వయోవృద్ధుల తల్లిదండ్రుల సంరక్షణ కు చట్టం
పున్నమి ప్రతినిధి అక్టోబర్ 10 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించగా ముఖ్యఅతిథిగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బిగితే హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు తల్లిదండ్రుల సంరక్షణకు చట్టం పకడ బందీగా అమలు చేస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ స్పష్టం చేశారు వయోవృద్ధుల తల్లిదండ్రుల సంక్షేమానికి అమలు చేస్తున్న చట్టాలు పథకాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మణ చారి వృద్ధుల సంరక్షణ చట్టాలు ఉపయోగాలు తెలియజేశారు









