Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: అనకాపల్లి జిల్లా

అనకాపల్లి

జనసేనకు రాజీనామా.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి శ్రీకాంత్ దంపతులు

యలమంచిలి: అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలానికి చెందిన ఆడారి శ్రీకాంత్, కమల ప్రియ దంపతులు జనసేన పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మునగపాక మాజీ జడ్పీటీసీ, సర్పంచ్ ఆడారి సరోజినీ సత్యనారాయణ దంపతుల కుమారుడైన శ్రీకాంత్ తన భార్య కమల ప్రియతో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరడం స్థానికంగా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.వైఎస్సార్‌సీపీ మాజీ ప్రభుత్వ విప్, యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, వైఎస్సార్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ సమక్షంలో ఈ చేరిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కరణం ధర్మశ్రీ, బొడ్డేడ ప్రసాద్‌లు ఆడారి శ్రీకాంత్, కమల ప్రియ దంపతులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

అనకాపల్లి

యలమంచిలి కాంగ్రెస్ ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా నాగుమంత్రి శాంతి నామినేషన్ దాఖలు

యలమంచిలి: యలమంచిలి మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ పదవికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాగుమంత్రి శాంతి ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పీఏసీ సభ్యుడు ఎం. పల్లంరాజు, జిల్లా ఇన్‌ఛార్జి జీవీవీ కమలాకర్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొడ్డు శ్రీనివాస్ ఆశీస్సులతో నాగుమంత్రి శాంతిని పార్టీ ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. మహిళా కాంగ్రెస్ నాయకురాలిగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, వివిధ ప్రజా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న శాంతికి అభ్యర్థిత్వం దక్కడంపై పార్టీ శ్రేణులు, మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు. నామినేషన్ దాఖలుతో యలమంచిలి మున్సిపల్ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని నిలిపింది. రాబోయే ఎన్నికల్లో ప్రజల మద్దతుతో విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకు సాగుతున్నాయి.

అనకాపల్లి

కొక్కిరాపల్లి నుంచి భారీ ర్యాలీ.. టీడీపీ అభ్యర్థిగా మజ్జి ఉమా మహేశ్వరి నామినేషన్!

యలమంచిలి మున్సిపాలిటీ 31వ వార్డు కొక్కిరాపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా మజ్జి ఉమా మహేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గ్రామం నుంచి యలమంచిలి పురపాలక కార్యాలయం వరకు గ్రామ కుటుంబ సభ్యులు, కూటమి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. బైక్‌లు, ఆటోలపై ఉత్సాహంగా ర్యాలీగా బయలుదేరిన నాయకులు, కార్యకర్తలు మధ్యాహ్నం 1:15 గంటలకు పురపాలక కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం మజ్జి ఉమా మహేశ్వరి తన నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. నామినేషన్ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆమెకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు మజ్జి వీరబాబు, మజ్జి రామకృష్ణ, సీనియర్ నాయకులు పొలరౌతు నాగేశ్వరరావు, రాంబాబు, మజ్జి రాంబాబు, చిన్నబ్బాయి, శ్రీనివాసరావు, అప్పలనాయుడు, చంటి తదితరులతో పాటు కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వారితో నామినేషన్ కార్యక్రమం సందడిగా సాగింది.

అనకాపల్లి

ఎలమంచిలిలో టీడీపీకి భారీ షాక్‌.. కరణం ధర్మశ్రీ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి 150 మంది కార్యకర్తలు!

ఎలమంచిలి మున్సిపాలిటీ 16వ వార్డులో తెలుగుదేశం పార్టీకి చెందిన 150 మంది కార్యకర్తలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సేనాపతి తులసిరావు తన అనుచరులతో కలిసి వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకోవడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.వైఎస్సార్‌సీపీపై నమ్మకంతో, పార్టీ నాయకుడు కరణం ధర్మశ్రీ నాయకత్వంపై విశ్వాసంతో పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. 16వ వార్డుకు చెందిన పెద్దలు దూది శ్రీరామమూర్తి, పిట్ట సత్తిబాబు, కిలాడ సత్యనారాయణల చొరవతో కరణం ధర్మశ్రీ సమక్షంలో ఈ చేరిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కరణం ధర్మశ్రీ పార్టీలో చేరిన వారిని సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోదెపు గోవింద్, బెజవాడ నాగేశ్వరరావు, బొద్దపు ఎర్రయ్య దొర తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం.. ట్రాఫిక్ నిబంధనలపై పోలీసుల అవగాహన

అనకాపల్లి: తుమ్మపాల గ్రామ రహదారి, కొత్తూరు జంక్షన్‌ వద్ద వాహనదారులకు రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్‌ఐలు అర్జునరావు, సత్యనారాయణ పాల్గొన్నారు. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాలను ఉదాహరణలుగా వివరిస్తూ, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వాహనదారులకు తెలియజేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని పోలీసులు సూచించారు. అతివేగం, ట్రిపుల్ రైడింగ్‌కు దూరంగా ఉండాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పాటిస్తూ, రహదారి భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా అనుసరించాలని కోరారు. నిబంధనల ఉల్లంఘన వల్ల ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించి ట్రాఫిక్ నియమాలను పాటిస్తే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పోలీసులు పేర్కొన్నారు.

అనకాపల్లి

యలమంచిలి 22వ వార్డులో బీజేపీ జోరు.. నామినేషన్‌కు సిద్ధమైన మాజీ సైనికుడు నక్కా శివ శంకరరావు!

యలమంచిలి మున్సిపాలిటీలో ఎన్నికల సందడి నెలకొంది. 22వ వార్డు కౌన్సిలర్ స్థానానికి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థిగా మాజీ సైనికుడు నక్కా శివ శంకరరావు ఆదివారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం 11:30 గంటలకు నామినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆయన నామినేషన్ నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషుల్లో ఉత్సాహం నెలకొంది.దేశ రక్షణలో సైనికుడిగా సేవలందించిన నక్కా శివ శంకరరావు, అదే క్రమశిక్షణ, నిబద్ధతతో ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ఆయన అభిమానులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాయకత్వంతో పాటు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, మాజీ చైర్‌పర్సన్ పిళ్లా రమాకుమారి, విశాఖ డెయిరీ చైర్మన్ పిళ్లా ఆనంద్ కుమార్ తదితర నాయకుల స్ఫూర్తితో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు.22వ వార్డులో స్థానిక సమస్యల పరిష్కారం, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించడం లక్ష్యంగా ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు అనుచరులు వెల్లడించారు. నామినేషన్ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల సహకారంతో ఎన్నికల ప్రక్రియలో ముందుకు సాగుతామని తెలిపారు.

అనకాపల్లి

అయోధ్య రామయ్య పాదుకలకు ఏటికొప్పాకలో ఘన స్వాగతం

భక్తి పారవశ్యంలో ఏటికొప్పాక.. వైభవంగా రాములవారి పాదుకల ఊరేగింపు ఏటికొప్పాక: అయోధ్య రామాలయం నుంచి శ్రీరాములవారి పాదుకలు మన ఏటికొప్పాక గ్రామానికి చేరుకోవడంతో గ్రామమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం 6 గంటల నుంచి గ్రామంలో శ్రీరాములవారి పాదుకల ఊరేగింపును అత్యంత వైభవంగా నిర్వహించారు.శ్రీరామ నామస్మరణలు, భక్తుల జై శ్రీరామ్ నినాదాలతో గ్రామ వీధులు మార్మోగాయి. చెట్టు భజన, హరిభజన, తప్పెట్ల వాయిద్యాల నడుమ భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఊరేగింపును భక్తిశ్రద్ధలతో కొనసాగించారు. పాదుకల దర్శనం కోసం భక్తులు ఆసక్తిగా తరలివచ్చారు. గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొనగా, భక్తుల ఆనందోత్సాహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.గ్రామ ప్రజలు, భక్తుల సమిష్టి భాగస్వామ్యంతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అత్యంత ఘనంగా, విజయవంతంగా ముగిసింది. శ్రీరాములవారి పాదుకలు ఏటికొప్పాకకు రావడం గ్రామానికి ఎంతో విశేషమైన ఆధ్యాత్మిక ఘట్టంగా భక్తులు భావించారు.

అనకాపల్లి

తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు రూ.50 వేల ఆర్థిక సాయం

అచ్యుతాపురం: తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ఇద్దరు చిన్నారులకు సీఐటీయూ అనుబంధ యూనియన్ అండగా నిలిచింది. అచ్యుతాపురం మండలం ఖాజీపాలెం గ్రామానికి చెందిన వివోఏ కూనిశెట్టి రేణుక, ఆమె భర్త నానాజీ అకాల మరణంతో పిల్లలు ఒంటరిగా మిగిలారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వెలుగు యానిమేటర్స్‌ వివోఏ యూనియన్‌ సీఐటీయూ అనుబంధ కార్పస్‌ ఫండ్‌ నుంచి రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇద్దరు చిన్నారుల పేర్లపై చెక్కును అందజేశారు.కష్టకాలంలో చిన్నారులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ సహాయం అందించినట్లు యూనియన్‌ నాయకులు తెలిపారు. చిన్నారుల భవిష్యత్తుకు ఈ సాయం కొంతవరకు తోడ్పడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఐకేపీ యూనియన్‌ మండల కార్యదర్శి పిల్లా లావణ్య, నాయకులు ఎస్. రమణ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్. రాము, మండల కన్వీనర్‌ కె. సోమునాయుడు పాల్గొన్నారు.

అనకాపల్లి

యలమంచిలి చైర్‌పర్సన్ బరిలో పిల్లా రమాకుమారి.. కూటమి అభ్యర్థిగా నామినేషన్

యలమంచిలి మున్సిపాలిటీ రెండో సాధారణ ఎన్నికల్లో చైర్‌పర్సన్ పదవికి కూటమి అభ్యర్థిగా బీజేపీకి చెందిన మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ పిల్లా రమాకుమారి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. మున్సిపల్ ఎన్నికల అధికారి కె. వరహాలకు తన నామినేషన్ పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో ఆమె మాట్లాడుతూ, తన తల్లి ఆశీర్వాదంతో నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.మరోసారి చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పిస్తే యలమంచిలి మున్సిపాలిటీ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని రమాకుమారి పేర్కొన్నారు. పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మల్ల కొండబాబు తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

ఏటికొప్పాక లక్క బొమ్మల తయారీ కేంద్రాన్ని సందర్శించిన ఎన్జీవో సంఘాల నేతలు ..

​యలమంచిలి :మండలంలోని ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ జేఏసీ చైర్మన్ అలపర్తి విద్యాసాగర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.వి. రమణ శనివారం యలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్. రవిశంకర్, అనకాపల్లి ఏపీ ఎన్జీవో అధ్యక్షులు పీలా రవితో కలిసి వారు ప్రముఖ హస్తకళాకారుడు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత శ్రీశైలపు చిన్నాయాచారికి చెందిన లక్క బొమ్మల తయారీ కేంద్రాన్ని సందర్శించారు. ​అనంతరం వారు లక్క బొమ్మల తయారీ విధానాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక హస్తకళాకారులతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కళాకారులు తెలిపిన సమస్యలపై నేతలు సానుకూలంగా స్పందిస్తూ, వాటిని సంబంధిత ఉన్నతాధికారులు మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కారమయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ​ఈ కార్యక్రమంలో యలమంచిలి తాలూకా యూనిట్ ఏపీ ఎన్జీవో ఉపాధ్యక్షులు బండారు ప్రేమ్ కుమార్, నక్కపల్లి ఏపీ ఎన్జీవో అధ్యక్షులు శ్రీనుతో పాటు పలువురు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.