Tuesday, 10 March 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు మండలంలో పెట్రోల్ నిల్వలపై బోర్లు వేసి పరిశీలన

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి ( పున్నమి ప్రతినిధి). మనుబోలు మండలంలోని చెర్లోపల్లి, కుడితిపల్లి గ్రామాల్లో పెట్రోల్ నిల్వలు ఉన్నాయంటూ బోర్లు వేసి సాయిల్ టెస్ట్ చేస్తున్నారు. సుమారు 60 అడుగుల లోతులో తవ్వకాలు చేపట్టి, సాటిలైట్ ద్వారా గుర్తించిన సమాచారం ఆధారంగా పరీక్షలు జరుగుతున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. గ్రామస్తుల్లో ఈ అంశంపై ఆసక్తి నెలకొంది. పెట్రోల్ లభిస్తే భూముల ధరలు పెరుగుతాయని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు గ్రామ అభివృద్ధిపై చర్చిస్తున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు మండలంలోని బైరవరం సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి కీ సీపీఎం పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు

దుత్తలూరు మండలంలోని బైరవరం సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి కీ సీపీఎం పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు సీపీఎం పార్టీ నేలటూరి సింహాద్రి మాట్లాడుతూ ఈ నెల 12-2-2026 తేదీన అఖిల భారత సర్వత్రిక సమ్మె జయప్రదం చేయాలనీ, అనంతరం ఈ సమ్మెకు అధిక సంఖ్యలో అన్నీ కార్మికుల సంఘాలు పాల్గొనాలని వారు మాట్లాడారు, ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయకులు దుత్తలూరు మండలం ప్రధాన కార్యదర్శి నేలటూరి సింహాద్రి, నేలటూరి లచ్చయ్య, నందిపాడు మళ్ళీ ఖార్జున,పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

ఒక్క నిర్ణయం వందల ప్రాణాలు కాపాడుతుంది – తూర్పుగోదావరి అధికారులకు ప్రజల విజ్ఞప్తి

పున్నమి ప్రతినిధి తాళ్లపూడి :తూర్పుగోదావరి జిల్లా ట్రాఫిక్, రవాణా శాఖ అధికారులకు జిల్లా ప్రజల తరఫున ఇది ఒక వినమ్రమైన అత్యవసర విన్నపం. హెల్మెట్ లేకపోతే జరిగే ప్రమాదాల గురించి అధికారులు ఎన్ని సార్లు చెప్పినా, హెచ్చరించినా, వాహనదారుల్లో ఇంకా పూర్తి అవగాహన రావడం లేదు. దాని ఫలితంగా ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు, ప్రాణనష్టం మన కళ్లముందే జరుగుతున్నాయి. విజయవాడ నగరంలో ట్రాఫిక్ నియమాలను కఠినంగా అమలు చేస్తూ, హెల్మెట్ ధరించని వారిపై భారీ జరిమానాలు విధించడం వల్ల అక్కడ ప్రమాదాలు కొంతమేర తగ్గినట్టు అందరూ గమనిస్తున్నారు. అదే తరహాలో రాజమండ్రి నగరం మరియు పరిసర ప్రాంతాల్లో కూడా కఠినమైన ట్రాఫిక్ నియమాలు అమలు చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఇటీవల రెండు రోజుల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కేవలం హెల్మెట్ ధరించి ఉంటే ముగ్గురు వ్యక్తులు ప్రాణాలతో బయటపడేవారని స్థానికులు భావిస్తున్నారు. ఈ సంఘటన అందరినీ కలచివేసింది. చట్టం సడలింపు ప్రాణాలకు ముప్పు అనే విషయం మరోసారి స్పష్టమైంది. అధికారులారా, ఇది జరిమానాల విషయం కాదు… ఇది ప్రాణాల విషయం. హెల్మెట్ ధరించని వారిపై ఎలాంటి మినహాయింపులు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటేనే ప్రజల్లో భయం కాదు, బాధ్యత పెరుగుతుంది. ప్రత్యేక డ్రైవ్‌లు, అవగాహన కార్యక్రమాలు, నిరంతర తనిఖీలు చేపట్టాలని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు. ప్రాణం ఉన్నప్పుడు చట్టం పాటించడమే నిజమైన విజ్ఞత. ఒక చిన్న నిర్ణయం వందల కుటుంబాల్లో వెలుగు నింపగలదు. జిల్లా రహదారులు సురక్షితంగా మారేందుకు తక్షణమే కఠిన నిర్ణయం తీసుకోవాలని తూర్పుగోదావరి ప్రజలు అధికారులను వినమ్రంగా కోరుతున్నారు.

రాజన్న సిరిసిల్ల

సీ డబ్ల్యూ ఎఫ్‌ ఐ జాతీయ మహాసభలకు రాజస్థాన్ రాష్ట్రం శికర్‌కు బయలుదేరిన తెలంగాణ ప్రతినిధులు

రాజన్న సిరిసిల్ల జిల్లా /పున్నమి ప్రతినిధి /ఫిబ్రవరి బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2026 ఫిబ్రవరి 6, 7, 8 తేదీలలో రాజస్థాన్ రాష్ట్రంలోని శ్రీకర్‌లో జరగనున్న జాతీయ మహాసభలకు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు ఫిబ్రవరి 4వ తేదీ రాత్రి బయలుదేరారు. ఈ మహాసభల్లో దేశవ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, కార్మిక హక్కుల పరిరక్షణ, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై సమగ్రంగా చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నట్లు యూనియన్ నాయకులు తెలిపారు. ఈ జాతీయ మహాసభలకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి డెలిగేట్‌గా జిల్లా బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు, రాష్ట్ర కమిటీ సభ్యుడు గీస బిక్షపతి పాల్గొనే అవకాశాన్ని పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ: “దేశవ్యాప్తంగా కార్మిక వర్గం తీవ్రమైన అన్యాయాలకు గురవుతోంది. కార్మిక చట్టాల నిర్వీర్యం, సంక్షేమ పథకాల కోతలు, అసంఘటిత కార్మికుల నిర్లక్ష్యం వంటి సమస్యలపై ఈ జాతీయ మహాసభల్లో బలమైన కార్యాచరణ రూపొందిస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కార్మికుల సమస్యలను జాతీయ వేదికపై వినిపించేందుకు ఈ అవకాశం ఉపయోగపడుతుంది” అని తెలిపారు. ఈ మహాసభల్లో రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారని, కార్మిక–కర్షక ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు మండలం బైరవరం గ్రామoలో పసి కందు మృతి

దుత్తలూరు మండలంలోని బైరవరం గ్రామం sc కాలనీలో మూడు నెలల పసికందు మృతి చెందింది ఈ విషయం తెలుసుకున్న దుత్తలూరు వైద్యులు ఆయాబ్ అప్సర్ సిబ్బందితో కలిసి వారి నివాసానికి వెళ్లి పరిశీలించారు బుధవారం ఉదయం అంగన్వాడీ కేంద్రంలో ఆ పసి కందుకు వ్యాక్సిన్ వేశారని రాత్రి 10 గంటలకు మృతి చెందినట్లు వెల్లడించారు కానీ వ్యాక్సిన్ వెయ్యడం వల్ల మృతి చెందలేదని అన్నారు, మూడు నెలల పసికందు వ్యాక్సిన్ వల్లనే మృతి చెందినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తుస్తన్నారు.

హైదరాబాద్

ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల భవిష్యత్తు కోసం రాజీలేని పోరాటం రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర శాఖ

*💥పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో చట్ట సవరణ చేసి, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను TET ఉత్తీర్ణత నుండి మినహాయించండి -* *శానమోనినర్సిములు RUPP-TS రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 5/02/2026* ప్రభుత్వ సర్వీసులో ఇప్పటికే పనిచేస్తున్న ఉపాధ్యాయులకు TET పరీక్ష నుంచి మినహాయింపు కల్పించాలని డిమాండ్ చేస్తూ రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ – తెలంగాణ రాష్ట్రం (RUPP-TS) కేంద్ర ప్రభుత్వంపై గట్టి ఒత్తిడి తీసుకువచ్చింది. *ముఖ్య అంశాలు* 🔹 కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి: గౌరవ కేంద్ర మంత్రులు శ్రీ కిషన్ రెడ్డి గారు, శ్రీ బండి సంజయ్ గారు, మరియు ఎంపీలు శ్రీమతి డి.కె. అరుణ గారు, శ్రీ మల్లు రవి గారికి వినతిపత్రాలు సమర్పించడం జరిగింది. *🔹 చట్ట సవరణ అవసరం:* RTE అమలుకు ముందు నియామకమైన వారికి TET మినహాయింపునిస్తూ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. *🔹 NCTE నిర్లక్ష్యం:* జాతీయ ఉపాధ్యాయ శిక్షణ సంస్థ (NCTE) నిర్లక్ష్యం వల్లే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందని, కేంద్రం వెంటనే రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని RUPP-TS విమర్శించింది. *🔹 ఢిల్లీ యాత్ర – ఫిబ్రవరి 16:* భావసారూప్యం గల సంఘాలతో కలిసి ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రులు మరియు ఉన్నతాధికారులను కలసి ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించడమైనది. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శానమోని నర్సింహులు, ప్రధాన కార్యదర్శి శ్రీ శశికుమార్ యాదవ్, గౌరవ అధ్యక్షులు శ్రీ ఎం.ఎన్. విజయ్ కుమార్, గౌరవ సలహాదారులు శ్రీ కే. గోపాల్ జీ, నాన్-TET ఫోరం కన్వీనర్ శ్రీ అమీర్ పాషా, మరియు రాష్ట్ర ముఖ్య నేతలు, జిల్లా బాధ్యులు ఈ పోరాటంలో పాల్గొంటున్నారు. *”ఉపాధ్యాయుల భవితవ్యం కోసం – రాజీలేని పోరాటం!”*

మహబూబ్ నగర్

ఇన్సర్విస్ ఉపాధ్యాయులందరికీ టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్

*ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులందరికీ టెట్ నుండి మినహాయించాలని* *రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు డిమాండ్* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ తేదీ 05/02/ 2026* ప్రభుత్వ సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయించాలని డిమాండ్ చేస్తూ .. రాష్ట్ర అధ్యక్షులు శానమోని నర్సింలు ప్రధాన కార్యదర్శి శశి యాదవ్ గౌరవ అధ్యక్షులు ఎం ఎన్ విజయ కుమార్ గౌరవ సలహాదారులు కే గోపాల్ జి నాన్ టెట్ టీచర్స్ ఫోరమ్ కన్వీనర్ అమీర్ పాషా రాష్ట్ర ముఖ్య నేతలు బస్వోజు సుధాకరాచారి విజయ్ శ్రీనివాస్ గౌడ్ వెంకట స్వామి వీరేందర్ గౌడ్ రాంరెడ్డి లు జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయిస్తూ పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో చట్ట సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు గౌరవ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ లతో పాటు పార్లమెంట్ సభ్యులు డి కె అరుణ మల్లు రవి లకు వేరువేరుగా విజ్ఞప్తి చేశారు. విద్యా హక్కు చట్టం అమలు తేదీకి ముందు నియామకమైన ఉపాధ్యాయులు రెండేళ్లలో టెట్ ఎగ్జామ్ పాస్ కావాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని కోరారు. జాతీయ ఉపాధ్యాయ శిక్షణ సంస్థ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి తీర్పు వచ్చిందని అభిప్రాయపడ్డారు. తీర్పువచ్చి నాలుగు నెలలుగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయలేదని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ ఓ ప్రకటనలో విమర్శించింది. బావస్వరూప్యం గల *ఉపాధ్యాయ సంఘాలతో ఫిబ్రవరి 16న ఢిల్లీలోని కేంద్ర విద్యాశాఖ మాత్యులు* *కేంద్ర న్యాయ శాఖ మంత్రి మరియు ఉన్నతాధికారులను కలిసి వత్తిడి తేనున్నట్లుగా వారు తెలిపారు*

మహబూబ్ నగర్

ఇన్సర్విస్ ఉపాధ్యాయులందరికీ టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్

*ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులందరికీ టెట్ నుండి మినహాయించాలని* *రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు డిమాండ్* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ తేదీ 05/02/ 2026* ప్రభుత్వ సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయించాలని డిమాండ్ చేస్తూ .. రాష్ట్ర అధ్యక్షులు శానమోని నర్సింలు ప్రధాన కార్యదర్శి శశి యాదవ్ గౌరవ అధ్యక్షులు ఎం ఎన్ విజయ కుమార్ గౌరవ సలహాదారులు కే గోపాల్ జి నాన్ టెట్ టీచర్స్ ఫోరమ్ కన్వీనర్ అమీర్ పాషా రాష్ట్ర ముఖ్య నేతలు బస్వోజు సుధాకరాచారి విజయ్ శ్రీనివాస్ గౌడ్ వెంకట స్వామి వీరేందర్ గౌడ్ రాంరెడ్డి లు జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయిస్తూ పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో చట్ట సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు గౌరవ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ లతో పాటు పార్లమెంట్ సభ్యులు డి కె అరుణ మల్లు రవి లకు వేరువేరుగా విజ్ఞప్తి చేశారు. విద్యా హక్కు చట్టం అమలు తేదీకి ముందు నియామకమైన ఉపాధ్యాయులు రెండేళ్లలో టెట్ ఎగ్జామ్ పాస్ కావాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని కోరారు. జాతీయ ఉపాధ్యాయ శిక్షణ సంస్థ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి తీర్పు వచ్చిందని అభిప్రాయపడ్డారు. తీర్పువచ్చి నాలుగు నెలలుగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయలేదని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ ఓ ప్రకటనలో విమర్శించింది. బావస్వరూప్యం గల *ఉపాధ్యాయ సంఘాలతో ఫిబ్రవరి 16న ఢిల్లీలోని కేంద్ర విద్యాశాఖ మాత్యులు* *కేంద్ర న్యాయ శాఖ మంత్రి మరియు ఉన్నతాధికారులను కలిసి వత్తిడి తేనున్నట్లుగా వారు తెలిపారు*

కడప

కడప లో ఏడవ తేదీ న భూపేష్_రెడ్డి, జబీవుల్లా ప్రమాణస్వీకారం

*కడప లో ఏడవ తేదీ న భూపేష్_రెడ్డి, జబీవుల్ల ప్రమాణస్వీకారం.! రాజకీయంగా కీలక ఘట్టం* *#కడప_జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన #దేవగుడి_భూపేష్_రెడ్డి ప్రధాన కార్యదర్శిగాఎన్నికైన వై యస్ జబీవుల్లా #ప్రమాణస్వీకార_కార్యక్రమం ఈ నెల 7వ తేదీన కడప నగరంలో అత్యంత వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో టీడీపీకి దిశానిర్దేశం చేసే రాజకీయ ఘట్టంగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కడప నగరంలోని సున్నం బట్టీల సమీపంలో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయ ఆవరణంలో జరిగే ఈ కార్యక్రమానికి #భారీ_ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయనతో పాటు జిల్లా పార్లమెంటు ప్రధాన కార్యదర్శి జబీవుల్ల మరియు 40 మంది కార్యవర్గ సభ్యులంతా కూడా అదే రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.*

ఆంధ్రప్రదేశ్

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

సాగు నీటి సంఘాలను బలోపేతం చేసి రైతుల సమస్యలకు పరిష్కారం చూపే విధంగా సీఎం చంద్రబాబునాయుడు అమరావతి లో ఏర్పాటు చేసిన రైతన్న మీకోసం కార్యక్రమానికి బంటుమిల్లి నుండి బస్సు లో తరలి వెళ్లిన బంటుమిల్లి మండల నీటి సంఘాల అధ్యక్షులు.ఈ కార్యక్రమాన్ని స్థానిక MLA కాగితకృష్ణప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల సమస్యలు, కాలువల పటిష్టత, నీటి సంఘాల బలోపేతమే ఈ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఈ సదస్సుకు తరలి వెళ్లిన వారిలో బంటుమిల్లి DC చైర్మన్ బొర్రా కాశీ, ములపర్రు నీటి సంఘం అధ్యక్షులు చింతా వెంకటేశ్వరావు, కంఠమనేని మురళి, మరియు కూటమి నాయకులు తదితరులు ఉన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.