Friday, 24 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వరి పంటకు తీవ్ర నష్టం

నెల్లూరు రూరల్ (పున్నమి ప్రతినిధి ) అక్టోబర్నె 22: నెల్లూరు లో వరి పంట నష్టం. గత 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వరి పంట తీవ్రంగా దెబ్బతింది. జిల్లా వ్యాప్తంగా 5 వేల ఎకరాల్లో వరి కోత దశలో ఉండగా ఈవర్షాలతో 2387.5 ఎకరాల్లో వరి పంట నీట మునిగిందని వ్యవసాయ అధికారులు తెలిపారు. 890 మంది రైతులు ఇప్పటి వరకు నష్ట పోయారు. నష్టబోయిన రైతులకు వరికి, వేరుశనగకు హెక్టారుకు రూ. 15 వేలు పరిహారం ఉంటుందని వివరించారు. మరో కొన్ని రోజులు వర్షాలు ఉండడంతో పంట నష్టం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రతినిధి ) అక్టోబర్ 22:

జనగాం

టిప్పర్ల టైర్లలో గాలితీసి, నిరసన తెలుపుతున్న ఇప్పగూడెంవాసులు

స్టేషన్ ఘన్పూర్, అక్టోబరు 21 (పున్నమి): ఇప్పగూడెం గ్రామశివారు లోని, కుర్చపల్లికి వెళ్లే రోడ్డులో ఉన్న మట్టిఏనెల నుంచి అక్రమంగా మట్టి తర లిస్తున్న టిప్పర్లను గ్రామస్తులు అడ్డుకొని వాటి టైర్లలో గాలితీసివేసి నిరసన వ్యక్తం చేసిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. నిరసనకారులు మాట్లా డుతూ నిబంధనలకు విరుద్ధంగా 50 నుంచి 60 టన్నుల లోడ్తో టిప్పర్లను గ్రామంలో రోడ్లమీదుగా నడుపడడంతో రోడ్లు ధ్వంసం అవుతున్నాయని, మిష న్ భగీరథ పైపులైన్లు పగిలిపోయి, తాగునీరు రాకపోవడంతో ప్రజలు ఇబ్బం దులు పడుతున్నారన్నారు. ఇటీవల రూ.70లక్షలతో వేసిన రోడ్డుకు పగుళ్లు వస్తున్నాయన్నారు. సోమవారం తెల్లవారుజామున 12 టిప్పర్లు మట్టిని తర లిస్తుండగా 9 టిప్పర్లు తప్పించుకొని వెళ్లగా 3టిప్పర్లను పట్టుకొని గాలితీయ డం జరిగిందన్నారు. కార్యక్రమంలో నాయకులు లింగనబోయిన శ్రీనివాస్, ఎమీ షాబుద్దీన్, ఎమ్డి యాకుబ్ పాషా, గొడిశాల యాదగిరి, జిట్టబోయిన , న్యాయం చిరంజీవి, మేకల రాజు, మర్రి రవి, రాజు, యాదగిరి, చేరాలు, నాగయ్య, మునిగెల సోమేశ్వర్, నర్సింహులు పాల్గొన్నారు.

E-పేపర్

నెల్లూరు పొదలకూరు మధ్య రాకపోకలు బంద్

నెల్లూరు పొదలకూరు-నెల్లూరు మధ్య నిలిచిన రాకపోకలు నెల్లూరు రూరల్ (పున్నమి ప్రతినిధి ) అక్టోబర్ 22: పొదలకూరు మండలంలో భారీ వర్షాలు కురిశాయి. ఈక్రమంలో నావూరు వద్ద పెద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రోడ్డుపైకి నీరు చేరడంతో పొదలకూరు, నెల్లూరు, రాపూరుకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

తిరుపతి

వాయులింగేశ్వరుని సేవలో ఢిల్లీ హోమ్ మినిస్టర్

ఢిల్లీ హోమ్ మంత్రి శ్రీ ఆశిష్ సూద్ కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని బుధవారం దర్శించుకున్నారు.ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి రాహు కేతు పూజలు,అంతరాలయ దర్శనము చేయించారు.అనంతరం వారికి వేద పండితుల ఆశీర్వచనంతో పాటు స్వామి,అమ్మవార్ల తీర్ధ ప్రసాదాలను,చిత్ర పటాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి T.బాపిరెడ్డి, ప్రోటోకాల్ AEO మోహన్, ఆలయ AEO విద్యాసాగర్,పర్యవేక్షకులు నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి,APRO రవి పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రేపు సెలవు

*రేపు పాఠశాలలకు, జూనియర్ కళాశాలకు సెలవు* : *జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా* నెల్లూరు, అక్టోబర్ 22 : తుఫాను కారణంగా జిల్లాలో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ నెల 23న (గురువారం)* అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, అంగన్వాడీ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, జూనియర్ కళాశాలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ఉత్తర్వులను అన్ని రకాల పాఠశాలలు, జానియర్ కళాశాలల యాజమాన్యాలు విధిగా అమలుచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

తెలంగాణ

ఆకలేస్తే సొంత పిల్లల్ని చంపి తినే జంతువులు ఏవి?

పున్నమి:అక్టోబర్ 22 తెలంగాణ: మగ సింహాలు విపరీతమైన ఆకలితో ఉన్నప్పుడు వాటి పిల్లలను చంపి తింటాయి. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. కొండచిలువతో సహా కొన్ని పాము జాతులు అప్పుడప్పుడు వాటి పిల్లలను మింగేస్తాయి. అలాగే మగ హిప్పోలు, ఆడ పీతలు, చిట్టెలుకలు, సాలెపురుగు, ఆడ అక్టోపస్లు వాటి సొంత పిల్లలను తినేస్తాయి. ఆధిపత్య పోరులో భాగంగా మచ్చల హైనాలు, ఆహారం దొరకని సమయంలో ధ్రువ ఎలుగుబంట్లు వాటి పిల్లలను చంపుకు తింటాయి.

తిరుపతి

క్యాన్సర్ వ్యాది బాదితుని జన సైనికుల ఆర్దిక సాయం

తొట్టంబేడు మండలం శివనాదపాలెం పంచాయతీలోని హరిజనవాడకు చెందిన గురవయ్య అనే వ్యక్తి కుటుంబం తనకు గొంతు క్యాన్సర్ వ్యాదితో ఇబ్బందిపడుతు, అంతేకాకుండా ఈ వర్షాల కారణంగా ఆర్దిక పరిస్థితి సరిగా లేదని, ఆసుపత్రికి వెళ్లి సరైన వైధ్యంకూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నామని గురవయ్య కుటుంబం జనసేన నాయకులుకి విన్నవించుకోవడంతో సమాచారం తెలుసుకున్న జనసేన నాయకులు వెంటనే స్పందించన జనసేన నాయకులు పేట బ్రదర్స్ మిత్ర బృందంతో కలిసి బుదవారం నాడు స్వయంగా పేట బ్రదర్స్ మిత్ర బృందంతో కలసి శివనాదపాలెం పంచాయతీలోని హరిజనవాడకు వెళ్ళి నిస్సహాయతలో వున్న గురవయ్య కుటుంబానికి వాళ్ళ ఇంటికి వెళ్లి ఒక నెలకు సరిపడా బియ్యం, నిత్యవసర సరుకులు అందజేసి, చికిత్స నిమిత్తం మందులు, మాత్రలు కొనుక్కోవడానికి కొంత నగదును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా జనసేన నాయకులు పేట బ్రదర్స్ మాట్లాడుతూ.. తాము చేపడుతున్న ఈ సేవ కార్యక్రమాలు తమ నాయకుడు జనసేనాని, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కే చెందని ఎందుకంటే ఆయననే తమకు అదర్శమని వారు తెలిపారు. అనంతరం జన సైనికులు చేసిన సహాయనికి గురవయ్య కుటుంబ సభ్యులు చాలా సంతోషిస్తూ జన సైనికులకు వారు కృతజ్ఞతలను తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, మనీ, దినేష్, ముని చంద్ర, సాయి, గోపి, గ్రామస్తులు పాల్గొన్నారు.

తిరుపతి

ఎస్సీ కాలనీలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన వైకాపా నేత

శ్రీకాళహస్తి అక్టోబర్ 22, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరపని వర్షాలకారణంగా ఇబ్బంది పడుతున్న వారికి సాయం అందజేయాలని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునివ్వడంతో బి.యస్. ఆర్. పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా బీసీ సెల్ కార్యదర్శి విజయ్ కుమార్ రెడ్డి చొరవ తీసుకుని పట్టణ సమీపం లోని ఎస్సీ కాలనీలైన లక్ష్మీ కానీ, తుఫాన్ సెంటర్ లలో ఎస్సీ కాలనీలో వర్ష ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్న గిరిజలనుల బియ్యం, కూరగాయతోపాటు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వైసిపి జిల్లా బీసీ సెల్ కార్యదర్శి విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడతూ… అధిక వర్షాలకారణంగా కష్టాలలో ఉన్న ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఆలాగే దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తోచిన సయం అందించాలని అయన కోరారు.

తిరుపతి

ముక్కంటి సేవలో మాజీ మంత్రి ఆర్కే రోజా

శ్రీకాళహస్తి అక్టోబర్ 22, పున్నమి న్యూస్: దక్షణ కాశీగా పేరొందిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనార్ధం బుడవారం నాడు మాజీ మంత్రి ఆర్కే రోజా తనకుటుంబ సభ్యులతో విచ్చేసి శ్రీ స్వామి, అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి సరజి స్వామి, అమ్మవార్ల ప్రత్యెక దర్శన ఏర్పాట్లు చేయించి అనంతరం శ్రీ గురు మేధా దక్షణామూర్తి సన్నిధిలో వేద పండితులతో ఆశీర్వదించి శ్రీ స్వామి, అమ్మవార్ల శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, వైకాపా నాయకులూ లోకేష్ యాదవ్, శ్రీవారి సురేష్, తేజు రాయల్, ప్రసాద్, చందు తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి …పలువురికి గాయాలు

అమలాపురం, అక్టోబరు 22 (పున్నమి ప్రతినిధి) : అమలాపురం – కాకినాడ హైవే రోడ్డు, ముమ్మిడివరం దగ్గిర కోళ్లఫార్మ్ లారీ ద్విచక్ర వాహనం మీద వస్తున్న యానాం వాసులను బుధవారం ఉదయం అత్యంత వేగంగా డీ కొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు . సుమారు 60 సంవత్సరాలు ఉన్న పెద్దాయన కాళ్ళు విరిగి రక్తం కారుతు రోడ్డుపై మూలుగుతున్నారు. సుమారు 50 సంవత్సరాలు ఉన్న మహిళకు తలకు దెబ్బ తగిలింది. అదే సమయంలో విధి నిర్వహణలో అటుగా వెళుతున్న ఐ టి డి ఏ.ఎ పి డి. టి. విశ్వనాథ్ 108 అంబులెన్సుకి ఫోన్ చేశారు. అది రావడానికి లేట్ అవుతుందని తెలుసుకుని ఆటోలో అమలాపురం, కిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన బాధితుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ముమ్మిడివరం ఎస్ఐ జ్వాలోసాగర్ కేసు విచారణ చేస్తున్నారు. మానవతా దృక్పథంతో సేవలందించిన ఐ టి డి ఎ. ఏ పి డి విశ్వనాథ ను ప్రయాణికులు, పస్థానికులు అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదం ఎలా జరుగుద్దో ముందుగా ఎవరు ఊహించలేమని,. మనం మనవంతుగా జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోవాలి, వేగంగా వెళ్ళకూడదు, రూల్స్ తప్పకుండా పాటించాలని ప్రాణం కన్నా ముఖ్యం ఏదీ ముఖ్యం కాదని, కుటుంబ సభ్యులే ముఖ్యమని సూచించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.