Friday, 24 April 2026

Blog

అన్నమయ్య

చిట్వేల్ పోలీస్ స్టేషన్‌పై ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆకస్మిక తనిఖీ

ప్రజా సేవలో ‘మర్యాద’, కేసుల పరిష్కారంలో ‘వేగం’ అవసరం – ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ అన్నమయ్య జిల్లా పోలీస్ సేవల్లో పారదర్శకత, సమర్థత పెంపు లక్ష్యంగా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ బుధవారం చిట్వేల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ నిర్వహణ, రికార్డులు, కేసుల పురోగతి, సిబ్బంది సంక్షేమ అంశాలను ఎస్పీ సమీక్షించారు. పాత భవనం కావడంతో స్టేషన్‌కు తక్షణ మరమ్మత్తులు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. రికార్డులు సక్రమంగా నిర్వహిస్తూ, సీసీటీఎన్ఎస్ వ్యవస్థలో కేసుల వివరాలను క్రమం తప్పకుండా అప్‌లోడ్ చేయాలన్నారు. నమోదైన కేసుల విచారణను వేగవంతం చేసి, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని ఆయన ఆదేశించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా, వినయంగా ప్రవర్తించడం పోలీసుల కర్తవ్యం అని స్పష్టం చేశారు. చిట్వేల్ పోలీస్ స్టేషన్ జిల్లా సరిహద్దులో ఉన్నందున, అనుంపల్లి చెక్‌పోస్ట్ వద్ద నిరంతర తనిఖీలు నిర్వహించి అక్రమ రవాణాను అరికట్టాలని సూచించారు. సిబ్బంది సంక్షేమం పట్ల శ్రద్ధ చూపి, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఏఎస్పీ శ్రీ మనోజ్ రామనాథ్ హెగ్డే ఐపీఎస్, చిట్వేల్ ఎస్ఐ జి. నవీన్ బాబు మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

అన్నమయ్య

గుండాల కోన ఏరును పరిశీలించిన సబ్ కలెక్టర్ భావన : వర్షాల ప్రభావంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచనలు

సబ్ కలెక్టర్ భావన బాలిరెడ్డి పల్లి మీదుగా వెళుతున్న గుండాల కోన ఏరు ఆమె పరిశీలించారు. ఆమె వెంట తాసిల్దార్ యామిని రెడ్డి ఉన్నారు. ఆమె గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గత నాలుగు రోజుల నుండి వర్షాలు విస్తారంగా పడుతున్నాయని గ్రామీణ ప్రాంతాల్లో వాగుల్లో వంకల్లో నీటి శాతం పెరుగుతూ వస్తుందని ఇలాగే వర్షాలు కొనసాగితే వాగు పొంగి పొల్లుతుంద ని వై కోట బాలి రెడ్డిపల్లి గ్రామస్తులు ఈ వైపు నుండి వెళ్ళకూడదని ప్రమాదాలు పొంచి ఉన్నాయని ముఖ్యంగా వాహనదారులు ఈ దారి గుండా వెళ్లకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తంగా ఉండాలని ఆమె అధికారులకు సూచించారు. గుండాల కోన గుండా ఈ నీటి ప్రవాహం ఈ వైపునుండి ప్రవహిస్తూనే ఉంటుందని గ్రామ ప్రజలు కూడా అనవసరంగా బయటికి రావద్దని ఆమె ప్రజలు ఉద్దేశించి తెలిపారు. పలు ప్రాంతాలలో భారీ వర్షాల ప్రభావం వలన రాకపోకలకు అంతరాయం కలుగుతూ ఉందని అన్నిటిని దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని ఆమె ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయరావు,సెక్రటరీ సురేష్, ఆర్ ఐ ఎం మల్లికార్జున రెడ్డి, వీఆర్ఓ రాజశేఖర్ రెడ్డి, స్థానికులు జీవి రెడ్డి, గ్రామ ప్రజలు పలువురు ఉన్నారు.

అన్నమయ్య

గుంజన నది ఉద్ధృతి ఆందోళన కలిగిస్తోంది – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

వరద ప్రభావం అవకాశంపై హెచ్చరికలు – అధికారులు సిద్ధంగా ఉండాలని ఉప సర్పంచ్ ఉమామహేశ్వర్ రెడ్డి సూచన రైల్వే కోడూరు నియోజకవర్గంలో గుంజన నది పరివాహక ప్రాంతాల్లో వర్షాల ప్రభావం తీవ్రతరమవుతోంది. చిట్వేల్ మండల పరిధిలో నది నీటి మట్టం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉప సర్పంచ్ ఉమామహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. ఎక్కడైనా వరద ప్రవాహం లేదా నీటి నిల్వలు పెరిగినట్లు గమనిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. చిట్వేల్ సచివాలయం మరియు పంచాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ, అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. గుంజన నది ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఉమామహేశ్వర్ రెడ్డి ఒక ప్రకటనలో సూచించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీవారి నిధుల తో గుండె మడగల గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయానికి ఘనంగా భూమి పూజ..!

శ్రీవారి నిధుల తో గుండె మడగల గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయానికి ఘనంగా భూమి పూజ..! విశిష్ట అతిథులుగా హాజరైన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్..;! వర్షాన్ని సైతం లెక్కచేయక భూమి పూజ మహోత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొన్న నాయకులు భక్తులు..! ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం గుండెమడకల గ్రామంలో శ్రీవారి కోటి రూపాయల నిధులతో శ్రీ సీతా రామాంజనేయ ఆలయానికి భక్తుల జయజయ ద్వానాలు వేద పండితుల మంత్రోచ్ఛరణలతో శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. విశిష్ట అతిధులు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని, పూజించిన ఇటుకలను అందజేశారు. వేద పండితుల వద్ద ఆశీర్వాదాలు అందుకున్నారు. అనంతరం శ్రీ సీతారామాంజనేయ స్వామి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు ఆలయ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి గుండె మడగల గ్రామస్తులు , స్థానిక ప్రజా ప్రతినిధులు అపూర్వ స్వాగతంపలికారు. పెద్ద ఎత్తున బాణా సంచాలు కాల్చుతూ పూలను వెదజల్లారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానం నుండి కోటి రూపాయలు నిధులను మా నియోజకవర్గంలోని గుండెమడుగుల గ్రామానికి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అందించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. భూమి పూజ చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. గ్రామస్తులంతా కలిసికట్టుగా ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేసి, అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని తెలిపారు. నా వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ కోటి రూపాయల టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో గుండె మడకల గ్రామంలోశ్రీసీతారామాంజనేయ స్వామి వారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు.గుండెమడకల గ్రామంతో తమ కుటుంబానికి మంచి అనుబంధం ఉందని ఈ గ్రామ అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తానని తెలిపారు. ఈ ఆలయ నిర్మాణం కోసం స్థానిక నాయకులు, పలుసార్లు విజ్ఞప్తి చేశారని తెలిపారు.నేడు ఈ మహత్కార్యానికి శ్రీకారం చుట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని, ఆలయ నిర్మాణం తర్వాత కూడా ధూప దీప నైవేద్యానికి, శ్రీవారి ట్రస్ట్ ద్వారా నిధులు సమకూరు స్థానాన్ని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 5600 ఆలయాలకు ధూప దీప నైవేద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులను ఖర్చు చేస్తున్నామన్నారు. మా నియోజకవర్గంలోని మర్రిపాడు మండలంలో సోమశిల హై లెవెల్ పేస్ టు ద్వారా నేను ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఐదు రిజర్వాయర్లను మంజూరు చేశామని, వింజమూరు మండలం గుండుమడుగుల గ్రామం చెరువును ఆరో రిజర్వాయర్ గా పనులు వచ్చే పట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వాలు మారినందున, కొంత ఆలస్యం జరిగిందని, రైతులకు ఇబ్బంది లేకుండా, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లి నిధులను తీసుకువచ్చి పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. శ్రీ కాకర్ల సురేష్ సహకారంతో ఉదయగిరి నియోజకవర్గంలో అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అతిధులను గజమాలతో శాలువాలు తో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో,మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామి రెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పొన్నుబోయిన చంచల బాబు యాదవ్, సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవులు నాయుడు,రీజనల్ జాయింట్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ ఆజాద్, అసిస్టెంట్ కమిషనర్ జనార్దన్ రెడ్డి, డి ఈ సిహెచ్ శ్రీనివాసులు, అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయులు, మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి, సొసైటీ చైర్మన్ చల్లా వెంకటేశ్వర్ల యాదవ్, మాజీ ఎఫ్సీఐ డైరెక్టర్ అంకినపల్లి ఓబుల్ రెడ్డి, అంకినపల్లి శివశంకర్ రెడ్డి, కలిగిరి మండల కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు గణపం సుదర్శన్ రెడ్డి, ఉండేలా గురవారెడ్డి, గాలి రామ్మోహన్ నాయుడు, గాలి నరసప నాయుడు, బుర్రాల శ్రీనివాసుల యాదవ్, కే శ్రీనివాసులు నాయుడు, రైతు అధ్యక్షులు బొల్లినేని వెంకట రామారావు, మాజీ జడ్పి టి సి సభ్యులు దామా మహేష్, దుత్తలూరు మాజీ ఎంపీపీ చీకుర్తి రవీంద్రబాబు, మాజీ జడ్పిటిసి పాముల సుబ్బరాయుడు, మల్లంపాటి గురవయ్య నాయుడు, కూనల వెంకటేశ్వర్లు నాయుడు, అన్నపురెడ్డి వెంగళరెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు దిండు మహేష్, విశ్రాంతి డిఎం అండ్ హెచ్ ఓ కే మా శిలామణి, వంశీ నాదెళ్ల, ఇతర నాయకులు భక్తులు అధికారులు తదితరులు ఉన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రాపాక కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గొల్లపల్లి సూర్యరావు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం, కేసనపల్లి గ్రామం లో ఇటీవలే మరణించిన రాపాక కేశవరావు కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేసిన రాజోలు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గొల్లపల్లి సూర్యరావు . ఈ కార్యక్రమంలో గుబ్బల మనోహర్, ఉచ్చులు దాసు, తదితర నాయకులు పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్

వెల్దండ కెనరా బ్యాంక్ లో నిలిచిన సేవలు..

కరెంట్ లేక పని చేయని కంప్యూటర్లు .. ఖాతాదారుల ఇక్కట్లు.. వెల్దండ అక్టోబర్ 22 వెల్దండ మండల పరిధిలోని పెద్దాపూర్ గ్రామంలోని కెనరా బ్యాంకులో బ్యాంకింగ్ సేవలు నిలిచిపోవడంతో ఖాతాదారులు ఇక్కట్లు పడ్డారు. కరెంటు సరఫరా లేకపోవడంతో కంప్యూటర్లు పనిచేయక ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బ్యాంకు సేవలకు సరిపడ జనరేటర్ లేకపోవడంతో చివరికి డబ్బు కౌంటింగ్ చేయడానికి సైతం కౌంటింగ్ మిషన్ పనిచేయడం లేదు. కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ఖాతాదారులతో పాటు బ్యాంకు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే గోల్డ్ లోన్స్ కోసం రోజుల తరబడి బ్యాంక్ వద్ద పడిగాపులు కాయల్సి వస్తుందని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్ అధికారులు స్పందించి బ్యాంక్ సేవలకు కావలసిన సదుపాయాలు కల్పించాలని కోరారు.

నాగర్‌కర్నూల్

వెల్దండ కెనరా బ్యాంక్ లో నిలిచిన సేవలు..

కరెంట్ లేక పని చేయని కంప్యూటర్లు .. ఖాతాదారుల ఇక్కట్లు.. వెల్దండ అక్టోబర్ 22 వెల్దండ మండల పరిధిలోని పెద్దాపూర్ గ్రామంలోని కెనరా బ్యాంకులో బ్యాంకింగ్ సేవలు నిలిచిపోవడంతో ఖాతాదారులు ఇక్కట్లు పడ్డారు. కరెంటు సరఫరా లేకపోవడంతో కంప్యూటర్లు పనిచేయక ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బ్యాంకు సేవలకు సరిపడ జనరేటర్ లేకపోవడంతో చివరికి డబ్బు కౌంటింగ్ చేయడానికి సైతం కౌంటింగ్ మిషన్ పనిచేయడం లేదు. కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ఖాతాదారులతో పాటు బ్యాంకు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే గోల్డ్ లోన్స్ కోసం రోజుల తరబడి బ్యాంక్ వద్ద పడిగాపులు కాయల్సి వస్తుందని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్ అధికారులు స్పందించి బ్యాంక్ సేవలకు కావలసిన సదుపాయాలు కల్పించాలని కోరారు.

పల్నాడు

ఉప్పలపాడు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు

వెల్దుర్తి మండలం, ఉప్పలపాడు గ్రామంలో రూ. 20 లక్షల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డుకు భూమి పూజ చేసి, శంకుస్థాపన చేసిన మాచర్ల గౌరవ శాసన సభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి తనయుడు శ్రీ జూలకంటి సాయి వివేకానందరెడ్డి గారు, టీడీపీ యువ నాయకులు శ్రీ జూలకంటి అక్కిరెడ్డి గారు

తిరుపతి

తుఫాను బాధితులను పరామర్శించిన వీఆర్వో

తోటంబెడు మండలం లో ఎల్ఐసి కాలనీ ఈదల గుంట గ్రామాలలో సిపిఐ పిలుపుమేరకు సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారి దినేష్ తుఫాను బాధ్యతలను పరామర్శించడం జరిగింది సిపిఐ నాయకులు మించల శివకుమార్ మండల కార్యదర్శి రుద్రపాకు శ్రీనివాసులు వీఆర్వో కి వివరించారు నాయకులు మాట్లాడుతూ గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రతి ఇంటికి తిరిగి వారి బాదసాధకాలు వివరించారు కార్మికులు ఇండ్లు లలో పాసి పని చేసుకుంటున్నా వారికి పని లేక నాన్న ఇబ్బందులు పడుతున్నారని తిన్న డానికి తిండి లేక అల్లాడుతున్నారని వారికి ప్రభుత్వం తుఫాను బాధ్యతలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు అదేవిధంగా వీధి దీపాలు రోడ్లు పూర్తిగా లేవని వారికి సిమెంట్ రోడ్లు మురికి కాలువలు సంబంధిత అధికారులు ఏర్పాటు చేయాలని కోరారు అదేవిధంగా వీధులలో పారుతున్న మురుకునీర్లు వల్ల ప్రజలు అంటూ రోగాల బారిన పడే పరిస్థితి దాతరించిందని తక్షణమే ప్రభుత్వం వారికి సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు మాసారపు నరసింహారావు పరశురామయ్య సుబ్బమ్మ ధనలక్ష్మి కుసుమ శివమ్మ బాలాజీ వసుంధర అమరావతి తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ

తెలంగాణలో చెక్ పోస్టుల రద్దు.. ఆఫీసుల మూసివేత..

పున్నమి అక్టోబర్ 22 బిగ్ బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో అన్ని రవాణా శాఖ చెక్ పోస్టులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఈ మేరకు కమిషనర్ ఆదేశాలు సాయంత్రం 5 గంటల్లోగా కార్యాలయాలు మూసివేయాలని ఆదేశం మరికాసేపట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.