Friday, 24 April 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

గుడిమేల్లంక గ్రామకమిటీ ఆధ్వర్యంలో జరిగిన “కోటి సంతకాల ప్రజా ఉద్యమ రచ్చబండ” కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి గొల్లపల్లి.*

అంబేద్కర్ కోనసీమ జిల్లా అక్టోబర్( పున్నమి ప్రతినిధి) *గుడిమేల్లంక గ్రామకమిటీ ఆధ్వర్యంలో జరిగిన “కోటి సంతకాల ప్రజా ఉద్యమ రచ్చబండ” కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి గొల్లపల్లి.* మలికిపురం: అక్టోబర్ 22 (తూర్పు ఉదయం విలేకరి) రాజోలు నియోజకవర్గ ఇన్చార్జ్ గొల్లపెల్లి సూర్యరావు పిలుపుమేరకు నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు గుర్రం జాషువా ఆధ్వర్యంలో గుడిమేల్లంక గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షులు బల్ల కిరణ్ అధ్యక్షతన *”మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా” వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం గ్రామస్థాయి రచ్చబండ కార్యక్రమం* నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గుడిమేల్లంక గ్రామంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమ రచ్చబండ కార్యక్రమ కరపత్రాలను గొల్లపల్లి సూర్యా రావు కమిటీ వారికి అందజేసి, గ్రామానికి వెయ్యి సంతకాలు సేకరించి మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణను ఆపడంలో భాగస్వాములు కావాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా గొల్లపల్లి సూర్యరావు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వలన పేద మధ్యతరగతి విద్యార్థులు, తల్లిదండ్రులు ఏమి కోల్పోతారో గ్రామస్తులకు వివరించారు. విద్య వైద్యం ప్రతి ఒక్కరి హక్కు, ప్రతి కార్యకర్త ఈ విషయాలు ప్రజలకు తెలియపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో , జడ్పిటిసి బల్ల ప్రసన్న కుమారి, పెన్మత్స రంగరాజు, గుబ్బల మనోహర్, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు కూనపరెడ్డి రాంబాబు, జిల్లా అధికార ప్రతినిధి ఉచ్చుల విష్ణు, జిల్లా కార్యదర్శి మోకా సురేష్ , జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు చింత ప్రసాద్, చింత శ్రీను, పిప్పల్ల రాజు, కొల్లబత్తుల సతీష్, ఉచ్చుల దాసు, ఉదయ్ కిరణ్ జిల్లెల్ల. స్థానిక నాయకులు: Mptc నల్లి అంజలీదేవి, మాజీ సర్పంచ్ కలిగితి ఏసురత్నం, నల్లి చిన్న, కంకటాల చిట్టిబాబు, నల్లి కృపావరం, దేవ రమేష్, కంకటాల శ్రీనివాస్, బల్ల రాజబాబు, గెడ్డం రోజులిన్, యడ్ల మార్తమ్మ, P రజిని, G ప్రభావతి, నల్లి బేబీ, నల్లి సౌజన్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు….🙏🏻

ఆంధ్రప్రదేశ్

అల్లవరం పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ

అల్లవరం పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మీనా ఐపీఎస్, క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ పోలీస్ స్టేషన్ ను సందర్శిస్తూ సిబ్బందికి సూచనలు జారి చేస్తున్న జిల్లా ఎస్పి. శాంతి భద్రతల విషయంలో రాజిపడేది లేదని, సిబ్బంది అప్రమత్తతో విధులు నిర్వర్తించాలని, ముందస్తు సమాచారాన్ని సేకరించి ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశాలు జారీచేయడమైనది.

ఆంధ్రప్రదేశ్

అల్లవరం పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ

అల్లవరం పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మీనా ఐపీఎస్, క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ పోలీస్ స్టేషన్ ను సందర్శిస్తూ సిబ్బందికి సూచనలు జారి చేస్తున్న జిల్లా ఎస్పి. శాంతి భద్రతల విషయంలో రాజిపడేది లేదని, సిబ్బంది అప్రమత్తతో విధులు నిర్వర్తించాలని, ముందస్తు సమాచారాన్ని సేకరించి ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశాలు జారీచేయడమైనది.

జనగాం

జీడికల్ రాములవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలి….*

*స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం* తేదీ: 22.10.2025 *శాశ్వత ప్రాతిపదికన ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలి….* *ఆలయ ఆవరణలో పచ్చదనాన్ని పెంపొందించాలి….* *రేడిమేడ్ టాయిలెట్స్ ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులో ఉంచాలి….* *పారిశుధ్య నిర్వహణ పై ప్రత్యేక ద్రుష్టి పెట్టాలి….* *హెల్త్ క్యాంప్, పోలీస్ క్యాంప్ ఏర్పాటు చేయాలి…..* *ఆలయ అభివృద్ధిలో ప్రజలు, దాతలు భాగస్వాములు కావాలి….* *జీడికల్ ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించి శాశ్వత ప్రాతిపదికన 5నుండి 10కోట్లతో పనులు చేపట్టెందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు తెలిపారు.* వచ్చే నెల లో జరగనున్న లింఘాల ఘనపూర్ మండలం జీడికల్ శ్రీరామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని చేపట్టాలిసిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఆలయం వద్ద స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. వచ్చే నెల 4 వ తేదీ నుండి 17 వరకు జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. వచ్చే నెల 10 వ తేదీన జరిగే స్వామి కల్యాణనికి అన్ని శాఖల అధికారులు సమన్వయము గా పని చేయాలని అన్నారు. గుడి పక్కన ఆలయ ప్రహరీ గోడ నుండి గుండం వరకు మెట్లు, రెండు గుండాల వద్ద ఫెన్సింగ్, గ్రామం నుండి ఆలయానికి వచ్చేందుకు సీసీ రోడ్, కల్యాణ మండపం వద్ద పిచ్చి చెట్లను తొలగింపు,ల్యాండ్ లేవలింగ్ తదితర పనులను వెంటనే చేపట్టాలని తెలిపారు. అటవీ శాఖ అధికారుల సహకారంతో స్వామి నిత్య కైంకార్యానికి పూల తోట ఏర్పాటు చేయాలని అన్నారు. ఆలయ సమీపం అంత శుభ్రంగా గా చేసి…. నీడ ను ఇచ్చే చెట్ల ను పెట్టి… పచ్చదనం తో ఆలయ పరిసరాలు ఆహ్లాదకరంగా ఉండేలా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సెంట్రల్ లైటింగ్, రెడీ మెడ్ గా ఉండే టాయిలెట్స్ లను అందుబాటులో పెట్టాలని వెల్లడించారు. శానిటేషన్ పక్కాగా జరగాలని, 24 గంటలు తాగు నీరు, విద్యుత్, మెడికల్ క్యాంపు, పోలీస్ భద్రత ఉండాలని అధికారులకు సూచించారు. నవంబర్ 3 వ తేదీ వరకు అన్ని పనులు అయిపోవాలని తెలిపారు. మున్ముందు జీడికల్ దేవస్థానంకి సంబంధించి మాస్టర్ ప్లాన్ తయారు చేసి శాశ్వత అభివృద్ధి పనులను చేపట్టే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఆలయ అభివృద్ధిలో ప్రజలు, దాతలు కూడా భాగస్వామ్యం కుడా ఉండాలని కోరారు. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ…. వివిధ శాఖల సమన్వయంతో గత జాతరను విజయవంతంగా నిర్వహించామని…. ప్రత్యేక దృష్టితో ఈసారి కూడా అన్ని శాఖల అధికారులు వివిధ రకాల అభివృద్ధి పనులను చేపట్టి త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. బ్రహ్మోత్సవాలు సజావుగా జరిగేందుకు జనగామ RDO గోపీరామ్ ని స్పెషల్ అధికారిగా నియమించామని… అలాగే కంట్రోల్ రూమ్ రూమును కూడా ఏర్పాటు చేసి ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే తగు చర్యలు తీసుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపారు. సీసీ రోడ్, మెట్లు, బుష్ క్లియరెన్స్, తాత్కాలిక టాయిలెట్స్ ఏర్పాటు చేస్తామని… ఎక్కువ శానిటేషన్ వర్కర్స్ పెట్టి ఆలయ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండేల చూడాలని డిపిఓ ని ఆదేశించారు. శాశ్వతంగా కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్ నిర్మాణంకి కుడా చర్యలు తీసుకుంటామని, మెడికల్ సిబ్బంది, మెడిసన్స్, అంబులెన్స్ అందుబాటులో ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారికి తెలిపారు ఫైర్ సేఫ్టీ తీసుకోవాలని, ఎక్కువ బస్ లు తిరిగేలా RTC అధికారులు చూడాలని, గత జాతర సందర్బంగా శాశ్వతంగా ట్రాన్స్ఫర్మ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రోటోకల్ సమస్యలు రాకుండా,చైన్ స్నాచింగ్ జరగకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. క్లోరినేషన్ చేస్తూ ఉండాలని, రోజుకి 3 సార్లు టెస్ట్ చేస్తూ… తాగు నీరు ఎలాంటి కలుషితం జరగకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రాజా మహేందర్ నాయక్, ఆర్డీ వో గోపిరామ్, డిపిఓ స్వరూప, ఆలయ చైర్మన్ నరసింహులు, ఆలయ కార్య నిర్వహణ అధికారి వంశీ, డైరెక్టర్ లు,విద్యుత్, ఇంజనీరింగ్, మెడికల్ తదితర శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కోటి సంతకాల ప్రజా ఉద్యమ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న మాజీమంత్రి గొల్లపల్లి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం రాజోలు నియోజకవర్గ ఇన్చార్జ్ గొల్లపల్లి సూర్యరావు పిలుపుమేరకు నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు గుర్రం జాషువా ఆధ్వర్యంలో గుడిమేల్లంక గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షులు బల్ల కిరణ్ అధ్యక్షతన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం గ్రామస్థాయి రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గుడిమేల్లంక గ్రామంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమ రచ్చబండ కార్యక్రమ కరపత్రాలను గొల్లపల్లి సూర్యా రావు కమిటీ వారికి అందజేసి, గ్రామానికి వెయ్యి సంతకాలు సేకరించి మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణను ఆపడంలో భాగస్వాములు కావాలని కోరడం జరిగింది.ఈ సందర్భంగా గొల్లపల్లి సూర్యరావు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వలన పేద మధ్యతరగతి విద్యార్థులు, తల్లిదండ్రులు ఏమి కోల్పోతారో గ్రామస్తులకు వివరించారు. విద్య వైద్యం ప్రతి ఒక్కరి హక్కు, ప్రతి కార్యకర్త ఈ విషయాలు ప్రజలకు తెలియపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో , జడ్పిటిసి బల్ల ప్రసన్న కుమారి, పెన్మత్స రంగరాజు, గుబ్బల మనోహర్, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు కూనపరెడ్డి రాంబాబు , జిల్లా అధికార ప్రతినిధి ఉచ్చుల విష్ణు, జిల్లా కార్యదర్శి మోకా సురేష్, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు చింత ప్రసాద్, చింత శ్రీను, పిప్పల్ల రాజు, కొల్లబత్తుల సతీష్, ఉచ్చుల దాసు, ఉదయ్ కిరణ్ జిల్లెల్ల . స్థానిక గ్రామ నాయకులు: Mptc నల్లి అంజలీదేవి, మాజీ సర్పంచ్ కలిగితి ఏసురత్నం, నల్లి చిన్న, కంకటాల చిట్టిబాబు, నల్లి కృపావరం, దేవ రమేష్, కంకటాల శ్రీనివాస్, బల్ల రాజబాబు, గెడ్డం రోజులిన్, యడ్ల మార్తమ్మ, P రజిని, G ప్రభావతి, నల్లి బేబీ, నల్లి సౌజన్య గార్లు మరియు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..*

*తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..* *-జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల సూచన..* తుఫాన్ కారణంగా జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయని అధికారులతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల సూచించారు. పొదలకూరు మండలంలోని నావూరుపల్లి పెద్దవాగు పొంగి నాలుగు గ్రామాలకు రాకపోకలు స్తంభించడంతో వాగు ఉద్ధృతిని బుధవారం సాయంత్రం ఆమె పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వర్షాలు తగ్గుముఖం పట్టి కాలువలు, వాగుల్లో నీటి ప్రవాహం తగ్గేవరకు రైతులు, ప్రజలు సాహశించి వాటిని దాటే ప్రయత్నం చేయరాదన్నారు. పెన్నా నది పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి శ్రీనివాసులు, పొదలకూరు సిఐ ఏ శివరామకృష్ణారెడ్డి, ఎస్ఐ మహమ్మద్ హనీఫ్, పొదలకూరు పీఏసీఎస్ చైర్మన్ తలచీరు మస్తాన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

జనగాం

జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్ వేళ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై సెన్సేషనల్ ఆరోపణలు నమోదయ్యాయి.*

*మాగంటి గోపినాథ్ తన భార్య మాలినీదేవికి విడాకులు ఇవ్వలేదని, ఇప్పటికీ మా అమ్మ మాగంటి గోపినాథ్ భార్యనేనని, అలాంటపుడు సునీత భార్య ఎలా అవుతుందని గోపినాథ్ మొదటి భార్య కొడుకు తారక్ ప్రద్యుమ్న ప్రశ్నించాడు.* *తన తండ్రి సునీతను పెళ్లి చేసుకోలేదని, కేవలం లివ్ ఇన్ రిలేషన్షిప్ లోనే ఉన్నారని, తన తండ్రికి అసలైన వారసుడిని తానేనని అన్నారు.* న్యాయబద్దంగా ఎమ్మెల్యే టిక్కెట్టు తన తల్లికి రావాలని, సునీత తన అనుచరులతో తమని బెదిరించారని, వెంటనే ఆమె నామినేషన్ రద్దు చేయాలని ప్రద్యుమ్న డిమాండ్ చేశాడు. అయితే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణించడంతో ఆ స్థానానికి ఉపఎన్నికలు ఏర్పడ్డాయి. నిన్నటితో నామినేషన్ ప్రక్రియ కూడా ముగియగా… నేడు బీఆర్ఎస్ అభ్యర్థి సునీతపై ఈ ఆరోపణలు రావడం రాజకీయాల్లో కలకలం రేగింది. అయితే ఈ ఆరోపణలపై సునీత స్పందించాల్సి ఉంది.

అన్నమయ్య

ఒంటిమిట్ట మండలంలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండండి

ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గజ్జల నరసింహారెడ్డి గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఒంటిమిట్ట మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గజ్జల నరసింహారెడ్డి హెచ్చరించారు ముఖ్యంగా పెన్నా నది తీర ప్రాంతాలైన దర్జీ పల్లె, గొల్లపల్లె, దొంతరం పల్లె, నరసన్న గారి పల్లె, పెద్ద పేరూరు గ్రామ రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నరసింహారెడ్డి విజ్ఞప్తి చేశారు రాగల నాలుగైదు రోజులలో ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ ఉరుములు మెరుపులు అక్కడక్కడ ఈదురు గాలులు వీచే అవకాశం భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తుండడం వల్ల వర్షాల కారణంగా సంభవించే ప్రమాదాలపై వాగులు, వంకలు, చెరువులు, నదులు ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉన్నందున అధికారుల సూచనల మేరకు లోతట్టు ప్రాంత ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ముఖ్యంగా ప్రజలు వాగులు వంకలు ఉదృతంగా ప్రవహించేటప్పుడు రోడ్లు దాటడం చెట్ల కింద నిలబడటం, విద్యుత్ తీగల కింద, రోడ్లపై నీరు ప్రవహించేటప్పుడు సైడ్ కాలవల దగ్గర ప్రజలందరూ తగు జాగ్రత్తలు పాటించాలని, ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని చాలా అప్రమత్తంగా ఉండాలని ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు మీకు దగ్గరలో ఉన్న సంబంధిత అధికారులకు తెలియజేయగలరు.

అన్నమయ్య

చిట్వేల్ పోలీస్ స్టేషన్‌పై ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆకస్మిక తనిఖీ

ప్రజా సేవలో ‘మర్యాద’, కేసుల పరిష్కారంలో ‘వేగం’ అవసరం – ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ అన్నమయ్య జిల్లా పోలీస్ సేవల్లో పారదర్శకత, సమర్థత పెంపు లక్ష్యంగా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ బుధవారం చిట్వేల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ నిర్వహణ, రికార్డులు, కేసుల పురోగతి, సిబ్బంది సంక్షేమ అంశాలను ఎస్పీ సమీక్షించారు. పాత భవనం కావడంతో స్టేషన్‌కు తక్షణ మరమ్మత్తులు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. రికార్డులు సక్రమంగా నిర్వహిస్తూ, సీసీటీఎన్ఎస్ వ్యవస్థలో కేసుల వివరాలను క్రమం తప్పకుండా అప్‌లోడ్ చేయాలన్నారు. నమోదైన కేసుల విచారణను వేగవంతం చేసి, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని ఆయన ఆదేశించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా, వినయంగా ప్రవర్తించడం పోలీసుల కర్తవ్యం అని స్పష్టం చేశారు. చిట్వేల్ పోలీస్ స్టేషన్ జిల్లా సరిహద్దులో ఉన్నందున, అనుంపల్లి చెక్‌పోస్ట్ వద్ద నిరంతర తనిఖీలు నిర్వహించి అక్రమ రవాణాను అరికట్టాలని సూచించారు. సిబ్బంది సంక్షేమం పట్ల శ్రద్ధ చూపి, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఏఎస్పీ శ్రీ మనోజ్ రామనాథ్ హెగ్డే ఐపీఎస్, చిట్వేల్ ఎస్ఐ జి. నవీన్ బాబు మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

అన్నమయ్య

గుండాల కోన ఏరును పరిశీలించిన సబ్ కలెక్టర్ భావన : వర్షాల ప్రభావంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచనలు

సబ్ కలెక్టర్ భావన బాలిరెడ్డి పల్లి మీదుగా వెళుతున్న గుండాల కోన ఏరు ఆమె పరిశీలించారు. ఆమె వెంట తాసిల్దార్ యామిని రెడ్డి ఉన్నారు. ఆమె గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గత నాలుగు రోజుల నుండి వర్షాలు విస్తారంగా పడుతున్నాయని గ్రామీణ ప్రాంతాల్లో వాగుల్లో వంకల్లో నీటి శాతం పెరుగుతూ వస్తుందని ఇలాగే వర్షాలు కొనసాగితే వాగు పొంగి పొల్లుతుంద ని వై కోట బాలి రెడ్డిపల్లి గ్రామస్తులు ఈ వైపు నుండి వెళ్ళకూడదని ప్రమాదాలు పొంచి ఉన్నాయని ముఖ్యంగా వాహనదారులు ఈ దారి గుండా వెళ్లకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తంగా ఉండాలని ఆమె అధికారులకు సూచించారు. గుండాల కోన గుండా ఈ నీటి ప్రవాహం ఈ వైపునుండి ప్రవహిస్తూనే ఉంటుందని గ్రామ ప్రజలు కూడా అనవసరంగా బయటికి రావద్దని ఆమె ప్రజలు ఉద్దేశించి తెలిపారు. పలు ప్రాంతాలలో భారీ వర్షాల ప్రభావం వలన రాకపోకలకు అంతరాయం కలుగుతూ ఉందని అన్నిటిని దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని ఆమె ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయరావు,సెక్రటరీ సురేష్, ఆర్ ఐ ఎం మల్లికార్జున రెడ్డి, వీఆర్ఓ రాజశేఖర్ రెడ్డి, స్థానికులు జీవి రెడ్డి, గ్రామ ప్రజలు పలువురు ఉన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.