Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
చిత్తూరు

అంగన్‌వాడీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అంగన్‌వాడీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

**అంగన్‌వాడీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి**

**ఏఐటీయూసీ నాయకుల పిలుపు**

పలమనేరు, అక్టోబర్ 10 ( పున్నమి ప్రతినిధి ) : అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ (ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర 8వ మహాసభలను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ నాయకులు పిలుపునిచ్చారు. అక్టోబర్ 31, నవంబర్ 1 తేదీల్లో చిత్తూరులో మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… అంగన్‌వాడీ కార్యకర్తలకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని, గుజరాత్ హైకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకుని నెలకు రూ.24,800 వేతనం అందించాలని కోరారు. యాప్‌ల ద్వారా పెరుగుతున్న పనిభారాన్ని తగ్గించి ఒకే యాప్‌ను అమలు చేయాలని, మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా మార్చాలని, ఖాళీగా ఉన్న సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రాల అద్దెలను పెంచి సకాలంలో చెల్లించాలని కోరారు. అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి మహాసభల్లో భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నియోజకవర్గ కన్వీనర్ చెన్నకేశవులు, కో-కన్వీనర్ బుర్రా మంజునాథ్, జిల్లా నాయకులు సిద్ధారెడ్డి, గుర్రప్ప, పలమనేరు ఐసీడీఎస్ ప్రాజెక్టు నాయకురాళ్లు శాంతి, సుబ్బమ్మ, ప్రభావతి, రాధ, పద్మ తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *