Friday, 24 April 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు

అమలాపురం, అక్టోబరు 22 (తూర్పు ఉదయం విలేఖరి) : స్థానిక కొంకాపల్లి క్షత్రియ కళ్యాణమండపంలో జరిగిన యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా సూపర్ స్టార్ ఉప్పలపాటి ప్రభాస్ రాజు పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు .ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ సత్తిబాబు రాజు, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి వెంకటేశ్వరరావు, ముత్యాల బాబీ, ఈతకోట నాగేశ్వరరావు, రొక్కాల నాగేశ్వరరావు, బిజిపి నాయకులు అడపా శ్రీను తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు

అమలాపురం, అక్టోబరు 22 (తూర్పు ఉదయం విలేఖరి) : స్థానిక కొంకాపల్లి క్షత్రియ కళ్యాణమండపంలో జరిగిన యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా సూపర్ స్టార్ ఉప్పలపాటి ప్రభాస్ రాజు పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు .ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ సత్తిబాబు రాజు, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి వెంకటేశ్వరరావు, ముత్యాల బాబీ, ఈతకోట నాగేశ్వరరావు, రొక్కాల నాగేశ్వరరావు, బిజిపి నాయకులు అడపా శ్రీను తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

25న శ్రీకాళహస్తిలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా

శ్రీకాళహస్తి: పట్టణంలోని విక్రమ్‌ డిగ్రీ కళాశాల నందు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యం లో ఈ నెల 25న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో జరిగే ఈ ఉద్యోగ మేళా ఉదయం 8:30 గంటలకు ప్రారంభమవుతుందన్నారు.పదవ తరగతి,ఇంటర్,ఐటీఐ,డిప్లమోమ,ఏదైనా డిగ్రీ, బీటెక్,పీజీ ఉత్తీర్ణత సాదించిన వారు అర్హులన్నారు.పలు బహుళజాతీయ కంపెనీలు పాల్గొనే ఈ జాబ్‌మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.సమాచారం కొరకు 7989508540. 8919889609 ఫోన్‌ నెంబర్లను సంప్రదించాలని కోరారు.

E-పేపర్

ఎక్కడైనా ప్రమాదకర పరిస్థితులు ఉంటే తెలియజేయండి ఎంపీడీవో నాగిరెడ్డి.

ఎడతెరిపి లేని వర్షం వలన ఎక్కడైనా ప్రమాదకర పరిస్థితులు ఉంటే అధికారులు తక్షణమే తెలియజేయండి.. రైల్వే కోడూరు ఎంపీడీవో నాగిరెడ్డి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం అక్టోబర్ 22 ( పున్నమి న్యూస్ ప్రతినిధి ) కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నిన్నటి ననుండి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షానికి మండల పరిధిలో ఉన్నటువంటి వాగులు, వంకలు, చెరువులు,రోడ్లు, పాఠశాలభవనాలు మరియు నివాస గృహాలు ఏవైనా ప్రమాదకర పరిస్థితిలో ఉన్నట్లయితే వాటి గురించి వీలైనంత త్వరలో సమాచారాన్ని తెలియజేయవలసిందిగా రైల్వే కోడూరు ఎంపీడీవో నాగిరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు మరియు గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి అంటువ్యాధులు ప్రభలకుండా దోమల నివారణకు తగు చర్యలు తీసుకొని వలసినదిగా సంబంధిత అధికారులను కోరారు పై విషయాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తూ చైతన్య పరుస్తూ ఆరోగ్య సూచనలు జారిచేస్తూ ఎలాంటి ప్రమాదాలకు మరియు వ్యాధుల బారిన పడకుండా వారికి సూచనలు ఇవ్వవలసినదిగా కోరారు

విశాఖపట్నం

బంగాళాఖాతంలోని తీవ్రఅల్పపీడనం

అమరావతి పున్నమి ప్రతినిధి విశాఖపట్నం 22-10-2025 బంగాళాఖాతంలోని తీవ్రఅల్పపీడనం రాబోయే 12 గంటల్లోపు వాయుగుండంగా బలపడనున్న నేపధ్యంలో ప్రభుత్వ యంత్రాంగం హై అలెర్ట్ ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి,దక్షిణకోస్తా తీరాల వైపు కదులుతూ ఆ తదుపరి 12 గంటల్లో మరింత బలపడే అవకాశం దక్షిణకోస్తా, రాయలసీమలో అతిభారీ వర్షాల నేపధ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతో హోం మంత్రి అనిత సమీక్ష. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయరాదు సహయక చర్యలకు NDRF, SDRF, పోలిస్, ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశం : హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత. జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ 24/7 అలెర్ట్ గా ఉండాలని ఆదేశం. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలి. వాతావరణ పరిస్థితులపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక మెసేజ్లు పంపాలని ఆదేశం. సహయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలి. ప్రజలు సురక్షితమైన భవనాల్లో ఉండాలి : .హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత.

విశాఖపట్నం

జగన్ రెడ్డిపై టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు ఫైర్*

*ఉద్యోగుల కంట్రిబ్యూషన్ నొక్కేసి నీతులా* *జగన్ రెడ్డిపై టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు ఫైర్* విశాఖపట్నం పున్నమి ప్రతినిధి సీపీఎస్ ఉద్యోగులకు సంబందించిన కంట్రిబ్యూషన్ సొమ్మును, జిపీఎఫ్ సొమ్మును వాడుకోవడమే కాకుండా అడుగడుగునా ఉద్యోగుల ప్రయోజనాలను దెబ్బకొట్టి వారి మధ్య చీలికలు తెచ్చిన మీరు, కూటమి సర్కార్ అమలు చేస్తున్న విధివిధానాలపై అడిగే హక్కు ఎక్కడిదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అనకాపల్లి నియోజకవర్గం సంస్థాగత ఎన్నికల పరిశీలకులు గంటా నూకరాజు అన్నారు కూటమి సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన డిఏ పై గంటా నూకరాజు స్పందించారు. అనుభవశీలి, రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఎంతో ముందు చూపుతో అడుగులు వేసే నాయకుడు, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల రూపకల్పనే ద్యేయంగా అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే హక్కు జగన్ రెడ్డికి లేదని అన్నారు. ఉద్యోగుల ప్రొవిడెండ్ ఫండ్, కంట్రిబ్యూషన్ సొమ్మును, చివరకు డ్వాక్రా అక్కచెల్లెమ్మలు దాచుకున్న సొమ్ములను వాడుకొని పాలన సాగించిన మీరు మాట్లాడటం దెయ్యాలు వేదాలు అల్లినట్లు ఉందని అన్నారు. ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల డిఏల విషయంలో చంద్రబాబు సర్కార్ సానుకూలంగా ఉందని అన్నారు. ఒకరోజు డిఏ ను ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ప్రకటించడం పట్ల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తే అధికారంలో ఉండగా ఒక్క డిఏ కూడా ఇవ్వని జగన్ రెడ్డి విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ఐదేళ్ల పాటు ఉద్యోగులతో చెడుగుడు ఆడుకున్న విషయాన్ని మర్చారా..? అని ప్రశ్నించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఐఆర్ కంటే ఫిట్ మెంట్ తక్కువ ఇచ్చిన సందర్భాలు లేవని అది ఒక్క జగన్ రెడ్డికే చెల్లిందని విమర్శించారు. పదవీవిరమణ అయితే డబ్బులు చెల్లించాల్సి వస్తుందని వయసును పెంచిన సంగతి మర్చారా..? అని నిలదీశారు. ప్రతిపక్షంలో ఉండగా ఉద్యోగ సంఘాలను పొగిడిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ విశ్వరూపం బయటపడిందని అన్నారు. సాక్ష్యాత్ గురువులనే మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టిన ఘనులని అన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందని అన్నారు. డిఏలు, పీఆర్సీ, మెడికల్ బిల్లులు, ఈఎల్స్, సీపీఎస్ కంట్రిబ్యూషన్ ను ఎగ్గొట్టడం.. జీతాలు, పెన్షన్స్ కూడా సరైన సమయానికి ఇవ్వకపోవడం వంటి దుశ్చర్యలు ఉద్యోగులు మర్చిపోరని గంటా నూకరాజు అన్నారు.

తిరుపతి

నిర్వాసితులను ప్రభుత్వం ఆదుకోవాలి – తలపా దామోదరం రెడ్డి

శ్రీకాళహస్తి అక్టోబర్ 22, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలోని కోర్టు సముదాయాల వెనకవైపు గల ప్రహరీగోడ కూలి గోడకి అనుకుని వున్న నివాస గృహాలు దెబ్బతిన్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు తలపా దామోదరం రెడ్డి బుధవారం నాడు సంఘటన స్థలానికి చేరుకుని నిర్వాసితులను పరామర్శించి, వారికి తమ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా తోడుగా ఉంటుందని తెలిపి శ్రీకాళహస్తి మండల తహశీల్దార్ కి ఫోన్ ద్వారా మాట్లాడి వార్కి పరిస్థితిని వివరించగా వారు వెంటనే స్పందిస్తూ సహాయక చర్యలు తప్పక చేపడతామని తెలిపడంతో తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ…..గోడకూలడం కారణంచేత నష్టపోయినటువంటి గృహాలకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం చెల్లించి వారిని ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, శంకర్, పురుషోత్తం, అరుణ్, చరణ్, సారధి తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కార్తిక మాస మహాలింగర్చన మహోత్సవం ప్రారంభం

అమలాపురం, అక్టోబరు 22 (పున్నమి ప్రతినిధి) : డా.బి. ఆర్ . అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఉప్పలగుప్తం మండలం , విలసవిల్లి గ్రామం , బసవయ్య అగ్రహారం లో వేంచేసి యున్న శ్రీ రామ మందిరం నందు 12 వార్షిక కార్తీక మాస మహాలింగార్చన మహోత్సవాలు ఘనంగా బుధవారం ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుబాష్ చే మహా గణపతి పూజ నిర్వహించి , ఈ కార్తీక మాస ఉత్సవాలకు సంకల్పంతో ప్రారంభించారు. ఉదయం మంత్రికి గ్రామ సర్పంచ్ సలాది ఊర్మిళా, సతీష్ గ్రామస్తులు, ఉత్సవ కర్త మున్నంగి రామకృష్ణ శర్మ, వేద పండితుల బృందం చే పూర్ణకుంభ స్వాగతం పలికారు. మున్నంగి రామకృష్ణ శర్మ , మంత్రి కు మహా లింగార్చన విశిష్టత తెలిపారు. ప్రతి రోజు మట్టి తో 365 శివలింగాలను తయారు చేసి మహాలింగార్చన పూర్వక రుద్రాభిషేకం నిర్వహిస్తామని ఉత్సవ కర్త తెలిపారు. అనంతరం మంత్రి సుభాష్ కు పండితులు వేదాశీర్వచనాలు, స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. ఇంతటి మంచి ఆద్యాత్మిక సనాతన ధర్మ కార్యక్రమాలను నిర్వహిస్తున్న మున్నంగి రామకృష్ణ శర్మ ను మంత్రి సుభాష్ అభినందించినారు.

తిరుపతి

అధిక వర్షాలపట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉందాలి…. ఎంపీపీ నిర్మల వాసుదేవ నాయుడు

తోట్టంబేడు అక్టోబర్ 22, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరపని వర్షాలపట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ నిర్మల వాసుదేవ నాయుడు ప్రకంటన ద్వారా కోరారు. తొట్టంబేడు మండలంలోని పలు పంచాయతీలో లోతట్టు ప్రాంతంలో ఉన్న వరినాట్లు, కొనతనేరి,ఇలకనూరు, పొయ్య, చియ్యవరం, చోడవరం, కొమ్మనగుంట, గురుకులపాలెం, పూడి, రౌతు సూరమాల, తదితర గ్రామాలలో పంట పొలాల్లో వరి నాట్లు పూర్తిగా మునిగిపోయాయని, అదేవిధంగా భారీ వర్షాలకు మండలంలోని ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు కొన్ని గ్రామాలలో పూరిగుడిసెలు, పడిపోవడం, ఇళ్లల్లో స్లాబులలో నుండి వర్షపునీరు ధారగా పడుతుంది. ఇండ్లు ఎప్పుడు కూలిపోటాయేమోనని మండల ప్రజలు భయాందోళన పడుతున్నారు. వర్షపు నీరు సజావుగా పోయే వసతిలేకపోవడంతో ఇళ్లల్లోకి నీరు చొచ్చుకు వచ్చి గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. లోతట్ట ప్రాంత ప్రజలు ఎక్కడికి పోలేక మండల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని అదేవిధంగా పలు ప్రాంతాలలో చెరువులు, వాగులు, వంకలు, తెగిపోయాయని, లోతట్ట ప్రాంత ప్రజలు భయం గుప్పెట్లో బతుకుతున్నారని ఎంపీపీ పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు, మండల వైఎస్ఆర్సిపి అధ్యక్షులు డాక్టర్ కోగిల సుబ్రహ్మణ్యంలు మాట్లాడుతూ.. భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను, మండల ప్రజలను, ఆయా పంచాయతీల నుంచి ప్రభుత్వాధికారులు పర్యవేక్షణ చేపట్టి బాధితులను ఆదుకుని, వర్షాలకు లోతట్టు ప్రాంత ప్రజలకు ఆహారాన్ని సమకూర్చి, వర్షాల కారణంగా అనారోగ్యంతో ఉన్నవారికి కనీస వైద్య సహాయాన్ని అందేలా సహాయక చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వర్షాలకు నష్టపోయిన రైతులను, కష్టాలలో ఉన్న మండల ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పొంగి ప్రవహిస్తున్న నల్లవాగును ఆత్మకూరు ఆర్డీవో, డిఎస్పి లు పరిశీలన..

అక్టోబర్ చేజర్ల పున్నమి ప్రతినిధి చేజర్ల మండలం లో గత వారం రోజులు గా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని యనమదల గ్రామ సమీపంలోని నల్లవాగు పొంగి ప్రవహిస్తుండడంతో.బుధవారం ఆత్మకూరు ఆర్డీవో పావని, డిఎస్పి వేణుగోపాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా వాగుకు రెండు వైపులా రోడ్డుపై ముళ్ళకంచెలను ఏర్పాటు చేయడంతో ఎలాంటి వాహనాలను వెళ్లకుండా చూడాలని సూచించారు. నల్లవాగు దగ్గర ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా రెవిన్యూ, పోలీస్ శాఖలు, , వివిధ మండల అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.