Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
చిత్తూరు

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యం: పుంగనూరు జనసేన సమన్వయ కమిటీ సభ్యుల ఘన సన్మానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యం: పుంగనూరు జనసేన సమన్వయ కమిటీ సభ్యుల ఘన సన్మానం

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

పుంగనూరు, అక్టోబర్ 12 (భాను ప్రసాద్ నాయుడు పున్నమి న్యూస్ ప్రతినిధి):
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన-కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమన్వయంతో కృషి చేయాలని పుంగనూరు నియోజకవర్గ నాయకులు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీలో నూతనంగా నియమితులైన సభ్యులను సోమవారం పుంగనూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. నూతన బాధ్యతలు స్వీకరించిన వారికి పూలమాలలు వేసి, శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా జనసేన సిద్ధాంతాలను గ్రామీణ స్థాయిలోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. క్షేత్రస్థాయిలో కూటమి ఐక్యతను పటిష్టం చేసుకుంటూ, ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో నియోజకవర్గంలో పార్టీ విజయకేతనం ఎగురవేసేలా ప్రతి ఒక్కరూ అంకితభావంతో బాధ్యతలు నిర్వర్తించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ & అసెంబ్లీ స్థానిక ఎన్నికల సమన్వయకర్త పగడాల రమణ, మండల అధ్యక్షుడు విరూపాక్షి, పట్టణ అధ్యక్షుడు నరేశ్ రాయల్, జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ కార్యదర్శి చైతన్య రాయల్, అసెంబ్లీ సమన్వయకర్త పాముల హరి, మండల ఉపాధ్యక్షుడు సుబ్రమణ్యం, ప్రధాన కార్యదర్శి హరి నాయక్, కార్యదర్శి బాలాజీ నాయక్, పట్టణ ఉపాధ్యక్షుడు నందు, నాయకులు జి.ఎన్. బాబు, జనార్దన రాయల్, శ్రీరాములు, నాగరాజ, పవన్ కుమార్, వెంకీ, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Uploaded Video:

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యం: పుంగనూరు జనసేన సమన్వయ కమిటీ సభ్యుల ఘన సన్మానం

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యం: పుంగనూరు జనసేన సమన్వయ కమిటీ సభ్యుల ఘన సన్మానం

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యం: పుంగనూరు జనసేన సమన్వయ కమిటీ సభ్యుల ఘన సన్మానం

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యం: పుంగనూరు జనసేన సమన్వయ కమిటీ సభ్యుల ఘన సన్మానం

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యం: పుంగనూరు జనసేన సమన్వయ కమిటీ సభ్యుల ఘన సన్మానం

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యం: పుంగనూరు జనసేన సమన్వయ కమిటీ సభ్యుల ఘన సన్మానం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *