Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: గాజుల బాలాజీ. ఎల్లారెడ్డి పేట

రాజన్న సిరిసిల్ల

వేములవాడలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 14 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో బతుకమ్మ పండుగకు ముందస్తుగా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అన్ని వార్డులో ప్రత్యేక పారిశుద్ధ్య పనులను మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు పరిశీలించారు రోడ్డుపై చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు ప్రజలు చెత్తను రోడ్లపై వేయకుండా స్వచ్ఛ ఆటో లకు అందించి మున్సిపాలిటీకి సహకరించాలని కోరారు ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ పండుగను పరిశుభ్రమైన వాతావరణం లో జరుపుకునేలా చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు బతుకమ్మ వేడుకల సందర్భంగా వేములవాడలో వివిధ వార్డులలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించి బతుకమ్మ వేడుకలను ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఆటపాటలతో దాండియా కోలాటాలతో ఆనందోత్సవాలు మధ్య పండుగను జరుపుకునేలా ఏర్పాట్లు చేశారు

రాజన్న సిరిసిల్ల

బతుకమ్మ పండుగకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశం

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 14 రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకంగా నిలిచే బతుకమ్మ సంబరాలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి పర్యాటక సంస్కృతిక శాఖ ఏ వాని ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు బతుకమ్మ వేడుకల నిర్వాహనతోపాటు పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టుగా అమలు నిధుల సమీకరణ ప్రాముఖ్యం పర్యాటక ప్రాంతాల్లో భద్రత ఏర్పాట్లపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పలు సూచనలు చేశారు జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ ఐ డి ఓ సి నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ వాణి ప్రసాద్ మాట్లాడుతూ బతుకమ్మ వేడుకలు గ్రామాలు పట్టణాల్లో ప్రజల భాగస్వామ్యంతో పండుగ వాతావరణం లో జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు మహిళలు యువతలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చూడాలన్నారు

రాజన్న సిరిసిల్ల

హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 161 వ హనుమాన్

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 14 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 161 హనుమాన్ చాలీసా పారాయణం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ ప్రగణంలోని ఆంజనేయ స్వామి సన్నిధిలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 161 సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని చాలీసా పఠించారు అనంతరం సమితి సభ్యులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు హిందూ ఉత్సవ సమితి సభ్యులు భక్తులు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి హనుమాన్ చాలీసా పటించి భక్తిలో నిమగ్నమై ఉన్నారు హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి వారికి భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం పట్టించారు భక్తజన సభ్యులు పాల్గొని స్వామివారిని పూజించారు

రాజన్న సిరిసిల్ల

37వ వార్డులో అంబా భవాని అమ్మవారికి ఒడిబియ్యం

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 14 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని స్థానిక 37వ వార్డులో అంబ భవాని దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి దంపతులు అంబా భవాని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని విద్య వ్యాపారం వ్యవసాయం వంటి అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరమన్నారు దసరా దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అమ్మవారి కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు అమ్మవారి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి పై ఉండాలని కోరుకున్నారు

రాజన్న సిరిసిల్ల

నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 13 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం అంకిరెడ్డి పల్లి గ్రామంలో గౌరవ గ్రామ సర్పంచ్ రాగుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేశారు అర్హులైన పేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కార్డులతో పారదర్శకంగా రేషన్ సరుకులు పొందవచ్చని గ్రామ సర్పంచ్ రాగుల రాజిరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిల్ల రమేష్ రేషన్ డీలర్ భీమచంద్రం పంచాయతీ కార్యదర్శి సలీం జి పి ఓ లావణ్య ఏఎంసి డైరెక్టర్ పొన్నాల పరుశురాం వార్డు సభ్యులు వివిధ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామపంచాయతీ పాలకవర్గం గ్రామ పెద్దలు యువత మహిళా సంఘాల సభ్యులు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల

శేరి లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా విప్

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 13 రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ మరియు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టుబదుల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పట్టుభద్రుల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పట్టుభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియను సమర్థవంతంగా వేగవంతం చేయడానికి అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా కోఆర్డినేటర్లను పరిశీలకులను నియమించింది ఈ నియామకాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని 52 శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్ గా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నియమిస్తూ టిపిసిసి అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు ఈ నియామకాల ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని పార్టీ ప్రకటించింది

రాజన్న సిరిసిల్ల

భీమేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 13 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లోని ప్రాముఖ్య పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారి వరంగల్ నియోజకవర్గ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి దర్శించుకున్నారు ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్సీ ఆలయ అధికారులు ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ మండపానికి చేరుకున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆలయ వేద పండితులు అర్చకులు వేదర్శివచనం అందజేశారు ఈ సందర్భంగా ఆలయం పర్యవేక్షకులు శ్రీనివాస శర్మ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి శాలువాతో సత్కరించి స్వామివారి శేష వస్త్రం బహూకరించారు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి భీమేశ్వర స్వామివారిని రాష్ట్రం లోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరడం జరిగింది

రాజన్న సిరిసిల్ల

భీమేశ్వర సదన్ ప్రాంగణంలో బతుకమ్మ ఉత్సవాలు

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 13 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ సమీపంలో గల భీమేశ్వర సదన్ ప్రాంగణంలో బతుకమ్మ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగాయి స్థానిక మహిళలు యువతులు తంగేడు గునుగు చామంతి బంతిపూలతో మూడు వరుసలలో బతుకమ్మలను అందంగా తీర్చిదిద్ది పైన పసుపు గౌరమ్మను నిలిపారు సాంప్రదాయ దుస్తులు విచ్చేసిన మహిళలు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ భక్తిశ్రద్ధలతో గౌరమ్మను కీర్తిస్తూ పాటలు పాడి కోలాటాలు ఆడుతూ ఆనంద ఉత్సవాల మధ్య కొలహాలo సృష్టించారు బతుకమ్మ తొమ్మిది రోజుల పండుగలో భాగంగా రోజుకు ఒక అమ్మవారిగా బతుకమ్మను పకృతి ఆరాధ్య దేవతగా పూజించారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగ బతుకమ్మను పూజించాలి

రాజన్న సిరిసిల్ల

500 బైకులతో భారీ నిరసన ర్యాలీ కేకే మహేందర్ రెడ్డి

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 13 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించి అర్హులైన అతి పౌరుడికి ఓటు హక్కును కాపాడాలని కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారా శైలిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సిరిసిల్ల నియోజకవర్గంలో సుమారు 500 బైకులతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషనర్ పై చర్యల విషయంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర హోం మంత్రి అమీషా వైఖరిని ప్రశ్నించారు ఎన్నికల ప్రక్రియ పై ప్రజల్లో అనుమానాలు కలగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు ఓటు హక్కు పరిరక్షణ ప్రతి పౌరుడికి సంబంధించిన అంశమని ఎన్నికల వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం కలిగించేలా ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు

రాజన్న సిరిసిల్ల

2025-2026 ఖరీఫ్ యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 13 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ ఆదేశించారు ఖరీఫ్ కొనుగోలు సి ఎం ఆర్ డెలివరీ పై జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్ తో కలిసి వివిధ శాఖల అధికారులతో కలిపి సమావేశం నిర్వహించారు ఈ ఖరీఫ్ సీజన్లో ఐకెపి 123 పి ఏసి ఎస్ 122 మే పా ఆధ్వర్యంలో ఆరు మొత్తం 251 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలని సూచించారు అలాగే 2025_ 2026 ఖరీఫ్ యాసంగి సీజన్ సిఎంఆర్ డెలివరీ పై దృష్టి సారించాలని సూచించారు పౌరసరఫల శాఖ అధికారులు నిత్యం ప్రత్యేక దృష్టి భరించాలన్నారు