Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

సాగర్ కాలనీలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు.. దాండియా నృత్యాలతో మహిళల సందడి!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సాగర్ కాలనీలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు.. దాండియా నృత్యాలతో మహిళల సందడి!

వార్త ముఖ్యాంశాలు

  • నిర్మల్ జిల్లా అక్టోబర్ 18 (పున్నమి ప్రతినిధి) నిర్మల్: సద్దుల బతుకమ్మ చివరి రోజు సందర్భంగా నిర్మల్‌లోని సాగర్ కాలనీలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
  • ఈ వేడుకల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని రంగురంగుల బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలతో సందడి చేశారు.
  • మహిళలతో పాటు చిన్నారులు, యువతులు, పెద్దలు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు.

నిర్మల్ జిల్లా అక్టోబర్ 18 (పున్నమి ప్రతినిధి)
నిర్మల్: సద్దుల బతుకమ్మ చివరి రోజు సందర్భంగా నిర్మల్‌లోని సాగర్ కాలనీలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని రంగురంగుల బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలతో సందడి చేశారు. మహిళలతో పాటు చిన్నారులు, యువతులు, పెద్దలు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన దాండియా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ కలిసి నృత్యాలు చేస్తూ పండుగ సంబరాలను ఆస్వాదించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు సాగర్ కాలనీలో ఆనందోత్సాహాల మధ్య ఘనంగా ముగిశాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *