Friday, 24 April 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

వర్షాల వలన పారిశుద్ధ్యం క్షీణించకుండా ముందస్తు జాగ్రత్తలు వహించాలి

సఖినేటిపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపధ్యంలో ఇబ్బందులను తొలగించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై సఖినేటిపల్లి మండల పరిధిలోని పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లు, హెల్త్ సిబ్బంది మరియు మండల స్థాయి అధికారులతో సఖినేటిపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వీరా మల్లిబాబు అధ్యక్షతన జరిగిన అత్యవసర సమావేశంలో గౌరవ శాసన సభ్యులు దేవా వరప్రసాద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా గౌరవ శాసన సభ్యులు మాట్లాడుతూ గత నెల రోజులుగా కురుస్తున్న వర్షాల వలన నీరు ఇళ్ళమధ్యకు చేరడం, చెత్త తొలగించక పోవడం, మొదలగు కారణాల వలన పారిశుద్ధ్యం క్షీణించి, ప్రజలు జబ్బుల బారిన పడుతున్నారని అన్నారు. కాబట్టి వెంటనే గ్రామపంచాయతీలు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇంజన్ల సహాయంతో ఇళ్ళచుట్టు, రోడ్లపై చేరిన ముంపునీటిని లోతట్టు ప్రాంతాలకు తరలించాలి అని సూచించారు.అదే విధంగా ఇళ్ల దగ్గర చెత్తను, డంపింగ్ యార్డులకు తరలించాలి. బ్లీచింగ్, ఫాగింగ్ చేపట్టాలని ఏఎన్ఎం, ఆశావర్కర్లు ఇంటింటి సందర్శన చేసి, ప్రజలు జబ్బులు జ్వరాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలి అని అన్నారు సర్పంచులు, రాజకీయనాయకులు, మహిళా సంఘాలు పారిశుధ్యం పై దృష్టి సారించాలని అని అన్నారు గ్రామపంచాయతీకి చెందిన 50% సాధారణ నిధులు, 30% 15వ ఆర్థిక సంఘం నిధులు పారిశుద్ధ్యనికి ఖర్చు పెట్టాలి అని తెలిపారు.ప్రజలు జబ్బులు జ్వరాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని పంచాయతీ యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు అందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలి అని అలసత్వం వహిస్తే సహించేది లేదని అన్నారు.ఈ సమావేశం లో మండల అధికారులు, సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు, హెల్త్ సిబ్బంది మరియు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.

తిరుపతి

భారీ వర్షాల నేపద్యంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అధికారులతో టెలి కాన్ఫరెన్స్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహిచి అధికారులకు కొన్ని సూచనలు చేశారు. అందులో భాగంగా భారీ వర్షాలు అనే పద్యంలో ఎటువంటి విపత్తుల సంభవించిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని,లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారిని అక్కడికి తరలించాలన్నారు.పునరావాస కేంద్రాలుగా ప్రభుత్వ,ప్రయివేటు భవనాలను తీసుకోవాలన్నారు.అలాగే వాగులు వంకలు ఉదృతంగా ప్రవహించే అవకాశం ఉన్నందున అటువైపుగా వెళ్లే మార్గాలను దారి మళ్లించాలని సూచించారు.అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రాకుండా చూడాలని పునరావాస కేంద్రాలలో మరియు లోతట్టు ప్రాంత ప్రజలకు ఆహారము అవసరమైన వస్తువులు సమకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని,ఎక్కడ ఎటువంటి ప్రాణ,ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు. దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదాలు జరిగినట్లయితే వెంటనే తెలిజేయాలని సూచించారు.

E-పేపర్

వాసవి క్లబ్ మరియు వనిత క్లబ్ మొదటి కార్యవర్గ సమావేశం

వాసవి క్లబ్ మరియు వనిత క్లబ్ మొదటి కార్యవర్గ సమావేశం రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు ఆర్యవైశ్య సమాజములో వాసవి క్లబ్ మరియు వనిత క్లబ్ మొట్ట మొదటి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశము నందు ముఖ్యముగా చర్చించదగిన విషయములు & చేస్తున్న కార్యక్రమాల వివరములు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు 98% మార్కులు సాధించిన విద్యార్థికి ప్రతిభా అవార్డు క్రింద ఇచ్చిన 10,000/- రూ స్కాలర్షిప్ చెక్కును గాజులపల్లి హరి కుందన కు అందజేయడం జరిగినది.వాసవి కుటుంబ సురక్ష పథకం గురించి కూడా తెలియజేయడం జరిగినది. ముఖ్యముగా వాసవి కుటుంబ సభ్యులకు ఏదైనా సందేహాలు కానీ లేదా క్లబ్ ఇంకా గొప్ప స్థాయికి వెళ్లటానికి, అభ్యున్నతికి సభ్యుల యొక్క అమూల్యమైన సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగినది. కావున మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వాసవి మరియు వనిత క్లబ్ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

అనకాపల్లి

ఉచిత ఇసుక పంపిణీ – పారదర్శక విధానంపై మంత్రుల సమీక్ష సమావేశంలో కీలకంగా మాట్లాడిన రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ పి.వి.జి. కుమార్

అనకాపల్లి, అక్టోబర్ 22: బుధవారం అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జిల్లా ఇంచార్జీ మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన మైన్స్ ఉచిత ఇసుక సరఫరాపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన, జిల్లా శాసనసభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ పి.వి.జి. కుమార్ మాట్లాడుతూ – ప్రజలకు ఇసుక సులభంగా అందుబాటులోకి రావడానికి, పారదర్శక వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రతి గ్రామానికి అవసరమైన ఇసుక సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు చేపట్టాం,” అని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు గవర్ కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర ఉమ్మడి విశాఖ జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్ కోట్లి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో అధికారులు మైన్స్ నిర్వహణ, ఇసుక పంపిణీ సమర్థత, ప్రజల ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలపై చర్చించారు.

Blog

నంద్యాల జిల్లా స్థాయి ఓపెన్ చదరంగ పోటీలు*

నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో, నంద్యాల లయన్స్ క్లబ్, ఎన్.ఆర్.జి.చెస్ అకాడమీ సంయుక్త నిర్వహణలో నవంబర్ రెండవ తేదీ ఆదివారం స్థానిక టేక్కే లో ఉన్న ఈ.ఎస్.సి .ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో జింకా డ్రాయింగ్ హాల్ నందు నంద్యాల జిల్లా స్థాయి చదరంగం పోటీలు ఓపెన్ క్యాటగిరిలో నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు నంద్యాల లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు, పారిశ్రామికవేత్త ఆత్మకూరు సుదర్శనం శెట్టి సౌజన్యంతో వివిధ వయస్సు కేటగిరీలలో పన్నెండు వేల రూపాయల నగదు బహుమతులతో పాటు జ్ఞాపికలను అందజేయడం జరుగుతుందని జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ జి. రవి కృష్ణ,టోర్నమెంట్ డైరెక్టర్, పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్. శైలేంద్ర కుమార్,ఎన్ ఆర్ జి చెస్ అకాడమీ గౌరవ అధ్యక్షులు రాజేష్, నంద్యాల జిల్లా సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి, టోర్నమెంట్ పర్యవేక్షకులు వెంకట్రావు లు తెలిపారు. ఈనెల 30వ తేదీ లోపు ఆసక్తి గల క్రీడాకారులు ఎంట్రీలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర వివరాలు నంద్యాల జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి ఫోన్ నెంబర్ 9010451585 లో తెలుసుకోవచ్చు.

తిరుపతి

శ్రీకాళహస్తి దేవస్థానం నందు ఆకాశ దీపం కార్యక్రమం

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు బుధవారం నుండి కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా సందర్భం గా ఆలయ ప్రాంగణంలో ఆకాశ దీప కార్యక్రమాన్ని దేవస్థాన అధికారులు వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి దంపతులు,ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, పర్యవేక్షకులు నాగభూషణం,టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ మరియు ఆలయ సిబ్బంది,భక్తులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

మల్టీపర్పస్ హాలు నిర్మాణ పనులు ప్రారంభం

విశాఖపట్నం, అక్టోబర్ 22 (పున్నమి ప్రతినిధి) అగనంపూడి కొండయ్య వలస గ్రామ శ్రీ సీతారామాలయం ప్రాంగణంలో గత ప్రభుత్వం హాయంలో ఇల్లపు వరలక్ష్మి ప్రసాద్ 20 లక్షల జిఎంసి నిధులతో మల్టీపర్సహాలు నిర్మాణ పనులు ప్రారంభించాక ఆ పనులు అసంతృప్తితో ఉండిపోవడంతో రెండో విడత ఇల్లపు వరలక్ష్మి ప్రసాద్ గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావు సహకారంతో మరో 29 లక్షల నిధులు జీవిఎంసీ మంజూరు చేయగా మల్టీపర్పస్ హాలు అసంతృప్తి నిర్మాణ పనులు వరలక్ష్మి ప్రసాద్ ప్రారంభించారు. కార్పొరేటర్ దంపతులను కొండయ్య వలస గ్రామ ప్రజలు సన్మానం చేసి హర్షం వ్యక్తపరిచారు. 85 వార్డు తెలుగు యువత అధ్యక్షులు బండారు చందు రమేష్ సభ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏడీసీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ, జనసేన పార్టీ నాయకులు విందుల వెంకటరమణ, టిడిపి నాయకులు వడ్డాది శ్రీనివాసరావు, బిజెపి నాయకులు కోసూరి తాతారావు ఏరియా ఆసుపత్రి కమిటీ సభ్యులు డొక్కా రమేష్ గ్రామ పెద్దలు బలిరెడ్డి శ్రీను, విందుల వరహాలు, సాయిన సన్యాసిరావు, బోండా ఈశ్వరరావు, డాక్టరేట్ గుదే సుశీల గజేంద్ర, తిలక్ కూటమి మహిళా నాయకురాలు మేడిశెట్టి పద్మ, యు గీత, అన్నపూర్ణ, రావాడ శిరీష మరియు కొండయ్య వలస గ్రామ పుర ప్రజలు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

మునిసిపల్ కార్మికుల రాష్ట్రవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి

మున్సిపల్ కార్మికుల రాష్ట్రవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి యూనియన్ గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు రాజమహేంద్రవరం , కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరన్నర కావస్తున్న ఇప్పటికి మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని నిరంతరం ప్రజల ఆరోగ్యం కోసం పరితపించే మున్సిపల్ కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు విమర్శించారు బుధవారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నవంబర్ 3న రాష్ట్రవ్యాప్తంగా జరిగే మున్సిపల్ కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని మున్సిపల్ కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.అంతకుముందు దేవి చౌక్ నుండి మున్సిపల్ ఆఫీసు వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు దారి పొడవున సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వంలో ఆనాడు సమ్మె ఫలితంగా కొన్ని డిమాండ్లు నెరవేస్తామని మున్సిపల్ అధికారులు హామీ ఇచ్చారని అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు మున్సిపల్ కార్మికులు సమస్యలు పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చి నేటికీ ఆ సమస్యలపై పరిష్కారం చూపడం లేదని ఆయన అన్నారు . ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలుగా ఆప్కాస్ లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులు ఇతర కారణాలతో మరణించారని ఆ మరణించిన వారి వారసత్వ కుటుంబీకులకు అప్పకస్ ఉద్యోగం ఇవ్వడంలో పూర్తిగా విఫలం చెందారని ఆయన తెలిపారు 60 ఏళ్లు నిండిన మున్సిపల్ కుటుంబీకులకు వారసత్వ ప్రకారం ఇప్పటికే ఉద్యోగాలు ఇవ్వాలని అది కూడా తట్చారం చేస్తున్నారని మధు పేర్కొన్నారు . సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పిన ఇప్పటికీ అమలు చేయడం లేదన్నారు ఆప్కాస్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని మధు డిమాండ్ చేశారు ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ జట్లు లేబర్ యూనియన్ అధ్యక్షులు కే రాంబాబు మాట్లాడుతూ ఎప్పటినుంచో మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వ బ్యాంకులో ఖాతాలు ఉన్నాయని కానీ నేడు తొందరగా ప్రభుత్వం యాక్సిస్ బ్యాంక్ ని అకౌంట్ ఓపెన్ చేయాలని చెప్పడం ఏదో కుట్ర దాగి ఉందని రాంబాబు తెలిపారు నవంబర్ 3న జరిగే మున్సిపల్ కార్మికుల సమ్మెకు అన్ని వర్గాల ప్రజలు కార్మిక లోకం మద్దతు ఇవ్వాలని ప్రభుత్వం వెంటనే చర్చిలకు పిలవాలని రాంబాబు సూచించారు ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రెడ్డి రమణ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి దుర్గమ్మ జిల్లా నాయకులు కాకి శారద పోలమ్మ గిరి శ్రీను తదితరులు పాల్గొన్నారు

తూర్పు గోదావరి

మునిసిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలం

మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం.. మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు

మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు రైల్వే కోడూరు అక్టోబర్ 22 ( పున్నమి న్యూస్ ప్రతినిధి): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కళా శాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం పేరిట కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా వైయస్సార్సీపి రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ బాధ్యులు, మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో 23-10-2025 గురువారం నాడు కోడూరు మండలం చియ్యవరం గ్రామపంచాయతీ యస్ఆర్ కాలనీ నందు మధ్యాహ్నం 3:30 గంటలకు రచ్చబండ కార్యక్రమం నిర్వహించబడును కావున ఈ కార్యక్రమానికి మండలంలోని వైయస్సార్సీపి కార్యకర్తలు, జడ్పీటీసీలు,సర్పంచులు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు డైరెక్టర్లు ప్రజా ప్రతినిధులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు ప్రతి ఒక్కరు హాజరుకావలసినదిగా ఒక మీడియా ప్రకటనలో తెలియజేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.