Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

మాజీ ఎమ్మెల్యే వంగా సుబ్బారావు కన్నుమూత

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మాజీ ఎమ్మెల్యే వంగా సుబ్బారావు కన్నుమూత

సత్తుపల్లి, జూన్ 27
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా రిపోర్టర్ )

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇల్లందు నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా సేవలందించిన మాజీ ఎమ్మెల్యే వంగా సుబ్బారావు శనివారం కన్నుమూశారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని వంగ ముత్యాల బంజర్ గ్రామంలో ఆయన తుదిశ్వాస విడిచారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండే నాయకుడిగా, నిరాడంబర ప్రజాప్రతినిధిగా వంగా సుబ్బారావు మంచి గుర్తింపు పొందారు. ఆయన మరణ వార్తతో కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

వంగా సుబ్బారావు మృతి పట్ల వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, సామాజిక ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.

మాజీ ఎమ్మెల్యే వంగా సుబ్బారావు కన్నుమూత

Leave a comment

Your email address will not be published. Required fields are marked *