతో పాటు (డెజర్ట్ లాగా) అస్సలు తినకూడదు. అన్నం/రొట్టెలతో పాటు పండు కూడా కలిస్తే కార్బోహైడ్రేట్ల భారం రెట్టింపై షుగర్ అకస్మాత్తుగా పెరుగుతుంది. అలాగే రాత్రి పడుకునే ముందు తినకూడదు.
​3.ఉత్తమ సమయం (మిడ్-మీల్ స్నాక్):
​ఉదయం 11:00 గంటలకు (అల్పాహారానికి, మధ్యాహ్న భోజనానికి మధ్యలో)
​లేదా సాయంత్రం 4:30 గంటలకు (టీ/కాఫీ బదులుగా).
​4. ఎంత తినాలి? (పరిమాణం – Portion Control) ఎంత మంచి పండైనా ‘అతి’ పనికిరాదు. రోజుకు 100 నుండి 150 గ్రాములు మాత్రమే తినాలి.
​సులభమైన కొలత:
​ఒక చిన్న కప్పు పండు ముక్కలు (లేదా)
​ఒక మధ్యస్థ పరిమాణపు ఆపిల్ ​
​5. ఏ విధంగా తినాలి? (సరైన పద్ధతి)
​కొరికి, నమిలి మాత్రమే తినాలి. పండ్లను జ్యూస్ (Fruit Juice) రూపంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. జ్యూస్ చేస్తే పీచు నశించి, ఫ్రక్టోజ్ నేరుగా కాలేయానికి చేరి రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతుంది.
6.​తొక్క తీయవద్దు…. ఆపిల్, జామ, బేరి వంటి పండ్లను శుభ్రంగా కడిగి తొక్కతో సహా తినాలి. పీచు పదార్థం ఎక్కువ శాతం తొక్కలోనే ఉంటుంది.
​ పండు ముక్కలతో పాటు 3–4 బాదం పప్పులు లేదా 2 వాల్‌నట్స్ కలిపి తింటే, వాటిలోని ప్రొటీన్ మరియు మంచి కొవ్వులు పండ్లలోని గ్లూకోజ్ శోషణను (Absorption) మరింత నెమ్మదింపజేస్తాయి.
7.​డ్రై ఫ్రూట్స్ వద్దు: ఎండు ఖర్జూరం, కిస్‌మిస్, అంజూర వంటి వాటిలో నీరు ఆవిరై చక్కెర గాఢత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.

​ * పీచు ఎక్కువ – తీపి తక్కువ ఉన్న పండ్లు తినాలి
*​ జ్యూస్ వద్దు – నమిలి తినే ముక్కలే ముద్దు.
​* భోజనంతో వద్దు – పూటల మధ్యలోనే ముద్దు.
* రోజుకు ఒక పండుకే పరిమితం.

మధుమేహం ఉన్నవాళ్లు పండ్లు తినవచ్చా?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *