యలమంచిలి నూతన చైర్పర్సన్ పిళ్లా రమాకుమారికి ఘన సన్మానం
యలమంచిలి మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా ప్రమాణస్వీకారం చేసిన శ్రీమతి పిళ్లా రమాకుమారిని ఆంధ్రప్రదేశ్ బీజేపీ మైనార్టీ మోర్చా కార్యదర్శి, అనకాపల్లి జిల్లా మాజీ బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షేక్ ఇబ్రహీం భాషా ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పిళ్లా రమాకుమారికి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలియజేశారు. నూతన బాధ్యతలు చేపట్టిన ఆమె యలమంచిలి పట్టణ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి, మౌలిక సదుపాయాల కల్పనకు అంకితభావంతో పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చా ఉపాధ్యక్షుడు ఎం.డి. సుభాన్, షేక్ మౌలాలి పాల్గొని చైర్‌పర్సన్‌కు అభినందనలు తెలిపారు.









