Tuesday, 10 March 2026

Blog

హెల్త్ టిప్స్

🥥 కొబ్బరికాయ – ఆరోగ్యానికి, జీవనశైలికి ప్రకృతి ఇచ్చిన అమూల్య వరం🙏

కొబ్బరికాయను భారతదేశంలో “కల్పవృక్ష ఫలం” అని కూడా అంటారు. ఎందుకంటే కొబ్బరి చెట్టులోని ప్రతి భాగం మన జీవితానికి ఉపయోగపడుతుంది. కొబ్బరి ఆకుల నుంచి మొదలుకుని, కొబ్బరి కాయ, కొబ్బరి నీరు, కొబ్బరి నూనె వరకు అన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మన సంప్రదాయాల్లో పూజలలో, శుభకార్యాలలో కొబ్బరికాయకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది శుభానికి, పవిత్రతకు ప్రతీకగా భావిస్తారు. కొబ్బరి నీరు సహజ ఎలక్ట్రోలైట్‌లతో నిండి ఉండి, శరీరంలో నీటి శాతం తగ్గకుండా కాపాడుతుంది. వేసవికాలంలో అధిక వేడి వల్ల కలిగే అలసట, తలతిరగడం, నీరసం వంటి సమస్యలను వెంటనే తగ్గిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ను బయటకు పంపి, కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ కొబ్బరి నీటిని సురక్షితంగా తీసుకోవచ్చు. కొబ్బరి గుజ్జు జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ పేగుల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. కొబ్బరిలో ఉన్న మంచి కొవ్వులు (Healthy Fats) శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఇవి గుండెకు హానికరం కాకుండా, సరైన మోతాదులో తీసుకుంటే హృదయ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కొబ్బరి నూనె ఆయుర్వేదంలో ఔషధంగా విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇది జుట్టు వేర్లను బలపరచి, జుట్టు రాలడం, చుండ్రు, జుట్టు పొడిబారడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా కొబ్బరి నూనెతో తల మసాజ్ చేయడం వల్ల మెదడుకు చల్లదనం కలిగి, నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. చర్మంపై ఉపయోగిస్తే చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. చిన్న పిల్లలకు మసాజ్ చేయడానికి కూడా కొబ్బరి నూనె చాలా సురక్షితం. ఇంకా కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటంతో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, శరీరంలో అధిక వేడి వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు కూడా పరిమిత మోతాదులో కొబ్బరిని తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెంచదు. ఈ ఆధునిక జీవనశైలిలో రసాయనాలతో నిండిన ఆహారం ఎక్కువగా తీసుకుంటున్న మనకు, సహజంగా లభించే కొబ్బరి ఒక సంపూర్ణ ఆరోగ్య ఆహారంగా చెప్పవచ్చు. రోజువారీ ఆహారంలో కొబ్బరిని, కొబ్బరి నీటిని, కొబ్బరి నూనెను సరైన విధంగా చేర్చుకుంటే అనేక ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. అందుకే కొబ్బరికాయను కేవలం ఒక ఆహార పదార్థంగా కాకుండా, ఆరోగ్యాన్ని కాపాడే ప్రకృతి ప్రసాదించిన అమృతంగా భావించాలి.

కామారెడ్డి

రామారెడ్డి మండలంలో అక్రమ ఇసుక మాఫియాపై పోలీసుల ఉక్కు పాదం

రామారెడ్డి మండలం రెడ్డిపేట శివారులో ట్రాక్టర్‌తో ఇసుక దోపిడీ.. కన్నాపూర్‌లో శివారులో పట్టుకుని కేసు! కామారెడ్డి,2 ఫిబ్రవరి, ( పున్నమి ప్రతినిధి ) :. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపెట్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అనుమతులు లేకుం డా దూసుకెళ్లిన ట్రాక్టర్ రామారెడ్డి ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. ఘటనకు సంబంధించిన వివరాలు రామారెడ్డి మండలం రెడ్డిపేట శివారులో కొయ్యల లింబాద్రి అనే వ్యక్తి తన ట్రాక్టర్‌తో ఎలాంటి అను మతులు లేకుండా పెద్దఎత్తుగా ఇసుకను అక్ర మంగా తరలిస్తూ.. కన్నాపూర్ శివారులో పక్కా సమాచారం మేరకు పోలీసులు, ఎస్ఐ రాజశేఖర్ నేతృత్వంలోని రెవెన్యూ అధికారులతో కలిసి వెంటనే ట్రాక్టర్‌ను సీజ్ చేసి, కఠిన కేసు నమోదు చేశామన్నారు. ఇది కేవలం ఒక్క ట్రాక్టర్ కాదు – ఇసుక మాఫియా దూకుడుకు సవాలైన చర్య!ఎస్ఐ రాజశేఖర్ స్పష్టమైన హెచ్చరిక.. ఎవరినీ వదలమని చెప్పారు. అనుమతులు లేకుండా చట్టవిరుద్ధ పనులు చేస్తే.. ఎవరినీ చూడకుండా కేసులు నమోదు చేస్తామంటూ ఎస్ఐ రాజశేఖర్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. మండలంలో ఇసుక దోపిడీకి గురి కాకుండా పకడ్బందీ చర్యలు తీవ్రత రం చేపడుతున్నామని అన్నారు. స్థానికుల సర్దు కునేలా, చట్టాన్ని దెబ్బతీయడానికి ఎవరూ ముందుకు రారని స్పష్టం చేశారు.మండలంలో ఇసుక మాఫియా దూకుడు వెంటనే ఆపివేయాల న్నారు. రామారెడ్డి మండలంలో ఇలాంటి అక్రమ ఇసుక రవాణా ఘటనలు ఎక్కువైపోతున్నాయి. పర్యావరణానికి, చట్టానికి గట్టి దెబ్బ తీస్తున్న ఈ మాఫియా కార్యకలాపాలకు పోలీసులు గట్టిగా బుద్ది చెపుతామన్నారు. స్థానిక ప్రజలు అపోహలు వదిలి, సమాచారం అందించాలని పిలుపు నిచ్చా రు. ఎక్కడైనా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు.

కడప

ప్రొద్దుటూరులో దారుణం చోటుచేసుకుంది

కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం వైఎంఆర్ కాలనీ గురుసాయి అపార్ట్మెంట్లో దారుణం చోటుచేసుకుంది. అపార్ట్మెంట్లో 5వ అంతస్తు నుండి ఆడుకుంటున్న 8వ తరగతి చరిత కిందపడి మృతి . “ఎరువుల దుకాణంలో పనిచేస్తున్న తన తండ్రి పొట్టి పార్టీ రామచంద్రారెడ్డి ” . కేశవరెడ్డి హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న చరిత.

E-పేపర్

నేర్రపల్లి లో శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయ ప్రధమ వార్షికోత్సవ

నేర్రపల్లి లో శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయ ప్రధమ వార్షికోత్సవ పున్నమి న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : 02 ఫిబ్రవరి 2026 నేర్రపల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయ ప్రధమ వార్షికోత్సవ ఆహ్వానం మేరకు ప్రత్యేక పూజలో పాల్గొన్న పాలకవర్గo అనంతరం ఆలయ కమిటీ సభ్యులు హాజరైనా పాలకవర్గానికి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ హేమలత శ్రీహరి, ఉప సర్పంచ్ వెలగ వేణుగోపాల్ రెడ్డి వార్డు మెంబెర్స్ మేకల పద్మ-జంగయ్య యాదవ్,గుడ్డేటి అరుణ్ కుమార్ యాదవ్ తో పాటు ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు…

E-పేపర్

అంబరాన్ని అంటిన జాతర సంబరాలు

*అంబరాన్ని అంటిన జాతర సంబరాలు ** రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : పున్నమి న్యూస్ ప్రతినిధి 02 ఫిబ్రవరి 2026 అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి ఆరుట్ల జాతర* *ఘనంగా శ్రీ శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి రధోత్సవం* – అట పాటలలో గ్రామ పెద్దలు -యువతి యువకులు – ⁠- ⁠ప్రత్యేక కార్యక్రమలతో ఆకట్టుకుంటున్న *కళాకారులు* – ⁠సకలసౌజర్యలు కల్పించిన *గ్రామ పంచాయతీ* – ⁠చిన్న నాటి మిత్రులను కలుసుకున్న క్లాసుమేట్ లు * ఆరుట్ల గ్రామం లో ఎన్నో ప్రతిష్టగా జరిగే శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణం రుక్మిణి సత్యభమా కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభావంగా జరిగింది , ఆరుట్ల. గ్రామస్తులతో పాటు చుట్టూ వున్నా పలు గ్రామాల ప్రజలు జాతరకు వచ్చి రాదోత్సవం నుచూసి ఆనందించారు , ప్రతి సంవత్సరం జరిగే జాతర ను ఈ. సంవత్సరం. నూతన. పాలక మండలి ప్రత్యేక శ్రద్ద తో వినూత్న కార్యక్రమాలు నిర్వహించండం విశేషం , హైద్రాబాద్ లో నివసిస్తున్న ఆరుట్ల గ్రామస్తులు వచ్చారు * ⁠ఈ కార్యక్రమం లో ఆరుట్ల గ్రామ సర్పంచ్. మానుపటి శోభ కుమార్, ఉపసర్పంచ్ నూకం రాజు ముదిరాజ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాతిరి ఎల్లేష్ BRS పార్టీ మండలం అధ్యక్షులు చీరాల రమేష్, PACS మాజీ చైర్మన్లు మొద్దు సికిందర్ రెడ్డి, వేదిరే హనుమంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు కొంగరి విష్ణు వర్ధన్ రెడ్డి, అనంగాళ్ల యాదయ్య, సుంకరి పండారిగౌడ్, మాజీ ఉపసర్పంచ్ పండాల జంగయ్య గౌడ్, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ యండి జానీపాషా ,గ్రామ పెద్దలు మాడ్గుల కృష్ణ గౌడ్, కొంగరి జనార్దన్ రెడ్డి, చిందం జంగయ్య, మెండు సత్తి రెడ్డి, నర్సిరెడ్డీ,రఘుపతి, శ్రీనివాస్ గౌడ్, రావుల రాఘవ, బడ్డు విజయ్, కంబాలపల్లి భాస్కర్, దంటు మధుసుదన్ రెడ్డి, వార్డు సభ్యులు పున్నం రాము, కొండిగారి శ్రవణ్, పంది శేఖర్, అనగాళ్ల జగన్, మంకు మమతావినోద్, మంద మాధవి మౌహన్ రెడ్డి, రావుల జంగయ్య, భాను, మాడ్గుల బాలమణి, మొర్రి పద్మా ఐలయ్య, మొహమ్మద్ ఇమ్రాన్, లాలగారి మణెమ్మ, సాతిరి సత్యం, తదితరులు వున్నారు

తెలంగాణ

మాజీ ఎమ్మెల్యే ఎస్ సీ వి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వానం

శ్రీ కాళహస్తి, పిబ్రవరి 02, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తీశ్వర మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు ఎస్ సీ వి నాయుడు కు దేవస్థానం అధికారులు ప్రోటోకాల్ ఏ ఈ ఓ మోహన్, ఆలయ సూపర్డెంట్ నాగభూషణం యాదవ్ తదితర అధికారులు ఆయన నివాసంలో కలిసి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వాన పత్రికలు అందజేశారు. అనంతరం వేద పండితులు ఎస్ సి వి నాయుడు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలని, భక్తులకు సదుపాయాలు కల్పించడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఎస్ సి వి నాయుడు సూచించారు. తమవంతు నిర్మాణాత్మక సహకారం అందిస్తామని మాజీ ఎమ్మెల్యే ఎస్ సి వి తెలిపారు.

తిరుపతి

హిందు పరిరక్షణకై దేవస్థాన ఈవోకి వినతి పత్రం

శ్రీ కాళహస్తి, పిబ్రవరి 02, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానములో హిందు వ్యతిరేకవాదులు విధులు నిర్వహిస్తున్నారన్న విషయాన్ని గ్రహించిన హిందూ చైతన్య వేదిక కార్యకర్తలు శ్రీకాళహస్తీశ్వర ఆలయ పరిపాలనాధికారిని ఆయన కార్యాలములో కలసి వారిని వెంటనే విధులను నందు తొలగించాలని, అన్యమతస్తులను శ్రీకాళహస్తి వాయు లింగేశ్వర జ్ఞాన ప్రసూనాంబ క్షేత్రంలో విదుల నిర్వహణ తొలగించాలని, రాబోవు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో అన్యమసస్తులైన బ్రహ్మకుమారి సమాజం వారు హిందూ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తారాని, వారికి ఎటువంటి స్టాల్స్ వంటి సదుపాయాలకు అవకాశం ఇవ్వకూడదని వినతి పత్రం అందజేశారు. వినతి పత్రం స్వీకరించిన ఆలయ ఈవో బాపిరెడ్డి సానుకూలంగా స్పందించి హిందు వ్యతిరేకవాదులను గుర్తించి వారిని విధులనుంది కచ్చితంగా తొలగిస్తామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుమారస్వామి హిందూ చైతన్య వేదిక జిల్లా కార్యదర్శి, కిరణ్,తిరుపతి నగర న్యాయ విభాగ కార్యకర్త, సుమన్, శ్రీకాళహస్తి ఖండ కార్యదర్శి, సుకుమార్, యన్ నాగరాజు, శివకుమార్, అచ్యుత్, నాగరాజు, సుధాకర్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి

గిరిజన కుటుంబానికి గ్యాస్ సిలిండర్ పాత్రసామానులు వితరణ చేసిన జనసేన సైనికులు

శ్రీ కాళహస్తి, పిబ్రవరి 02, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం పూడి గిరిజన కాలనీలో జనసేన పర్యటన చేసినప్పుడు ఒక కుటుంబం కొద్దిరోజుల క్రితం తమ ఇల్లు కాలిపోవడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులు దగ్ధం అయిపోయాయని పాత్ర సామానులు, సిలిండర్ తో పాటు అన్ని దగ్ధమైపోయాయని ఆవేదన వ్యక్తం చేయడంతో వారి దీనవస్తని చూసి వెంటనే స్పందించినటువంటి జనసేన పార్టీ పేట బ్రదర్స్ మిత్రబృందంతో కలిసి తమ వంతు భరోసాగా ఆ కుటుంబానికి సహాయంగా నిలబడుతూ గ్యాస్ సిలిండర్, పాత్ర సామాన్లు, నిత్యవసర సరుకులు, ఇవ్వడం జరిగింది, గిరిజన కాలనీవాసులు అందరూ కూడా సాటి కుటుంబానికి చూపించినటువంటి సహాయక చర్యలను చూసి నాయకులందరుకు కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, జానీ,గంధం శీను, కళ్లిపూడి వెంకటేష్, నాదెండ్ల రాజేష్, ప్రదీప్ కుమార్, మనీ, నవీన్, లక్ష్మణ్, హరి, డాక్టర్ నక్క ప్రసాద్, మహేష్, పసల సురేష్, పసల ఎలిషా, ముని చంద్ర,రమేష్ బాబు, శాంతి కుమార్, నాగరాజు, చందు,గోపి, సాయి, గిరిజన కాలనీవాసులు పాల్గొన్నారు.

తిరుపతి

రాజికియ ప్రముఖులకు శివరాత్రి ఆహ్వానపత్రిక అందజేసిన ట్రస్ట్ బోర్డ్ మెంబర్

శ్రీ కాళహస్తి, పిబ్రవరి 02, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన పాలక మండల సభ్యులు కొప్పెర్ల నాగరాజు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కు, అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులుకు, వేలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కు, దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ల శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం మహాశివరాత్రి వేడుకలకు హాజరుకావాలని ఆహ్వాన పత్రికలను అందజేశారు.ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు కొప్పాక వెంకటేశ్వరరావు, ఏలూరు జిల్లా పార్లమెంట్ సాధికారక సభ్యులు కొప్పాక వీరవెంకటసత్యనారాయణ నియోజకవర్గ నారాలోకేష్ యువజన ఫౌండేషన్ కార్యదర్శి చక్రపు మారేశ్వరరావు కలిసి ఆహ్వాన పత్రిక అందించారు.

తిరుపతి

ఆంధ్రప్రదేశ్‌కు బాసటగ రూపొందిన కేంద్ర బడ్జెట్ విధానంపై తెదేపా నాయకుల హర్షం

శ్రీ కాళహస్తి, పిబ్రవరి 02, పున్నమి న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిన అంశాల్లో మరింతగా దూకుడుగా వెళ్లేందుకు, అభివృద్ధికి సహకరించేలా నిన్నటి రోజు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి బాసటగా నిలుస్తుందని వన్నెకుల క్షత్రియ సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్ కొనియాడారు. డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్లో ఏపీ ఖనిజ వనరులున్న రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తామన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్… రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ కోసం ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. అటు శ్రీకాకుళం నుండి ఇటు కృష్ణా జిల్లా వరకు ఉన్న సముద్ర తీరం వెంబడి 200 మిలియన్ టన్నుల అతి విలువైన బీచ్ శాండ్ ఖనిజ నిల్వలు ఉన్నాయని తెలిపారు. హైస్పీడ్ రైల్ కారిడార్ హైదరాబాద్-బెంగుళూరు, హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ ద్వారా రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు సమకూరబోతున్నాయని, దేశంలో మొత్తం ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్ లు ఏర్పాటు చేస్తుండగా… అందులో మూడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తిరుపతి, అమరావతి వంటి ప్రాంతాలు ఈ హైస్పీడ్ కారిడార్లల్లో కవర్ అవుతాయని తెలిపారు. దీని ద్వారా హైదరాబాద్, అమరావతి, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలన్నీ కూడా అనుసంధానం అవుతాయని హర్షం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు ఆర్థిక భరోసా నదుల అనుసంధానం ప్రక్రియలో భాగంగా వృధాగా సముద్రంలో కలిసే గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవసరాలకు వినియోగించుకునే ఉద్దేశంతో గోదావరి నదిపై నిర్మిస్తున్న జాతీయ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు మంజూరు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఇదివరకటి లాగానే వచ్చే ఆర్ధిక సంవత్సరానికి కూడా సుమారు 3,300 కోట్ల రూపాయలు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. డేటా సెంటర్‌కు పన్నుల నుండి ఉపశమనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే వివిధ కంపెనీల డేటా సెంటర్లకు పన్ను మినహాయింపులు 2047 వరకూ ఇస్తూ కేంద్ర బడ్జెట్ లో ప్రతిపాదనలు పెట్టడం ద్వారా విశాఖపట్నంలో నెలకొల్పే గూగుల్ సహా వివిధ డేటా సెంటర్ లకు భారీ ప్రోత్సాహకంగా ఉంటుందని,ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు ఊతమిచ్చేలా ఈ డేటా సెంటర్లు తయారవుతాయని సంతోషం వ్యక్తం చేశారు. పర్యాటకానికి ఊతం పర్యాటకానికి ఊతమిచ్చేలా అరకు రీజియన్ అభివృద్ధి అంశాన్ని కేంద్ర బడ్జెట్లో పెట్టి ‘మౌంటైన్ ట్రైల్స్’ అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే పులికాట్ సరస్సు అభివృద్ధికి కూడా బడ్జెట్లో నిధులు కేటాయించి, అక్కడకు వచ్చే వివిధ జాతుల పక్షులను వీక్షించడం కోసం ‘బర్డ్ వాచింగ్ ట్రైల్స్’ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సంకల్పించడం శుభపరిణామం అని కొనియాడారు. అమరావతి అభివృద్ధికి అండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ అభివృద్ధి కొరకు కేంద్ర బడ్జెట్ లో 1,561 కోట్ల రూపాయలు కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోభివృద్ధి కొరకు ఎంతో ఉపయుక్తంగా ఉండే విధంగా నిన్నటి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో మనకు నిధులు కేటాయించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి,ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ…. కేంద్రం నుండి మన రాష్ట్రానికి పెద్దయెత్తున నిధులు రాబట్టడానికి విశేషంగా కృషి చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, మంత్రి నారా లోకేష్ బాబు కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వన్నెకుల క్షత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, తెలుగుదేశం పార్టీ బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు, తంగేళ్ళ పాలెం పిఏసియస్ ఛైర్మన్ బీమాల భాస్కర్ ముదిరాజ్, శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్‌ కోట చంద్రశేఖర్,తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి చిల్లకూరు మణి,మురళీ నాయుడు,గంగనపల్లి రమేష్,కృష్ణమూర్తి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.